Thursday, May 14, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మధ్యమావతి

సాయీ నీకు క్షీరాభిషేకం
బాబా నీకు పుష్పాభిషేకం
సద్గురునాథా నీకు గంధాభిషేకం
హే అవదూతా నీకు భస్మాభిషేకం

1.తీయని పలుకుల సాయినీకు తేనెతొ అభిషేకం
రాజాధిరాజ యోగిరాజ గొనుమిదే ఆజ్యాభిషేకం
పంచభూతాత్మకా చేసేము పంచామృతాభిషేకం
సచ్చిదానంద శివరూపా ఇదెనీకు సలిలాభిషేకం

2.చిత్తమునే స్థిరపర్చగ ముత్యాల అభిషేకం
నడవడినే సరిజేయగ పగడాల అభిషేకం
సద్బోధలు రుచిచూపగ రతనాల అభిషేకం
మానవతను మేల్కొలుపగ ఆనంద భాష్పాల అభిషేకం
వెన్నెలే ముద్దగ చేస్తే నీ ముగ్ధరూపం
క్షీరమే ఘనీభవిస్తే నీ మేని తేజం
విద్యను శిల్పీకరిస్తే నీ రమ్య విగ్రహం
కళలనే కుప్పగపోస్తే అదినీ విలాసం

1.రవికి ఎంతో ప్రియం నీ వదనం
శశికి ఇంకా ఇష్టం నీ నయనద్వయం
గణపతిని అర్చించాలి నీ అధరాలతో
సమరాన పూరించాలి నీ కంఠముతో

2.కేసరి ఆవాసము నీ నడుమే
కలహంసల ఆనవాలు నీ నడకే
కోడెనాగు జాడచూడ నీ వాలు జడలో
మేఘమాల ఏదొ తోచే ముంగురులలో

ఎంతోమంది ఎవరినైనా పొగడవచ్చుగాని
ఎరుగరాయే ధనమేలే అన్నిటికీ మూలమని
చేదోడువాదోడు రేయైనపగలైన బ్యాంకేనని
గుర్తించరేల అనుభవించినా వింతేగాని
నమ్మినా నమ్మకున్నా చెబుతున్నా నిత్య సత్యాన్ని
ఒక పాటగా పాడుతూనే తెలుపుతున్నా మా కష్టమర్ల థాంక్స్ ని

బ్యాంకు సారూ బ్యాంకు సారూ మీకు జోహారు
తోడునీడై ఆదుకొంటూ మా కష్టాలు తీరుస్తారు

1.ఎండైన వానైన ఆగిందిలేదు బ్యాంకు ఎన్నడు
వేళాపాళా చూడకుండా అందుతాయి మీసేవలు
పంటలోన్లనిచ్చేకాలాన పస్తుండైనగాని పంచుతారు
వాపసైతె అసలు పంపరు
మహిళాగ్రూపులు ఎన్నొచ్చినాగాని ఓపికతొ ఉంటారుమీరు
వాళ్ళకు ఆసరా అందిస్తారు
బ్యాంకు సారూ బ్యాంకు సారూ మీకు జోహారు
తోడునీడై ఆదుకొంటూ మా కష్టాలు తీరుస్తారు

2.నోట్లురద్దుకాగ రష్షెంత పెరిగిన సాయపడినారు
అండగనిలబడినారు
కరోనరక్కసి కాలుదువ్వినగాని మడమతిప్పలేదు
జడిసి ముడుసుకోలేదు
డాక్టర్లలాగ సేఫ్టీ కిట్లైన లేకున్నా పనిచేస్తారు
ధైర్యంగ ముందడుగేస్తారు
ప్రశంసలే ఆశించనీ  ఋషులేమీరు మహాపురుషులుమీరు
అభినందనలైనా పొందకున్నా కృంగిపోరు కర్తవ్యం దైవంగ భావిస్తారు

బ్యాంకు సారూ బ్యాంకు సారూ మీకు జోహారు
తోడునీడై ఆదుకొంటూ మా కష్టాలు తీరుస్తారు


Wednesday, May 13, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మరలిచూడకు మరలమరల
మరుని శరముల వరదలా
వలలు వేయకు నవ్వి చిలిపిగ
తీపి వలపులు జ్వాల రేపగ

1.మామూలుగ తల తిప్పానని
కథలేవొ నాకిక తిప్పి చెప్పకు
మనసు మనసును తట్టెనిపుడు
వట్టి మాటల చిట్టా విప్పకు

2.ఇంద్రజాలమె నీ రూపము
 నువు వినా నాబ్రతుకు శూన్యము
తాళజాలను చెలీ నిమిషము
తరియింపజేయవె జీవితాంతము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నమ్మశక్యమైతె కాదు దేవకన్యవే నీవు
నా భాగ్యమేమొ గాని నను వరించినావు
వెదకబోయిన తీగనే తనకుతానె తాకినట్లు
విస్తుబోవ సిరితానే ఇంటితలుపు తట్టినట్లు
దొరికినావే నీవు  నిధిలాగ నాకు
నువు లేక శూన్యమై చితికేను బ్రతుకు

1.అందమైన హృదయం నీది అందించినావే
సరిజోడునని ఎంచి ప్రేమనంత పంచినావె
ఎంతటి అదృష్టమో నీవాడిగ మనగలిగా
దేదీప్యమానమైన దీపమోలే నే వెలిగా
 తీర్చిదిద్దినావే ఆదర్శ పురుషునిగా
మార్చివేసినావే మర్యాద రామునిగా

2.బండరాయినైన నన్ను శిల్పంగా చెక్కావు
గుండెగుడిలొ నెక్కొల్పి  దైవంగా మొక్కావు
కంటగింపుగా ఉంది మనజంట ఎందరికో
కన్నుకుట్టుతోంది ఈర్ష్యాద్వేషాలతో
లోకమంత ఏకమైనా చెరగదు మన అనుబంధం
కాలాలు మారినా ఇగురదు అనురాగ గంధం

Tuesday, May 12, 2020

https://youtu.be/U3ZBjiGsbuo?si=W3PCR_wtmRa5Qg1V

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:రస రంజని

అలనాటి రాణీ పద్మినివో
అల్లసాని వరూధినివో
రవివర్మ చిత్రాల భామినివో
రామప్పగుడిలోని నాగినివో

1.రంభను తలదన్ను మంజులవో
పలువిరుల రమణీయ మంజరివో
పరువాల నిధులున్న మంజూషవో
రవళించు మనోజ్ఞ మంజీరమువో

2.లలితకళలకు నెలవేనీవో
కళాకారులు కాంచు కలవో
కలహంస నడకల హొయలే నీవో
కలతలు తీర్చే కమ్మని కలయిక నీవో 

ఎప్పుడూ జగడమే నీకురులతో
తప్పవే తిప్పలు నీ ముంగురులతో
ముద్దాడబోగా అవి ముందే తయారు
సంధిచేసుకుంటేనే నా ముచ్చట తీరు

1.కవ్విస్తూ కయ్యానికి కాలుదువ్వు నీకళ్ళు
ఊరిస్తూ పోరుసలుపు నీ నునుపు చెక్కిళ్ళు
పెదాలతో సర్వదా యుద్ధాలే నాకు
చుబుకానికి లోకువే పుణికి పుచ్చుకున్నందుకు

2.చూపులే అస్త్రాలు నవ్వులే శస్త్రాలు
నన్ను లోబరచుకొనగ నీకెన్ని ఆయుధాలు
సరసాల్లో సమరాలు ఇరువురికీ విజయాలు
ఓడినా గెలిచినా ఒకే తీరు తీయని ఫలితాలు
అద్దానికి చెప్పనేల సుద్దులన్నీ
అధరాన దాచనేల ముద్దులన్నీ
ఎడబాటు బాటలో ఎన్నాళ్ళీ నిరీక్షణ
తడబాటు చాటున ప్రేమకే పరీక్షనా

1.ఋతువులెన్నొ వేచేను కోయిల ఆమనికై
మబ్బులకై తపించేను మయూరమే విరహిణియై
ప్రతీక్షించు చకోరమే ప్రసరించే కౌముదికై
ఎదిరిచూచు గోరింక చిలకమ్మతొ చేరికకై

2.రాధకెంత బాధనో మాధవుని రాకకై
మీరాకెంత తపననో గోవిందుని పొందుటకై
నది పరుగులు పెడుతుంది కడలి సంగమానికై
మది గుబులే తీరకుంది చెలీనీ కలయికకై


Monday, May 11, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

దివ్యత్వమేదో కళ్ళనుండి కురిసింది
కనుపాపలందు కరుణ కదలాడింది
కాటుకే చీటికిమాటికి నరదృష్టి మరలిస్తోంది
కనుబొమల ధనువే ఎక్కిడ వక్రబుద్ధి జడుస్తోంది

1.ఒలికీ ఒలకని కలికి నవ్వు కనికట్టుచేస్తోంది
కోటేరసొంటి నాసికేమో వాసిగా ఉంది
చెంపలైతే కెంపులల్లే మెరిసిపోసాగే
చెవిన జూకా ఆకతాయిగ సైగ చేసే

2.వనిత ఒద్దిక దిద్దుకున్న తిలకమే తెలిపే
నీలవేణి కురుల సొగసే మేఘమై తోచే
శంఖమంటి కంఠమే కలకంఠి కింపాయే
పెదవులనుగని మధుపమే భ్రమకు లోనాయే
శుభోదయం ప్రతి ఉదయం
అనురాగయుతం ప్రతి హృదయం
జగమంతా ఆనందమయం
నీలోకి నీవే తొంగిచూచు ప్రతి సమయం

1.మలయమారుతం మనసు తాకినప్పుడు
లేలేత రవికిరణం తనువు మీటినప్పుడు
పక్షులన్ని పనికి వెళుతు పలకరించుకొన్నప్పుడు
నీకోసమె నీవుగా జీవించునప్పుడు

2.గృహదేవత తులసిచుట్టు ప్రదక్షణలు చేసిపుడు
యోగా వ్యాయామం యోగక్షేమమైనప్పుడు
ఘుమఘుమ కాఫీ టీలు ముక్కుపుటాలు చేరినపుడు
నిన్ను నీవు తెలుసుకొనగ బ్రతుకు మలుచుకొన్నప్పుడు
https://youtu.be/PX5LF3_utRE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

శంభో హరా శంకరా
గౌరీ మనోహర గంగాధరా
పదములు చాలవు నీ పదములు కొలువ
నా ఎరుక సరిపోదు నీ తత్వమెరుగ

1.నీ రూపము  నిరాడంబరము
నీ వేషము నిఖిల దిగంబరము
నీ తత్వము నిత్య సంబరము
నీనామమే వరము ఇహఁబరము

2.కాలము నిటారు గమనము
ప్రకృతి విశాల వ్యాపకము
అద్వైతము నీ అర్ధనారీశ్వరము
అనూహ్యమే శివా భవా'నీ లక్ష్యము

OK

Sunday, May 10, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆశయాల నిచ్చెనలు ఎన్నో ఎక్కాలి
విశ్వాసం వంతెనెగా అగడ్తలే దాటాలి
అనుదినం అద్దంలో సమీక్షించుకోవాలి
సాధనే ఆయుధంగ యుద్ధాన్ని గెలవాలి
జన్మసార్థకం కావాలి చరితార్థం కావాలి

1.వయసుకూ ఆయువుకూ విలోమానుపాతమే
గడిచే ప్రతి క్షణము చేజారే అమృతమే
అనుభవాలు మార్పుకై గుణపాఠం నేర్పాలి
అనుభూతులు స్ఫూర్తికై నెమరువేసుకోవాలి

2.అనివార్యం మరణం అనూహ్యమకారణం
నిన్ను నీవు మలుచుకొనగ ఇదే కదా తరుణం
తనువు ఉపకరించాలి మానవ హితానికై
మనసు ధ్యానించాలి దైవానుగ్రహానికై
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన కళ్యాణి

కదిలివచ్చినావే నదిగ జీవనాన
సంగమించినావే మదిసాగరాన
సుధలే చిలికించినావు మన కాపురాన
కలశమై వెలిసావు దాంపత్య గోపురాన
నేడే మన త్రిదశ వార్షిక వైవాహిక దినోత్సవం
మన కళ్యాణమహోత్సవమే మధుర జ్ఞాపకం
అందుకో శ్రీమతీ గీతాభినందనం-నీతో అనుబంధమే శ్రీచందనం

1.అర్ధాంగిగ నా బ్రతుకున అడుగుమోపినావు
పూర్ణాంగివై నను నీవుగ ఆక్రమించినావు
నీ ప్రేమతొ చేసావు నను బంధీగా
ఎదలో బంధించావు ఆజన్మ ఖైదీగా
నువువేసే తీపి శిక్ష హాయిగొలుపుతుంది
నువు తెలిపే క్రమశిక్షణ  మేలుకూర్చుతుంది

2.నీ ఒడిలో పసివాడిగ ఆదమరచిపోతాను
నీ ఎదుట అమాయకుడిగ మారిపోతాను
ఓరిమిలో ఉర్వి సైతం నీముందు దిగదుడుపే
ఒద్దికలో హరిమ కూడ నీకడ కడు తడబడునే
జన్మల నా భాగ్యమే నీతో సహచర్యం
మన జంట జగమునకే ఒక ఆదర్శం

Ok

Friday, May 8, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తలపులలో చొరబడకు నేస్తమా
నా మదిలో స్థిరపడకు ప్రియతమా
గాయపడిన గుండెలోన ప్రేమకేది తావు
వంచనతో ముంచేసిన  నావ చేరదే రేవు

1.యవ్వనమున జీవితమొక ఇంద్రధనువు
బంగారు కలలతో తేలియాడు తనువు
అందని ద్రాక్ష గుత్తి ఆంక్షలతో మనువు
అడియాసల నడుమన భవితకు చావు

2.కీలుగుర్ర మెక్కించే రాకుమారుడొస్తాడు
జగదేక సుందరివని వరమాల వేస్తాడు
అనుమానపు పంజరాన ఆత్మను బంధిస్తాడు
స్వేఛ్ఛా కపోతపు రెక్కలు నరికేస్తాడు

3.పదే పదే అదే పనిగ మోసపోలేను
వ్యక్తిత్వం చంపుకొంటు తలవంచుకోలేను
సాధికారికంగా బ్రతికేస్తా సగర్వంగా
స్వావలంబనే ఊతంగా పయనిస్తా కడదాకా

శ్రీ అక్షర ప్రేరణతో-చిత్రానికి సాక్షర భావ సాక్షాత్కారం

https://youtu.be/zPHVIeGTKa0?si=EJ5e7UnrjLWwzg39

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:చక్రవాకం

పోలిక నీకేది సౌందర్య లహరి
ఏలిక నీవేగా భువనైక సుందరి
కనకధార కురిపించే జననీ శ్రీ సిరి
నమస్తే వీణా పుస్తక హస్త భూషిణివిద్యాధరి

1.మనుగడ కోసం మాకు నిత్యపోరాటం
చావు బ్రతుకుల మధ్య క్షణమొక సంకటం
ఏ దిక్కునుండి ఏ ముప్పు కబళించేనో
ఏ రీతి మృత్యువొచ్చి ప్రాణం హరించేనో
కన్నతల్లివైనా నీకు కంటతడి రాదేలమ్మా
జగన్మాతవైనా నీవు మిన్నకుంటివేలమ్మా

2.మనుషులంత వ్యాధులతో మాడిపోవాలా
పంచభూతాల ఘాతకు నేలరాలిపోవాలా
ఇరుగుపొరుగు కౄరత్వానికి బలియైపోవాలా
పైశాచిక ప్రవృత్తితో నరజాతే నశించనేలా
సృష్టిస్థితి లయకారిణీ కరుణించవే తల్లీ
గుణపాఠం గ్రహించినామే కావవే కల్పవల్లీ

Thursday, May 7, 2020

రచన,స్వరకల్పన&గానండా.రాఖీ

కొప్పునిండ మల్లెపూల గుత్తులున్నవి
గుప్పుమంటు అత్తరే మత్తుగొలుపుతున్నది
చిత్తైపోయింది ఈ శ్రీవారి చిత్తము
ఆత్రపు ఆర్తిని తీర్చగ శ్రీమతీ నీ చిత్తము

1.తొలినాటి మధుర స్మృతులు తట్టిలేపుతున్నవి
నీ సిగ్గు దొంతరలు గురుతుకొస్తున్నవి
అందించిన పాలరుచి తపన పెంచుతున్నది
గ్రోలిన మకరందముకై  పెదవి గోలచేస్తున్నది

2.ముడివీడని కోకముడులు మూలబడిన సంగతి
తడియారని పరువాలు పోగొట్టెకదా ఉన్నమతి
తెరుచుకున్న తలుపులతో స్వర్గమే స్వాగతించె
అమృత ధార రసన జేర అనుభూతే పరవశించె
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

సాయినాథా-సద్గురునాథా
సన్మార్గము చూపితివయ్యా అవధూత
నీ బోధలే మాకు గురుగీత ఇలలో ఆచరణగీత

1.హితము చేయగలిగేదే మహితమనీ
సేవచేయ గలగడమే మానవీయమనీ
మనిషిని అభిమానించడమే  సమ్మతమనీ
జీవకారుణ్యమే అభిమతమవ్వాలనీ
సన్మార్గము చూపితివయ్యా అవధూత
నీ బోధలే మాకు గురుగీత ఇలలో ఆచరణగీత

2.భవబంధనాలనే సడలించుకొమ్మనీ
భువిలోన అందరినీ బంధువులనుకొమ్మనీ
దానమునే జీవన విధానము చేసుకొమ్మనీ
'నేను'ను  నీలోను అనుభూతిచెందమనీ
సన్మార్గము చూపితివయ్యా అవధూత
నీ బోధలే మాకు గురుగీత ఇలలో ఆచరణగీత
చేయని పాపానికీ ఎంతటి దారుణం
తీరని ఆయువుకీ ఆకాల మరణం
తప్పు ఎవరిదో శిక్ష ఎవరికో ఈ ప్రమాదం
దయమానిన దైవమా ఇదా నీకు ప్రమోదం

1.ఏ కలల విహరించే వేళనో
ఏ గాఢ నిద్దుర సమయాననో
ఉసురు తీసెనెందుకో ఈ ప్రాణాంతక వాయువు
ఉక్కిరిబిక్కిరైరి జనం  అందక ప్రాణవాయువు

2.బ్రతికి ఉన్నవారు ఎందరో
చికిత్స అందుకున్న దెందరో
చిందరవందరాయే చిరుచిరు చిరు పొదరిళ్ళు
పుండుమీద పుట్రలాయే కరోనాలు కడగళ్ళు

3.ఊరడించడానికైతె నోరురావడం లేదు
సర్దిచెప్పడానికీ భాష చాలడం లేదు
నిన్న అందరున్న వారు అనాథలై పోయిరి కదా
ఆపన్న హస్తాలే వ్యధార్తుల నాదుకోవాలి సదా

Wednesday, May 6, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

క్షణిక చలిత అలకనంద ఉరవడిగా
మందగమన మందాకిని ఒరవడిగా
కదలాడెను పదపదమూ ప్రబంధమై
పరిమళించె కవనమందు చందన గంధమై

1.అలతి అలతి అక్షరతతి భారతి ఆకృతియై
ఏమాత్రమైన సడలని మాత్రాగతి ఆ కృతియై
భావగాంభీర్యమై శ్రవణ మాధుర్యమై
అలరించెను రసజ్ఞ జన మనోజ్ఞమై

2.ఎదలయతో లయమై నటరాజ ఢమరుకమై
ఊపిరిలో స్వరఝరులై నవ జీవన వేణువై
పల్లవించె ఝల్లుమనగ పల్లవిగా గీతమే
నర్తించె చరణాలే తన్మయముగ సాంతమే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మూగవోతుంటారు మాటరాక
మౌనంగా ఉంటారు చెప్పలేక
ఎదలోని ఉద్వేగం ఎరుకపరుచలేకా
మది మెదిలిన స్పందనలే స్పష్టపరుచలేకా
అభిమానులారా అభివందనం
మీ హృదయంలో నా కవితలు
పదిలపరుచగా ఆనంద నందనం

1.వెచ్చించుతారు మీ విలువైన కాలాన్ని
చదువుతారు ఓపికగా నా కవితలని
వింటారు విసుగొందక నా కర్కష గాత్రాన్ని
భరించుతారు కొన్నికొన్ని నచ్చని భావాలని
అభిమానులారా అభివందనం
నను మరువని మీ మనసుకు
దాసోహం సదా -ధన్యోహం

2.ఏ మూలో దాగిఉంది మీలోన మానవత
ఎక్కడో అణిగి ఉంది ఎనలేని భావుకత
అష్టదిగ్గజాల పోషించిన అల రాయల అంశ మీరు
నవరసాల ఆస్వాదన జన్మతః మీ తీరు
అభిమానులారా అభివందనం
మీ ప్రేరణా ప్రోత్సాహం ప్రశంసలే
 నా కవనానికి స్ఫూర్తిదాయకం
ఎందుకు సుందరీ నీ జోలికైన వచ్చామా
దేనికి భామినీ నిన్నూహించుకున్నామా
ఉచితంగా ప్రదర్శిస్తె తిలకించక మానగలమ
అందాలను ఒలకబోస్తె తాపంతో మనగలమా

1.మార్జాలమల్లె నీవు కవ్విస్తూ ఉంటావు
మూషకాలమే మా ఉసురు తీస్తుంటావు
మా మానాన మమ్మూ బ్రతక నీవె మానినీ
తలవంచుక మమ్మింకా పోనీయవె తరుణీ

2.వాలమైతె లేదుగాని మేము వానరులమే
కైపులోన ఎప్పుడూ మునిగితేలు వారలమే
నీ సొగసు నిప్పు కణిక తొక్కునట్లు జేయకే
చిందులేయ ఉసిగొల్పీ బ్రతుకును చిదిమేయకే

Monday, May 4, 2020

https://youtu.be/NIGVSlAiF3g?si=B8Synu62_iCfLTh-

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: హంసధ్వని

విఘ్నాధిపతివి కదా వినాయకా
నిమగ్నవని నా 'కుమతికి' పగ్గము వేయరా 
సంకటహర గణపతీ అభీష్టదాయకా
నా ప్రగతి బాట కంటకములు కడతేర్చరా
అన్యధా నాస్తి శరణాగతి నీయరా
నిను వినా వేడనైతి వేగమె కరుణించరా

1.తొలుత నిన్ను తలువకుంటె తప్పదు ఆటంకము
నిను పూజించకుండ సఫలమవదు కార్యము
ఇష్టదైవ మీవేయని స్పష్టపరచినానయ్యా
కష్టాలను తీర్చిమమ్ము గట్టెక్కించవయ్య
అన్యధా నాస్తి శరణాగతి నీయరా
నిను వినా వేడనైతి వేగమె కరుణించరా

2.చిన్ననాటినుండి నిన్ను నమ్మికొలిచినానయ్యా
ఎన్నడైనగాని స్వామి కోరినదొసగితివయ్యా
మన్నించర మహాకాయ నా పొరపాట్లను
పరిమార్చర ప్రమధనాథ నా ఇక్కట్లను
అన్యధా నాస్తి శరణాగతి నీయరా
నిను వినా వేడనైతి వేగమె కరుణించరా

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కొందరి నవ్వుల్లో పూసేను మల్లెలు
కొందరి నవ్వుల్లో విరిసేను జాజులు
ముత్యాలు రాల్చేను మరికొందరి నవ్వులు
రతనాలు పొదుగుతూ మెరిపించేనవ్వులు
నవపారిజాతాలే నెచ్చెలీ నే మెచ్చిన నీ నవ్వులు

1.మొగిలి రేకులై గుచ్చేను కొన్ని నవ్వులు
ముద్దబంతులై విచ్చేను కొన్ని నవ్వులు
చేమంతుల ఘాటుతో కొన్ని నవ్వులు
గులాబీ నాజూకుతొ మరికొన్ని నవ్వులు
నవపారిజాతాలే నెచ్చెలీ నే మెచ్చిన నీ నవ్వులు

2.తంగేడు పూలంటి పాల నవ్వులు
గన్నేరు పూలవంటి గోల నవ్వులు
నందివర్దనాలే నవ్వీనవ్వని నవ్వులు
దవనంలా మత్తుగొలుపు మరికొన్ని నవ్వులు
నవపారిజాతాలే నెచ్చెలీ నే మెచ్చిన నీ నవ్వులు
బ్రహ్మ భువికి రాలేకా అమ్మను పంపాడు
ప్రేమనంత రంగరించి అమ్మద్వార వొంపాడు
సృష్టికే మూలంగా అమ్మని మలిచాడు
అమ్మ ప్రేమకోసమే జన్మలెన్నొ ఎత్తాడు

1.రెండు భిన్న కణాలతో గమ్మత్తే చేసాడు
తొమ్మిది మాసాలూ ప్రేగుతొ ముడివేసాడు
ఊపిరిలో ఊపిరిగా అమ్మతొ జతచేసాడు
దేహాత్మ భావనగా పుట్టుకనేర్పరచాడు

2.శిశువుగ ఉద్భవించ అమ్మ ఒడిలొ వేసాడు
స్తన్యమునే అమృతముని గ్రోలగ చేసాడు
బ్రతుకునేర్పు గురువుగా అమ్మను మార్చాడు
సాటిలేని అనుబంధం అమ్మతో కూర్చాడు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీ గళమున పొంగి పొరలిందనా
నా గొంతులొ నింపావు గరళాన్ని
నీ కన్ను భగభగ మండిందనా
నా గుండెలొ రేపావు మంటలని
ఎందుకయా ఓ నీలకంఠా భావ్యమా పరమదయాళా
దేనికయా ఓ ఫాలనేత్రా న్యాయమా ఆశ్రితపాలా

1.గంగలాగ నిరంతం నా కంఠ మంతా కఫం
ఆమ్లంతో జ్వలిస్తోంది నా ఉరఃపంజరం
అలసటగా సాగుతోంది నాహృదయ పనితనం
నాడులే సుడివడి నడక నరకయాతనం
ఎందుకయా ఓ వైద్యనాథా భావ్యమా పరమదయాళా
దేనికయా మృత్యుంజయా న్యాయమా ఆశ్రితపాలా

2.ప్రకోపించ సాగింది కపాలాన పైత్యరసం
ఒంటినాక్రమిస్తోంది విచ్చల విడి వాతం
నరనరాన సన్నగిల్లె పట్టరాని పటుత్వం
సడలనీకు నీ ఎడల ఏమాత్రం విశ్వాసం
ఎందుకయా ఓసుందరేశా  భావ్యమా పరమదయాళా
దేనికయా ఓ కాలకాలా న్యాయమా ఆశ్రితపాలా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హిందోళం

రేపంటూ ఒకటుంది
చీకటులకు సెలవంది
చిగురించును వసంతాలు
ప్రభవించును జీవితాలు

1.ఒంటరినని ఇపుడెంచక
దిగులేల ఏకాంతమనుభవించక
ఆత్మీయుల నడుమన కదలక
గడపడం వరమే ఇంచుక

2.అరచేతి స్వర్గం వదలక
అంబరాన ఉందని భావించక
బలపడు బంధం ప్రేమ దీపిక
కాపురాన కరువిక అరమరిక

3.శుచీ శుభ్రత శుభసూచిక
కల్మష రహిత మలయవీచిక
శతమానం భవతి ఆయువిక
అంతామన మంచికె గనక
రచన,స్వరకల్పన&గానం :డా.రాఖీ

చిగురుటాకూ కదలమాకూ కీచురాయీ ఈలనాపూ
చందమామా తప్పదు నీకు తప్పుకో ఇక మబ్బుచాటుకూ
చీమభామా నీవు సైతం చిటుకు మనకూ
చిన్నారి కన్నయ్యా నిదురపోయేనూ
నా జోల పాటకూ ఈ లాలి పాటకూ
లాలీజో లాలీజో లాలిలాలి లాలీజో

1.ఆటలాడీ అలసిపోయెను చల్లగాలీ వీచాలీ
పాలుతాగక గోల చేసెను నీవే బుజ్జగించాలీ
కిర్రుమనకే ఊయలమ్మా నిదురలోకి జారసాగే
జారిపడకే కొయ్యబొమ్మా ఉలికిపడుతూ బెదరసాగే
లాలీజో లాలీజో లాలిలాలి లాలీజో

2.వంత పాడగ చింత పడకుర పాటలన్నీ నేర్పుతానుర
వీడిపోదను భీతి వీడర హత్తుకొని నిన్నూరడింతుర
కలవరించకు కన్నయ్యా కలత నిదుర ఏలయ్యా
బంగారూ కలలు కంటూ విహరించి రారా విశ్వవీథుల
లాలీజో లాలీజో లాలిలాలి లాలీజో
రచన,స్వరకల్పన&డా.రాఖీ

ప్రేమని మోసుకొస్తుంది
ఒక అల్లరి పలకరింపు
బంధం చిగురింపజేస్తుంది
ఒక చల్లని చిలకరింపు
మానవీయ బంధాలను మించి ఏమున్నది
మహదానందం
మనసువిప్పి మాటాడితే జీవితాన
మకరందం

1.మనుషులమని మరిచిపోయి ముసుగులేసుకొంటాము
కులమతాల రంగులను మేన పూసుకొంటాము
ఎక్కించే రక్తానికి ఎవరిదైన ఎరుపు రంగె
కొట్టుకునే గుండెలధ్వని లబ్ డబ్ లబ్ డబే

2.సంపన్నవర్గమైన తిను అన్నం పరిమితమే
సబ్బండ వర్గానికైనా ఆకలి తీరగ ఉచితమే
ఉన్నోడికి లేనోడికి తేడాయే లేదులే
సంతృప్తి లేనప్పుడు ఏ బ్రతుకూ చేదేలే

3.ఇవ్వడమను గుణానికి పేదతనం తెలియదు
లోభత్వానికీ ఎంతగ ఉన్నా చాలనేచాలదు
పోగేసుక పోయేందుకు నూలుపోగూ రాదు
సాయపడగ సిద్ధపడితె ఏ మాత్రం తరిగిపోదు

Sunday, May 3, 2020

మాతృదేవోభవ అన్నది అక్షర సత్యం
అమ్మ అనురాగం అనుభవైక వేద్యం
ఎంత పేద తల్లికైన తనయుడు యువరాజు
కొడుకు కడుపు నిండితేనె తనకు నిదుర రోజు

1.ఢిల్లీకి రాజైనా  తల్లికి ప్రణమిల్లేను
కొడుకు ఎంత దుడుకైనా అమ్మ ఆదరించేను
జగన్మిథ్య అమ్మ సత్యం తత్వమిదియేను
ముదిమివయసున అమ్మసేవయె తృప్తినొసగేను

2.పులకరించు అమ్మహృదయం పలకరిస్తేనూ
కనులనిండును బాష్పకణములు ఎదుటకొస్తేను
కన్నప్రేగు కాంక్షించును కొడుకు కుశలము
అమ్మ ఎదలయ పలవరించు కుమరుని విజయము
https://youtu.be/mw4a8-yUZrU

మొదటి కంటి చూపుతానె అమ్మా
మొట్టమొదటి నేస్తమే అమ్మా
        మొదట నేర్చుకున్న మాట అమ్మా
ఆ అమ్మఋణం తీర్చుకొనగ సరిపోదు జన్మ
ఈజన్మ మరియే జన్మ||

ఊయలగా మార్చింది ఒడినే
సవారికై నిలిపింది తన మెడనే
అంటనీయలేదునా కాలికి తడినే
ఇంటికే తెచ్చింది   తొలి గురువై బడినే-నేర్పింది బ్రతుకు   ఒరవడినే

లాలిపాటలోని హాయి అమ్మా
గోరుముద్ద కమ్మదనం అమ్మా
ముద్దాడే తీయదనం అమ్మా
కనిపెంచే అనురాగం అమ్మా-కనిపించే ఆ దైవం అమ్మా

అ అంటే అమ్మతో విద్యకు శ్రీ కారం
ఏచిన్ననొప్పైనా అమ్మా అని పలవరం
ఎంతవారికైనా అమ్మే ఒక వరం
కలవరించినా అమ్మ కలవరం-నా బాగే అమ్మకో కల-వరం

OK

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

( చి॥ ఏ. మనోజ్ఞకు అంకితం)
రాగం:షణ్ముఖ ప్రియ

నటరాజ పుత్రీ అభినవ అభినయ అభినేత్రీ
నీ పదము కదలాడ మురిసెను జనని ధరిత్రీ
ఆంగిక వాచిక భావోద్వేగాల నటనా వైచిత్రీ
భరతముని వరమునుగొని వరలెడి చంచలగాత్రీ

1.తాళము చెవిబడిన తాళదు నీతనువు
జతులకు గతులకు వెలయు ఇంద్రధనువు
మనోజ్ఞమౌ నీ నాట్య భంగిమ నయన మనోహరము
రసజ్ఞులౌ ప్రేక్షక జనులకు హృదయానందకరము

2.నృత్యరీతులేవైననూ దాసోహములే నీకు
లాస్యమన్నది పాదాక్రాంతమే నీ ఆకాంక్షకు
హరిణేక్షణలే నృత్తము నందున నీ నేత్రాలు
మయూరములే నేర్చుకొనును నీకడ పాఠాలు

Saturday, May 2, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మోయబోకు విరహాన్ని ఎంతో భారం
సైచమాకు ఎడబాటు ఎంతటి ఘోరం
త్రుంచగ నేనున్నా ప్రతీక్షనే నెచ్చెలీ
మురిపించెద  దరిజేరీ రాసకేళి

1.సీతలాగ వీడిపోకు లేడి కోరి గీతదాటి
రాధలాగ బాధపడకు రోజంతా ఎదురుచూసి
నీ ఎదలోకి తొంగి చూడు కనిపించెదనే
నీతలపులు తట్టిచూడు ఏతెంచెదనే

2.చేరలేని రవిని కాను కమలమా నే కవిని
పున్నమి శశిని కాను చకోరమా నేనే కైరవిని
నా గుండెలొ దేవతగా కొలువుండవే
నా బ్రతుకున కర్థమై వెలుగొందవే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అందరం పోయేది తప్పక స్వర్గానికే
బ్రతుకును మించిన నరకం మరొకటి లేనందుకే
రౌరవాది దండనలు అష్టావింశతి
అనునిత్యం యాతనలు అనంతకోటి

1.సప్తవ్యసనాలు అష్టకష్టాలు
నవగ్రహ పీడనలు దశ దారుణాలు
అడుగుతీసి అడుగువేస్తె కందకాలు
అలవాటై పోయాయి దినదిన గండాలు

2.అవమానాలు అసూయా ద్వేషాలు
నమ్మితె మునిగేటి ఘరానా మోసాలు
మందూ మాకే లేని వింత మొండి రోగాలు
కల్తీమయ వస్తువులు కలుషిత దేహాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఓటమి నొప్పని వీరులం
పోరాటాల్లో యోధులం
ఎదురొస్తేనేం  మరణం
ఎదిరించడమే మా గుణం

1.విశ్వంలోనే బుద్ధిజీవులం
రోదసికంతకు మేధావులం
ఐక్యత గలిగిన మానవులం
ఆధిపత్యం సాధించిన నరులం

2.విపత్తులనే అధిగమించాం
వ్యాధులనే తుదముట్టించేసాం
సృష్టికి ప్రతి సృష్టిని చేసాం
గుట్టులెన్నిటినొ విప్పిచెప్పాం

3.కరోనాపై సమరాన లౌక్యం
చాకచక్యమె మాకు ముఖ్యం
తప్పుకొంటూ తప్పించేస్తాం
అంటువ్యాధికి మంటబెడతాం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పుట్టిన ఊరికీ దూరమైపోయి
చుట్టపక్కాలనింక వీడిపోయి
పొట్టచేత పట్టుకోని ఏ దరికి చేరినావో
తట్టనెత్తికెత్తుకొనీ ఏ పనికి కుదిరినావో
వలసకూలీ తమ్ముడా -దినసరి కూలీకే నీ బ్రతుకమ్ముడాయే

1.రెక్కాడితె గానీ డొక్కాడదాయే
నిలువ నీడైనా నీకిక కరువాయే
పిల్లాపాపలతో ఎండావానలలో
రోడ్డుపక్క జీవితమాయే-జీవితమే రోడ్డుపాలాయే
వలసకూలీ తమ్ముడా -దినసరి కూలీకే నీ బ్రతుకమ్ముడాయే

2.బ్రతుకునకు ఏమాత్రం భరోసాలేదు
భవితకైన కనీస భద్రత లేదు
పనిదొరకనివేళలో బ్రతుకు ప్రశ్నార్థకమే
అనుకోని విపత్తులందు అతలాకుతలమే
వలసకూలీ తమ్ముడా -దినసరి కూలీకే నీ బ్రతుకమ్ముడాయే

3.పుండు మీద పుట్రలాగ రోగమేదొ కఱవసాగె
ఆత్మాభిమానమేమొ వీథులపాలాయే
దారితెన్ను గనలేక సొంతూరికి పయనమాయే
నడిచి నడిచి త్రోవతెగక కాళ్ళు రేగాళ్ళాయే
వలసకూలీ తమ్ముడా -దినసరి కూలీకే నీ బ్రతుకమ్ముడాయే

OK


Thursday, April 30, 2020

https://youtu.be/ZSsx1e_-E30?si=vEzEw_MK_క్క్డొడన్క్

రచన,స్వరకల్పన&గానం.డా.రాఖీ



విశ్వేశ్వరమ్ విశ్వాకారమ్
ప్రదోష కాల తాండవ ప్రియం నటేశ్వరమ్
వందే శంభుం భుజగేంద్ర భూషణం
వందే వైద్యనాథం సర్వ క్లేశ భీషణమ్

1.త్రినేత్రమ్ ప్రభుమ్ గుణత్రయాతీతమ్
త్రిభువనైక పూజితం కాలత్రయాన్వితమ్
త్రిశూలాయుధ ధరమ్ త్రిపురాసుర సంహారమ్
త్రియంబకేశ్వరమ్ భవం భక్తవశంకరమ్
వందే త్రివిక్రమ మిత్రమ్ పరమేశ్వరమ్
వందే అకారోకారమకార రూపమ్ ఓంకారేశ్వరం

2.పంచాననం పంచాయుధ ధరం
పంచాయతనాన్వితమ్ శివమ్
పంచభూతేశ్వరమ్ పంచప్రాణనాథమ్
పంచామృతాభిషేక సంతసమ్ ఈశ్వరమ్
వందే పంచబాణ ధర హరమ్
వందే పంచాక్షరీ మంత్ర వశంకరమ్ శుభకరమ్॥
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:చారుకేశి

కష్టాల్లో సాయపడే నేస్తము నీవే
ఇష్టాలను తీర్చే కల్పవృక్షము నీవే
వ్యాధుల పరిమార్చే వైద్యుడవీవే
భవజలధిని దాటించే నావికుడవే
సాయీ నిన్నే శరణంటినయ్యా
సాయీ నన్నే కరుణించవయ్యా

1.ఆకలినెరిగిన అమ్మవు నీవే
ఆశల నెరిగిన నాన్నవు నీవే
మార్గము చూపెడి గురడవు నీవే
మోక్షము నొసగెడి దైవము నీవే
సాయీ నిన్నే శరణంటినయ్యా
సాయీ నన్నే కరుణించవయ్యా

2.ఏకాగ్రత చేకూర్చే లక్ష్యము నీవే
చెక్కు చెదరనీ గుండె ధైర్యము నీవే
అచంచలమైన విశ్వాసము నీవే
అనంతానంతమైన విశ్వము నీవే
సాయీ నిన్నే శరణంటినయ్యా
సాయీ నన్నే కరుణించవయ్యా

Wednesday, April 29, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

(సినిమా కోసం వాడుకోవచ్చు-రచయిత అనుమతితో)

కాటుక మురిసిపోతున్నది
నీ కళ్ళతో జతపడి సార్థకమైనందుకు
తిలకం గర్వమొందుతున్నది
నీ నుదుటన మెరిసిపోతున్నందుకు

ముంగురుల భ్రమరాలే భ్రమిసిపోతున్నాయి
నీ వదన కమలాన్ని ముద్దాడినందుకు
చిరునవ్వుల మల్లియలే ముదమొందుతున్నాయి
నీ పెదవుల నలరించినందుకు

నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
అనుబంధం పెనవేసినందుకూ

1.పరవశించి పోతున్నది గానము
నువు గాత్ర మాధురిని అద్దుతున్నందుకూ
పలవరించుతున్నది ప్రౌఢ పికము
నీ పాటే మాదిరిగా దిద్దుతున్నందుకూ
నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
నీ గీత మకరందం గ్రోలుతున్నందుకూ

2.తృప్తిపడుతున్నది భారతీయము
కట్టుబొట్టులో ప్రతీకవే నీవైనందుకూ
చాటిచెప్పుతున్నది మనదైన తెలుగుదనము
సాంప్రదాయ బద్ధమైన నీ నడతకూ
నాదెంత అదృష్టమో నెచ్చెలీ
నీతో సావాసమున్నందుకూ
నూరేళ్ళూ ముడివడి ఉన్నందుకూ
https://youtu.be/CHvEY7gJY7Y


అంటే అంటావుగాని
ఆ కొంటె చూపులెందుకంటా
తిడితే తిట్టావుగానీ
ఆ చిలిపి నవ్వులెవరికంటా
ఆకంటా ఈకంటా నువు పడకుంట
నిన్ను దాపెట్టగ నా కెంతటిదో ఈ తంటా

1. కళ్ళేమో బెల్లాలు నోరూరే తాయిలాలు
ఎదకవి గొళ్ళాలు ఎర వేసిన గాలాలు
పోరే పెడుతున్నాయి మిగిలిన నీఅందాలు
కురులు కెంపుల చెంపలు ఊరించే పెదాలు
రెప్పవాల్చలేని తిప్పలు నాకెన్నో
చెప్పనలవి కాని గొప్పలు నీకెన్నో

2.కచ్చ తీర్చుకోనేల రెచ్చగొడుతు నన్ను
అలసిపోతుందే చూస్తూనె ఉంటె నా కన్ను
ఋజువన్నది లేకుండా చంపగలవె నువ్వు
కత్తికన్న పదునే పరువాలు చిలుకు నీ తనువు
ఛస్తే మాత్రమేమి నిన్నే పొందగా
బ్రతికొస్తా పదేపదే అందాలనందగా

OK

Tuesday, April 28, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:బీంపలాస్

సాకారా నిరాకారా సైకతలింగేశ్వరా
అవ్యక్తా అభివ్యక్తా ఆత్మలింగేశ్వరా
శ్రీ రాఘవ హస్త ప్రతిష్ఠితా
ధర్మపురీ శ్రీరామలింగేశ్వరా
పాలయమాం పంచభూత లింగేశ్వరా
ప్రణమామ్యహం ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరా

1.పృథ్వీరూపలింగా కంచి ఏకామ్రేశ్వరా
జలరూపలింగా జంబుకేశ్వరా
తేజోరూపలింగా అరుణాచలేశ్వరా
వాయురూపలింగా శ్రీకాళహస్తీశ్వరా
ఆకాశరూపలింగ చిదంబరేశ్వరా
నమోస్తుతే వేములవాడ రాజేశ్వరా
రాజరాజేశ్వరా

2. శ్రీశైల మల్లికార్జునా సోమనాథేశ్వరా
ఉజ్జయినీ మహాకాలా ఓంకారేశ్వరా
భీమశంకరా పర్లీ వైద్యనాథేశ్వరా
రామేశ్వరా దారుకావన నాగేశ్వరా
త్రయంకేశ్వరా కాశీ విశ్వేశ్వరా
కేదారేశ్వరా ఎల్లోరా ఘృష్ణేశ్వరా
కాళేశ్వర ముక్తీశ్వరా
https://youtu.be/-mDga2xu_v4

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నిన్ను నీవు తెలుసుకొనుటె ఆత్మజ్ఞానము
మనిషి దైవమన్నదే పరమ సత్యము
జగద్గురువు ఆదిశంకర ప్రబోధము
తత్వమసి తత్వమే అద్వైతము
శంకర జయంతి నేడు సద్గురునికి వందనాలు
కంచి పరమాచార్యులకు సాష్టాంగ వందనాలు

1.కాలడిలో ఆర్యాంబ గర్భాన ఉదయించి
ఎనిదేళ్ళ ప్రాయంలో సన్యసించి
గోవింద భగవద్పాదుల గురువుగా పొంది
బ్రహ్మ సూత్రాలకు సరళ భాష్యాలు రచియించి
విఖ్యాతి నొందాడు శంకరుడు అద్వైత సిద్ధాతం ప్రవచించి

2.శృంగేరి పూరీ ద్వారకా జ్యోతిర్మఠాలు
నాల్గు చెరగులా స్థాపించాడు అద్వైత పీఠాలు
కనకధారా స్తవమును ఎనలేని దేవతా స్తోత్రాలను
జగతికి అందగా చేసాడు ఆదిశంకరాచార్యులు
అహం బ్రహ్మాస్మి తత్వాన్ని అవగత పరిచాడు

Saturday, April 25, 2020


https://youtu.be/dlO8H6p6NzU?si=P6qRzk_kAT96R7NK

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

(ప్రతి పంక్తిలో "క్ష కార" పదగీతి)

రాగం:మధ్యమావతి

అక్షయ నిధులను అందించవె
ఆదిలక్ష్మి మాయమ్మా
అక్షయ తృతీయ నేడూ
లక్షణముగ నిన్నర్చించెద మోయమ్మా

అక్షయ నిధులను అందించవె
ధనలక్ష్మీ మాయమ్మా
అక్షయ తృతీయ నేడూ
లక్షణముగ నిన్నర్చించెద మోయమ్మా

1.బిక్షకులే లేనటుల ఈ ఇలలో
క్షుద్బాదలు తీర్చవె మాయమ్మా
నిక్షేపములౌ ధాన్య రాశుల మాకు
దయసేయవె ధాన్యలక్ష్మీ శరణమ్మా

అక్షయ నిధులను అందించవె
గజ లక్ష్మీ మాయమ్మా
అక్షయ తృతీయ నేడూ
లక్షణముగ నిన్నర్చించెద మోయమ్మా

2.నిరక్షరాస్యులను మాటే
ఈ క్షితిలో వినిపించనీకమ్మా
అక్షరమౌ విద్యాసంపద నొసగవె
విద్యాలక్ష్మీ వినతులు గొనవమ్మా

అక్షయ నిధులను అందించవె
వర లక్ష్మీ మాయమ్మా
అక్షయ తృతీయ నేడూ
లక్షణముగ నిన్నర్చించెద మోయమ్మా

3.రక్షించవె ఆయురారోగ్యములిచ్చి
పరీక్షించక మమ్మిక ఓయమ్మా
వీక్షించవే కన్నుల వెన్నెల ఒలుక
సంతాన లక్ష్మీ మాయమ్మా

అక్షయ నిధులను అందించవె
ధైర్యలక్ష్మీ మాయమ్మా
అక్షయ తృతీయ నేడూ
లక్షణముగ నిన్నర్చించెద మోయమ్మా

Friday, April 24, 2020

https://youtu.be/KGYUnC3KOks

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

విజయాలను నెమరువేసుకొంటూ
గుణపాఠాలనే నేర్చుకుంటూ
అధిరోహించాలి ఉన్నత శిఖరాలనూ
అధిగమించి తీరాలి అవరోధాలనూ
జన్మదినం కావాలి స్ఫూర్తికారకం
జన్మదినం  ఎల్లరకూ ఆనందదాయకం
శుభాశీస్సులందుకో సుందరా
శుభాకాంక్షలివిగో హరీష్ భరద్వాజా

1.పిరికితనం నినుచూసి జడుసుకోవాలి
తడబాటే  స్థైర్యానికి తలవంచాలి
ఓరిమి నీవెంటే నీడగ సాగాలి
ఓటమి నీ దీక్షముందు ఓడిపోవాలి
జన్మదినం కావాలి స్ఫూర్తికారకం
జన్మదినం  ఎల్లరకూ ఆనందదాయకం
శుభాశీస్సులందుకో సుందరా
శుభాకాంక్షలివిగో హరీష్ భరద్వాజా

2.ఆరోగ్యం నిన్నెపుడు అంటిపెట్టుకోవాలి
ఆహ్లాదం హృదయంలో ఆవాసముండాలి
గణపతీ మారుతీ నిన్ను దీవించాలి
అమ్మానాన్న అన్నల ఆశీస్సులు పండాలి
జన్మదినం కావాలి స్ఫూర్తికారకం
జన్మదినం  ఎల్లరకూ ఆనందదాయకం
శుభాశీస్సులందుకో సుందరా
శుభాకాంక్షలివిగో హరీష్ భరద్వాజా


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కానడ

గడ్డకట్టి పోయాయి కన్నీళ్ళూ
బండబారి పోయింది నాగుండె
ఎటుచూసినా శోకసంద్రమే లోకంలో
జనమంతా అయోమయపు  వింత మైకంలో

1.గడిచెటోడికైనా ఇది గడ్డుకాలమే
పూటగడవనోడికి ఇక దినదిన గండమే
గతిలేక గతపు స్మృతులు నెమరేసుకోవడమే
ఉగ్గబట్టి విపత్కాలమీదుకుంటు సాగడమే

2.తీరిపోతె కష్టమెంత చిన్నదో కదా
మునకలేస్తున్నపుడిక బ్రతుకు విలువ తెలియదా
మించనీకు తరుణమింక మంచిగ మెలగగా
ప్రేమ దివ్వె వెలిగించు చీకటే తొలగగా
ఎన్నిజన్మముల పాపములైనా
ఎంచక తొలగించు వాడు
తెలిసీ తెలియక చేసిన దోషములు
మన్ననచేసి మాన్పెడి వాడు
ఎల్లలోకముల నడిపెడివాడు
చల్లని చూపుల వేంకటేశ్వరుడు
మహిమలు గుప్పించు మదనజనకుడు
సిరులను కురిపించు శ్రీనివాసుడు
గోవింద గోవింద హరినారాయణ
గోవింద గోవింద కరుణాభరణా

1.అడిగేపనిలేదు అంతర్యామిని
కోరేదియు లేదు కొండలరాయుని
వేడాలని లేదు వేంకటా చలపతిని
మనసెరిగిన మా మంగాపతిని
మహిమలు గుప్పించు మదనజనకుడు
సిరులను కురిపించు శ్రీనివాసుడు
గోవింద గోవింద హరినారాయణ
గోవింద గోవింద కరుణాభరణా

2.వ్యాధులకౌషధము వ్యాసవినుతుడే
నలతల లేపనము నారద నాంత్రుడే
రుగ్మతకు వైద్యుడు హరినారాయణుడె
రోగాలకెల్లనూ  ధన్వంతరి తానె
మహిమలు గుప్పించు మదనజనకుడు
సిరులను కురిపించు శ్రీనివాసుడు
గోవింద గోవింద హరినారాయణ
గోవింద గోవింద కరుణాభరణా

Tuesday, April 21, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఖర్చేముంది సాటివారిని కాస్త ప్రేమిస్తే
కష్టమేపాటి తోటివారిని ప్రేమగా ఆదరిస్తే
మనిషిగా జీవించు మనుషులను అభిమానించు
మానవత్వాన్ని ఇంచుకైనా పెంచి పోషించు

1.కొంపలేం మునిగిపోవు కొంతైనా పంచివేస్తే
ఆస్తులేం కరిగిపోవు అన్నార్తులకు వితరణ చేస్తే
ఆకలే కద జీవజాతికి మహిలోన మహమ్మారి
వృత్తి ఉద్యోగాలన్నీ చేయుట భుక్తికే చచ్చీచెడీ

2.రోజువారీ కూలైనా రాజ్యమేలే రాజైనా
అతీతులెవ్వరులేరు  క్షుద్భాద ముందు
ఉపాధే లేనివేళలో ఏ భృతీ నోచనివారికి
ఉడతా భక్తిగా కీర్తి కోరైనా సరే విరాళాన్ని అందజేయి

Monday, April 20, 2020

https://youtu.be/KNrrRpiscrI

రాగం:తోడి

చూపులతో తొలి వందనం ఉగ్రనార సింహం
కరములతో మలి వందనం యోగ నారసింహం
సాష్టాంగ వందనమిదె లక్ష్మీనార సింహం
యాదగిరి లక్ష్మీ నారసింహం
మనసారా గొనుమిదె మా వందనం
ధర్మపురీ నారసింహం మా ధర్మపురీ నారసింహం

1.జనుల తపన నెరవేర్చెడి జ్వాలా నారసింహం
మునుల తపము మెచ్చెడి వరాహ నారసింహం
కనుల గాంచ వరములిచ్చు శాంతనారసింహం
ఇహపర సుఖములొసగు ధర్మపురీ నారసింహం
మా ధర్మపురీ నారసింహం

2.నారద ప్రహ్లాద వరద పవన నారసింహం
హిరణ్య కశిపు సంహరా మాలోల నారసింహం
సర్వరోగహర గండభేరుండ నారసింహం
శేషప్ప కవి సన్నుత ధర్మపురీ నారసింహం
మా ధర్మపురీ నారసింహం

Sunday, April 19, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తపములే చేయాలా నిన్ను రప్పించ
జపములే చేయాలా నిన్ను మెప్పించ
సాధ్యమే కాదు నాకు యాంత్రికుణ్ణి నేను
వాస్తవాలు నిగ్గదీయకు కాస్తనాస్తికుణ్ణి నేను
ఉనికి తెలుపుకోవయ్యా ఉమాశంకరా
పనికిరావేల ఉంటే ఫాలనేత్రుడా

1.అర్చనలూ అభిషేకాలు లంచాలా నీకు
హారతులు నైవేద్యాలు నజరానాలెందుకు
నువ్వు ప్రసన్నం కావాలంటే ప్రదోష దీక్ష చేయాలా
నువ్వు వరములీయాలంటే ముడుపులిచ్చుకోవాలా
బదులు పలుకవేమయ్యా బాలేందు శేఖరా
ఆదుకొనుగ రావయ్యా  అర్ధనారీశ్వరా

2.నీ గుళ్ళూ గోపురాలు నిశ్చయంగ దర్శించాలా
తీర్థాలూ యాత్రలన్ని మేము తిరిగి తీరాలా
కన్నతండ్రి పెట్టగలడా కరుణాకరా ఇలా ఆంక్షలు
ఆత్మలోన కనుగొంటే అవ్యక్తుడా ఏలా పరీక్షలు
చిత్రవధలు మాకేనా చిదానందుడా
ఘోరయాతనకు తుది లేదా నీలకంధరా

OK
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చిన్ని చిన్ని చర్యలతో -ప్రయోజనాలెన్నెన్నో
చిరుచిరుచిరు చేష్టలతో -మనసూరటలెన్నెన్నో
గమనించు నేస్తమా - సూక్ష్మంలో మోక్షాన్ని
పాటించు మిత్రమా-బాంధవ్య సూత్రాన్ని

1.దయచేసి వాడాలి తరచుగా దయచేసి అన్న పదాన్ని
సరే అని అనగలిగావా-త్రుంచగలవు వాదాన్నీ వివాదాన్నీ
విచారాన్ని వ్యక్త పరిస్తే-అణచగలవు ఎదుటివారి ఆగ్రహాన్నీ
కృతజ్ఞతలు తెలిపావంటే-పంచగలవు పరస్పరం ఆనందాన్నీ

2.పలకరించినా చాలు-తీర్చేవు కన్నవారి కాస్త ఋణాన్ని
తాజాగా ఉంచగలిగితే-నిలిపేవు నిండైన స్నేహితాన్ని
కర్తవ్యం మీరకుంటే -గెలిచేవు యజమాని విశ్వాసాన్ని
మక్కువను వ్యాఖ్యానిస్తే-ఇచ్చేవు కవులకు ప్రోత్సాహాన్నీ
చప్పట్ల దుప్పట్లతో సత్కరించగలవు కళాకారులందర్నీ

Saturday, April 18, 2020

https://youtu.be/kVz5FWjHOT8

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:సింధుభైరవి

నందబాలం యదునందబాలం
గోకుల గోపాలం ఆనందమూలం
వందే పరమానందమూలం

వసుదేవ సుతం యశోదా మోదితం
నవనీత హరం గోవర్ధన గిరిధరం
నమామి శిఖిపింఛ శోభితం

యమునా తీర విహారం బృందావన సంచారం
గోపికా ప్రియకరం రాధికా మనోహరం
పాలయమాం మురళీగాన విలోలం

ద్రౌపదీ మాన సంరక్షణం చక్రధరం
పాండవ హితకరం కిరీటి రథచోదకం
భజే గీతా జ్ఞాన సుబోధకం

Friday, April 17, 2020

రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ

రాగం:శివరంజని

స్ఫురించినంతనే రామా నీ రూపం
దివ్య సుందర విగ్రహం
స్మరించినంతనే రామా నీ నామం
మకరంద మాధురీ సమం
అమృత తుల్యం నీ అద్భుత చరితం
అనన్య సామాన్యం ఆదర్శ భరితం

1.తరించింది తాటకి నీ బాణం తాకి
అవతరించింది నాతి నీ పాదం సోకి
వరించింది జానకి విలువిరిచిన నీ శౌర్యానికి
కలవరించింది సాకేతపురి నీ పట్టాభిషేకానికి

2.విలువ హెచ్చింది నీ వల్ల రాజసానికి
జనం మెచ్చింది నువుపాటించ తండ్రిమాటకి
కళవచ్చింది పదునాలుగేళ్ళు దట్టమైన వనికి
కీర్తి తెచ్చింది నీ ధర్మనిరతి భారతావనికి

3.భక్తి కుదిరింది నదిదాటగ బోయవాడికి
బ్రతుకు ఆరింది నిన్నేమార్చ మాయలేడికి
మైత్రి కలిసింది నీకూ కిష్కింద వానరుడికి
ముక్తిదొరికింది రావణుడికి నీ తూపువాడికి

Thursday, April 16, 2020

https://youtu.be/WIBOUssIa4A

బ్రతుకు నీ చేతిలో శివశంకరా
భవిత నీ చేతలో పరమేశ్వరా
ఆరిపోయే దీపాన్నీ అఖండంగ వెలిగిస్తావు
ఆకస్మికమైన క్షణంలో అంతరింపజేస్తావు
ఏమిటో నీ క్రీడ మంజునాథేశ్వరా
ఎందుకో సయ్యాట రాజరాజేశ్వరా

1.మార్కండేయులెంతమంది చిరంజీవులైనారు
శిరియాళులెంతమంది కృపాపాత్రులైనారు
బ్రహ్మరాతరాస్తాడేల -శివుడు చెరిపివేస్తాడేలా
అపవాదునీకేల కాలకాలుడా
అపకీర్తి నీకేల విశ్వనాథుడా

2.వైద్యనాథుడవే నీవు రోగాలు బాపలేవా
మృత్యుంజయుడవే అపమృత్యునాపలేవా
ఇదే నీ అభీష్టమా-ఇదే సుస్పష్టమా
కరుణించి కాపాడు చంద్రశేఖరా
శరణంటు వేడేము శంభోహరా

Monday, April 13, 2020

కలం రాయని రాతలెన్నో కన్నీళ్ళు రాస్తాయి
ఎవరు చూడని లోతులెన్నో ఎదలొ ఉంటాయి

జలతారు ముసుగులు మోమునంతా కప్పివేస్తాయి
చిరునవ్వు నివురును ఊదివేస్తే నిప్ప్క లుంటాయి

ఎండమావులు ఎదురువస్తూ అశనిస్తాయీ
తీరలేని తపనింకా పెంచివేస్తాయీ

 తొలగిపోనీ మబ్బులెన్నో శశినిమూస్తాయి
బ్రతుకు సాంతం గ్రహణమల్లే తలపునిస్తాయి

పంచప్రాణాల దేహము అలసిపోతుంది రాఖీ
పంచభూతములప్పుడే కబళించి వేస్తాయి

Saturday, April 11, 2020

ఉన్నదే ఇపుడున్నదే జీవితం
చేజారినదంతా గతం
కాలప్రవాహంలో కరిగెను స్వప్నం
ఎపుడే మలుపు తిరుగునో
జీవిత నాటకం

1.బండ్లు ఓడలైతే ఎంతటి అదృష్టం
ఓడలు బండ్లవడమే ఓ నగ్నసత్యం
జీర్ణించుకోగలేని పరిణామాలు
ఊహించగాలేని ఉత్పాతాలు
నిన్నటి నందనవనమే నేటి స్మశానం
కట్టెలమ్ముకొట్టాయే పూలదుకాణం

2.యథాతథంగా సాగాలి బ్రతుకు రథం
ఎత్తు పల్లాలెన్నున్నా ఉన్నది ఒకటే పథం
శీలలే ఊడినా ఆగదు ఈ పయనం
చక్రమే తొలగినా చేరకతప్పదు గమ్యం
ఆశించినప్పుడే మనషికి ఆశాభంగం
ఎదురీదక స్వీకరిస్తే ఎనలేని ఆనందం


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కత్తిమీద సామురా కలికితో స్నేహము
పులిమీద స్వారిరా పడతితో చెలిమి
ఎప్పడెలా పరిణమిస్తుందో
ఏ మలుపు తిరుగుతుందొ
అత్తిపత్తిలాగా ఎంచరా సోదరా
ఉత్తి తోలుతిత్తిగ భావించరా

1.అందమనే వెలుగు శిఖన-శలభమల్లె మాడిపోకు
తామర రేకుల మధ్యన-భ్రమరమోలె చిక్కుబడకు
మోహమనే పాశానికి నువు కట్టుబడకు
వలపుల మాయల వలలోన పట్టుబడకు

2.పట్టించుకోకున్నా ఆకట్టు కొంటారు
తపసుచేసుకుంటున్నా భంగపరుస్తుంటారు
చొరవగ ఉన్నారనీ సొల్లుకార్చుకోకురా
చనువునిచ్చారనీ చంకనెక్కబోకురా

Friday, April 10, 2020

https://youtu.be/BPW8t05I3rw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

ఎక్కడ కొలువుంచనూ ముక్కంటి దేవరా
ఏ తావున నిలుపనూ ఓ తిక్క శంకరా
తిరుగ మరిగినోడివి
ఒక పట్టే పట్టనోడివి
నిన్నెలా పట్టేయనూ ఎదకెలా కట్టేయనూ

1.గుండె నుండమనలేను
పాడుబడినదెప్పుడో
మనసున బస చేయమనను
మసిబారిందెన్నడో
నీళ్ళంటే నీకిష్టము గంగాధరా
నా కళ్ళలొ పుష్కలము మునిగితేలరా

2.ఇంటికింక పిలువలేను
ఇక్కట్లే ఆక్రమించుకొన్నాయి
ఒంటిలోన స్థలమీయ లేను
రోగాలే పీడించుతున్నాయి
అక్షరమే నీతత్వము సదాశివా
అక్షరముల బంధింతును నిను సదా శివా

OK
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నారు పోసిన నీవు-నీరు పోయగ లేవా
ఈత నెరుగని మమ్ము-ఏరు కడపగ లేవా
ఏడు కొండల సామి-బదులు పలుకవేమి
మము గన్న మాతండ్రి-దారి చూపవదేమి

1.ఎలుగెత్తి అరిచింది ఏనుగు ఆనాడు
ఆదర బాదరగా - ఆదుకొంటివిగాదా
దీనంగా వేడింది ద్రౌపది శరణంటూ
చీరలనందించి మానము కావగలేదా

2.నీకున్న పని ఏమి లోకాలేలే సామీ
మంచిని పెంచడము -చెడ్డను తుంచడమే
పడక వేసినావొ పడగ నీడలోన
కునుకే తీసినావో లిప్తపాటులోన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నువ్వొక్కడివే దిక్కు
నీపైనే నమ్మిక మాకు
జగమేలే పరమాత్మా
నువ్వొక్కడివే రక్ష మాకు

1.నరజాతి నశించడాన్ని
కాచే ప్రభుడవు నీవే
ఘోరక(లి)రోనా ఆగడాన్ని
ఆపే యోధుడవల్లా నీవే

2.ముక్తకంఠంతో మేము
నిన్నర్థిస్తూనే ఉన్నాము
గుణపాఠం నేర్చుకున్నాము
పద్ధతులను పాటిస్తాము

https://youtu.be/5TIZYliGxxw?si=wXeQOkD_LjOnhOtf

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:దేవగాంధారి

జననం మరణం సహజాతి సహజం
జన్మకారణం కానేల (అను)నిత్య రణం
జగమే మాయని ఎరిగినగాని
జనులేల జగడాల కడతేరనేల
ఈచక్ర భ్రమణము నాకేలనమ్మా జ్ఞాన సరస్వతి
జననీ జగజ్జననీ కోరితి మరిమరి నీశరణాగతి

1.సతతము మరువక  నెరనమ్మితి భారతీ
మనమున మననము దినమానము జేసితి
మనసేల వచ్చెనే ఇల నన్నొదలగ అనాధగ
అక్కునజేర్చవే చక్కని మాయమ్మ ననువేగ
ఈచక్ర భ్రమణము నాకేలనమ్మా జ్ఞాన సరస్వతి
జననీ జగజ్జననీ కోరితి మరిమరి నీ శరణాగతి

2.తుఛ్ఛమైన ఇఛ్ఛల తీర్చి మోసపుచ్చకే జగన్మామాత
నిత్యానందము నీ పదసన్నిధి దయసేయవె దాక్షాయణీ
ఆప్తుడగానా నీ కృపా ప్రాప్తికి లిప్తపాటైన వృధాపరచక
పరసౌఖ్యదాయిని నిజ శ్రేయకారిణి శృంగేరీ శారదాంబికా
ఈచక్ర భ్రమణము నాకేలనమ్మా జ్ఞాన సరస్వతి
జననీ జగజ్జననీ కోరితి మరిమరి నీ శరణాగతి

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎడారిలో తడారిన గొంతును నేను
తుది మెదలు తెగిపోయిన వంతెన నేను
ఊహల స్వర్గానికి నిచ్చెనపై నేను
ఉద్ధరించువారికై ఎదిరిచూస్తున్నాను

1.భగీరథుడనయ్యాను గాత్రగంగ కోసం
గాధేయుడనయ్యాను బ్రహ్మత్వం కోసం
నత్తగుల్ల నయ్యాను స్వాతిచినుకు కోసం
బీడునేల నయ్యాను వానధార కోసం

2. చకోరినయ్యాను కార్తీక వెన్నెల కోసం
చాతకపక్షినైతి మృగశిర కార్తి కోసం
మయూరమైనాను ముసిరే మబ్బుకోసం
శిశిరమై మిగిలాను రాని ఆమని కోసం

Thursday, April 9, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా కవి తలలో తరగని స్నేహముంది
నా కవితలలో సాహితీ దాహముంది
నే పాడే గీతాల దాగిన అనురాగముంది
నే వేడే భారతీమాత వర యోగముంది

1.ఎనలేని సారస్వత మక్కువ ఉంది
మనలేని సంగీతపు ఆత్రుత ఉంది
రసహృదయుల అగణితమౌ అభిమానముంది
ననుగన్న తలిదండ్రుల మిక్కిలి దీవెన ఉంది

2.దైవమంటె అమితమైన భక్తి ఉంది
దేశమంటె ఎదలో అనురక్తి ఉంది
సమాజమంటె ఇష్టపడే బాధ్యత ఉంది
విశ్వజనీనమైన ప్రేమ అనుభూతి ఉంది

Wednesday, April 8, 2020


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:భీంపలాస్

చిత్తములో నీవున్నా ప్రాప్తమేల ఈ గతి
భావనలో కొలువున్నా భవిత కేల దుర్గతి
నిదురలోన కలగా నీవే
నిజములోనా కనులానీవే
నన్నేల ఏలవో నగజా విభో
శరణాగతవత్సలా హరహర శంభో

1.పలుకుతున్న ప్రతి పలుకూ పంచాక్షరిగా ఎంచా
ఎదురైన ప్రతి శిలనూ శివలింగమని తలిచా
కురిసేటి వర్షాన్నే భగీరథిగ భావించా
జీవరాశినంతటినీ నీవుగా ప్రేమించా
నన్నేల ఏలవో నగజా విభో
శరణాగతవత్సలా హరహర శంభో

2.ఉఛ్వాసే నమక స్తోత్రం నిశ్వాస నాకు చమకం
ఆత్మలింగానికి సతతం  రుధిర రుద్రాభిషేకం
నవనాడుల మ్రోగుతుంది నాప్రాణ రుద్రవీణ
గుండెయే తాండవమాడ బ్రతుకే శివా నీకర్పణ
నన్నేల ఏలవో నగజా విభో
శరణాగతవత్సలా హరహర శంభో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీ కళ్ళే కలువరేకులు
ఆ కళ్ళే ఎదకు బాకులు
నీ కళ్ళే కదలనీక పాదాలకు మేకులై
ఆ కళ్ళే మెదలనీక గుళ్ళున్న తుపాకులై

1.నీ కళ్ళు నేర్పాయి తారలకు తళుకులెన్నో
నీకళ్ళు కూర్చాయి మెరుపులకు జిలుగులెన్నో
నీకళ్ళే అరువిచ్చాయి నిశీధికే నీలవర్ణము
నీకళ్ళే  స్మృతి తెచ్చాయి నెలలోని కృష్ణపక్షము

2.నీకళ్ళు చూసి చూసీ కృష్ణుడాయే నందబాలుడు
నీకళ్ళు గీసిగీసీ చకితుడాయే చతురాననుడు
నీ కళ్ళే  వరమిచ్చాయి వెన్నెలకు  ఆహ్లాదాన్నీ
నీ కళ్ళే దయతలచాయి కరిమబ్బుకు నల్లదనాన్నీ
దీపం పెట్టి వెతికినా ఆస్కారమెలేదు అందచందాలకి
ఆసాంతం పరిశీలించినా సంస్కారముండదా వ్యక్తికీ
ఉంటారు కొందరు ఊకదంపుడు వాళ్ళు
భజంత్రీలు కార్చేస్తారు ఎనలేని సొల్లు
విచ్చలవిడి తనమన్నదే అర్హతగా
విశృంఖల జీవితమే ఆలంబనగా

1.తలిదండ్రుల ప్రేమకైనా నోచనివాళ్ళు
అందరూ ఉండికూడ ఔతారిల అనాథలు
చిరునవ్వుల ముసగేసుకొని గొంతులే కోస్తారు
నమ్మించినట్టే ఉండి నట్టేట ముంచేస్తారు
పైశాచికత్వమన్నదే ఒక అర్హతగా
హింసించే ఆనందం కడువేడుకగా

2.మనోవైకల్యమే వారికో వైపరీత్యం
బ్రతుకున వైఫల్యమే అసహన కారణం
ఓర్వలేరు సంతోషించే సాటివాళ్ళను
జీర్ణించుకోలేరు తమకు బోధించేవాళ్ళను
అదను చూసి వలవేయడమే అర్హతగా
మోసగించి అవమానించే నెలతగా


ఆధిపత్యం లేనపుడే అన్యోన్య దాంపత్యం
ఏ దాపరికం లేనపుడే అపురూపమౌను కాపురం
మూడు ముళ్ళే బంధించాలా ముడిపడిన మనసులుంటే
ఏడడుగులు నడిపించాలా ఏడుజన్మలు తోడుంటే
ఒకరికి ఒకరై జతకడితేనే ప్రణయం
మనసుల మధ్యన వారధియే పరిణయం

1.ఎలా ఏర్పడిపోతాయో అపరిచితమౌ బంధాలు
ఎందుకు పెనవేస్తాయో ఎరుగలేము బాంధవ్యాలు
కళ్ళుమూసి తెరిచేలోగా చిక్కుబడి పోతాము
ఎంతగా విదిలించుకున్నా తప్పుకొని రాలేము
కార్యకారణ సంబంధం ఉండితీరుతుంది
ప్రతి చర్యకు ప్రతిచర్యై ప్రేమగా మారుతుంది

2.భారతీయ వ్యవస్థలో పవిత్రమే వివాహబంధం
హైందవ తత్వంలోనే అద్భుతమీ కళ్యాణ బంధం
ఒడిదుడుకులు ఎదురైనా సర్దుబాటు చేకొంటారు
పొరపొచ్చాలెన్నున్నా దాటవేసి పోతుంటారు
సంతానం లక్ష్యంగా బ్రతుకు బండి సాగుతుంది
కుటుంబమే ఐక్యంగా గండాలు దాటుతుంది

Tuesday, April 7, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నను స్పృశియించుమన్న వస్తువే లేదాయే
నను సృజియించమన్న ఆత్మే కనరాదాయే
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

1.రాసాడు వ్యాసుడు పద్దెనిమిది పురాణాలు
నుతించె స్తోత్రాలు జగద్గురు శంకరాచార్యులు
త్యాగయ్యా అన్నమయ్య కృతులెన్నొ కూర్చారు
క్షేత్రయ్యా జయదేవులు రక్తినొలికించారు
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

2.మేఘాల కావ్యాల బంధించెనే అల కాళిదాసు
మనుచరిత్రనే ప్రబందించెనే అల్లన అల్లసాని పెద్దన
విజయవిలాస మొనరించె చేమకూర కవి
కరుణారస మొలికించె తెనాలి వికటకవి
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

3.ప్రకృతినంత పదముల నుడివె కృష్ణ శాస్త్రి
అభ్యుదయమును ఎత్తుకునే అలనాడే శ్రీశ్రీ
మనసును మధించడం ఆచార్య ఆత్రేయకే దక్కే 
అక్షర కన్నెల వెన్నెలనాడించినాడు నాడా తిలక్కే 
కవితా నిన్నెలా తీర్చిదిద్దనూ
కవితానిన్నెలా ఇపుడోదార్చనూ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వాగధీశాయ నమో వాయుపుత్రాయ
అంజనానందనాయ వానర యోధాయ
వందే వారిజప్రియ శిష్యాగ్రేసరాయ
శరణు శరణు శంకరస్వరూపాయతే నమః

1.కేసరీసూనాయ కేయూరభూషణాయ
సాకేతసార్వభౌమ రామభద్ర సేవకాయ
జానకీ ప్రమోదకాయ లంకాదహనాయ
మహాబల దేహాయ  మారుతీ రాజాయ నమః

2.సంకట హారాయా సంజీవరాయా
సౌమిత్రి ప్రాణదాయా జితేంద్రియాయా
సింధూర దేహాయ చిరంజీవాయా
కొండగట్టువాసాయ కరోనా నాశకాయ నమః

(హనుమజ్జయంతి శుభాకాంక్షలతో)

Saturday, April 4, 2020

https://youtu.be/3dJozfr5TZY?si=0LU4oybl-aH9iptG

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా మత్తుచెడగొడుతూ నీఊపిరి సుప్రభాతం
రవిగ మెరిసెనునీ భృకుటి మధ్య సింధూరం
కురులు విదిలించగా కురిసిందిలే తుషారం
అపురూపమైనీరూపం తలపించె ఇంద్రచాపం
ప్రియమైన నా శ్రీమతి నీవే దైవమిచ్చిన బహుమతి
మనసైన నా ప్రియసఖి నీవే అనురాగానికి ఆకృతి

1.తులసికోట చుట్టూ తిరిగే గృహలక్ష్మి నీవే
రుచురుచుల ఆకలితీర్చే అన్నపూర్ణా దేవివే
ఇల్లుసర్ది సగబెట్టే  ఇంటి యజమానివి నీవే
పడకటింట కులుకులు చిలికే రతీదేవి నీవే
ప్రియమైన నా శ్రీమతి నీవే దైవమిచ్చిన బహుమతి
మనసైన నా ప్రియసఖి నీవే అనురాగానికి ఆకృతి

2.అలసిన నా బడలిక బాపే  పిల్లతెమ్మెర నీవే
అలజడి చెలరేగినవేళ ఊరడించు నేస్తానివే
అలకపాన్పు ఎక్కినంతనే అల సత్యభామవే
అలవోకగనను మురిపించే నిండైన ప్రేమవే
ప్రియమైన నా శ్రీమతి నీవే దైవమిచ్చిన బహుమతి
మనసైన నా ప్రియసఖి నీవే అనురాగానికి ఆకృతి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అల్లా అల్లా అల్లా -సద్బుద్ధినివ్వు మా కెల్లా
ప్రభువా జీసస్ క్రీస్తు-కలిగించు మాకు శ్రీరస్తు
శ్రీరామచంద్ర మూర్తి-తీర్చవయ్య మా ఆర్తి
జగమేలే  పరాశక్తి-ప్రసాదించవే-కరోనానుండి  విముక్తి

1.హితము కూర్చగ ప్రతి మతము
జనతకు ఎంతో సమ్మతము
మానవతను కోరే అభిమతమూ
ఈ సృష్టికంతటకీ మహితము
సాటి మనుషులతొ సఖ్యత గలిగి
సాగించేదే ఉత్తమ జీవితం
ప్రతి మత గ్రంథం బోధించేది
మనిషి మనిషిని ప్రేమించడం

2.మూడునాళ్ళ బ్రతుకులోనా
విద్వేషాలకు తావేల
పుట్టుక చావు అందరికొకటే
మంచిగ మెలగవు నీవేల
నెత్తురులోనా భేదమెక్కడిది
మతమును తెలిపెడి సూచికగా
గంగా జమున సంగమించవా
మేధనుమార్చకు పాచికగా

Friday, April 3, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

దీపం దైవానికి ప్రతిరూపం
దీపం లోకానికి గురు తుల్యం
దీపం ప్రగతికి ప్రతిబింబం
దీపం సుగతికి ఒక గమ్యం
జ్ఞాన దీపం వెలిగించు-అనురాగ దీప్తిని పంచు
ఆత్మజ్యోతిని ప్రభవిస్తూ-సమైక్య గీతిని వినిపించు

1.పట్టపగలైనా గాని -పగలు కమ్మె చీకటులై
వెన్నెలే కురిసినగాని- విద్వేషం చిమ్మె కరిమబ్బై
విచక్షణే తేజరిల్లితే  -విభేదం మోకరిల్లదా
మానవత్వ కాంతిలోనా-  విశ్వశాంతి వెల్లివిరియదా
జ్ఞాన దీపం వెలిగించు-అనురాగ దీప్తిని పంచు
ఆత్మజ్యోతిని ప్రభవిస్తూ-సమైక్య గీతిని వినిపించు

2.లౌకికత అన్నదే- ప్రపంచాన మన  ఘనత
అనాదిగా పరమత సహనం- మన దివ్య చరిత
నరజాతికి పరమ విరోధి -కరోనా మహమ్మారి
మట్టుబెట్టి చితిపేర్చేద్దాం  -ఒక్కతాటిపైన చేరి
జ్ఞాన దీపం వెలిగించు-అనురాగ దీప్తిని పంచు
ఆత్మజ్యోతిని ప్రభవిస్తూ-సమైక్య గీతిని వినిపించు

https://youtu.be/KojzywMe_L8


https://youtu.be/hA6YW6X6YzY

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:సారంగ

సరయూ నది తీర సాకేతపుర నికేత సార్వభౌమా
గోదావరి తటవాస ధర్మపురీ నిజధామ శ్రీ రామా
శరణాగత వత్సలా కోదండరామా
శరణు శరణు దశకంఠ రావణ శమనా
 తక్షణమే కరోనాను కడతేర్చి మముకావర

1.పావనమౌ నీకోవెలకరుదెంచ లేనైతి
రమణీయము నీరూపము దర్శించ నోచనైతి
కమనీయమైన నీ కళ్యాణము కాంచనైతి
శరణాగత వత్సలా కళ్యాణ రామా
శరణు శరణు జానకీ వల్లభ రామా
 కరోనాను కడతేర్చి జగత్కళ్యాణమొనరించర

2.మానవీయ విలువలకూ నిదర్శనం నీవె రామ
మైత్రీభావనకూ తార్కాణం నీవే సుమా
ధర్మ సంస్థాపనకు సుభిక్ష రాజ్యపాలనకు ఆదర్శమా
శరణాగత వత్సలా పట్టాభి రామా
శరణు శరణు జగదానందకారక రామా
 కరోనాను కడతేర్చి నరులనుధ్ధరించరా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:ఉదయ రవి చంద్రిక

నన్నల్లుకుంది నవ్వుల మల్లెల పరిమళమేదో
నను గిల్లుతోంది మధురిమలొలికే పికగళమేదో
వెన్నెలే తానుగ వచ్చి శార్వరిని వెలిగించిది
ఆహ్లాద ప్రభలే ప్రసరించి నేస్తమై నిలిచింది

1.మంచితనం నిండుగ ఉండగ
మంచుకొండ గుండెగమారె
పసితనం పరువం నిండగ
సెలయేరు పలుకుల పారే
పాటగా రవళించేను శ్రుతిలయల అనుబంధం
తేనెలే సృజియించేను  విరి తేటి బాంధవ్యం

2.శిల్పమే రూపుదిద్దును
ఉలికి శిలకు పొసగినంతనే
కావ్యమే అంకురించును
భావుకతలు చెలగినంతనే
కల కళగ వెలయగజేస్తే బ్రతుకే ఒక నందనం
కలయిక కలగా కరిగితె భవిత ప్రశ్నార్థకం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

https://youtu.be/mD5lQQv8hD4

పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ
మీరు సల్లంగా కాచే తల్లులె గదమ్మా
మిమ్ములను మొక్కంది దినామే గడువదు
మిమ్ములను కొలువంది పానామె ఊకోదు
ఊకూకే గిట్లైతే మేమెట్ల సచ్చూడో
తాపకో మామ్మారిని మీరెట్ల మెచ్చుడో
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

1.ప్లేగు మశూచీ కలరా స్ఫోటకపు వ్యాధులు
క్షయ డెంగ్యూ చికున్ గన్యా వంటి రోగాలు
ఎన్నిటినినుండి గట్టెక్కించినారో మమ్ముల
కడుపులవెట్టుక సక్కగ సాకినారో మమ్ముల
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

2.యాపమండలె బతుకు దీపాలాయే నాడు విషజ్వరానికి 
పసుపు పూసుకుంటే మందాయే కదమ్మా ప్రతి గాయానికి  
మైలబడకుండా శుచిగా ఉంటిమి  జబ్బుపడినప్పుడు
పత్యం పాటించి నిత్యం మిము తప్పక తలచామప్పుడు
కూసింత మామీద దయజూడరొ తల్లులు
జర కరోన గండం దాటించరొ అమ్మలూ

OK

Wednesday, April 1, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎవ్వరమూ కాము అనాథలం
మనుషులమంతా ఆత్మబంధువులం
మన మధ్యన బంధుత్వం మానవత్వం
అనంతవిశ్వంలో మన ఉనికే నిత్వత్వం
కలసికట్టుగా చిచ్చేపెడదాం కౄర కరోనాకు
నరుని ఘనతనే చాటిచెప్పుదాం ఈ జగత్తుకు

1.దిగంత అంతరాళంలో మన భూమొక పిపీలికం
ఖగోళ పాలపుంతల్లో ఎంతటిదీ మన స్థానం
రోదసి గ్రహరాసుల్లో పరమాణు పరిమాణం
నక్షత్ర మండలాల్లొ ఒక మూలగ మన వాసం
లక్షల వత్సరాల  మనుగడకే సవాలు
చావోరేవో అనాదిగా ఎన్నని నరజాతి యుద్ధాలు

2.కంటికి కనబడని  లక్షలాది విరోధి వైరస్లు
నిత్యం వెంటాడే వేలాది బాక్టీరియ ఫంగస్లు
పంచభూత విలయాలు ప్రతిఏటా విపత్తులు
వంచన మించిన సాటిమనిషి అనూహ్యమైన వెన్నపోట్లు
లక్షల వత్సరాల  మనుగడకే సవాలు
చావోరేవో అనాదిగా ఎన్నని నరజాతి యుద్ధాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఔదార్యం ఉండదు కొందరికి ఉంటెనేం ఎంతో  ధనం
అవకాశం దొరకదు ఇంకొందరికి వితరణకై ఏక్షణం
సాటివారి ఎడల స్పందించగ ఇదె తరుణం
మానవాళిపట్ల తీర్చుకొనగ మన ఋణం
కరోనా వైరి ఐనా గుణపాఠం నేర్పగ అయ్యింది కారణం
ప్రతి ప్రతికూలతలోనూ ఉంటుంది ధనాత్మక ప్రేరణం

1.వృద్ధిచెందాయి కరోనా పుణ్యమా అని వ్యక్తిగత శ్రద్ధలు
పెరుగసాగాయి కరోనా మూలాన పరిసర పరిశుభ్రతలు
ఇనుమడించాయి కుటుంబ సభ్యులతో అనుబంధాలు
పెంపొందుతున్నాయి దేశ ప్రజలలో జాతీయ భావనలు
కరోనా వైరి ఐనా గుణపాఠం నేర్పగ అయ్యింది కారణం
ప్రతి ప్రతికూలతలోనూ ఉంటుంది ధనాత్మక ప్రేరణం

2.అలవడింది నేతల పిలుపుతో గడపదాటని క్రమశిక్షణ
ఒంటబట్టింది చట్టానికి సహకారమందించే పౌరబాధ్యత
తెలియవచ్చింది విపత్తునధిగమించు మన ధీరోదాత్తత
అవగతమైనది సమాజశ్రేయస్సుకున్న ప్రాథమ్యత
కరోనా వైరి ఐనా గుణపాఠం నేర్పగ అయ్యింది కారణం
ప్రతి ప్రతికూలతలోనూ ఉంటుంది ధనాత్మక ప్రేరణం

Tuesday, March 31, 2020

https://youtu.be/4jvkplvQ3Zo

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

పైన పటారం లోన లొటారం కాదయ్యా నువు శంకరా
ఎంత పటాలం నీకున్నదో మము కాచుటలో లేదు శంక రా
కైలాసం వదిలేసి గణములనాయత్త పరచి మా వంకరా
పిలిచీ పిలువగనే భక్తుల బ్రోచుటలో నీకు లేదు వంక రా

1.శివునాజ్ఞలేనిదే చీమైనా కుట్టదని మేమెరుగమా
నీ ఆనతిలేనిదే యముడైనా కదలడని అనుభవమేగా
మృత్యుంజయా ఆపరా సత్వరమే కరోనా కరాళ నృత్యం
జీవేశ్వరా ఛేదించరా కరోనా వ్యాప్తి వెనుక దాగిన సత్యం

2.నర జాతియే నాశనమొందువేళ ఏల తాత్సారం
మనుషుల మధ్యన మతమొకగీతగా దేనికి మత్సరం
అధికార దాహాలు రాజ్యాధిపత్యాలు ఎంత కుత్సితం
మానవ సమాజాన  మచ్చగమారనీకు ఏ వత్సరం

Monday, March 30, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:మాల్కోస్

త్వమేవాహమ్ పరమ శివమ్
దేహిమే ఆత్మ దర్శనమ్ పరమాత్మ దర్శనమ్
ఏకమ్ సత్ విప్రా బహుదావదంతి
అవలోకయమామ్ ఋగ్వేదోక్తి

1.మమ సంశయమతి అజ్ఞానపూరితమ్
సందేహనివారిణమ్ వందే విశ్వైకగురుమ్
పార్వతీ వల్లభమ్ అర్ధనారీశ్వరమ్
దివ్యానంద ప్రసాదినమ్ దిగంబరమ్ సుందరమ్

2.తత్వమసి అహం బ్రహ్మాస్మి భావనమ్
కించిత్ మీమాంస సంయుతమ్
దేహాత్మ భేదమ్ అవగతవరదమ్
సోహమేకం సత్యం శివమ్ సుందరమ్
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పాటకోసం ఎదిరిచూసే తోటనైనాను
తోటలోని చివురుకోరే పికమునైనాను
గున్నమావి చివురులున్న తోటనేనేను
గొంతువిప్పీ గీతిపాడే కోయిలమ్మనునేను
ఏమనినే చెప్పెదను మనస్నేహం జగతిన సుందరం
ఆమనియే అరుదెంచు మనవల్ల పొందగ ఆనందం

1.వరమునొసగె దైవము నీకు గాత్ర మాధుర్యం
నీది ఎంతటిభాగ్యము మనసంతా ఔదార్యం
ఉన్నదాన్ని ఉపయోగిస్తె జగత్కళ్యాణము
 ప్రతిభనంత ధారపోస్తే  జన్మసార్థక్యము
ఏమనినే చెప్పెదను మనస్నేహం జగతిన సుందరం
ఆమనియే అరుదెంచు మనవల్ల పొందగ ఆనందం

2.వాడే పూవు తెలుపుతుంది తావిపంచడాన్ని
పారెగంగ నేర్పుతుంది తపన తీర్చడాన్ని
పరికించి చూడూ ప్రకృతే గురువౌతుంది
చెలిమిని అందించు చెట్టునేస్తమౌతుంది
ఏమనినే చెప్పెదను మనస్నేహం జగతిన సుందరం
ఆమనియే అరుదెంచు మనవల్ల పొందగ ఆనందం

OK

ఏ దివ్య లోకాలనుండో దిగివచ్చినావే చెలీ
రస రమ్య సోయగాలే ఇల సంధించినావే సఖీ
వెన్నెలనంతా దోచుకొచ్చి వెల్లెవేసావు నీమేనికి
కన్నె పరువం దాచుకొంటూ వన్నెలూనావే నేటికీ
ప్రౌఢలోనీ గూఢపొంకం సాటిరాదది నీకే సొంతం
నీ అంగాంగం మన్మథరంగం నిత్యవసంతం  జీవితాంతం

1.అందంగా జన్మించడం  లలనకు అదృష్టం
కలకాలం సవాలే యవ్వన పరిరక్షణం
ఏపూటన తిన్నావొ పస్తులే ఉన్నావో సౌష్ఠవానికి
వ్యాయామమె చేసావో ఆరోగ్యమె కాచావో సొగసుకి
సౌందర్యపోషణే నిష్టాగరిష్టమైన యజ్ఞం
ఏమరుపాటులేక కాచుకున్నావు సౌందర్యం

2.ఏచోటన తమ అందపు కేంద్రముందొ ఎరుగరు
ఏవర్ణం సొబగుల ఇనుమడించునో తెలియరు
కనులు వీక్షణలు అధరాల విరుపులు బుగ్గసొట్టలు
నాభి నడుమొంపులు పయోధరాలు కురులు జఘనాలు
ఎదగుట్టు కనిపెట్టి కనికట్టు చేసే కప్పుర గంధీ
తాపసులకు కసిరేపి రతికై ఉసిగొలిపే కలశస్తనీ

Sunday, March 29, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఒంటరిగా నా పయనం
అనంతమే నా గమ్యం
భావాలనే కవితలుగా మలచుకొంటూ
గీతాలనే ఎలుగెత్తి పాడుకొంటూ

1.యుగాలుగా నాదిదే కథ
ఎన్ని జన్మలెత్తినా మారదు చరిత
తామరాకుపై నీటిబొట్టుగా
తాత్కాలికంగా ఇతరుల జతకట్టగా

2.వచ్చింది ఈ ఇలకు ఒంటరిగానే
వదిలేది సైతం ఒంటరిగానే
నాతోనేనే గడిపేను హాయిగా
ఇల్లే ఇలలో ఒక స్వర్గసీమగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నరునికీ కరోనాకు నడుమన సమరం
కంటికి కనిపించకుండ రాక్షస యుద్ధం
రాజీపడి మరుగైతె గెలుపు మనదె తథ్యం
ఎదుటపడగ సమిధలై మన సమాధి ఖాయం
నరజాతికి కరోనా పాడుతోంది చరమగీతం

1.పరిశుభ్రత వహించడం ప్రజలను కాచే కవచం
మాస్క్ లూ శానిటైజర్లు సంధించే ఆయుధాలు
ఇంటిపట్టున అంటకమెంటక ఉండడమే పద్మవ్యూహం
సోషల్ డిస్టెన్స్  ఒకటే జనులకు వాడగ పాశపతాస్త్రం

2.మాయలనేర్చిన మారి కరోనా రెచ్చగొట్టేను ఎరలను వేసీ
కాలుకదపక కూర్చొనువేళ కాలుదువ్వును వలలను పన్నీ
యుద్ధనీతే లేదుగా కరోనాకు మననే మార్చును అస్త్రాలుగా
 కబళించైనా మనుషులపైనా గెలుపే ధ్యేయం కౄర కరోనాకు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హిందోళం

కరోనా అంటే  మన జనాలకు ఒక కల'రా
కరోనా అన్నది మన మూర్ఖులకు కల్పనరా
దేశవ్యాప్త లాక్ డౌన్ పెద్ద జోకురా
ఇంటిపట్టునుండమంటె ఎంతడోకురా
ఎవరుచెపితె ఎక్కుతుంది ఈ మూఢులకి
ఎలాచెపితె ఎరుకౌతుందో ఎర్రిమొర్రోళ్ళకి

1.రోజువారి పనులన్నీ యథావిధిగ చేసేరు
రోడ్డుమీది కొద్దంటే వింతగ వాదించేరు
చావులంటె ఎవరికీ ఏమాత్రం లెఖ్ఖలేదు
కర్ఫ్యూ ను పెట్టినా కాస్త ఖాతరైనలేదు
ఎవరుచెపితె ఎక్కుతుంది ఈ మూఢులకి
ఎలాచెపితె ఎరుకౌతుందో ఎర్రిమొర్రోళ్ళకి

2.మొకానికైతె నేమోమాస్కన్నదె ఉండదు
శానిటైజర్ పేరైనా తెలియనే తెలియదు
పరిశుభ్రత అన్నది ఇంటా వంట లేదు
మనుషుల మధ్యన దూరం మాటవరుసకైన లేదు
ఎవరుచెపితె ఎక్కుతుంది ఈ మూఢులకి
ఎలాచెపితె ఎరుకౌతుందో ఎర్రిమొర్రోళ్ళకి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఏడేడు లోకాలు నీకళ్ళలో
ఎన్నెన్ని వర్ణాలు చెక్కిళ్ళలో
కడతేరిపోతాను కౌగిళ్ళలో
ముగిసిపోతేమి బ్రతుకు మూన్నాళ్ళలో

1.సమయమెంత దొరికిందో కరోనా మిషవల్ల
తేరిపార చూస్తున్నా సుందరినీ తనువెల్లా
కవితలెన్నొ  రాస్తున్నా కవినైనా కాకున్నా
చూపులతొ చిత్రాలెన్నో చిత్రంగా గీస్తున్నా

2.చేజారిన కాలమంతా తిరిగి ఏరుకుంటున్నా
నీ ఎడల నిర్లక్ష్యానికి దండుగనే చెల్లిస్తున్నా
చేదోడువాదోడై బాధ్యతగా ఉంటున్నా
ఏడాది పండుగలన్నీ ఇపుడె చేసుకొంటున్నా

Saturday, March 28, 2020

https://youtu.be/dyTZSqgbTMw

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

సాడేసాత్ శని నిన్నూ పట్టబోతుంటేనూ
మఱ్ఱిచెట్టు తొర్ర లో సొర్రలేదా
భస్మాసురుడు నెత్తిమీద సెయ్యిబెట్టబోతేనూ
హరినే శరణుకోరి బచాయించలేదా
మంచుకొండదప్ప మంచి ఇల్లైనా లేదాయే
వల్లకాడెగాని  చిన్న గుడిసైనా లేదాయే
పైలంరా శంకరా అంటురోగమంటరా అమానవీయం 
భద్రంరా ఈశ్వరా ఇలాజ్ లేదంటరా బ్రతుకే అయోమయం 
సల్లంగ బతికుంటే శివరాత్రికి మల్ల శ్రీశైల మొచ్చేము
నూకలు బాకుంటె కోడెనుగట్ట మేము ఎములాడకొచ్చెము

1.కనివిని ఎరుగని కాలనేమి ఇదిరా కాలకాలుడా
నీ ఆనతివినని పెను భూతమేనురా భూతనాథుడా
జాతరలంటూ తిరుగుతూ ఆడికీ ఈడికీ  పోబోకు
భక్తులవెంట బడి నీకున్న మైమలకే ముప్పు తెచ్చుకోకు
పైలంరా శంకరా అంటురోగమంటరా అమానవీయం 
భద్రంరా ఈశ్వరా ఇలాజ్ లేదంటరా బ్రతుకే అయోమయం

2.సల్లబడ్డదేమో సంపనీకి నీకన్ను ముక్కంటీ
శిలుంబట్టిందేమొ పొడవనీకి శూలం శూలపాణీ
వైద్యనాథడువైననూ నీకే అంతువట్టకుంది ఈ వింత వైఖరి 
గరళకంఠుడవైన నీవే హరించలేనిదాయె ఈ వ్యాధి మల్లారి 
దిక్కులకే రారాజువు నీకే దిక్కులేదు మమ్మెట్లకాచేవు
యుమునికే గురుడవు నీకే సక్కిలేదు మమ్మెట్ల సాకేవు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అరె ఏం జెప్పుడ్రబై మన పబ్లిక్కు
దీన్ని సౌరగజేసుడెంత సిక్కు
నెత్తినోరుగొట్టుకుంటు మొత్తకున్నగాని పట్టించుకుంటే ఒట్టు
ఖుల్లం ఖుల్లజేసి ముంగట్లవెట్టినా ఎక్కదేందిరో గీ కరోనా గుట్టు

1.కాళ్ళుమొక్కిజెప్పినా ఖాతరే జేయరాయె
దండవెట్టిజెప్పినా మొండిగా వినరాయే
దందాలన్ని బందువెట్టి ఇంటికాడ ఉండమంటే
లెక్కజేయకుండ ఇంక సడకు మీద్కి రావట్రి
సబ్బువెట్టి సెయ్యితోమి సచ్చంగా ఉండమంటే
ఏదివడ్తె అదిముట్టి కంపుకంపు జేయవట్రి

2.టీవీల్లల్ల జూపినా సింతాకంత సింతలేదు
మైకువెట్టి జెప్పినా మంచిగైతె ఇనుడెలేదు
దగ్గు తుమ్ము ఏదొచ్చిన మూతిమూసుకోమంటే
నాకేమైతదంటు  పర్వజేసుడె లేదాయే
గజమంత దూరముండి పన్లు సక్కవెట్టమంటె
మీదమీద వడుకుంటూ రాస్కపూస్క తిరుగుడాయె
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మాయామాళవగౌళ

అనివార్యం మనిషికి మరణం
అర్ధాంతరమైతేనే అది దారుణం
ఇంటినిలిచి గెలిచేటిదీ రణం
మించిపోనీకు కరోనానరికట్టే తరుణం
బుద్ధి లేక వెధవలై గుంపులుగా గుమిగూడనేలా
మీరూ గుర్తించలేని మీలోని వైరస్ను పరులకంటించనేలా

1.దేశాధినేతలే పబ్బతులిడి చెప్పినా
ప్రపంచమంతా బెదురుతు గడగడలాడినా
వార్తల్లో కళ్ళముందు వ్యాధి వ్యాప్తి ఎరుకైనా
టీకా చికిత్సలూ లేనే లేవని తెలిసినా
బుద్ధి లేక వెధవలై గుంపులుగా గుమిగూడనేలా
మీరూ గుర్తించలేని మీలోని వైరస్ను పరులకంటించనేలా

2.మిమ్మల్ని చేయమన్న దేశ సేవ ఏమిటని
మిమ్మల్ని కోరుతున్న త్యాగం ఏపాటిదని
అంటకమెంటక శుభ్రత పాటించడమేగా
కుటుంబ సభ్యులతో ఇంటగడపమనేగా
బుద్ధి లేక వెధవల్లా గుంపులుగా గుమిగూడనేలా
మీరూ గుర్తించలేని మీలోని వైరస్ను పరులకంటించనేలా

Friday, March 27, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."

దిక్కులేని చావునే చావాలా
కుక్కచావు లాంటిదే కావాలా
ఇంటిపట్టునుండమంటె ఇంత నిర్లక్ష్యమా
మనకైతే రాదనే వింత ఉదాసీనమా
కొనసాగితె ఇలాగే కరోనా కోఱల్లో చిక్కకతప్పదిక
మృత్యుకరాళ నృత్యానికి కాబోతోంది ప్రతి ఎద ఒక వేదిక

1.చావైనా పండగే  మన ఇండియాలో
చచ్చాకా సందడే సంప్రదాయ రీతిలో
స్వర్గవాసమో ముక్తిధామమో మరణాంతర ఆంతర్యం
కళేబరాలనైనా పూడ్చలేక కాల్చలేక ఇకపైన మనదైన్యం
కరోనా కోఱల్లో చిక్కకతప్పదిక
మృత్యుకరాళ నృత్యానికి ప్రతి ఎద ఒక వేదిక

2.మనం బ్రతికి మందిని బ్రతికించగలగడం
ఎదుటివారికి తగినంత దూరంగా మెలగడం
ఇల్లే ఒక స్వర్గమని ఇంటికి పరిమితమవడం
చేతులు కడుగుకొంటు పరిశుభ్రత పాటించడం
క్రమశిక్షణ కలిగియుంటె  కరోనాకు అంతం
నియంత్రణను మీరకుంటె కరోనాకు మరణం

https://youtu.be/ZUPJ7hW0J0M?si=aJB0iUVASotSnZSg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: సారమతి

ఇందరు ఎందుకు కొలుతురు నిన్ను
ఇందిరా రమణా నీ ఉనికే లేకున్న
పరిపరి విధముల పొగడుదురేలను
పురుషోత్తమా నీ గుణగణములను
గోవింద గోవింద హరి నారాయణ
గోవింద గోవింద కరుణాభరణా

1.వందలు వేలు నీ మందిరములు
లక్షలు కోట్లు నీ భక్త జనములు
నిత్యపూజలు కైంకర్యములు
తప్పక జరిపెడి బ్రహ్మోత్సవములు
ఇంతగ ఎందుకు కొలుతురు నిన్ను
ఇందీవరశ్యామ నీ మహిమలు గనకున్న
గోవింద గోవింద వేంకట రమణ
గోవింద గోవింద కరుణాభరణా

2.నారదాది ముని పుంగవులు
అన్నమయ్య వంటి వాగ్గేయ కారులు
స్మరియించిరి సహస్ర నామాల
కీర్తించిరి నిను వేవేల కీర్తనల
కరిని బ్రోచిన మకరి సంహారి
కావవేర కరోనా మహమ్మారి బారి
గోవింద గోవింద శుభ చరణా
గోవింద గోవింద కరుణాభరణా

క-ట్టుబడి ఉంటాను నీ నట్టింటిలో
కాపురముంటాను నీ కాటుక కళ్ళలో
కితకితలే పెడతాను నిను జోకుల్తో
కీర్తనలే పాడతాను నీ అందాలు పొగుడ్తూ

రో-మాంచితమాయే రేతిరౌతుంటేనూ
రౌద్రరసం పొంగుతోంది పడక దక్కకుంటేనూ
రంజైన వయసంతా నీరుగారి పోతోంది
రఃదారి మూసివేయ బతుకు వెగటు కొడుతోంది

నా-కూ నీకు మధ్య దూరముంది సరేనా
నిమిషమైన తప్పుజేస్తె తప్పదింక కరోనా
నీడ కూడ పడకుండా జాగ్రత పడుతున్నా
నువ్వే నేనైతే అదేకదా ప్రేమకు నజరానా
రచన,స్వర కల్పన&గానం:డా.రాఖీ

ఎంత మస్తుగున్నవె నీ సోకుమాడ
మత్తెక్కిస్తున్నావే నీ జిమ్మడ
సూపుల్లో కైపుంది నవ్వుల్లో కిక్కుంది
పడిసస్తాడెవడైనా నీ కాళ్ళకాడ
ఇస్తాడే పానాలైన నిన్ను గూడ

1.పిక్కలపైకెగ గట్టిన సుక్కల కోక
నీ ఎండి కడియాలు కేకోకేక
తిప్పుకుంటు ముప్పుదెచ్చె సుప్పనాతి నడుము
బొడ్డుసూడబోతెనేమొ యాదికొచ్చె కుడుము
నడకేమో హంసనడక తప్పదింక హింస పడక
పడిసస్తాడెవడైనా నీ కాళ్ళకాడ
ఇస్తాడే పానాలైన నిన్ను గూడ

2.సుక్కలన్ని దండగుచ్చి సుట్టావే కొప్పులో
సెంద్రవంకనెట్టినావు ముక్కెరగా ముక్కులో
ముందు ఎనక చెప్పబోతె ఎన్నెన్ని గొప్పలో
కళ్ళబడితె ఆగలేక గుండెకెన్ని తిప్పలో
నువులేక దిగదు మెతుకు నీతోనే నాకు బతుకు
పడిసస్తాడెవడైనా నీ కాళ్ళకాడ
ఇస్తాడే పానాలైన నిన్ను గూడ
https://youtu.be/fEzWA1J8QVQ?si=DKmBE9pyPyu07EJY
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి

భీకరాకారా నరకేసరీ చక్రధరా
ధర్మపురీ సంస్థితా దనుజ సంహారా
ప్రహ్లాద వరదా హే ప్రభో కరుణా సముద్రా
అరిషడ్వర్గమునే హరించరా  కరిరాజ భద్రా

1.విచ్చలవిడి మా నడతను మార్చుకున్నాం
విర్రవీగ గుణపాఠం నేర్చుకున్నాం
మానవతను మా అక్కున చేర్చుకున్నాం
నీవే ఇక దిక్కని అంగలార్చుతున్నాం

2.ప్రకృతి ఎడల మరికాస్త శ్రద్ధవహిస్తాం
పర్యావరణానికి తగినవిలువనిస్తాం
మనిషికి మనిషికి మధ్యన వంతెన వేస్తాం
చిత్తశుద్ధితో నిన్ను సర్వదా స్మరిస్తాం

3.ఇందుగలదందులే దని ఎరుగం
కరోనా అన్నదే బ్రహ్మ పదార్థం
సర్వాంతర్యామివి స్వామీ నీవు
కరతలామలకమే నీకు కరోనా చావు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వినాలి ఎద సవ్వడి ఏమంటున్నదీ
కవితల కనాలి అనుభూతుల నెలా మలుచుకుంటున్నదీ
చిగురాకులా స్పందించేను చిరుగాలి వీచినా
ఘనఘనమై వర్షించేను తనమేనొకింత తాకినా

1.కలయేదో వచ్చి వాలింది రెప్పలపై చిలుకలా
కలయికయే వరమయ్యేలా ఆశగొలిపింది రేపులా
ఊసులెన్నొ చెప్పింది బాసలెన్నొ చేసింది
కనులు తెరిచి చూసినంతనె కలవరమే రేపింది
కల్లగానె మారింది

2.నా చీకటి జీవితాన ప్రమిదలా వెలుగిచ్చింది
నా ఒంటరి ప్రపంచాన ప్రమదగా తోడొచ్చింది
ఏడడుగులు వేసేతరుణం ఏడు జన్మలదా ఋణం
చెప్పాపెట్టకుండానే బంధాలను త్రెంచేసింది
సంద్రంలో ముంచేసింది

Thursday, March 26, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:యమన్

కనుగీటనేల మదిమీటనేల
కుదురుగా ఉండేవేళా-ముగ్గులోకి లాగనేల
పట్టించుకోవేల పరువాలు వగచేలా
యవ్వనాన విహరించేలా అందించు రాసలీల

1.ఏ కరోనా కాటువేయునో ఏకరువు పెడుతున్నా
నీ దైనలోకంలోనే కలలు కందువేలా
బ్రతికితె రతికేమి కొదవలే అడ్డుఅదుపులేనేలేదా
ఓపికనువు పట్టావంటే ఓరుగల్లు పట్నమౌనులే

2.చేజారిపోనీకు మనవైన మధురక్షణాలు
మించనీకు సంగమించు ఎదురవనీ మరణాలు
గడిచిపోతె మరలారాదు ఘడియ సమయమైనా
నిమిషమే యుగమయ్యేను సరసమే రసమయమైనా

PIC courtesy:  నీ నేస్తం ID

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తిలక్కామోద్

సిద్ధ హస్తుడవు ప్రసిద్ధ వైద్యుడవు
మహమ్మారుల పరిమార్చే దురంధరుడవు
మృత్యువుకే ఎదురొడ్డిన పరమాత్ముడవు
దీనజనుల కాచిన అపర పరమేశ్వరుడవు
కడగళ్లనే కడతేర్చగా కరుణించవో గురునాథా
షిరిడి సాయినాథా జయ జయ సద్గురునాథా

1.కలకలము రేపెను షిర్డీ గ్రామాన కలరా
తిరుగలితొ బాబా గోధుమలు విసరా
పిండినంత షిర్డీలో మూలల్లో విసరా
పారిపోగ చేసావుగ ఎవరైనా నీకు సరా
కడగళ్లనే కడతేర్చగ కరుణించవొ గురునాథా
షిరిడి సాయినాథా జయ జయ సద్గురునాథా

2.గాలిలోన చేతులుతిప్పి గారడీలు చేసేవు
ధునిలోని విభూతినిచ్చి వ్యాధులెన్నొ మాన్పేవు
ఫకీరుగా ఉంటూనే బంధాలకు విలువిచ్చావు
వండివార్చి ఎందరికో క్షుద్బాధను తీర్చావు
కడగళ్లనే కడతేర్చగ కరుణించవొ గురునాథా
షిరిడి సాయినాథా జయ జయ సద్గురునాథా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎంతోకొంత స్వార్థముంటుంది-ప్రేమికుల ప్రేమలో
రక్తబంధమైతే ఉంటుంది- బాంధవ్యాలలో
కలుషితమసలే అవ్వనిది ప్రతి ఫలాల నాశించనిది
సృష్టిలోనే తీయనిది యుగములైనా మాయనిదీ
స్నేహ బంధము మైత్రీ గంధము మహదానందము

1.చెలిమికి కారణమేమిటో ఇదమిద్దంగా తెలియదుగా
మనసుల కలిపే వంతెనేదో ఎవ్వరైననూ ఎరుగరుగా
పురుషులు స్త్రీలను భేదమె లేక సోపతి నావలొ ఎక్కేరు
వయసూ స్థాయీ ఎల్లలనే నేస్తాలెప్పుడు పరిగణించరు
సృష్టిలోనే తీయనిది యుగములైనా మాయనిదీ
స్నేహ బంధము మైత్రీ గంధము మహదానందము

2.బేషరతుగా తోడైనిలుచును స్నేహితమన్నది జీవితాంతం
ధనము సమయము కష్టము కోర్చును ఫ్రండ్షిప్పన్నది కలకాలం
నిస్వార్థం నిర్మలత్వం సంయమనాల సంగమమే సాంగత్యం
త్యాగం కోసం తలపడగలిగే అద్భుత బంధమె సావాసం
సృష్టిలోనే తీయనిది యుగములైనా మాయనిదీ
స్నేహ బంధము మైత్రీ గంధము మహదానందము

Wednesday, March 25, 2020

OK

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:దర్బార్ కానడ

సాగర కెరటాలై నీ కరములు
నర్తించువేళల ఉత్తుంగ తరంగాలు
జలపాత ధారలై నీ పదములు
కదలాడు సమయాన ఉరకల తురంగాలు
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ తనువే సప్తవర్ణాల ఇంద్రధనువు

1.మనోజ్ఞమై విలసిల్లు నీ అపూర్వ నృత్యము
రసజ్ఞులను అలరించగ నయనానందకరము
ప్రవర్ధమానమై ఒప్పారు నీ అనన్య నాట్యము
ప్రసిద్ధ నర్తకీమణులకైన అనితర సాధ్యము
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ మేనే నేల దిగిన విద్యుద్ధామము

2.లాస్యబ్రహ్మ నటరాజ ప్రియపుత్రిక నీవే
నాట్య శాస్త్ర భరతమునికి శిశ్యురాలి వీవే
అప్సరసల తలదన్నే హావభావ భంగిమలు
ఆంగిక వాచిక నేత్రాంకిత  నటన ప్రకటనలు
అభినవ మయూరమా అభినయ మరాళమా
నీ గాత్రమే ప్రతి పాత్రకు బ్రాతిపాత్రము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రణయాలలీలలెరిగిన జాబిలీ జాలిగనవా
అందించు  ప్రియసఖునికి నా అహరహర విరహ వేదన
పరిమళాలు విరజిమ్మే అరవిరిసిన జాజిబాలా
జవరాలి కెరిగించు నా అహరహర విరహ వేదన

1.చేసుకున్న బాసలన్నీ మరచిపోయెనేమో తానూ
తట్టిచెప్పవే కాస్తా నా అహరహర విరహ వేదన
చెప్పుకున్న ఊసులన్నీ చెదిరిపోయెనేమో మదిలో
మొక్కిచెప్పవే ప్రియునికి నా అహరహర విరహ వేదన

2.ఆకుఅలికిడైనా తానని ఆరాట పడుతున్నాను
ఓపలేను నేస్తమా నా అహరహర విరహ వేదన
ఏ మువ్వల సవ్వడివిన్నా తానేనని భ్రమపడుతున్నా
తాళలేను నా ప్రియతమా ఈ అహరహర విరహ వేదన

3.సందేశాలనందించే అందాల మేఘమాలా
చేరవేయి నా చెలునికి ఈ అహరహర విరహ వేదన
ప్రేమలేఖలందించే ఓ చిట్టి పావురమా
వివరించు నెచ్చెలికి ఈ అహరహర విరహ వేదన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నిన్నే చూస్తు ఉండగలను  ఒక యుగము
నిన్నే చేసుకున్నాను నాదైన జగము
ఇల్లునసలు కదలను రెప్పలైన గిలుపను
దృశ్యారాధనయే జీవితాంతము
సౌందర్యో పాసనయే అనుక్షణము

1.పిడుగులైన పడిపోనీ కుంభవృష్టి కురియనీ
వరదలు తూఫానులు ఎన్నైనా ఇక రానీ
ఇల్లునసలు కదలను దేనికింక బెదరను
చీకటైతె నీ కన్నుల వెన్నెలనే కంటాను
ఆకలైతె నీఅందమునాస్వాదిస్తాను

2.కరోనాను రాకుండా కట్టడియే చేసాను
జ్వరమైన దూరకుండ జాగ్రత్త పడినాను
ఇల్లునసలు కదలను ఇతరములే తలచను
చేదోడుగ నీకెపుడూ నేనుంటాను
నీవాడిగ కడదాకా తోడుంటాను
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసధ్వని

సరిహద్దుకు వెళ్ళి కంచెను కాచే పనిలేదు
అవసరమొస్తే యుద్ధం చేసే అగత్యమే లేదు
ప్రపంచమంతా మృత్యు విపత్తుతొ విలవిలలాడే
జగత్తుమొత్తం కౄర కరోనా కోరలలోన చిక్కుబడే
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

1.పెడచెవిన పెట్టకు ప్రభుత సూచనలు ఎప్పటికప్పుడు
అతిక్రమించకు చట్టాన్నెపుడు తప్పవు ముప్పుతిప్పలు
సంయమనం పాటించాలి కష్టకాలన బాధ్యతగా మనం
అంటక మెంటక మెలగాలి అంటువ్యాధితో ప్రతిక్షణం
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

2.మనిషికి మనిషికి మధ్యన  తగిన ఎడంగా ఉండాలి
పదేపదే చేతులు కడుగుతు పరిశుభ్రపరచుకోవాలి
తుమ్ము దగ్గు తుంపర్లుకు అడ్డుగ గుడ్డను వాడాలి
ముక్కుమూతి కన్నులను విధిలేనప్పుడె తాకాలి
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

3.కట్టడి చేద్దాం కరోనాను సమిష్టికృషితో మనమంతా
నశింపజేద్దాం వైరస్ ను నామరూపాలు లేకుండా
పొరపాటొక్కరిదైనా భారీ మూల్యం అందరికీ
తీవ్రత గ్రహించకుంటే చరమగీతమే మననరజాతికి
ఆపత్కాలమందు సహకారమందిస్తేనే జాతికి శక్తి
ఇంటిపట్టున కొంతకాలం ఉండగలిగితె అదియే దేశభక్తి
వందే మాతరం వందేమాతరం వందే మాతరం వందేమాతరం

Tuesday, March 24, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

"ఉగాది శుభాకాంక్షలు-సకారాత్మకతయే జీవితం"

అగత్యమే శార్వరి ఉగాదికీ స్వాగత గీతం
తథ్యమే ప్రతి కాళరాత్రికీ ఓ సుప్రభాతం
శుభకృతును చేరాలంటే శార్వరిని దాటక తప్పదు
పునఃసృష్టి కావాలంటే మృత్యువీణ మీటక తప్పదు
దేశం కోసం ప్రతిపౌరుడు పాటించక తప్పని వైపరీత్యం
కరోనాను కాలరాయగ నిర్భందిత గృహమే ఆయుధం

1.పాపం పండే రోజొకటి రానేవచ్చింది
బలిదానంకోరే తరుణమెప్పుడో తప్పనిది
కోయిలపాటే కాకికూతగా కర్ణకఠోరమౌతోంది
గుణపాఠంనేర్పగ కాలం యుగాంతమైపోతోంది
దేశం కోసం ప్రతిపౌరుడు పాటించక తప్పని వైపరీత్యం
కరోనాను కాలరాయగ నిర్భందిత గృహమే ఆయుధం

2.మూడు వారాల గ్రహచారం ఆరుఋతువుల సంచారం
ఎవరికివారై క్రమశిక్షణగా నడవగ తెలుపును పంచాంగం
చేదుమ్రింగితె చాలు అర్ధమండలం ఏడాదంతా మకరందం
చావూ బ్రతుకూ ఇరుచేతుల్లో చేతలే మార్చేను జీవితం
దేశం కోసం ప్రతిపౌరుడు పాటించక తప్పని వైపరీత్యం
కరోనాను కాలరాయగ నిర్భందిత గృహమే ఆయుధం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తాకితె అల్లన మోవి
పలికేను రాగాలు పిల్లనగ్రోవి
నల్లనయ్య నన్నుచేరి మేను మీటగా
గమకాలనొలుకుతు మారిపోదు నేను పాటగా

1.బండరాయి సైతం సజీవశిల్పమౌతుంది
ఎండినమోడైనా చివురుతొడుగుతుంది
యదునందనుని ఎదుట నిలువగా
 హృదయమే యమునౌతుంది
మాధవుణ్ణి మతిలో నిలుపగ
మనసు మధువనమౌతుంది

2.కుబ్జవంటి వక్రజీవితం సుందరమౌతుంది
మీరాకోరుకున్న తత్వం నిత్యత్వమౌతుంది
సుధాముడైమెలిగామంటే
గాఢ మైత్రి దొరుకుతుంది
తులసిదళమైపోతేనో
భక్తి  సిరులు తూచుతుంది

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నాన్నంటే ప్రాణము
నాన్నంటే జ్ఞానము
నాన్నంటే లోకము
నాన్నేగా దైవము

1.నాన్న బీజము అమ్మ క్షేత్రము
కమ్మని కలల పంటనే సంతానము
నాన్న జీవము అమ్మ దేహము
ఇద్దరి వలపుల ఫలితమే జీవితము
నాన్నంటే మార్గము-నాన్నంటే దుర్గము
నాన్నంటే గోప్యము-నాన్నేగా ధైర్యము

2.నాన్న భద్రత అమ్మ ఆర్ద్రత
వెన్నంటి తోడుండేదే కుటుంబము
నాన్న మేలుకొలుపు అమ్మజోలపాట
ఇరువురి అనురాగమే మాధుర్యము
నాన్నంటే వైద్యము నాన్నంటే హృద్యము
నాన్నంటే ఆరాధ్యము నాన్నే సర్వస్వము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఇల్లే జైలు ఇపుడైతేనే మేలు
ఎవరికివారైతేనే తప్పేను చావులు
ఆషామాషీ కాదు నేస్తమా కరోనాకు విరుగుడు
ఇంటిపట్టునుంటేనే వైరసిక ఆగుడు
వెర్రిమొర్రి ధీమాతో విచ్చలవిడి తిరుగకు
కరోనావ్యాప్తి చేయగ తెలికనే సమిధవకు

1.చెవిముందు శంఖమూదినా పట్టించుకోవేల
కంటిముందు కనబడుతున్నా వింతపోకడేల
దుర్దినము దూరములేదు అజాగ్రత్త వీడకుంటే
ఆత్మహత్యయేకాదు హత్యలౌను నువు వినకుంటే
వెర్రిమొర్రి ధీమాతో విచ్చలవిడి తిరుగకు
కరోనావ్యాప్తి చేయగ తెలికనే సమిధవకు

2.దేశ సరిహద్దులైనా  మూసివేసినారు
రాష్ట్రాల మధ్యనా కంచెవేసినారు
ప్రాణాలు ఉగ్గబట్టి ప్రయత్నించ ప్రభుత్వాలు
కొంచమైన జంకులేకా సంకనాకి పోతావు
వెర్రిమొర్రి ధీమాతో విచ్చలవిడి తిరుగకు
కరోనావ్యాప్తి చేయగ తెలికనే సమిధవకు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

పరమ దయాళా పరమేశ్వరా
కరుణతొమము కావుమయ్య కాలకాలుడా
మించిపోతున్నది మనగలిగే తరుణం
ముంచుకొస్తున్నది అకాల మరణం
కరోనా చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

1.చదువు లేని మూఢులమే మేమందరం
చదువుకున్న మూర్ఖులమే ప్రతి ఒక్కరం
కష్టకాలమందైనా ఇష్టారాజ్యమె మాది
నియమాల నతిక్రమించు నైజము మాది
పనులుచక్కబెట్టమంటె వంకలతో మానేము
ఇంటిపట్టునుండమంటే బేఖాతరు చేసేము
కరోనా చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

2.ఆయువు మూడినా అవినీతినొదలము
ప్రళయము కబళించినా నిర్లక్ష్యము వీడము
ఇతరులకన్నా మేమే అతీతులనుకంటాము
చేయిదాటిపోయాకా నెత్తికొట్టుకుంటాము
మా వంకర బుద్ధులింక సరిజేయర శంకరా
మా తింగరి చేష్టలనే అరికట్టర హరహరా
కరోనా చెలరేగె అన్యధా శరణం నాస్తి
ఈశ్వరా నువు వినా మానవజాతికి స్వస్తి

Saturday, March 21, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వేనవేల వందనాలు వైద్యులకు
శిరసువంచి ప్రణామాలు నిత్యారాధ్యులకు
ఎన్నలేము అహర్నిశల మీ సేవానిరతి
జేజేలుకొడుతోంది జనమంతా పడుతోంది హృదయహారతి

1.గుండె బదులు గుండెమార్చి కొత్త ఊపిరులు పోసి
తమప్రాణం ఫణంపెట్టి వికృత విషపూరిత రోగాలనరికట్టి
భేదాలను పక్కనెట్టి మానవుడే దేవుడన్న సత్యాన్ని నిలబెట్టి
సకలమానవాళికి అవిశ్రాంత సేవజేసి ధన్యులైన వైద్యులారా
ఎన్నలేము అహర్నిషల మీ సేవానిరతి
జేజేలుకొడుతోంది జనమంతా పడుతోంది హృదయహారతి

వేనవేల వందనాలు వైద్య సిబ్బందికి
శిరసువంచి ప్రణామాలు నిత్యారాధ్యులకు-
వేనవేల వందనాలు అత్యవసర సిబ్బందికి
శిరసువంచి ప్రణామాలు నిత్యారాధ్యులకు
ఎన్నలేము అహర్నిషల మీ సేవానిరతి
జేజేలుకొడుతోంది జనమంతా పడుతోంది హృదయహారతి

2.శుచీ అశుచి అనిలేక ఎంత కంపైనా అసహ్యించుకోక
తమప్రాణం ఫణంపెట్టి చెత్తను తొలగించే పారిశుద్య కార్మికులకు
అగ్నిమాపక పోలీసు సిబ్బందికి చిత్తశుద్దితొ పనిచేసే యంత్రాంగానికీ
అంబులెన్స్ డ్రైవర్లకు క్యాటరింగ్ కర్తలకు ఆపద్బాంధవులందరికీ
ఎన్నలేము అహర్నిషల మీ సేవానిరతి-కరోనా వ్యతిరేక అవిరళ కృషికీ
జేజేలుకొడుతోంది జనమంతా పడుతోంది హృదయహారతి

Friday, March 20, 2020

రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:పట్ దీప్

నీ వదనమే అరవిందము
నీ అందమే మకరందము
నా చూపులు మారేనూ భ్రమరాలుగా
నీ మోమున వాలేనూ సుధలుగ్రోలగా

1.కలువల వలలోనా -చిక్కుకుంది నాహృదయం
అధర మందారాల్లో మత్తుగొంది నా చిత్తం
కపోలాల నిగారింపులో స్ఫురించింది నవనీతం
కనుబొమల కనుమల్లో సింధూర సుప్రభాతం

2.ఊరించసాగాయి ఉరోజాలు పరువాన్ని
పక్షపాతి అయ్యింది పైటకొంగు తప్పుకొని
ఉపాసించగలనే నిన్ను సౌందర్య దేవత
ప్రసాదించవే వరమును అందించి నీ మమత
https://youtu.be/_Pdu8Byh3fU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తిలాంగ్

శిరమునుండి కరుణగంగ పొంగిపొరలదా
కనులనుండి దయామృతం వరదలై పారదా
భోళాశంకరుడవు సర్వదుఃఖ హరుడవు
శివుడవు భవుడవు ప్రణవ స్వరూపుడవు
సాష్టాంగ వందనాలు సదాశివా
కవనచందనాలు నీకు సాంబశివా

1.కాలకూట విషమునైన కంఠాన నిలిపావు
ప్రళయాగ్నినైనా మూడో కంటిలోన దాచావు
నాగులనే నగలుగా తనువున దాల్చావు
చితివిభూతి ఒంటికంత పూసుకున్నావు
కరోనాను కాలరాయ నీకేపాటి
దీనులనిల కావగా నీకెవరు పోటి

2.కనికరమున వరములీయ లేరునీకు సాటి
కోరినదొసగుటలో అసామాన్యమె నీ దృష్టి
అర్ధాంగినైతె నేమి ఆత్మలింగమైతెనేమి
అడిగినదే తడవుగా ప్రసాదించినావు
కరోనాను కాలరాయ నీకేపాటి
దీనులనిల కావగా నీకెవరు పోటి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఒళ్ళుమరిచె ప్రపంచం సోషల్ మీడియాతొ
జగతి విడిచె సమాజం అంతర్జాలంతో
మంటగలిసిపోయాయి మానవీయ బంధాలు
మింటికెగసిపోయాయి రక్తసంబంధాలు
కరోనా కల్పించింది చూరుకింది అనుబంధాలు
కరోనాపెంచింది గృహంలోన బాంధవ్యాలు

1.బందైపోయాయి బయట తిరగడాలు
కుచించబడిపోయాయి హోటళ్ళలొ తినడాలు
ఇల్లాలి చేతివంటలొ వడియాలు అప్పడాలు
పరస్పరం శ్రద్ధాసక్తుల ఆరోగ్య భాగ్యాలు
కరోనా కల్పించింది చూరుకింది అనుబంధాలు
కరోనాపెంచింది గృహంలోన బాంధవ్యాలు

2.సంసారమె ప్రాధాన్యతగా సాగాలి లోకం
వ్యక్తిగత సౌఖ్యమే సంఘానికి శ్రేయోదాయం
ఎవరికివారైతేనే ప్రబలిపోదు అంటువ్యాధి
ఇంటిపట్టునే ఉంటే కట్టగును ప్రతి మహమ్మారి
కరోనా కల్పించింది చూరుకింది అనుబంధాలు
కరోనాపెంచింది గృహంలోన బాంధవ్యాలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హేమవతి

ఏడు కొండలనైతే వీడవులే సరి
మా గుండెల నెలా చేరుదువో శ్రీహరి
విజృంభిస్తున్నదీ అమానుష వైఖరి
మము కావగ నినువినా ఎవరిక మరి
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

1.మా దేహమందు నిన్ను ఆవాహన చేసెదము
మా హృదయమందు నీకు ఆసనము వేసెదము
పన్నీటి పాద్యమిచ్చి పదముల కడిగెదము
కన్నీటి అర్ఘ్యమొసగి కరముల తోమెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

2.మాలిన్యము తొలగేలా అభిషేకించెదము
స్వచ్ఛమైన వస్త్రాలను ధరియించెదము
ప్రకృతి పచ్చదనం నిత్యం నిలిపెదము
పర్యావరణమునే పరిశుభ్ర పరిచెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

3.సాటివారిపట్ల మేము బాధ్యతగా మెలిగెదము
కలుషితాల నెడబాసి నీ ధ్యాసలొ మనెదము
ప్రతి నరుడిలో మురహరినే దర్శించెదము
మానవీయ బంధాలు పునరుద్ధరింపజేసెదము
వేంకట రమణా కరుణా భరణా
శరణుశరణు భవపాపహరణా

Thursday, March 19, 2020

https://youtu.be/PCE_QX0mE7M?si=VI9RCJg8SWu9zUSR

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


అందం సంగతి సరేసరి
ఏర్చి కూర్చాడు విరించినీకై  కొసరికొసరి
అంతకుమించి ఏదో ఉంది
చూసీచూడగానే ఆహ్లాదమాయే నా మది
మంజుల విరి మంజరి నువ్వు
మంజుల శింజినీ సవ్వడి నీ నవ్వు

1.అమావాస్య నాడూ విరిసే కౌముదివే
మృగతృష్ణలోనూ పారే మందాకినివే
నింగికి రంగులు వెలయగజేసే సింగిడివే
బీడును తడిపెడి  తొలకరి  చినుకువు నీవే
మంజుల విరి మంజరి నువ్వు
మంజుల శింజినీ సవ్వడి నీ నవ్వు

2.సుధలు రంగరించిన అనురాగ రాగిణివే
మూర్తీభవించిన అపర సౌందర్య లహరివే
ఆరాధనకే అర్థము నేర్పిన ఆ రాధనీవేలే
ప్రణయానికే భాష్యము రాసిన సూర్యకాంతివే
మంజుల విరి మంజరి నువ్వు
మంజుల శింజినీ సవ్వడి నీ నవ్వు



రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చేతితో మూతిఅన్నది నను తాకరాదనీ
పాణితో నేత్రమన్నది ననుతాకరాదనీ
ముక్కుతనను ముట్టవద్దనీ హస్తంతోఅన్నది
నేడు కరోనాను కట్టడిసేయమని మోము కరమునన్నది

1.పరిశుభ్రత పాటిస్తే కరోనా ఏపాటిది
తగు జాగ్రత వహియిస్తే లక్ష్మణ గీటది
సానిటైజర్లనే పరిపరి వాడితీరాలి
పదేపదే చేతులను గిచగిచా తోమాలి
చికిత్సకన్నా ఉత్తమం ముందుజాగ్రత్తలే
నిర్లక్ష్యం చేస్తేనే తప్పవింక తిప్పలే

2.దగ్గినా తుమ్మినా అడ్డుగ దస్తీనుంచాలి
చిన్నసుస్తి చేసినా డాక్టర్ కడకేగాలి
జ్వరమేదైనా సరే నియంత్రింప జేయాలి
ఇతరులతో వేరుగా ఇంటిలోనె ఉండాలి
సూచనలను పాటిస్తే కరోనాకు అంతమే
బెంబేలు పడిపోతే అగమ్యగోచరమే

3.ప్రతి నలతకు కారణం కరోనా ఐపోదు
ప్రతిజలుబూ కరోనాకు దారితీయనే తీయదు
స్వచ్ఛదనం కావాలి మన జీవన విధానం
పరిశుభ్రతె చెప్పుతుంది రోగసమాధానం
రోగనిరోధక వ్యవస్థ వృద్ధి పర్చుకోవాలి
విషమపరిస్థితెదురైనా నిబ్బరంగ ఉండాలి
https://youtu.be/pjSBGChI-3g?si=lUOVpO4dbyZtc0Eg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మకరి బారి కరిగాచిన శ్రీహరీ
డింభకు బ్రోవగ స్తంభాన వెలసినా నరహరీ
వ్యాధుల పరిమార్చే శ్రీ ధన్వంతరీ
కరోనాను కడతేర్చర కనికరించి మురారీ

1.ఎత్తినావు ఎన్నెన్నో అవతారాలు
తీర్చినావు పలుమార్లు మానవ సంకటాలు
దిక్కుతోచకున్నది మానవజాతి అంతరించు దిశగా
దిక్కికనీవన్నది కరోనా మహమ్మారి నణచగ ఆశగా

2.ఆచారాలన్నీ తగు శాస్త్రీయమైనవే
సంప్రదాయాలూ మనుగడకుపయుక్తమైనవే
నాగరికత మోజులో దిగజారిపోయాము
విచ్చలవిడి స్వేఛ్ఛలో ఉచ్ఛనీచాలవిడిచాము

3.తప్పిదాలు మావెన్నో తలచక మన్నించు
పద్ధతులను అలవరచి మమ్ముద్ధరించు
ఇకనైనా మేల్కొనీ పాటింతుము క్రమశిక్షణ
నిను నమ్మినవారికీ ఇంతటి మరణశిక్షనా

Wednesday, March 18, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ   

రాగం:రేవతి

లేటువయసులో ఘాటు సొగసుతో మాటువేసినావే
రేతిరంతనూ రతీదేవివై నిదురకాసినావే
సూదంటి నీ చూపులు నాటబోకె నాగుండెలో
నీ నవ్వుల వలవేసావో నా బ్రతుకే నీ గుప్పిటిలో
రేవతీ రాగంలా రెచ్చగొట్టమాకే
కార్తీక పున్నమిలా కసిపెంచమాకే

1.ఇన్నాళ్ళు ఏలోకాల్లో విహరించుతున్నావే
నా బ్రహ్మ చర్యమంతా హరియించుతున్నావే
నా జీవన గగనంలో ఇంద్రచాపమైనావు
నా మనసును మాయచేసే ఇంద్రజాలమైనావు
స్వర్గమంటె వేరే కాదు నీ సన్నిధియే
స్వప్నమే నిజమవగా నువ్వు నా పెన్నిధియై

2.నెమలికెంత అసూయనో నీ నాట్య భంగిమలు
గంధర్వ కాంతకు  విస్మయమే నీ నాభి దివ్య సొబగులు
వయసాగిపోయేనీకు పరువాల పాతికలో
మునులైన ముక్తిపొందరా నీ వలపు పాచికలో
తపములేలనే చెలీ తరించరా నీ బిగి కౌగిట కాలి
సుధలేలనే సఖీ అనిమేషులవరా నీ మోవి గ్రోలి

Tuesday, March 17, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అనురాగ రంజితం ప్రతి సుప్రభాతం
రసయోగ సంయుతం మన జీవితం
గతంలోని వెతలన్నీ మతిమరచిపోదాం
రేపేంటను ఆందోళననూ విస్మరించేద్దాం
ఆస్వాదిద్దామూ ఇద్దరమే మనదైన లోకాన్ని
ఆనందం చేద్దామూ చేజార్చక అన్ని క్షణాల్ని

1.రాయబడ్డ నాటకంలో నటించే పాత్రధారులం
కాలప్రవాహంలో కలుసుకున్న బాటసారులం
పాత్రోచితంగా   రక్తికట్ట పోషించాలి
ప్రమేయమే లేకుండా ప్రవహిస్తు సాగాలి
ఆస్వాదిద్దామూ ఇద్దరమే మనదైన లోకాన్ని
ఆనందం చేద్దామూ చేజార్చక అన్ని క్షణాల్ని

2.విపత్తులూ విపర్యయాలూ జీవితంలో భాగాలే
వ్యాధులూ యుద్ధాలు మనుగడలో సవాళ్ళే
మరణం అనివార్యమేకద అనుదినం వగయగనేల
రాబోయే మృత్యువుకోసం నేడు స్వాగతించనేల
ఆస్వాదిద్దామూ ఇద్దరమే మనదైన లోకాన్ని
ఆనందం చేద్దామూ చేజార్చక అన్ని క్షణాల్ని
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:శుభ పంతువరాళి

ముట్టుకుంటే అత్తిపత్తి
పట్టబోతె ద్రాక్షగుత్తి
రెండువైపుల పదునున్న కత్తి
గొంతులింక కోయడమే నీ ప్రవృత్తి
ఆశలెన్నొ కల్పిస్తావు చెలీ అందాలనెరవేసి
నడి కడలిన తోసేస్తావు ప్రేమ నావలోంచి

1.పట్టించుకోకుంటే సెలుకుతావు గిల్లిగిల్లీ
చొరవగా ముందుకెళ్తే చేస్తావు లొల్లిలొల్లి
తప్పించుక తిరుగుతుంటే మాటేస్తావు పిల్లికిమల్లె
చావనీవు బ్రతుకగనీయవు నేనెలాసచ్చేది తల్లే
ఆశలెన్నొ కల్పిస్తావు చెలీ అందాలనెరవేసి
నడి కడలిన తోసేస్తావు ప్రేమ నావలోంచి

2.ప్రేమనొలకబోస్తావనే భ్రమలేర్పరుస్తావు
జీవితమే అంకితమంటూ కథలెన్నొచెబుతావు
పీకల్లోతు మునిగేవరకు దుస్థితే తెలియదెవరికీ
గుండెగాయమైపోయి భవితశూన్యమౌను చివరికి
ఆశలెన్నొ కల్పిస్తావు చెలీ అందాలనెరవేసి
నడి కడలిన తోసేస్తావు ప్రేమ నావలోంచి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాయకుండ ఉండలేను నీ మీద గీతమొకటి
తెలుపకుండ ఆగలేను మదిలోని భావసంపుటి
అందమంత కేంద్రీకృతమై నాభిలోనే దాగుంది
నాట్యమాడ నడుమెపుడో వంశధార అయ్యింది

1.గుండెలెన్నొ దండగుచ్చి మెడలోన దాల్చావు
చూపుల్ని మాలకట్టి సిగలోన దూర్చావు
నిన్ను చూసి యువకులంతా అన్నాలు మానారు
ఇంటికో దేవదాసై నీ ధ్యాసలొ మునిగారు
మైకమేదొ కమ్ముతుంది నిన్ను చూసినంతనే
మతి భ్రమించి పోతుంది నవ్వునవ్వినంతనే

2.వయసుకు విలోమానమై  సౌందర్యం వికసిస్తోంది
చెదిరిపోని సౌష్ఠవమింకా బుసలుకొడుతోంది
జన్మలెన్ని ఎత్తితేమి నిన్ను పొందడానికోసం
చచ్చీ చెడైనాసరే బ్రతుకంతా నీదాసోహం
అయస్కాంతమేదోఉంది నీ ఒంటిలో
ఇంద్రధనుసు కనిపిస్తుంది నీ కంటిలో

Monday, March 16, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నరాలన్ని జివ్వుమంటూ సరాగాలు పాడుతున్నయ్
కోర్కెలకు రెక్కలొచ్చి స్వర్గాన్ని చేరుతున్నయ్
పెదాల్నుండి పెదాల్లోకీ సుధనదులు పారుతున్నయ్
వెచ్చనైన ఊపిరులే చలినింకా పెంచుతున్నయ్
అంగనా నీ అంగాంగమే మదన రంగమయ్యింది
కాయాలు కాలు దువ్వగ కదనరంగమయ్యింది

1.నీ మేని వీణియనే మీటింది నా రసన
నీ ఎడద ప్రేరణగా సాగింది నా రచన
వేణువేదొ మ్రోగుతోంది మోవి తాకినపుడల్లా
మువ్వలే సవ్వడిచేసే నువ్వు నవ్వినపుడల్లా
అంగనా నీ అంగాంగమే మదన రంగమయ్యింది
కాయాలు కాలు దువ్వగ కదనరంగమయ్యింది

2.తబలాల దరువుల్లో తనువు నాట్యమాడింది
చెమట కురియ అణువణువు హరివిల్లు విరిసింది
వ్రేలికొసల వెంపర్లాటకు దేహమే మోహనమైంది
తమకమే హయముగమారి రతివాహనమైంది
అంగనా నీ అంగాంగమే మదన రంగమయ్యింది
కాయాలు కాలు దువ్వగ కదనరంగమయ్యింది

Sunday, March 15, 2020


https://youtu.be/0w41gD_9WRY?si=tZxxsdJwUzjL6AxS

చేపరూపుదాల్చి సోమకుణ్ణి జంపి
వేదాలను కాచావు వేదవేద్యా వేంకటేశా
సాగరాన్ని మథించగా మంథరగిరిని మోయగా
కూర్మావతారివై కూర్మికూర్చినావు దేవతారాధ్యా శ్రీనివాసా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం

1వరాహమూర్తివై  హిరణ్యాక్షు వధియించి
భువి చెఱ విడిపించావు వడ్డికాసులవాడా
నరకేసరి రూపుదాల్చి హిరణ్య కశిపు దునిమి
ప్రహ్లాదుని బ్రోచావు ఆపదమ్రొక్కులవాడా
వామన భార్గవ అవతారములెత్తి దాన ధర్మ
వైశిష్ట్యము తెలిపావు వకుళా నందనా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం

2.సీతా రామునిగా మానవీయ విలువలనే
జగతికి తెలిపావు జగదానందకారకా
శ్రీ కృష్ణ మూర్తిగా జగద్గురువు నీవై
గీతను బోధించావు గోవింద ప్రియ నామకా
బుద్ధ కల్క్యి రూపుడవై లోకోద్ధరణ జేసి
ప్రసిద్ధికెక్కినావు తిరుమల గిరి దీపకా
ఎత్తక తప్పదిపుడు నరజాతిని రక్షింపగా
ఏదో అవతారం ఏకాదశావతారం
ధన్వంతర మూర్తివై సంజీవని మాత్రవై
ఉద్భవించి నెరపాలి కరోనాది వ్యాధుల సంహారం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చిన్ని చిన్ని జాగ్రత్తలు
తీర్చివేసేను మన చింతలన్నీ
వస్తే రానీ ఆపత్తులు
తిప్పికొడదాము చిత్తశుద్ధితోని
కలిసి పోరుదాం మనవంతు బాధ్యతగ
కలియబడదాం కరోనా మహమ్మారినణిచేయగా

1.దరిరావు ఏ క్రిములు వైరస్ లూ
పరిశుభ్రతను పాటించినపుడు
మనలేవు ఏ రోగాలు వ్యాధులు
పరిసరాలు స్వఛ్ఛగా ఉంచుకొన్నప్పుడు
నిర్లక్ష్యమే మనకు ఆత్మహత్య వంటిది
నిగూఢతే మనిషిని మట్టుబెడుతుంది

2.పదేపదే చేతులని ప్రక్షాళణ చేసుకుందాం
దగ్గుతమ్ము జలుబుల్లో మాస్కుల్నే వేసుకుందాం
ఏమాత్రం జ్వరమున్నా ఆసుపత్రికి వెళదాం
చికిత్సదాకా ఎందుకు ముందస్తు చర్యలు చేపడదాం
కరచాలనాలే కరోనాకాలవాలం
నమస్కారమొక్కటే రోగవ్యాప్తి పరిష్కారం

3.అంటువ్యాధి కరోనా అన్నది మరువొద్దు
గుంపులుగా పొరపాటుగను కూడిఉండవద్దు
అరికట్టే వరకైనా కట్టుబాట్లు పాటించాలి
చావోరేవో  కరోనాను తుదముట్టించాలి
ప్రపంచానికే ఇది ఒక సవాలయ్యింది
ఘోరకలేదైనా సరే మానవాళే గెలుస్తుంది