కన్నీటికి కరువన్నది కనలేదు కలలోనా
హృదయ కుహరమందు ఊట ఆగిపోదు
ప్రమేయమే లేకున్నా బ్రతుకున వెత ఒడవదు
1.రుధిరమేమొగాని అశ్రుధారె నరనరాన
ఆనందమె మరీచిక మనిషి జీవితాన
మనుగడకై పోరాటం బ్రతికినంతకాలం
శ్రమకు తగ్గ ఫలితం శూన్యమే ఆసాంతం
2.దుఃఖాలు పలువిధాలు కారణాలనేకం
నవ్వుల ముసుగేసుకుంది ఈ విషాద లోకం
మునకలేయడంలోనే సంతోషం చవిచూడు
చరమగీతినైనా మోహనంగ పాడు