పరిరక్షించును శివ పంచాక్షరి మంత్రం
ఓం నమఃశివాయ నే పరమ పవిత్రం
సత్ఫలితము నొసగును స్మరణ మాత్రం
శివపదమును చేరగ నా మదికెంత ఆత్రం
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ
1.ప్రణవనాద సంయుతం శివ మంత్రం
పరమానందకారకం సదాశివనామం
కైవల్య దాయకం సతతం శివధ్యానం
కరుణావర్షితం అనవరతం కపర్ది వీక్షణం
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ
2.ఆరోగ్యదాయిని మృత్యుంజయ మంత్రం
ఐశ్వర్య ప్రదాయిని దారిద్ర్యదహన స్తోత్రం
కామితవరదాయిని కాశీపురపతి స్తవం
జన్మరాహిత్యకరం రాజేశ్వర గుణగానం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ