Tuesday, July 13, 2021

 

https://youtu.be/AZCXsBByjPA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జయగోదావరి మాత మాపాలిటి  సౌభాగ్య విధాత

గౌతమ ముని తపఃఫలిత సంజనిత

శ్రీరామ పాద స్పర్శిత  పరమ పునీత

హారతిగొనుమిదె జనని మా ధర్మపురీయుల చేత

పరిశుభ్రతగా నిను మననీయడమే మా కృతజ్ఞత


1.అహల్యాసతి  పాపము ప్రక్షాళణ జేసితివి

పాముకు శాపముబాపి మనుజ రూపమిచ్చితివి

త్రయంబకేశ్వరాన వెలసి సలిలరయమువైతివి

బాసరపురముకు అరసి తెలుగుల వరమైతివి

హారతిగొనుమిదె జనని మా ధర్మపురీయుల చేత

పరిశుభ్రతగా నిను మననీయడమే మా కృతజ్ఞత


2.కృషీవల ఫలసాయార్జిత పరితోషిణి

విద్యుదుత్పత్తి కారిణి మానవ జీవతరంగిణి

.స్నాన పాన జప ధ్యానుల అను నిత్య స

కారిణి

నరసింహుని సేవకజన భవతాప హారిణి

హారతిగొనుమిదె జనని మా ధర్మపురీయుల చేత

పరిశుభ్రతగా నిను మననీయడమే మా కృతజ్ఞత

OK

Monday, July 12, 2021

https://youtu.be/oCF8iX2kHiw?si=pW_UjBd8XBE0KRwd


గుండె గుండెలో మువ్వన్నెల జెండా

ప్రతి భారతీయుని కలలే పండ

జాతీయతే పిడికిళ్ళు నిండా

జాతి  జాగృతికే అండదండ

జయహో స్వతంత్ర భారతమా

జయజయహో స్వేఛ్ఛా సంకేతమా


1..జైళ్ళలో మగ్గారెందరొ జీవితాంతం

లాఠీ దెబ్బలు తిన్నారు ఉద్యమసాంతం

తూటాలకు ఎద ఎదురొడ్డారు ఏ మాత్రం వెరవక

అహింసతోనే సాధించారు సంపూర్ణసాధికారత

జయహో స్వతంత్ర భారతమా

జయజయహో స్వేఛ్ఛా సంకేతమా



2.బానిస సంకెళ్ళనే త్రెంచివేసి

భావదారిద్ర్యమే త్రుంచివేసి

సమైక్య గీతం ముక్తకంఠంతొ ఆలపించారు

పంద్రా అగస్ట్ స్వతంత్ర కేతన మెగురవేసారు

జయహో స్వతంత్ర భారతమా

జయజయహో స్వేఛ్ఛా సంకేతమా




 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుర్తింపుకోసం ఎంత ఎంత వెంపర్లాట

కీర్తి కోసమెందుకె మనసా ఇంతగా తండ్లాట

గోరంత ప్రతిభ ఉన్నా కొండంత అపేక్షట

ఇసుమంత కృషిచేస్తేనే ఇలన వెలిగి పోవాలంట

సహజమైన పాటవమును తూచలేదు ఏ కొలమానం

అత్మసంతృప్తిని మించి విలువైంది కాదే బహుమానం


1.ఎవరి మెప్పుకోసము ఎలుగెత్తేను పికము

ఏ పురస్కారముకై పురివిప్పును మయూరము

ఇంద్రధనుసు ఎందుకని అందాలు చిందుతుంది

మేఘమాల దేనికని మెరుపులని చిమ్ముతుంది

సహజమైన పాటవమును తూచలేదు ఏ కొలమానం

అత్మసంతృప్తిని మించి విలువైంది కాదే బహుమానం


2.కొలనులో విరిసిన కమలం ఏమికోరుకుంటుంది

వెన్నెల వెదజల్లే జాబిలి ఏ సత్కారమడుగుతుంది

హాయిగొలుపు పిల్లతెమ్మెర సమ్మానించమంటుందా

తపన తీర్చు వర్షపుజల్లు బిరుదులే ఇమ్మంటుందా

సహజమైన పాటవమును తూచలేదు ఏ కొలమానం

అత్మసంతృప్తిని మించి విలువైంది కాదే బహుమానం

https://youtu.be/bm_KUa4U_D4


ఉత్తర దిక్పతి సకల సంపత్పతి

అలకాపురపతి సిరి వరదా ధీమతి

కుబేరా ప్రభో యక్షపతి నీకిదె నా ప్రణతి

తరగని ఐశ్వర్యమొసగ నీవే శరణాగతి


1.విశ్రవసు దేవవర్ణి ప్రియపుత్రా

భరద్వాజ ఋషిపుంగవ సుపౌత్రా

చార్వీ పతీ  స్వామీ పింగళ నేత్రా

త్రిపాద అష్టదంష్ట్ర లఘు గాత్రా

కుబేరా ప్రభో యక్షపతి నీకిదె నా ప్రణతి

తరగని ఐశ్వర్యమొసగ నీవే శరణాగతి


2.మహాదేవ ప్రియసఖా పూర్వ గుణనిధిరూపకా

శ్రీ వేంకటేశ కళ్యాణ వినిమయ ఋణదాయకా

గదాయుధ ధరావీరా నర వాహన సంచాలకా

జంబాల నామాంతరా నర లోక నిజ పాలకా

కుబేరా ప్రభో యక్షపతి నీకిదె నా ప్రణతి

తరగని ఐశ్వర్యమొసగ నీవే శరణాగతి


https://youtu.be/bm_KUa4U_D4

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పంజరాన్ని వీడిరావే నా పావురమా

బంధనాలు త్రెంచుకోవే ఓ ప్రియతమా

దిగంతాలు దాటివెళదాం 

దివ్యమైన లోకం ఉంది

యుగాంతాల అంతుచూద్దాం

భవ్యమైన జీవితముంది


1.సాలెగూడులోన చిక్కే చక్కనైన నీ బ్రతుకే

విధే వక్రించి ముక్కే  బంగారు నీ భవితే

అంతుపట్టలేకుంది నీ అంతరంగం

కట్టువీడ తలపడుతోంది యౌవనతురంగం

చేయందుకోవే ఓ చంచలాక్షి

నీ జతను కోరుతోంది నా ప్రాణపక్షి


2.ఊబిలోన దిగబడిపోయాం బయటపడలేము

సాగరాన ఈదుతున్నాం చేరలేము ఏతీరం

మనసంటు ఉందిగాని మార్గమే లేదాయే

తీపి తీపి జ్ఞాపకాలే వేపాకు చేదాయే

సాంత్వనే అందజేద్దాం పరస్పరం

ఊరటే చెందగలము అనవరతం




పల్లెటూరి చిన్నదాన

పట్నం చదువుకు వచ్చినదాన

రెక్కలె రాని పక్షిలాగా

దారం తెగిన పతంగిలాగా

ఎందుకే ఎందుకే అంత తొందర 

తప్పటడుగు వేసావో భవితే చిందరవందర


1.రంగురంగుల హంగులే పట్టిలాగుతాయి

ఫ్యాషన్ పేరిట వికృతాలు చుట్టుముడతాయి

కొత్తకొత్త వ్యసనాలన్నీ నిన్నే కోరి వరిస్తాయి

వింత వింత స్నేహాలన్నీ ఆప్తంగా కనిపిస్తాయి

ఎందుకే ఎందుకే అంత తొందర 

తప్పటడుగు వేసావో భవితే చిందరవందర


2.పార్టీల్లో చేరకపోతే నిన్ను గేలి చేస్తారు

పబ్బులకు వెళ్ళకపోతే జాలిగా చూస్తారు

డేటింగ్ అన్నది చేయకపోతే అప్డేవలేదంటారు

మాదక ద్రవ్యాలకే బానిసగా మారుస్తారు

ఎందుకే ఎందుకే అంత తొందర 

తప్పటడుగు వేసావో భవితే చిందరవందర

Saturday, July 10, 2021


నాదానివై మంజుల నాదానివై

ఆవిర్భవించావు నిశ్శబ్ద విశ్వమే రవళించగా

మోదానివై ఎదల ప్రమోదానివై

అవతరించావు చిరకాల స్వప్నమే ఫలించగా

అందుకో నేస్తమా జన్మదిన శుభాకాంక్షలు

ఆనందమే చిందగా కురిపింతు అక్షరాక్షంతలు


1.మూర్తీభవించిన స్త్రీమూర్తిగా సౌహార్ద దీప్తిగా

తీర్చిదిద్దిన అపరంజి బొమ్మగా ముద్దుగమ్మగా

పదహారు కళలొలికే సిరిగా సౌందర్య లహరిగా

 విలసిల్లు వికసించే విరిగా జనాళికే స్ఫూర్తిగా

అందుకో నేస్తమా జన్మదిన శుభాకాంక్షలు

ఆనందమే చిందగా కురిపింతు అక్షరాక్షంతలు


2.ఉపాధ్యాయ ఉద్యోగాన  పదోన్నతే పదింతలై

కవనలోక తలమానికగా పురస్కార పులకింతలై

షట్కర్మయుక్తగా కాపురాన ప్రేమలే చిగురించగా

జీవితమే సాఫల్యమొందగ కనులే చెమరించగా

అందుకో నేస్తమా జన్మదిన శుభాకాంక్షలు

ఆనందమే చిందగా కురిపింతు అక్షరాక్షంతలు

Friday, July 9, 2021


ఎవరికెలా ముడిపెడతాడో పరమేశ్వరుడు

ఎవరితో జతకడతాడో మనలనా భగవంతుడు

ఏ క్షణం జీవితాన్ని ఏ మలుపు తిప్పుతాడో

ఏ ఋణం తీర్చుకొనగ ఏ బంధం విప్పుతాడో


1.పరిచయాలన్నిటిలో మన ప్రమేయమెంతని

స్నేహాం కొనసాగుటలో మన పాత్ర ఏమేరకని

ఎదురయ్యే సందర్భం ఎవరు రచించారని

ఎదుర్కొనే సంఘటనలు ఎవరు సృజించారని


2.పరమార్థమేదో లేకుండా ఉండదు ప్రతి జన్మకు

ప్రయోజనమొకటి కలుగకుండ ఉండదు ప్రతికర్మకు

ఏ చర్యవల్ల ఏ చర్యకే ముందొ అవినాభావ సంబంధం

దైవలీలల్లోనా సంభవమే ఏదో కార్యకారణ సంబంధం

Thursday, July 8, 2021



https://youtu.be/aTkyjXR5dI4


విశ్వసించా నా శ్వాసవే నీవుగా సాయి

పలవరించా నీ నామమే పగలు రేయి

నిజాయితే కొఱవడిందో నీ మీది భక్తిలో

సజావుగా సాగకుంది నా బ్రతుకే ఆసక్తితో


1.ఎందరు నిను కొలిచేరో-లబ్దెవరికి చేకూరేనో

షిరిడీ దారి పడతారు-నీ సమాధిన తలపెడతారు

ఎవ్వరికే సిరి దొరికేనో ఏ సంపద సమకూరేనో

ద్వారకమాయికేగుతారు-ధునిబూది తలనెడతారు


2.చెప్పుడు మాటలు వినను-కాకమ్మ కథలు నమ్మను

మరిమరి నిను వేడను- మదిలో మాత్రం నే మరవను

ఏరీతి చక్కబెట్టెదవో  -చేజారిన ఈ నా జీవితం

ఎలా మరమ్మత్తు చేసెదవో -శిథిలమైన నా హృదయం

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎలా ఋజువు పరుచను నా ప్రేమను

ఎలా ఎరుక పరుచను నా మనసును

ఏ అపురూప కానుకనందించను

ఏ విధి నా హృదినిక ప్రకటించను


1. పారిజాత తరువును గొనిరానా

సత్యపరం చేసాడు కృష్ణుడేనాడో

ఐనా పారిజాత పరిమళమే నీ సొంతం

అమృతాన్ని దివికేగి సాధించుకరానా

పాత్రకే పరిమితమై మితంగా లభ్యమౌనో

పుష్కలమే నీ అధరాల్లో ఆ సుధామాధుర్యం


2.కోహినూరు వజ్రం సంపాదించనా

ఆంగ్లేయులు దొంగిలించిరి అలనాడే

నీకాలిగోటి విలువకు తూగదుగా ఆ రత్నం

పాలరాతి మందిరమే నిర్మించనా

కఠినమేకద శిలాకోవెల  సుకుమారీ నీకేల

నా గుండెను గుడిగా మలచి కొలిచేను నిత్యం

Tuesday, July 6, 2021

 

ఎలా కాచి ఉంచను నీ వదన కమలాన్ని

తుంటరి తుమ్మెదల దండునుండి

ఎలా ఏమార్చను నీ చరణ పల్లవాన్ని

గండుకోయిలల దాడినుండి

తెరవెనక ఉండక కలంలోకి చొరబడవే

కనులెదుట లేకున్నా కలల్లోకి త్వరపడవే


1.క్షీరసాగర మథనం మళ్ళీ మొదలౌతుంది

నీ అధరామృతం కోసం

శివ మనోచపలత్వం మరలా సాధ్యమౌతుంది

నీ నవమోహన రూపంకోసం

తెరవెనక ఉండక కలంలోకి చొరబడవే

కనులెదుట లేకున్నా కలల్లోకి త్వరపడవే


2.ప్రపంచాన్ని సాంతం త్యజించవచ్చు

నీ క్రీగంటి చూపుకు

విశ్వాన్ని సైతం జయించగావచ్చు 

నీ అరనవ్వు కైపుకు

తెరవెనక ఉండక కలంలోకి చొరబడవే

కనులెదుట లేకున్నా కలల్లోకి త్వరపడవే


OK

 

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతటి శిక్షనో ఈ నిరీక్షణ

నీకెప్పటికైనా చెలీ ఎరుకౌనా

ఎంతగకాల్చునో విరహ వేదన

కాసింతైనా నీకిక అవగతమౌనా

అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన

సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా


1.కన్నయ్య రాకకు రాధ ఎలా ఎదిరి చూసిందో

దుష్యంతుని జాడకై శకుంతలెంత వేచిందో

ప్రణయాగ్ని జ్వాలలోన ఎవరెంత వేగారో

ప్రియతముల సంగమించ ఎంతగా గోలారో

అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన

సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా


2.రామునికి దూరమై సీత ఎంత వగచిందో

నలుడి నెడబాసి దమయంతెలా సైచిందో

చేజారి పోతే తెలియును గాజు పూస రత్నమనీ

చెలికాని వెలితిని మరచుట విఫల యత్నమేననీ

అనుభవైకవేద్యమైతేనే తెలిసేనీ తీపియాతన

సహానుభూతితోనే కరుణించాలి నువ్వికనైనా

 

https://youtu.be/W64g06TYrKU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సకల సృష్టికే స్త్రీ మూలం

ఆకాశంలో అతివ సగం

స్వావలంబన సాధికారత

సబలకు పెట్టని ఆభరణం

విద్యతోనే  నేటి వనితకు నిత్యవికాసం

బాలికలందరు చదువుకొంటెనే బంగరు భారత దేశం


1.సకల విద్యలకు అధిదేవతయే మాతా శ్రీ సరస్వతి

సిరులను వరముగ నరులకిచ్చే లక్ష్మి సైతం పడతి

అసురదూర్తులను మట్టుబెట్టినది కాదా ఆదిపరాశక్తి

నిబిడీకృతమౌ మనో బలమునే గుర్తెరగాలి ప్రతి ఇంతి

విద్యతోనే  నేటి వనితకు నిత్యవికాసం

బాలికలందరు చదువుకొంటెనే బంగరు భారత దేశం


2.పలురంగాలలొ పురుషుని దీటుగ నిలిచింది ప్రమద

వ్యోమగామిగా గగనతలంతో విహరించింది ధీర

దేశమునేలే నేతగ నాడే పరిపాలించెను తరుణి

సంతతి పొందే ఉన్నతి ఖ్యాతికి కారణభూతం కాంత

విద్యతోనే  నేటి వనితకు నిత్యవికాసం

బాలికలందరు చదువుకొంటెనే బంగరు భారత దేశం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మెరుగులు దిద్దని ముడి సరకు

అమరపురి నుండి దిగె ఈ ఇలకు

సహజాతమే నీ అపురూప సౌందర్యం

అపరంజి శిల్పమేనీ అనన్య సోయగం


1.కొలనులోన విచ్చిన కమలం

వనములొ  విరిసిన మందారం

అణువణువు నీ తనువు మొగలి సౌరభం

తాకిచూస్తే హాయిగొలిపే గులాబి సుకుమారం


2.అనంగ రంగం నీ అంగాంగం

 బృందావన రస సారంగం

హద్దులు దాటి పెదవులు మీటే కమ్మదనం

హత్తుకపోతే మత్తులొముంచే వెచ్చదనం

 

https://youtu.be/A4NIJt8szQM

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భో భో భో భో బోళా శంకరా

భో భో భో భో శంభోశంకరా

ప్రభో రాజరాజేశ్వరీ విభో శంకరా

సాంబ సదాశివ భక్తవశంకరా హరా

నమోనమఃశివాయా భవాశంకరా

హరహర మహాదేవ పాహి పాహిశంకరా


1.జటాఝూట హఠయోగీ గంగాధరా

కరుణా కటాక్ష వీక్షణా బాలేందుశేఖరా

నిటలాక్ష విషకంఠా వృషభ వాహనా

శూలధరా పురంధరా ఫణి భూషణా

నమోనమఃశివాయా భవాశంకరా

హరహర మహాదేవ పాహి పాహిశంకరా


2.త్రయంబకా పంచముఖా మృత్యుంజయా

వైద్యనాథ భూతనాథ విశ్వనాథ సహాయా

నటరాజా చిద్విలాస ప్రళయ రౌద్ర రూపాయా

రాజేశ్వర పరమేశ్వర కైవల్యదాయకాయ

నమోనమఃశివాయా భవాశంకరా

హరహర మహాదేవ పాహి పాహిశంకరా

Sunday, July 4, 2021


https://youtu.be/rMlYA6GEbwk

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జన్మనే వరమిచ్చిన మముగన్నతల్లీ

నీ జన్మదినము ఈనాడే మా కల్పవల్లి

సంబరమే చేసెదము మేము సంతసిల్లి

దీవెనలందెదము నీ పదముల ప్రణమిల్లి

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా


1.నాన్నకు తగు ఇల్లాలిగ మన్నలే పొందావు

కన్న మా ఏడుగురిని కనుపాపగ సాకావు

అత్తింటికి పుట్టింటికి పెద్ద దిక్కువైనావు

చెల్లెళ్ళను కోడళ్ళను ఆదరణతొ చూసావు

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా


2.ఇంటికెవరు వచ్చినా కడుపునింపి పంపావు

కమ్మనైన రుచులతో తృప్తిదీర పెట్టావు

ఎవరికైనా సాయపడి రెక్కలరగ దీసావు

అన్నపూర్ణవై అతిథుల మతులలో నిలిచావు

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా


3.తీరలేని వెతలున్నా నవ్వెన్నడు చెరగలేదు

ఎంతకష్టమెదురైనా నీ ధైర్యం సడలలేదు

నిన్ను తలచుకుంటే నిరాశే దరికిరాదు

సవాళ్ళనే ఎదుర్కొనగ నీ తెగువకు సరిలేదు

శుభాకాంక్షలందుకో అమ్మా మాదైవమా

నీ శుభాశీస్సులే మాపై కురిపించవమ్మా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీరెండలో మెరిసే అపరంజి గులాబీ

నా గుండె తహతహలాడే ఆరెంజి జిలేబీ

రోజూ చూడాలనిపించే రోజా పువ్వు నువ్వు

నోరూరించి మనసునుదోచే మడత  కాజానువ్వు


1.గాలి మోసుకొస్తుంది నీ మేని పరిమళం

మబ్బు చిలకరిస్తుంది నీ హృదయ మర్మం

నది కౌగిలిస్తుంది నీ ప్రతినిధిగా నా దేహం

చెట్టు సేదతీరుస్తుంది నీకు మారు అంగాంగం


2.వెలవెలబోతుంది సూర్యరశ్మి నీ ముందు

తళతళ విద్యుల్లత నిను గని వగచెందు

ఇంద్రధనసు కన్నా నీ వన్నెలె కనువిందు

నీ ఊహ మెదిలినంత మదికెంతో పసందు

 రచన,స్వరల్పన&గానం:డా.రాఖీ


రాగం:సారమతి


హరి వేంకట నారాయణా

సిరివల్లభా కమలనాభా

కరుణాభరణా  దీనావనా

పరిపరి విధములుగా నిను నుతియింతును

మరిమరి నీ చరణములే నే శరణందును 


1. కరినైనా కానైతిని సరగున నను బ్రోవగా

బలినైనా అవకపోతిని నీపదమే తలనిడగా

రాయిగా పడివున్నా  తాకాలని నీ అడుగు

వెదురునై  ఒదిగున్నా చేరాలని నీ మోవి

పరిపరి విధములుగా నిను నే కోరెదను

త్వరపడి నీ పదములనే నేనిక చేరెదను


2.నీ గుడి గంటనై నిన్నంటెద సవ్వడిగా

అఖండ దీపమునై వెలిగెద గర్భగుడిన

తులసీదళ మాలనై అలరింతును నీ మెడన

చక్కెర పొంగళినేనై స్థిరపడెదను నీ కడుపున

పరిపరి విధములుగా చేసెద నీ సేవలు

నీ సన్నిధిలో మనుటకు ఎన్నెన్ని స్వామి త్రోవలు

Friday, July 2, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందితే వంపులు 

అందకుంటె జంప్ లు

అందాల ఇంతులవి

ఇంతే సంగతులు


1.వలపులతో వలలు

అర్భకులే చేపలు

చిక్కిన వెనువెంటనే

చిక్కులే చిక్కులు


2.మాయలేడి జోడి

మాయ చేయ లేడి

పులిహోర కలపబడి

బ్రతుకంతా చేతబడి

 https://youtu.be/x2pdd2n5RNI?si=c7lOr_PFrbEC8o04

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఎద మంజుల నాదమా నా కవన వేదమా

యుగయుగాల నా తపఃఫలమా 

నా కలానికే దొరికిన అపూర్వ వరమా

తడబడుతోంది నినుగాంచ నాదృష్టి 

నివ్వెరబోతోంది నీ అందానికి ఈ సృష్టి


1.నీ శిరోజాలు కృష్ణవేణి పాయల జాలు

నీ కన్నులు మిలమిల ఇంద్రనీలమణులు

నీ నునులేత చెంపలు కెంపులరుచి నెలవులు

పోలికే దొరకదు తీరిచి దిద్దిన నీ ముక్కునకు

తడబడుతోంది నినుగాంచ నాదృష్టి 

నివ్వెరబోతోంది నీ అందానికి ఈ సృష్టి


2. పిల్లనగ్రోవిగా తోస్తోంది నాపెదాలకు నీమోవి

మత్తులోన ముంచుతోంది నీ మేని పారిజాత తావి

చిత్తైపోయింది నా చిత్తము నీమాయకు లోబడి

నా మనసే నను వీడెను నీ లోనికి చొరబడి

చర్వితచరణమైంది చెప్పిన ఉపమానము

అందానికి ఇకనుండి నీవేలే నిర్వచనము


https://youtu.be/ynmtOVJGl-0


మనసాయే నిను గన షిరిడీ సాయి

వినవాయే మొరలిడ పగలూ రేయి

సద్గురుడవీవని నాకెంతో గురి

పట్టితి నీపదము విడవను ఏ మరి

వెతలకు నేనిక వెరవనె వెరవను

సాయీ సాయని స్మరణే మరవను


1.నీ సూత్రాలు తలదాల్చలేను

నీ స్తోత్రాలు పఠియించ లేను

పంచహారతుల నొనరించలేను

పల్లకి భారము మోయగలేను

వెతలకు నేనిక వెరవనె వెరవను

సాయీ సాయని స్మరణే మరవను


2.చీకటి వేళల దీపము నీవే

ఆకటి వేళల అన్నము నీవే

శోకము బాపెటి నేస్తము నీవే

లోకములో నాకిక దైవము నీవే

వెతలకు నేనిక వెరవనె వెరవను

సాయీ సాయని స్మరణే మరవను


OK

Thursday, July 1, 2021

 

https://youtu.be/bpnQJvPTmVs?si=glZq006Bhc7జబీనియ్

వేములాడ వాడ రాజన్న

దయగల్ల వాడ రాజన్న

శివసత్తులదొర జంగమదేవర

ఎల్లలోకాల నీవె చల్లగ కావర


1.  గుండె  నిండుగా  చేసుకొని

గుండంలొ నిండా ముంచి మెయ్యని

గుడి గంట ఠామ్మని కొట్టి నేనిలిస్తిని

గురి నీ మీదనే పూరా పెట్టుకొంటిని


2.చెంబెడు నీళ్ళు కుమ్మరిస్తిని

శివ లింగమ్మీద పత్రి పెడితిని

శంభో శంకా నా వంక చూడమని

సాగిలబడి నీకు మొక్కుకుంటిని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మళ్ళీ పుట్టాలి మనం 

మనదైన లోకంలో ఈ క్షణం

ఆంక్షలేవి లేని చోట ఆకాంక్షలు తీరే వాకిట

వాస్తవికతకు సమాంతరంగా

భావుకతకు సుందర తీరంగా


1.ఆకలి దప్పులకు తావుండదచట

జరా మరణాలకు వీలుండదచట

అనురాగమొక్కటే విరిసేటి తోట

ఆనందం మాత్రమే కురిసేటి చోట

అది అందమైన మనదైన ఊహల జగము

అట నీవు నేను ఒకరికొకరం చెరి సరి సగము


2.పలుకుల జలపాతాలే ప్రవహిస్తుంటే

పాటల పారిజాతాలే పరిమళిస్తుంటే

అమృతాన్ని  ఆసాంతం ఆస్వాదిస్తూ

హాయినే జీవితాంతం అనుభూతిస్తూ

కలిసి మనం పయనిద్దాం దిగంతాల దాకా

కలలపంట పండిద్దాం యుగాంతాలదాకా


https://youtu.be/eimfjGN3NSg?si=kIHq6bcKNcp-_0e-

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: శ్రోతస్విని

మ్రోగనీ నా ఎద మంజులమై నీ పద మంజీరమై
దిద్దనీ నా పెదాలు అరుణిమలే  నీపదాల పారాణియై
నడిపించనీ అరచేతుల పదిలంగా నీ పాదాలు కందనీయక
నిమరనీ నాకనురెప్పలతో సౌమ్యంగా నీ పాదాలకానందమీయగ

1.తరించనీ నీ పవళింపుసేవలో మెత్తని నీ పదములనొత్తగా
నిదురించనీ మైమరచి నీ పదముల తలగడపై రేయంతా మత్తుగా
మెటికలు విరియనీ నీకాలి వ్రేళ్ళకే అపురూపంగా నను కొత్తగా
మర్ధన చేయనీ అతిసున్నితంగా నీ పాదాల తీపులే చిత్తవగా

2.తేలిపోనీ నను నీ బొటన వ్రేలు నా ఛాతిపై ముగ్గులేయగా
మూల్గనీ నీ పాదాలు నా నిలువెల్లా కొలతలేవో తీయగా తీయగా
సోలిపోనీ నీ అరిపాదం నా చెంపకు సుమ గంధం రాయగా మాయగా
వాలిపోనీ అలసిసొలసి నీ పదతాడనతో ఆ హారతి నీయగా హాయిగా


Tuesday, June 29, 2021

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమవ్వగలను నేస్తమా 

బంధాలకతీతమై నీకు నేనౌతా సర్వం సహా

ఏమివ్వగలను మిత్రమా 

నేనే నీవైపోయిన నీకు -నిన్ను నీకు మినహా


1.నీవుగా కోరింది ఇప్పటికి నెరవేరంది

మనసారా నువు బాగా మెచ్చింది -ఇంకా ఏముంది

నావద్ద దాచుకుంది నాకెంతో నచ్చేది

నన్నిమ్మని అడిగింది నీవేకదా అది -నిన్ను నీకు ఇచ్చేది

ఖరీదెవరు కట్టలేంది అమూల్యమే అది నీకు నా బహుమతి


2.దూరంగా ఉన్నాగాని ఒకే ఒరలొ కత్తులం

పరస్పరం ప్రభావంతో సాహితీ పాన మత్తులం-కవన చిత్తులం

చేరువగా భావాలున్నా చేరలేని తీరాలం

తలపులతో తలమునకలయే పావురాలం-స్నేహగోపురాలం

సృష్టిలో తీయనిది ఎన్నటికి తరగనిది చెలిమి నీకు  కానుక

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా అంతరాత్మవు నీవు

నామేధలో  పార్వతీ మాతను నిలిపేవు

నా పంచప్రాణాలే పంచ భూతవిశ్వము

నాదనుకొను ఈ దేహమే నీదైన గృహము

త్వమేవాహం శివా నీకు నాకు అభేదము


1.గుణరూప రహితుడవు నిత్య నిరంజనుడవు

సాకార నిరాకార సందిగ్ధ లింగ ప్రాప్తుడవు

సర్వవ్యాపకుడవు అఖండ విశ్వజనకుడవు

త్రయంబకుడవు నీవు సాంబ సదా శివుడవు

త్వమేవాహం శివా నీకు నాకు అభేదము


2.వేదవేద్యుడవు సంగీత శాస్త్రాద్యుడవు 

తాండవకేళీ విలాసుడవు నటేశ్వరుడవు

ఆది వైద్యుడవు సకల విద్యా పారంగతుడవు

ప్రళయకాల రుద్రుడవు మృత్యుంజయుడవు

త్వమేవాహం శివా నీకు నాకు అభేదము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చారెడేసి కళ్ళున్న చారులత

బారెడంత జడ ఉన్న మంజులత

ఒదిగిపో నీవే నా కవితగా

సాగవే  బ్రతుకంతా నా జతగా


1.గోముగా చూడకే నా వంక

అరనవ్వు రువ్వకే చంద్రవంక

వెక్కిరించినా నీ ప్రేమకదో వంక

వైరులకూ దొరకదు నీలో ఏ వంక


2.ఊరించడం నీకు మామూలే

ఉడికించకు మగటిమికది సవాలే

ఊహలే రేపేను నీ పరువాలే

ఉక్కిరిబిక్కిరాయే నాలో భావాలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లోకమంతా నిదురపోతోంది

నా కవితకిపుడే వేకువయ్యింది

చెదురుమదురుగా ఎదను తట్టిన

భావసంచయము

కుదురుగా ఇపుడిపుడే వచ్చి

కూర్చె నీ సరము


1.సెలయేరై పారుతుంది ఎడారిలోనూ

గులాబీగ పూస్తుంది స్మశానంలోను

చంద్రికయై వెలుస్తుంది అమావాస్యలోను

చిరుజల్లై కురుస్తుంది ఎద బీడులోను

వేగుచుక్కగా మారి దారి చూపుతుంది భావుకత

పొద్దుపొడుపుగా ఆశలకే రుచిస్తుంది నా కవిత


2.ఆర్తి తెలియపరుస్తుంది ప్రేమికుల జతకు

స్ఫూర్తి కలుగజేస్తుంది యథాలాప యువతకు

మార్గదర్శనం చేస్తుంది సరియగు నడతకు

జాతీయత రగిలిస్తుంది నా దేశజనతకు

వేగుచుక్కగా మారి దారి చూపుతుంది భావుకత

పొద్దుపొడుపుగా ఆశలకే రుచిస్తుంది నా కవిత

Monday, June 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గృహిణితో మగనికి ఇంట ఒత్తిడి 

యజమానితో  పనిలో పడని ఒత్తిడి 

అధిక రక్త పోటుతో  ఒళ్ళంతా  ఒత్తిడి 

కలత నిదుర వలన మనసుంతా ఒత్తిడి

ప్రశాంతతే కరువై బ్రతుకంతా ఒత్తిడి

ఆసాంతం అనుక్షణం భరించలేని ఒత్తిడి


1.నరకమే సుఖకరం  ఒత్తిడుల మధ్యన

చావే గత్యంతరం బ్రతుకు వధ్యశిలన

అసమర్థుడి జీవయాత్ర పుట్టుకతో మొదలౌను

అడుగడుగున సతమతమై మెదడంతా చెదలౌను

ప్రశాంతతే కరువై బ్రతుకంతా ఒత్తిడి

ఆసాంతం అనుక్షణం భరించలేని ఒత్తిడి


2. అస్తవ్యస్తమే బ్రతుకు నాదిగా అనాదిగా 

విఫలయత్నమే గెలుపుకు సమిధగా వ్యధగా

ఉప్పెనతో కప్పబడే భవిష్యత్తు సాంతం

తుఫానుతో చిత్తడాయే జీవన వసంతం

ప్రశాంతతే కరువై బ్రతుకంతా ఒత్తిడి

ఆసాంతం అనుక్షణం భరించలేని ఒత్తిడి

Saturday, June 26, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అసూర్యంపశ్యవు నీవో

అనాఘ్రత పుష్పమునీవో

జలతారు మేలిముసుగులో

జగదేక సుందరినీవో

అమృత కలశపు అంజలితో

అపర జగన్మోహిని నీవో


1.మత్తుకళ్ళతొ చిత్తేచేసిన మత్స్యగంధివి నీవో

పాలనురుగుల నవ్వులతో మాయచేసిన గంగవునీవో

మతిచలించే అందమున్న ఇంతి దమయంతివి నీవో

చూపులతో కైపును రేపే అప్సరాంగన ఊర్వశి నీవో


2.రాసలీలతొ మురళీధరునికి రక్తికూర్చిన రాధవునీవో

ఇంద్రుడే పాదాక్రాంతుడైన సుందరి అహల్యవే నీవో

దుశ్యంతుని హృదయము దోచిన శకుంతలవు నీవో

రవివర్మ కుంచెకు దొరకని సౌందర్య దేవత నీవో

Friday, June 25, 2021



ఇలా నిర్ణయించావా నా జాతకం

బలిచేయనెంచావా నా జీవితం

ఏ మలుపు తిరిగేనో నీచేత నా కథనం

గాలివాటు పతంగమాయే నా భవితవ్యం

అరవిందాననా తిరుమల శ్రీ రమణ

అడుగంటెనా  స్వామి కడలంత నీ కరుణ


1.నిన్ను అడుగు వాడిలలేడు

నీకు సాటి మొనగాడెవ్వడు

నీనోటి మాటనే ఒక వేదమంత్రం

నీ ఆదేశమే అది రాజ శాసనం

నీదే ఈ సామ్రాజ్యం మా విలువే శూన్యం ఎంత దైన్యం

అరవింద నయన  తిరుమల శ్రీ రమణ

అడుగంటెనా  స్వామి కడలంత నీ కరుణ


2.కంచే చేన్ను కాచకుంటే దిక్కెవ్వరు

రెప్ప తప్పుకుంటుంటే కన్నుకు చుక్కెదురు

రాజుతలుచుకున్నాడంటే దండనే దండన

దైవం కన్నెర్రజేస్తే బ్రతుకు సుడిగుండాన

నీవే దయగాంచు నీవె ఆదరించు నన్నుద్ధరించు

అరవింద చరణ  తిరుమల శ్రీ రమణ

అడుగంటెనా  స్వామి కడలంత నీ కరుణ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెఱకు గడవు నీవు ఎటుతిన్నా తీయదనమె

ఇంద్ర ధనువు నీవు ఎటుకన్నా ప్రన్నదనమె

వర్ష ఋతువు నీవు పుడమంతా పచ్చదనమె

హేమంత ఉషస్సువు తనువంతా వెచ్చదనమె

కవిలోని చైతన్యము పిక మంజుల గీతము

నీవే నీవే ప్రియతమా నీవే నీవే


1.తెలుగు మాట నీవు అగుపించును తేటదనం

బ్రతుకు బాట నీవు తలపించును నందనం

వలపు తోట నీవు మేను విరుల సవరదనం

ప్రగతి మీట నీవు  నా మనోరథ ప్రచోదనం

కవిలోని చైతన్యము పిక మంజుల గీతము

నీవే నీవే ప్రియతమా నీవే నీవే


2. అంతులేని ప్రేమ నీవు నీతోనే జీవనం

అనవరతం నీ సన్నిధి అపర బృందావనం

ఆహ్లాదము నీ తలపే అది కమ్మని భావనం

అపురూపము మనకలయిక ఇల కడు పావనం

కవిలోని చైతన్యము పిక మంజుల గీతము

నీవే నీవే ప్రియతమా నీవే నీవే

Thursday, June 24, 2021

 

https://youtu.be/0qU3846QCgc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శుక్రవార శుభలక్ష్మి

చక్రధారి గృహలక్ష్మి

స్వాగతమమ్మ నీకు ఆరోగ్యలక్ష్మి

వందనమమ్మ నీకు ఆనందలక్ష్మి


1.వక్ర బుద్ధి మాకెవరికి కలగనీయకమ్మా

అక్రమార్జన కెపుడు మాకు తావీయకమ్మా

తృణమో ఫణమో పంచే గుణమీయవమ్మా

ఉన్నంతలొ జీవించే తృప్తి నీయవమ్మా


2.చిరునవ్వును పెదవులపై చెరగనీయకమ్మా

బంధుమిత్రులే సిరులను భావమీయవమ్మా

ప్రకృతితో చెలిమి జేయు వరమీయవమ్మా

నీ ఆకృతి మా మదిలో చెదరనీయకమ్మా

 రచన,స్వరకల్పన&గానం:రాఖీ


రెప్పకు చూపుకు పోరాటం

తనువుకు మనసుకు తప్పని జగడం

రెప్పనిదుర పొమ్మంటుంది

చూపు ఆగమంటుంది

తనువు తప్పదంటుంది

మనసు గోడు వినమంటుంది


1.రెప్ప చెప్పి ఒప్పిస్తోంది

కలకు చెలిని రప్పిస్తానని

చూపు నమ్మనంటోంది

నిమిషమైన ఆపలేనని

నిదుర బెదిరి పోతోంది

కలత కుదరదంటోంది

గొడవ సద్దుమణిగే లోగా

వేకువ పొడసూపుతోంది


2.రెప్పమూసినా గాని

చెలి రూపు నిలిపింది

స్వప్నాల సౌధం లోకి

సఖిని సాగనంపింది

తనువుతో రాజీకొచ్చి

మనసు నెమ్మదించింది

చెలియ మనసుతో చేరి

ప్రణయ గీతి పాడింది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బంధించు  నీ హృదయంలో

సంధించు నీ ప్రణయంలో

సాధించు నన్ను సఖీ నీ సన్నిధిలో

ముంచిఉంచు ఎప్పటికీ ప్రేమాంబుధిలో

హక్కులన్ని చేసేసా నీ పరమే

నువు నాకు దక్కడమన్నది ఒక వరమే


1.ఊపిరాడనీయకూ నీ కౌగిలిలో

తేరుకోనీయకు ముద్దుల జడిలో

గాయపరచవే నన్ను నాలిక ఛూరికతో

దోచేయి సర్వస్వం మంత్రతంత్ర విద్యలతో

హక్కులన్ని చేసేసా నీ పరమే

నువు నాకు దక్కడమన్నది ఒక వరమే


2.బానిగా మార్చుకో వశీకరణ చేసి

దాసునిగా చేసుకొ దేవీ కోరికలే తీర్చేసి

నను కట్టడి చేసేయి కనికట్టు చేసేసి

నేన్నే లేకుండా చేయి నీవుగా మార్చేసి

హక్కులన్ని చేసేసా నీ పరమే

నువు నాకు దక్కడమన్నది ఒక వరమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వు నవ్వితే రోజూ పున్నమి

నాకన్నుల నీవే నిండు జాబిలి

మేఘమాల మధ్యన చందమామ నీ మోము

ఒక నిమిషమైనా దృష్టి మరల మనలేము


1.పొందికలోనె ఉంది నీ ఎనలేని అందము

ఒద్దికనే తెలుపుతోంది  పొందిన ఆనందము

నిను గనినంతనే పరవశమౌ నా డెందము

కలయే నిజమై  కలవరమౌ చందము


2.హళేబీడు శిల్పాలు నినుగాంచి చెక్కినవే

అజంతా చిత్రాలకు అలనాడు ప్రేరణవే

ప్రబంధ నాయిక పాత్రలు నీ వల్ల వెలిసినవే

దేవీ మూర్తులన్ని నీ స్ఫూర్తితొ మలచినవే

Wednesday, June 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కాస్తంత తోడొస్తావా-కలలోకి వెళుతున్నా

నీచేయినందిస్తావా-తలమునకలౌతున్నా

కవితలకు వీలౌతుంది-కవి తలకు మేలౌతుంది

విహరించు మిషతోనే హరించవే నాఎదను

మొహరించు వేళలో భరించవే నా సొదను


1.నీ చూపుల శరాలనే మారుస్తా అక్షరాలుగా

నీ పదాల గురుతులనే పేరుస్తా పదాలుగా

నీ మంజుల దరహాసాన్నే వాక్యాల్లో కుమ్మరిస్తా

నీ గాత్ర పరిమళాన్నే  గీతమంత పరిచేస్తా

విహరించు మిషతోనే హరించవే నాఎదను

మొహరించు వేళలో భరించవే నా సొదను


2.నీ స్పర్శలోని హాయిని రాగమందు రంగరిస్తా

నీ గుండె సవ్వడిని పాటకు తగు లయచేస్తా

కలిగే గిలిగింతలన్నీ గమకాలు పలికిస్తా

మిగిలే అనుభూతులన్నీ కృతిగా నేనాలపిస్తా

విహరించు మిషతోనే హరించవే నాఎదను

మొహరించు వేళలో భరించవే నా సొదను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మీటితే మ్రోగుతుంది నీ హృదయవీణ

రాగాలు పలుకేనది అది సంగీత ప్రవీణ

సవరించితే చాలు తెగిన తీగలన్నీ

వరించేను మధురిమలెన్నో ఎదుటి ఎదలన్నీ


1.ఆటగా భావించారో ఘాటుగా వేటేసారో

మోటుగా వాయించారో చేటుచేయనెంచారో

మూలబడిపోయింది నీ మానసవీణ

మూగవోయి మిన్నకుంది ఈ నవ్వుల నిక్వణ


2.శిథిలమైపోయింది మరమ్మత్తులే లేక 

శకలమై మిగిలింది బాధ్యతెవరు తీసుకోక

దుమ్మునంత దులిపేస్తే నవ్యంగా తోస్తుంది

శ్రుతిచేసి సంఘటిస్తే సవ్యంగా పలికేస్తుంది


PIC.courtesy:  Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముసుగేసుకోకు నీ మనసుకు

విసుగునే పులుమకు అందాలమోముకు

అద్దమైన ఎప్పుడు చూపని సౌందర్యం నీది

అనుభూతి చెంది ఉండని లావణ్యం నీది

పూర్వజన్మ పుణ్యమే నిను పొగిడే అవకాశం

ప్రస్తుతించ ధన్యమే అనుమతించ నా అదృష్టం


1.దబ్బపండు ఛాయలో నీ మేనిరంగు

అబ్బా అని అనిపించేలా అంగాంగ హంగు

మబ్బులను మరిపించేలా నీకురులు రేగు

పబ్బమల్లె నినుగనినంత ఉల్లమే ఉప్పొంగు


2.వెతికితేనె కనబడునంత నంగనాచి నడుము

మతిచెలింప చేసేంత దోబూచి నీ ఉదానము

చితి నుండి బ్రతికించేటి నీ నడకల సోయగము

కృతిని నాతొ పలికించేటి అపురూప రూపము


3.ఎక్కడ మొదలెట్టానో కవితంతా తికమక

ఎలా చెబుదామన్నా ప్రతీది పాత పోలిక

నయనాలు అధరాలు దరహాసము నాసిక 

చతికిల బడిపోయాను ఉపమానమె తోచక

 


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏడడుగులు నడవనీ

మూడుముడులు వేయనీ

మనస్సాక్షిగా అగ్నిసాక్షిగా

తాళిబొట్టుకట్టనీ తలంబ్రాలు పోయనీ

శుభలగ్నాన కళ్యాణ మండపాన

ఎత్తనీ ఏడేడు జన్మలు నీపతిగా

పొందనీ త్రికరణశుద్దిగా నిను ధర్మపత్నిగా


1.పరస్పరం ఇరువురం ఇష్టపడి

జరగనీ తాంబూలల మార్పిడి

ఊరూ వాడంతా మన పెండ్లి సందడి

నూతన అనుబంధాలే ముడివడి

ఎత్తనీ ఏడేడు జన్మలు నీపతిగా

పొందనీ త్రికరణశుద్దిగా నిను ధర్మపత్నిగా


2.ఆహ్వాన పత్రికలే ఎల్లరకూ పంచి

బంధు మిత్రులందరినీ మనవుకు పిలిచి

రంగరంగవైభవంగా విహహమునకేతెంచి

విందునారగించనీ అతిథులు మననాశీర్వదించి

ఎత్తనీ ఏడేడు జన్మలు నీపతిగా

పొందనీ త్రికరణశుద్దిగా నిను ధర్మపత్నిగా


3.కన్యాదానమునే మామనుండి స్వీకరించి

మంగళవాద్యాల మధ్య మంగళాష్టకాలు చదువ

సుముహూర్త సమయాన వేదమంత్రాలనడుమ

 జిలకర బెల్లాన్ని మనం తలలపై దాల్చనీ

నీలేత పాణిగ్రహణమేచేయనీ-నిను పరిణయమాడనీ





Tuesday, June 22, 2021


https://youtu.be/NeYGpZVOJEM?si=yy1PnFY5XZsbGu9O

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: హిందోళం

శుభోదయం ప్రాణ మిత్రులకు
అపారమైన ప్రేమ పాత్రులకు
సారస్వత జ్ఞాన నేత్రులకు
మధుర మధురతర సుమధుర గాత్రులకు

1. సాహిత్యమే వైద్యం రోజువారి వత్తిడికి 
సంగీతమే హృద్యం మనోల్లాసానికి
కవిత్వమే నైవేద్యం పాఠకుల ఆకలికి
అనుభవైకవేద్యం సకలం హృదయానుభూతికి

2.పఠనంతో పదునౌతుంది ప్రతివారి మేధ
సాధనతో సాధ్యమే మనోహర గానసుధ
పరస్పరం స్పందిస్తేనే సేదదీరుతుంది ప్రతి ఎద
స్నేహితమే సృష్టిలోన నేస్తం - అంతులేని సంపద


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మిడిసిపాటెందుకు-మూణ్ణాళ్ళ చిందుకు

మూతిముడుచుడెందుకు-చిరునవ్వు విందుకు

కన్నుమూసి తెరిచేలోగా-పడుతుంది బ్రతుకు తెఱ

వినియోగ పరచాలి-అనుక్షణం ఏమరక


1.వెలివేయ బడతావు-గిరిగీసుకుంటుంటే

కనుమరుగై పోతావు-కలిసిసాగిపోకుంటే

ఆధారం తెగిన పతంగి-ఎగిరేను ఎంతటి దూరం

చుక్కానే లేని  పడవ-చేరలేదు కోరిన తీరం


2.గర్వభంగం చేసేయి-నీ అహంభావానికి

అర్థాన్ని స్పష్టం చేయి- ఆత్మవిశ్వాసానికి

అహర్మణీ వెలుగీయదు-అహం మబ్బు కమ్మేస్తే

పరాజయం తప్పదు- సాధననే సడలిస్తే

 

https://youtu.be/FxP6zt4td0I?si=r0hyQ7D0T5lnMoHa

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:లలిత


కమలాసనురాణి -కఛ్ఛపి వీణాపాణి

శరణంటిని నిను వాణీ-జయతు జపమాలా ధారిణీ


1.ప్రజ్ఞను దయచేయి విజ్ఞత నాకీయి

నీ అనుజ్ఞ మేరకు గీతాల రసజ్ఞత నందీయి

విజ్ఞాన రూపిణి ప్రజ్ఞాన ప్రదాయిని

స్థిత ప్రజ్ఞతనొనగూర్చవే వరదాయిని


2.లౌక్యమునీయవే పరసౌఖ్యము నీయవే

శక్యముకాదు నినువినా సఖ్యత నందీయవే

సారస్వత సామ్రాజ్ఞి నీ ఆజ్ఞ నా కవనం

 గీర్దేవి వేదాగ్రణి  నీకై జిజ్ఞాసే నా జీవనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ వాలు చూపులే వలవేసెనే

నీ వాలు జడే నన్ను బంధించెనే

సవాలు చేయకే గెలవలేను నీ పందెం

భావాలు కవితలుగా మార్చేను నీ అందం


1.వెన్నలాంటి నీ మేను నునుపుదనం

వెన్నెలంటి నీ తనువున తెల్లదనం

వెన్నంటి వస్తుంది నీ ఒంటి పరిమళం

వన్నెలు నీవెన్నగ నా తరమా ప్రియ నేస్తం


2.పదహారు కళలొలుకును నీ పరువం

పదహారు ప్రాయాన నిను కన పరవశం

పదహారణాల నీ తెలుగు ప్రన్నదనం

పదహారు తీరుల కొలుతును నిను అనుదినం


https://youtu.be/jrHV5mvZodA

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జిల్లేడు మాలలివిగొ ఇంద్రియ జితుడా

సిందూర లేపనమిదె అంజనీ సుతుడా

వందనాలనందుకో వాయుపుత్రుడా

సేవలనే గైకొనుమా సుగ్రీవ మిత్రుడా


1.పంచామృతాలతో నిను అభిషేకింతు 

పంచన చేర్చుకో పంచముఖీ హనుమా

దండకముతొ నిన్ను మనసారా నుతింతు

అండదండగా యుండి మమ్ముకావుమా


2.ఏల్నాటి శని దోషము పరిహరించివేతువు

మండలకాలము నిను దండిగ కొలిచినంత

తీరిపోని ఆశలన్ని తప్పక నెరవేర్చెదవు

రామనామ జపమునే నిరతము చేసినంత

Monday, June 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముప్పైయ్యారు ఇరవైనాలుగు ముప్పైయ్యారు

నిలువెత్తు నీరూపం కంటే నా గుండె బేజారు

ఓ చెలీ నీ చూపే నను చంపే వాడి కైజారు

ఇలా నిను చూస్తుండి పోయానంటే రేయితెల్లారు


1.కొండలు కోనలు దిబ్బలు మైదానాలు

నదులు లోయలు జాలువారే జలపాతాలు

నీలినీలి మేఘాలు అణువణువూ పూవనాలు

ప్రకృతి సాంతం నీవైనట్టుగ చెలీ నీ అందచందాలు


2.మీనాలు మైనాలు శుక పిక శారికలు

వయారమొలికే నాట్య మయూరాలు

నడకలతో  హోయలొలికే రాజహంసలు

పుణికిపుచ్చుకున్నావే చెలీ శకుంతాల సోయగాలు

Sunday, June 20, 2021

https://youtu.be/UZ8ozqDV0kk?si=qNx9B6iFPRRm6tfB

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: మధ్యమావతి

శారదా నా కవన వరదా
ఏల నీ హృదయాన పరదా
నీ నామజపమే నాకు సదా
నా ఊసంటేనే నీకు చేదా?
నువు కనికరించే రోజే రాదా

1.అక్షరమౌ నీ అక్షర సుధ
లక్షణమౌ నీ పద సంపద
ఊతమీయవే మాత నా గీతమందున
చేయూతనీయవే నా జీవితమందున

2.శ్రుతి శుభగమవనీ ప్రతి కృతిని
లయ లయమైపోనీ నీ ఆకృతిని
సుస్వరాలు రవళించనీ మనసుకను రాగమై
గమకాలు పరిమళించనీ ఎదకు శుభయోగమై


 

https://youtu.be/nbTqWezBdCk

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శిరము నుండి దూకేను ఒక విషము

గళము  నందు నిలిచేను ఒక విషము

విషయ వాంఛా రహితుడవు శివుడవు

విషమము నీతత్వము మాకు అర్థమే కావు

శంభోమహాదేవ కైవల్య దాయకా

సాంబసదాశివ శరణము నీవే ఇక


1.మునులెందరు నీకై తపమాచరించిరో

రావణాదులెందరు నీ వరములనందిరో

నందివాహన సచ్చిదానంద ధవళ మోహన

అమర వందిత గంగాధరా నమో పంచానన

శంభోమహాదేవ కైవల్య దాయకా

సాంబసదాశివ శరణము నీవే ఇక


2.ఏ స్థాణువైనా  కనగ లింగ రూపమే

ఏ శబ్దమైనా నాకు ఓంకార నాదమే

భోళాశంకరుడవు శశాంకధరుడవు

సుజ్ఞాన వరదుడవు త్రిపురాసుర హరుడవు

శంభోమహాదేవ కైవల్య దాయకా

సాంబసదాశివ శరణము నీవే ఇక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీలాల మేఘాల నీ కేశాలు

వేసాయి నామదికి పాశాలు

గాలికి చెలరేగుతూ ఆసక్తే  రేపుతూ

అలరించినాయి నీకందమిస్తూ

మురిపించినాయి నా ఎద దోస్తూ


1.కదలాడు మీనాలు నీ సోగనయనాలు

తీస్తాయి చూపులతో నా పంచప్రాణాలు

తాళజాలరెవ్వరు  నీ తీక్షణ సుమ బాణాలు

నినుచూస్తూ  బ్రతికితె చాలు నాలుగే క్షణాలు


2.భూమినైన మించిఉంది నీ ఆకర్షణ

ఎదురుగా నీవుంటే అంతర్గత ఘర్షణ

చెప్పలేను మానలేను అంతఃకరణ

నీ కరుణ గనకుంటే అది మరణ యాతన

 

https://youtu.be/CvOpQYZBchw?si=u2-Uu9BYdsJJv2

(పితృదేవుల దినోత్సవ సందర్భంగా మా నాన్న సంస్మృతిలో)


వాడని గులాబీవి నీవు

కమ్మని జిలేబీవి నీవు

సజీవంగ మెదులుతాయి నీ తలపులు

 వెన్నంటే ఉన్నాయి  నీ మందలింపులు

నాన్నా నువ్వెప్పుడు చిరంజీవుడవే

నాన్నా మాగుండె గుడిలొ నువు దేవుడవే


1.నడవడి నది కట్టడికి ఆనకట్ట నీవు

మా ఉన్నతి అక్కెరలకు తేనెతుట్టెవు

కష్టాలలో సైతం నవ్వే గుట్టునెరుకపర్చావు

ఉన్నంతలొ జీవించే పట్టు తెలియజేసావు

నాన్నా నువ్వెప్పుడు చిరంజీవుడవే

నాన్నా మాగుండె గుడిలొ నువు దేవుడవే


2.అంజయ్యసారు కొడుకన గర్వమే

నీతోటి గడిపిన ప్రతిరోజూ పర్వమే

ఆహారం ఆహార్యం నీవన్నీ రుచికరమే

నీకడుపున పుట్టడం మాకపూర్వ వరమే

నాన్నా నువ్వెప్పుడు చిరంజీవుడవే

నాన్నా మాగుండె గుడిలొ నువు దేవుడవే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూడనీ నను చూడనీ నిను చూడనీ కడతేరనీ

పాడనీ నీ మిసిమి పొగడనీ,నను తరించనీ

మాటాడనీ నను మది తెలుపనీ స్నేహించనీ

తోడవనీ ననునీ నీడవనీ నిను విడువక జీవించనీ


1.చందమామలా నీ మోముని

మిలమిల నక్షత్రాలు నీ నేత్రాలని

కోటేరు సూటి నీ ముక్కెర ముక్కని

పెదాలు పిండుకొనే తేనె తెట్టెలని

ఊహించుకొన్నాను కలలెన్నొ కన్నాను

ఊహ వాస్తవంగా చేయనెంచవే

కలలు నిజం చేయగా కనిపించవే


2.చూపు మరలనీయని నీరూపుని

మధురతరమైన నీ మాట తీరుని

మనోహరమైన నీ చిరునవ్వుని

మెరుపుతీగ వంటి నీ హొయలుని

చిత్రించుకొన్నాను ఆత్రంగ ఉన్నాను

సజీవంగ మారనీ నామనో చిత్రమే

వరమై వరించనీ నా మదిలోని ఆత్రమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


నీ ముక్కుపోగు నన్ను ముగ్గులోకి లాగు

నీ కలువ కళ్ళు నన్ను కదలనీవెలాగు

నీకొంటె నవ్వు నన్ను వెంబడించి సాగు

ఇక నీ ఆరాధన అనుక్షణం కొనసాగు

ఈ కవి తలలో నీవే నా కవితలలో నీవే

నా జతగా చేరిపోవె నా జీవితమీవె కావె


1.మధువలవాటు లేదు మత్తులో ముంచావే

ఒరులను నేనెరుగను కొంగున ముడివేసావే

రేయిలేదు పగలు లేదు ఎప్పుడూ నీధ్యాసే

కవితా నా కవిత యంటు సదా నీ ధ్యానమే

ఈ కవి తలలో నీవే నా కవితలలో నీవే

నా జతగా చేరిపోవె నా జీవితమీవె కావె


2.గులాబీల రెక్కలే నీ లేలేత పెదాలు

తమలపాకు తీరేలే చిగురంటి పాదాలు

ఎక్కడ ముద్దిడినా మధురాతి మధురాలు

హద్దులు  దాటించగలుగు నీ మేని సోయగాలు

ఈ కవి తలలో నీవే నా కవితలలో నీవే

నా జతగా చేరిపోవే నా జీవిత మీవె కావె

Friday, June 18, 2021

 రెచ్చగొట్టగలుగుతుంది పుట్టుమచ్చ సైతం

పిచ్చి పిచ్చి ప్రేమలకు పచ్చబొట్టె ఊతం

వలవేసిపడుతుంది క్రీగంటి ఆలోకితం

వలపుల ముడివేస్తుంది అధరస్మితం


1.కొండలకెగ బ్రాకుతుంది కొంటెచూపు జలపాతం

మంటలనెగదోస్తుంది నడుం ముడత నవనీతం

స్వేదమునే రేపుతుంది నూగారు హిమపాతం

వడగళ్ళలొ మునుగుతుంది ఎద ఎడారి ప్రాంతం


2.అహ్వానం పలుకుతుంది పంటినొక్కు శుకము

ఆదరించ పూనుతుంది  చుంబన కపోతము

అక్కున జేర్చుతుంది ప్రియ లాలన శకుంతము

ఆలపించి మురిపించును అనుభూతి పికము




https://youtu.be/TToQMJitRkQ?si=HFLFPvGIqKKF0T78

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అశనిపాతమై విషాద గీతమై

ఆనందపు ఛాయేలేని జీవితమై

అడుగడుగూ అపార దుఃఖభరితమై

ఇదేనా నీ ప్రసాదము ఇంతేనా జన్మాంతము

శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా

పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా


1.జగత్పితవు నీవంటారే నేనే అనాథనా

జగన్నాథ నీవంటూ ఉంటే జనులకింత వ్యథనా

తప్పుచేస్తె దండించాలి స్వప్నాలు పండించాలి

దారితప్పు వేళల్లో చేయపట్టి నడిపించాలి

శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా

పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా


2.మా ప్రమేయమెంత ఉంది  మా మనుగడలో

మా ప్రతాపమేముంది మా గెలుపులలో

గడిచినంత గడిచింది కాలమంత కష్టాల్లో

ఇకనైనా మననీయి నీ చల్లని కనుసన్నలలో

శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా

పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక కవిత నాలో మెదిలింది

కలంతో జత కలిపింది

ఎదలోతు భావాలనే  వెలికి తీసింది

ఒద్దకగా అల్లుకుంటూ అందంగా వెలిసింది


1.అచ్చరువునొందేలా అచ్చరాలు కూర్చింది

ఇంద్రజాలమేదోచేసి పదాలుగా మార్చింది

మనసుల నలరించేలా పరిమళాల నద్దింది

గేయమై రూపుదాల్చి హృదయాలు గెలిచింది


2.అలతి అలతి నడకలతో అడుగులేసింది

చిరునవ్వు చెదరకుండా నుడుగులే పలికింది

ఆహ్లాదం రంగరించి అనుభూతులిచ్చింది

మరవలేని జ్ఞాపకమై మదిలోన దాగుంది

Thursday, June 17, 2021

 https://youtu.be/T8qIwWVhMWs


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టుపీతాంబరాలు కట్టబెట్టినాము

పట్టుబట్టి ఆభరణాలు నీకు పెట్టినాము

పట్టెనామాలతో కోరమీసాలతో

దిట్టంగా ఉన్నావు దివ్యంగా కొలువున్నావు

ధర్మపురీ నరసింహా దయగనగ జాగేలా

దితిసుతు సుతు కాచిన సంగతి  మరచితివేల


1.శంఖ చక్రాలునీకు అలంకార ప్రాయాలా

కౌముది నందకము చేరాయా ఓ మూల

భీకర కోఱల వాడి వాడ ఉడిగి పోయిందా

చీల్చిన నఖముల పదును మొండివారి పోయిందా

జరుపవేల దుష్ట శిక్షణ చేవ కాస్త తగ్గిందా

చేయవేల శిష్టరక్షణ దయ అడుగంటిందా


2.నెరనమ్మితి నిన్ను స్వామి త్రికరణ శుధ్ధిగా

కొనియాడితి సర్వదా నీ కృపయే పరలబ్ధిగా

సనకాది ఋషులకేనా నీ దివ్య దర్శనం

ప్రహ్లాద బాలునికేనా నీ కరుణా కటాక్షం

పక్షపాతివైతివా శ్రీపతి నా గతిగానక

పక్షివాహన నీవే శరణాగతి ప్రభోనాకిక

Wednesday, June 16, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలుసైపోతున్నా నీ వెంటబడి

బోల్తా పడుతున్నా అడుగులు తడబడి

నాకు నేనే మిగులకున్నా నీకు లోబడి

బ్రతుకే కోల్పోతున్నా మనది ప్రేమగా పొరబడి


1.దూరం అంతేగా ఇరువురి ఇళ్ళ నడుమ

అవసరమొకటేగా పరస్పరం తీర్చుకోగ

అందం నీకుందంటే ఒకరుండాలి నాలా పొగడ

బంధం కోరుకుంటే కావాలెవరో సరిపడ


2.బయట  పెట్టదే పడతి తన ఎడద

చుట్టూ తిప్పుకోవడమే స్త్రీకి సరదా

మర్మమే గ్రహించకనీ మాయలోన పడినాను

నాకు గాక నీకూ గాక రెండిటికీ చెడినాను

 

https://youtu.be/bvJdnQmgkuE?si=_RkrgNH1f2qms22m


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:కీరవాణి

సాక్షాత్కరించవయ్య సద్గురుదత్తా

సాష్టాంగవందనమిదె జగద్గురు దత్తా

ప్రత్యక్షమిక కావయ్య అత్రివరపుత్రా

ప్రత్యక్షరమూ నీవయ్య అనసూయ  ప్రియసుతా


1.త్రైమూర్త్యవతారా త్రిజగన్మోహనా

త్రిగుణాతీత నమో త్రైలోక్య పూజితా

త్రిభువన రక్షక పాహిమాం మోక్షదాయకా

త్రికరణశుద్ధిగ వేడెద శరణాగత పాలకా


2.దండకమండలధర అవధూతా

శంఖచక్ర కర భూషా భక్త జనపోషా

త్రిశూల ఢమరుక హస్తా సచ్చిదానంద

శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి నమః


3.దిగంబరా దిగంబరా గురుదేవ దత్తా దిగంబరా

దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభా దిగంబరా

దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతి దిగంబరా

దిగంబరా దిగంబరా దిగంబరా జయ దిగంబరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనసంతా కలకల

నా నయనాల వలవల

ఓ నా శశికళ.. ఏకైక నా కల 

నీవేలే ఇల మోహన బాల

నువు కాదంటే నాకీ బ్రతుకేల

నువు వద్దంటే ఇకపై చితిజ్వాల


1.నోరూరేలా నీ పెదవుల అరుణిమ

సుధలే గ్రోలగ రసనే మధురిమ

నీవే పదహారు ప్రాయపు లేలేత లేమ

నినుముట్టుకున్నా తరిస్తుంది నా జన్మ

నువు కాదంటే నాకీ బ్రతుకేల

నువు వద్దంటే ఇకపై చితిజ్వాల


2.నుదుటిన జీరాడే ముంగురులు

చెంపలు ముద్దాడే చెవి వంకీలు

ఆటంక పరిచేను నా అన్ని చర్యలు

ఎలా నీకు చేయాలి ప్రియా నా సపర్యలు

నువు కాదంటే నాకీ బ్రతుకేల

నువు వద్దంటే ఇకపై చితిజ్వాల

Tuesday, June 15, 2021


https://youtu.be/rZCbN-qVC1w

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వీణాపుస్తక హస్త భూషిణి

నా ప్రాణప్రద దైవరూపిణి

మధుతర ప్రియకర మంజుల భాషిణి

కవిగాయక వైజ్ఞానిక సుజన పోషిణి

వాణీ విరించి రాణీ ప్రణతులివే పారాయణి


1.సతతము హితమగు సుద్దుల వెలయని

నిరతము నీదగు బుద్దినాలో చెలఁగని

అనవరతము  వ్రతముగ నీ గతి సాగనీ

నిరవధికము నీ పదముల మతి దాల్చనీ

అహరహము నీధ్యాసలోనే మునగనీ

కలకాలము నీ నీడలో కడతేరనీ


2.కామమె కవితగ  పరిణమించనీ

క్రోధము నీ శోధనయై ననుపొందనీ

మితమగు పదముల భావము పొసగనీ

ప్రియమగు నుడుగుల గీతము సాగనీ

కరతలామలకముగ వర్ణములొదగనీ

స్పర్దతో సత్కవులచెంత నను చేరనీ


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవితలే అల్లగలను నీ ప్రాపు కోసం

కావ్యాలే రాయగలను నీ మెప్పుకోసం

పడిగాపులు కాయగలను నువ్వు పలకరించేందుకు

ప్రాణాలే ఇవ్వగలను నీ నవ్వు నాదయ్యేందుకు


1.ఊడిగం చేయగలను నీవాడినయ్యేందుకు

ఏడుజన్మలెత్తగలను నీతోడై సాగేందుకు

తపమునాచరించగలను నువు వరములిచ్చేందుకు

గుండె గుడిగా మార్చగలను నిను దేవిగ నిలిపేందుకు


2.లోకమునే వెలివేస్తా నీకు చేరువయ్యేందుకు

యాతననే భరిస్తా నిన్ను చేరగలిగేందుకు

హద్దులన్ని దాటేస్తాను నీ చేయినందడానికి

సద్దుకొని జీవిస్తాను సదా నిన్ను పొందడానికి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కత్తులెందుకు,కటారులెందుకు

చిత్తుగా నను ఓడించేందుకు

తూపులెందుకు,తూటాలెందుకు

నీచూపులె చాలు బంధించేందుకు

అస్త్రమెందుకు ఆయుధమెందుకు

చంపడానికి నా కొంప ముంచడానికి

వ్యూహమెందుకు యుద్ధమెందుకు

నీ అందమేచాలు బతుకు చితికిపోవడానికి


1.కసినెంతో రేపే బింకం

మతినే మసిచేసే పొంకం

ఎంతకైనా తెగింపునిస్తూ

పెంపొందించు మొండిధైర్యం

రాజ్యాలు ధారపోయ గలిగే

నీ రమ్య సౌందర్యం

రక్తాలు పారించైనా పొందగోరే

నీ దివ్య సోయగం


2.పిచ్చివారు కాక తప్పదు

ఒక్కసారి నిను చూస్తే

వెర్రికాస్త ఎక్కక మానదు

నువ్వు నవ్వు రువ్వితే

నిలువునా బలికాగలిగే

అపురూప నీ మురిపెం

చావుకైన ఎదురొడ్డే

అతి సుందర నీ రూపం

Sunday, June 13, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎందుకింత ఆసక్తి

ఎందుకింత అనురక్తి

ఎంతగొప్పదో కదా మన దోస్తీ

ఎప్పుడైనా మదిలో నీదే ప్రసక్తి


1.ఎస్సెమ్మెస్ ఏది వచ్చినా నీదిగా

పోనంటూ మ్రోగితే నీదన్నట్టుగా

ఎక్కడలేని ఉత్సాహం కమ్మేనుగా

ఎద గాల్లో హాయిగా తేల్తున్నట్టుగా


2.ఫేస్ బుక్ డిపి చూసినా

వాట్సప్ స్టేటస్ చదివినా

అటూ ఇటూ తిరిగేది నీకోసమే

ఆన్ లైన్ లో ఉన్నావంటే అదృష్టమే

 

https://youtu.be/9VG1MnwZVck?si=pG6aEoNCgUdeZOLZ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:రేవతి


డమరుకం నినదించు

త్రిశూలం సంధించు

శంభో మహాదేవా

వినతులే అవధరించు

ధరలోన అవతరించు

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.నైరాశ్యం తుదముట్టించు

దాష్టీకం బలికావించు

నమో భూతనాథా

మానవాళిని సంరక్షించు

మా నివాళిని స్వీకరించు

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.గౌరి మాకు కన్న తల్లి 

హరా నీవు కన్నతండ్రి

నమో సాంబసదాశివా

అనాథలుగ మార్చకు

అశాంతి చేకూర్చకు

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

Friday, June 11, 2021

 


ఆశని కలిగిస్తావు బంగారు భవిత ఎడల

ఆ శనినే తగిలిస్తావు బ్రతుకున మేము కుముల

ఆషామాషా స్వామీ మా మానవులంటే

దోషాలన్నీ నీవే -ఖుషీగ మేము లేమంటే

కలికల్మషనాశా శ్రీశా తిరుమల వేంకటేశా

నిజభక్తజన పోషా సర్వేశా సుందరవేషా


1.నమ్మిక వమ్ము చేస్తావు నీవున్నావని నమ్మితే 

నట్టేట్లో ముంచేస్తావు మము దాటిస్తావని ఎంచితే

దగా చేయడమే  సరదాగా ఆటలాడెదవేల

వేధించడమే వేడుకగా  వినోదింతువేల

కలికల్మషనాశా శ్రీశా తిరుమల వేంకటేశా

నిజభక్తజన పోషా సర్వేశా సుందరవేషా


2.విసుగే చెందినాను వారం వారం నిను పొగిడి

ఇడుములు పొందినాను అడుగడుగు నీ నుడి నుడిగి

తస్కరించినావా స్వామీ మా సంతసాలను

తిరస్కరించినావా ప్రభో మా విన్నపాలను

కలికల్మషనాశా శ్రీశా తిరుమల వేంకటేశా

నిజభక్తజన పోషా సర్వేశా సుందరవేషా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిందించలేనూ ఎవ్వరినీ

ఆనందించలేను ఈ ఉరిని

ఆఖరి కోరికైనా ఈడేరని నా దుస్థితిని

విధివంచితిడినై ఈడుస్తున్నా ఈ జన్మని

                                    ఈ దురదృష్ట జన్మని


1.అన్నీ ఉన్నాయి నా బ్రతుకు విస్తట్లో

ప్రతి బుక్క మట్టిగా చేరుతోంది నా నోట్లో

సైంధవులెందరో శల్యులు ఎందరో

శిఖండి శకునిల ప్రతినిధులెందరో 

మూకుమ్మడిగా నాకు వ్యతిరేకులై

పక్కలో గుచ్చుకునే వాడిబాకులై


2.విఫలమైన ప్రతిసారి నాకుగా నొచ్చుకుంటూ

ఉన్నదానితోనే ఎపుడూ సరిపుచ్చుకుంటూ

నాగజెముడు ముళ్ళమధ్య పువ్వునై నవ్వుతున్నా

మొదలంటా నరికిన గాని చివ్వున చివురేస్తూ ఉన్నా

చరమాంకమే కదా ఓరిమి నా కూరిమి

ఏకాంతమంటే  సదా నాకెంతో  పేరిమి

Wednesday, June 9, 2021

 దిన దినమూ ఇనుమడించె నీమేని మిసమిస

అణువణువూ పెట్టసాగె గోముగా  గుసగుస

తట్టుకోలేనీ  పడుచు వయసు నసనస

చూడకలా రుసరుస వదిలి వెళ్ళకే విసవిసా


1.పారాడే మేఘాలో తారాడే భ్రమరాలో నీకురుల దెస

వెన్నెల గనులో ఇంద్రనీమణులో కనుగవల పస

ఊరించే బూరెలో గులాబీ నిగ్గులో నీ సిగ్గుల వరస

దానిమ్మగింజలో ముత్యాల దండలో నీ పలువరుస


2. కనుదోయి నే దోచేసే పెను చనుదోయి

మదిహాయిని పెంచేసే నీ నడుమే సన్నాయి

దోసగింజ స్ఫురించే నాభిగాంచ మతిపోయి

కాసేపైన చాలు బ్రతుకు నీకడ బానిసయి



జయజయజయ జయజయజయ సాయీ అవధూత

మా ప్రియ దైవమా బాబా మా  హృదయ సంస్థిత

సాష్టాంగ ప్రణామాలు సద్గురునాథా

కష్టాల నష్టాల కడతేర్చు సచ్చిదానందా


1.ఇక్కట్లు మాకుంటె చిక్కులే బ్రతుకంటే

ఎక్కడికని వెళ్ళము ఎవ్వరినని వేడము

దిక్కువు దెసవు మాకెప్పుడు నీవేనని

మొక్కితిమయ్య సాయి చేయందీయమని


2. కోటికి పడగలెత్తజేయమని అడగము

అత్యున్నత పదవులేవి మేమాశించము

చెదరని ఆరోగ్యమే మాకందజేయి చాలు

చెరగని ఆనందమిస్తె అదే నీవు చేయు మేలు

Tuesday, June 8, 2021

https://youtu.be/J3fRL8cwRtk


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


హనుమయే భవిష్యత్తు బ్రహ్మ

హనుమయే శివ తేజపు పరమాత్మ

హనుమయే వైష్ణవాత్మిక కర్మ

హనుమయే త్రిమూర్తిరూప పరబ్రహ్మ

నమోఆంజనేయం నమో ముక్తిదాయం


1.సూర్యుడినే మ్రింగిన ఘనుడే హనుమ

దినకరునుకి ప్రియ శిశ్యుడాయెను హనుమ

రామసుగ్రీవుల మైత్రి కారకుడే హనుమ

సీతమ్మ జాడ తెలిపె సుందర హనుమ

నమోఆంజనేయం నమో ముక్తిదాయం


2.అంబుధినే లంఘించిన యోధుడు హనుమ

లంకనంత  కాల్చేసిన వీరుడు  హనుమ

సంజీవిని గొని తెచ్చిన శూరుడు హనుమ

సౌమిత్రిని బ్రతికించిన ధీరుడు హనుమ

నమోఆంజనేయం నమో ముక్తిదాయం


3.సిందూర ధారణాసక్తుడు హనుమ

రామనామగానాను రక్తుడు హనుమ

 సేవా పరాయణుడు రామభక్త హనుమ

చిరంజీవి జితేంద్రియుడు జీవన్ముక్తుడు హనుమ

నమోఆంజనేయం నమో ముక్తిదాయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నలగని పూదండలు

తడిసిన తలదిండులు

కలలుగన్న నవ వధువుకు అడియాసలు

తొలినాళ్ళలోనే ఎదురైన మృగతృష్ణలు


1.అవగాహనలోపము

అరాటమె సాంతము

పొదగక ముందుగనే పగులగొట్టు చందము

విచ్చని పసి మొగ్గనే పూయించిన వైనము


2.మనసెరిగుటె ముఖ్యము

మచ్చిక చేకొంటె సౌఖ్యము

మంద్రస్వరమధికతమం కొసతారాస్థాయే ఉత్తమం

గతులు గమకాలతో అనురాగ రాగమౌను రసగీతం

Monday, June 7, 2021

 

https://youtu.be/QF3Nl0475sg?si=Zgt5XJDefEDSHMki

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మోహన


ఉరకలేసె నా  మనసు ఉధృతిని బంధించు గంగాధరా

వంకయున్న నామతినింక సిగన దాల్చు శశిశేఖరా

చెలరేగె నామరులనే దహియించరా మదనాంతకా హరా

నా విషయోచనలన్నీ నీగళమందుంచరా నీలకంధరా

ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమఃశివాయ


1.అర్ధాంగికి తగు విలువనిచ్చే బుద్దినీయి అర్ధనారీశ్వరా

పొంగని కృంగని తత్వము నొసగు జంగమదేవ భోళాశంకరా

భోగములోను యోగిగ నిలిచే శీలమునీయర రాజేశ్వరా

రాగద్వేషము కతీతమైన నడతనీయి రామలింగేశ్వరా

ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమఃశివాయ


2.నీవిచ్చిన ఈ బ్రతుకునకు సార్థకమీయర కాళేశ్వర ముక్తీశ్వరా

తప్పటడుగులే పడనీకుండ తప్పించరా నమోనమో నాగేశ్వరా

పదుగురికోసం పరితపించే హృదయమీయరా విశ్వేశ్వరా

అంతిమ ఘడియల నా చెంతనుండరా స్వామీ మార్కండేశ్వరా

ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రతి దినమూ  ప్రత్యేకమే

కదిలించే ఎద ఎదుటేఉంటే

అనునిత్యం పరమానందమే

అనుభూతి చెందే మనసుంటే

నిన్నకు నేటికి రేపటికెంతో వ్యత్యాసం

అనుక్షణం అనుభవించుటకె మనకోసం


1.మండే ఎండలు ఒకనాడు

ముంచే వానలు మరునాడు

హాయగు వెన్నెల ఒక మాసం

మనసలరించగ శీతాకాలం

ఆటుపోటులు జీవితాన అతిసామాన్యం

ఒడిదుడుకులలో స్థిరమగు మనసే ధన్యం


2.నవ్వేవేళలొ  బాధల మననాలు

దుఃఖపు ఘడియల ఏవో బింకాలు

నిన్నటి చింతలలో క్షణం  జారిపోతుంది

రేపటి చింతనలో నేడు మారిపోతుంది

నవ్యంగా సాగించాలి  నిరంతరం మనయానం

సవ్యంగా యోచిస్తే మానవజన్మే బహుమానం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇప్పటికిప్పుడే నే కలువనైతి

రెక్కలులేకనే నిను కలువనైతి

లేలేత నీపాదాల ముద్దాడనైతి

ముద్దులొలుకు పెదాలను అద్దనైతి

ఊరించకే నన్ను ఉత్పల మాల

నను చంపకే ఇంకా చంపకమాల


1.మనసులోని ఊసులన్ని తెలుపనైతి

చేతిలోన చెయ్యివేసి నడువనైతి

నా హృదయం బహుమతిగా అందించనైతి

నా కలల శ్రీమతిగా చేసుకొనగనైతి

ఊరించకే నన్ను ఉత్పల మాల

నను చంపకే ఇంకా చంపకమాల


2.బిగియారా కౌగిలిలో బంధించనైతి

తమకాల నీ జడిలోనా నే తడువనైతి

యుగాలనే క్షణాలుగా కరిగించనైతి

దేహాలను రసఝరిలోనా ముంచనైతి

ఊరించకే నన్ను ఉత్పల మాల

నను చంపకే ఇంకా చంపకమాల

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మదిగీతం వినిపిస్తుంది నీ ఎదతో ఆలకిస్తే

నా ఆత్రం కనిపిస్తుంది నీ మనసుతొ అవలోకిస్తే

భావాలు తెలుపుటకెపుడూ భాషనే కురచాయే

హృదయాన్ని పరచాలంటే లోకమే ఇరుకాయే


1.కన్నులతో చేసిన సైగలు విఫలమాయేనే

వెన్నెలతో పంపిన కబురులు నిన్ను చేరవాయే

పిల్లగాలిసైతం ఉల్లము నెరిగించదాయే

మేఘాలతొ నా సందేశం నీకందదాయే


2.చిటికెవేసి చూపినగాని గుర్తించవాయే

పావురంతొ పంపిన పత్రం ప్రాప్తిలేకపాయే

హంస రాయబారమూ చేయగా భారమాయే

హింస దూరమౌతుందంటే బదులే లేదాయే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముగ్ధ మోహనము నీ మోము స్నిగ్ధ కోమలము

చకిత శోభనము నీ దేహము గణిత నిర్మితము

లలనా లలామ నీవె అద్భుతము పదునాల్గు భువనాల సైతం

మనుషులనిమేషులయ్యే కృత్యం నిను చూడ నిష్ఠూర సత్యం


1.పంచవింశతియె మిగిలె రోదసీలోనా నక్షత్రాలు

రుచిగ మెరిసేనా శేషయుగ్మము నీ నేత్రాలు

ముక్కెరలు నోచేటి బహుచక్కనీ నీ నాసిక

రాసమున మేల్కొనే నొక్కుల చెక్కిళ్ళకేదీ పోలిక


2.శీతమధుచోష్యమనగ చప్పరింతకు రేపు అధరాలు

హిమవన్నగాలనగను ఒప్పించదగెడి పయోధరాలు

పిడికిటికి సగమున్న కేసరికన్నను నడుము సింగారాలు

ఘననగములకు సమములౌ  జఘన నయగారాలు

Saturday, June 5, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కదులుతున్న ఖజురహో సాలభంజికనో

హంపిలోని  వంపులున్న లలన శిల్పమో

రామప్ప గొప్పగ చెక్కిన నాగిని పంచాణమో

చతురతన తీర్చిదిద్దిన చతురానను సర్గమో

చూపు శిలగమారే మనసు ఉలిగ తొలిచే

కన్ను స్థాణువాయే ఊహ చెలిగ తలిచే


1.రవివర్మ అంచనాను చిత్రంగ మించిపోయే

బాపుబొమ్మ  సైతం ఎంచగా  తూగదాయే

వడ్డాది కుంచె కూడ దించినది సరిపోదాయే

ఎంతగా గాలించినా నీవంటి చిత్తరువే లేదాయే

చూపు చిత్ర వస్త్రమాయే మది కుంచెగ మారిపోయే

కన్ను వర్ణాలు కలిపే ఊహ హృదయాన నిలిపె


2.కాళిదాసు  శకుంతలే నిన్నుగని చింతించే

అల్లసాని వరూధినీ నిన్ను గాంచి ఈర్ష్యనొందె

రామరాజభూషణుని దమయంతి తలవంచే

బాణుని కాదంబరి నీ అందానికి కలతచెందె

చూపు కైపులోన మునిగె డెందమే కలమై చెలఁగే

కన్ను వెన్ను దన్నైనిలిచే ఊహ నిన్ను కవితగ మలిచే

https://youtu.be/NZY_gL5Oquc


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తొలి ప్రేమలొ దక్కని నా ప్రేయసి

మరలిరాదు మరి మరపురాదు

నా చెలి చేసిన తీవ్ర ఎద గాయమే

మానిపోదు మచ్చ మాసిపోదు

ప్రకృతిలోన ఏదైనా ప్రేయసి రూపంగా

నా గుండె కెలికి తీరిపోని శాపంగా


1.పున్నమి జాబిలి చెలి మోములా

చల్లని వెన్నెల నా సఖి కన్నుల్లా

విరిసిన మల్లెలన్ని తనవైన నవ్వుల్లా

విచ్చిన గులాబీలు  సిగ్గుల బుగ్గల్లా

ప్రకృతిలోన ఏదైనా ప్రేయసి రూపంగా

నా గుండె కెలికి తీరిపోని శాపంగా


OK

2.కారు మబ్బులే  శిరోజాలుగా

నింగి తారలే సిగలో జాజుల్లా

గోదావరి గలగలలే ప్రేయసి ఊసులుగా

గాలిలోని గంధాలే చెలి చేసిన బాసలుగా

ప్రకృతిలోన ఏదైనా ప్రేయసి రూపంగా

నా గుండె కెలికి తీరిపోని శాపంగా


OK

Friday, June 4, 2021

https://youtu.be/nAXhWCDbcd4?si=KPOCi1ZOY_Jq_d89

ఏడుకొండలవాడ వెంకటరమణా గోవిందా గోవిందా

ఆపదమొక్కులవాడ అనాధనాథ గోవిందా గోవిందా

వడ్డీకాసులవాడ శ్రీ శ్రీనివాసా గోవిందా గోవిందా

గడ్డుకాలాలన్ని గట్టెక్కించువాడ గోవిందా గోవిందా

దండాలు నీకు గుండెలోనివాడ గోవిందా గోవిందా

దండిగవేసేము మనసుతులసి దండ గోవిందా గోవిందా


1. చేజోతలే నీకు ముపుడులు మొక్కులు

నా కైతలే నీకు నజరానాలు కాన్కలు

చిత్తాన నువ్వుంటె చిత్తుచిత్తైపోవ చిక్కులు

తండ్రి నువ్వేకద సాధించితీరేము మా హక్కులు

దండాలు నీకు గుండెలోనివాడ గోవిందా గోవిందా

దండిగవేసేము మనసుతులసి దండ గోవిందా గోవిందా


2.గారెడోనివి నీవు చేస్తావు కనికట్టు

మాయలోనివి నీవు దొరకనీయవు గుట్టు

వదలిపెట్టము స్వామినీ పాదాలె మా పట్టు

నమ్మియుంటిమి స్వామి మమ్మింక చేపట్టు

దండాలు నీకు గుండెలోనివాడ గోవిందా గోవిందా

దండిగవేసేము మనసుతులసి దండ గోవిందా గోవిందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బదులే లేదు నా మాటకి

ఖాతరులేదు నా చూపుకి

నా దృష్టి మొత్తం నీ మీదే

కవన సృష్టి అంతా నీసోదే

ఎందుకు నాపై నీ అలక

చెప్పవే నా రాచిలక


1.వచ్చి వాలావే నా భుజంపైన

గిచ్చి గిల్లావే నీవైపు మరలేలా

సయ్యాటలే నీకు అలవాటా

బరిలోకి లాగడమే ప్రతిపూట

ఎందుకు నాపై నీ అలక

చెప్పవే నా రాచిలక


2.మౌనాన్ని ఛేదించి మాట కలిపావు

పరిచయాన్ని బంధంగా తలపోసావు

నీ చర్యలన్నిటితో నను భ్రమింపజేసావు

నమ్మించి అంతలోనే కన్నుచాటేవు

నన్ను దాటవేసావు

ఎందుకు నాపై నీ అలక

చెప్పవే నా రాచిలక


https://youtu.be/l_kktxYWgOE

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొండగట్టు అంజన్నా నీకు కోటిదండాలు

నిన్ను చూసి చూడంగానే తొలగును గండాలు

ఏర్చికూర్చి తెచ్చాము జిల్లేడు పూదండలు

కోరినిన్ను కొలిచేము నీ అండదండలు


1.నీ మాలవేసుకొని నిష్ఠగమేమున్నాము

నీమాల తప్పకుండా దీక్షపూర్తిచేసాము

అవయవాలన్నిటిని కట్టడి చేసాము

అంజన్నా రామజపము ఆపక మేఁ చేసాము


2.సుందరకాండను పారాయణ చేసాము

హనుమాన్నీ చాలీసా పఠనం చేసాము

నీనామ గానాలే రోజూ భజియించాము

తప్పొప్పులెంచకుమని మనసారా మొక్కాము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అమావాస్య నేడైనా వెన్నల కురిసింది నీ నవ్వుల వల్లె

మండువేసవే ఐనా చల్లగాలి వీచింది నీ సన్నిధి వల్లే

సీతకన్నువేసితివే ప్రియమైన చెలియా నాపై

ఎందుకలా మరచితివే ననుచూసి చూడని చూపై


1.తొలి సంధ్యనీవై నాలో పొడచూపావే

మలిసంధ్య పొద్దై మరులెన్నొ రేపావే

తెల్లారేలోగానే బంధమే తెల్లారిపోయే

బెట్టుగట్టుదిగకపోతివే తపనే చల్లారిపోయే


2.ఊహల సౌధాలనే నిర్మించుకున్నామే

ఊసులెన్నొ చెప్పుకుంటూ చర్చించుకున్నామే

పైచేయి నీదవడానికి పంతానికి పోయావే

కాళ్ళబేరమాడినగాని ననుకాదుపొమ్మన్నావే

Thursday, June 3, 2021

https://youtu.be/mw3fRQ_C_rU?si=s_M84vUURHnn8tEl

బృందావన రాధికవే

నా జీవన గీతికవే

సరసరాగ మొలికే నాప్రణయ వీణియవే

అనురాగమే చిలికే  హృదయ వేణువువే


1.యుగమే మారినా మారదు నీ తీరు

జగమే కాదన్నా ఆగదు సంగమ తేరు

ఎదలో బంధించావు ఖైదీగా నన్నుంచావు

యవ్వనమర్పించావు నాకే అంకితమైనావు


2.యమునకెంత ఆతురతో మనరాసకేళిపై

పొన్నచెట్టు పొదలో గుట్టు ఓ వింతకోరికై

మురళికెంత అసూయనో నీ పెదాల దిష్టముపై

వైజయంతిమాలకు అలకే నలగాల్సిన దుస్థితిపై

Wednesday, June 2, 2021

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


చచ్చాక నరకమన్నదేమో గాని

చావలేక బ్రతుకూ నరకమే నని

పాడెకైన నోచని దీనమైన చావుని

పగవాడికైనా కూడదని రాకూడదని


1.మనిషంటూ భూమిపై ఏర్పడినాక

నాగరీకుడై జ్ఞానం పెంచుకున్నదాక

విస్తుబోయే ఈ స్థితి కనీవినీ ఎరుగక

అంతిమయాత్రనైన కించితాశించక


2.మనిషిని మనిషే పీక్కుతినే వైనం

గోచైనా మిగల్చచలేని వికృత ధనదాహం

ఆసుపత్రిలోనైనా అంబులెన్సుకొఱకైనా

జలగలూ రాబందుల్లా పీడన కడుహేయం


3.కరోనాయె నయం నరునిదెంతో క్రౌర్యం

దొరికినంత దోచుకునే దళారీల దమనం

శవాలపై పేలాలను భక్షించే రాక్షసకృత్యం

కలమే రాయలేని నీచమైన పదబంధం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రానే వస్తుంది ఆ క్షణం

పోనేపోతుంది ఈ ప్రాణం

కలిగిఉండు ఇకనైనా మానవీయ లక్షణం

రేపూ మాపని కంతులేయక అనుకున్నది చేసివేయి తక్షణం


1.మిత్తిముంచుకొస్తున్నా మానవింక ఊహలు

నెత్తినోరు మొత్తుకున్నా ఆపవింక జిత్తులు

ఎంచగ నీవెన్నున్నాయి గతమందు మంచి పనులు

ఒక్కఅశ్రుబిందువైనా రాల్చగలర బంధుజనులు


2.మించిపోనీయకు ప్రేమపంచు సమయాన్ని

మరుగున పడనీయకు దానమిచ్చు సద్గుణాన్ని

బాధ్యతలు నెరవేర్చి సడలించు బంధనాన్ని

ఆధ్యాత్మిక చింతనతో ఉపాసించు ఆ దైవాన్ని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సుప్రభాత శుభవేళ నీదే తలపు

దర్పణాన నే చూడగ నీదే రూపు

నీ స్మరణయే నాకు పొద్దూ మాపు

నీ ఊహలే మదినూయలలూపు


1.తేనీరు సేవిస్తూ నీ భావనయే

జల్లుతానమందునా నీ స్ఫురణయే

తిన్నావో తినలేదో అన్నది  ఆరాటమే

కుశలమే తెలియకున్న కలవరమే


2. ఏ కవిత రాసినా నీవే వస్తువు 

ఏ గీతి పాడినా నీవే ప్రియ శ్రోతవు

నా ప్రతి కలలో నువుమాత్రమే కలవు

ఏడేడు జన్మలకు నీవే నా చెలియవు


2.నను జ్ఞప్తి చేయమని విజ్ఞప్తులు

నినుమించి ఎవ్వరూ నాకాప్తులు

నాకన్న ఆరాధించరే భక్తులు

నాలా నిను ప్రేమించరే వ్యక్తులు

Tuesday, June 1, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనుల ఎదుట నిలిచిన నా కలవే

ఇలకు దిగిన పున్నమి శశికళవే

ఇంద్రధనుసు వన్నెలన్ని పుణికి పుచ్చుకున్నావే

ఇంద్ర సభలొ అప్సరవైనా నన్ను వలచి వచ్చావే


1.నల్లకలువరేకులా నీ ముఖ సరోవరానా

అల్లాడు మీనాలౌనా నీ మోము తటాకానా

అల్లనేరేడులేమో నీ వదన ఫల వనానా

చారడేసి నయనాలకే కలం కలవరమొందేనా


2.కోడెత్రాచుగా తోచే నీ జడనే పొగడనా

శంఖంలా స్ఫురింపజేసే నీ మెడనే నుడువనా

కోటేరుతొ పోటీచేసే ముక్కుచక్కదనం మెచ్చనా

మందారంతొ పందెంవేసే అధరాల నుతించనా


3.కవితయందు తెలుపనైతి రాయనా కావ్యమే

గీతమందూ సరిపోదు లిఖించనా ప్రబంధమే

అంగాంగమందు నీది అంతులేని సౌందర్యం

అందంమంటె అర్థం నీవే నీదే కద ఆహార్యం

Monday, May 31, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గండుకోయిలే తలదించుతుంది

నిండుగ నువు పాడుతుంటె

పారిజాతమే ఇలరాలుతుంది

పరవశాన నువు నవ్వుతుంటె

 ప్రియా గానమే ప్రాణము నీకు నాకు

కలిసి చనెడి దొకే మార్గము ఇరువురకు


1.ఇలవంక వచ్చినారు నారదతుంబురులు

నీ కడ పాటనేర్చేందుకు

నీకొరకే వెతుకుతున్నారు దేవ గంధర్వులు

నిను గురువుగ ఎంచుతూ

కఛ్ఛపి వీణియకున్న జతులు గతులు నీవి

అనాలంబ మధురిమలా నీ గాత్రపు నెత్తావి


2.తరియించగ నీగాన లహరే అల ఆకాశ గంగయై

నను పావన మొనరించు

ఎలుగెత్తిన నీ గళ రావమే కడు ఉత్తేజభరితమై

నను ఉరకలు వేయించు

సాటిరారు భువినెవ్వరు నీసరితూగ

సంగీతపు చిరునామా ఎప్పటికీ నీవవగ

 https://youtu.be/dgUQqPYwwRk


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నెత్తిమీద శివ గంగ నీకంట

ఎత్తిపోతల శోకంగ నా కంట

నివురు గప్పి ఉండె నీ నుదుటి కంటి మంట

ఎగసిపడుతున్న గుండె మంటతొ మేమంట

చిక్కని చిక్కుతొ మిక్కిలి తంట విధిరాతంట

త్వమేవాహం త్వమేవాహం  శివోహమేనంట


1.చంద్ర వంకనీకు అలంకారము

బ్రతుకు వంక నాకు బాధాకరము

గొంతైతే దిగకుంది నీకు కాలకూటము

ఒళ్ళంత పాకింది విషము నాకెంత కష్టము

చిక్కని చిక్కుతొ మిక్కిలి తంట విధిరాతంట

త్వమేవాహం త్వమేవాహం  శివోహమేనంట


2.మరుభూమే నువు మసలేటి స్థానము

మా ఇల్లు సైతం వల్లకాడుతో సమానము

బొచ్చె గలిగియున్న  బిచ్చగాడివి నీవాయే

తెరిచిన జోలెతొ వరములడగుతూ నేనాయే

చిక్కని చిక్కుతొ మిక్కిలి తంట విధిరాతంట

త్వమేవాహం త్వమేవాహం  శివోహమేనంట

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తరగని గని ప్రియా నీ అందం

నవరత్నాలకు అది భాండారం

నా వెంటే నీవుంటే జీవితాంతం

కొదవనేది ఉండనే ఉండదు సాంతం


1.ఇంద్రనీల మణులే కనులు

కెంపులు నీ ఇంపైన చెంపలు

పగడాలే  అరుణాధరాలు

పలువరుసే ముత్యాల పేరు

పలుకుల్లో రతనాలు రాలు


2.వజ్రమే కమనీయ కంఠము

మరకతమే  బిగుతు పేరణము

పుష్యరాగమే నీ కౌశేయము

గోమేధికమే నీ మధ్యవృత్తము

వైఢూర్యమే ప్రియా నీ మేనిఛాయ

Friday, May 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అభిసారికవో అభినవ రాధికవో

రసమయ నవ గీతికవో మదనుని సుమ వేదికవో

విరహవేదనతొ ద్వారమానుకొని వేచితివో

మధుర కలయికల ఊహచేసుకొని సైచితివో


1.జాము గడచినా జాడలేని ప్రియుడి చింతన

జాలిమాని ఆ జాబిలేలనో తారకల చెంతన

జన్నమాయే నీ మేని సెగలతో వాడ వేడినొందె

జంగమయ్య జగదంబ మెదల మనసు కలత చెందె


2. మరుమల్లెలే ఉరులోసినా కురులకందమిచ్చె

నీ గాజులే విదిలించినా మంజులమై రవళించే

ఉక్కబోసి తడిసిన రవికె మత్తును మరిపెంచే

జారుతున్న పయ్యెద సైతం జావళీలు ఆలపించె

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత సొబగు నీది నువు పాలరాతి శిల్పమే

ఎంత సొగసు నీది తూచితే అనల్పమే

ఎదుటికొచ్చి నిలిచిన కవి కల్పనవే

కనులకు మిరుమిట్లుగొలుపు సౌదామినివే


1.ప్రాగ్దిశ గళాన అరుణ స్వరానివే

పూరెక్కన ప్రత్యూషపు తుషారానివే

పూనికతో కూర్చిన మౌక్తిక హారానివే

అయాచితంగ నా కందిన అమరవరానివే


2.అపరాణ్ణమందున పూర్ణ వటచ్ఛాయవే

 మీరిన తపనలకై మలయ సమీరమీవే

బీడును పులకింపజేయు దివిజలధారవే

హాయిగొలుపు పికగానపు పూలకారువే

Thursday, May 27, 2021

తిరుమలేశు మేలుకొలుపు మేలుకొలుప శుభోదయం

పంచాయతన  గుడిగంటలు చెవినబడగ శుభోదయం

నరసింహుని అభిషేకపు వేదఘోష వినబడితే శుభోదయం

అరచేతిని కళ్ళకద్ది గణపతినే తలచుకొనగ శుభోదయం


1.గోదారిలొ మునకలేసి అర్ఘ్యాలొదిలితే శుభోదయం

దోసెడు నీళ్ళైనా లింగంపై ధారపోస్తె శుభోదయం

శ్రీ దత్తుని పాదుకలకు ప్రణమిల్లగ శుభోదయం

శ్రీరాముని కోవెలను భక్తిమీర దర్శిస్తే శుభోదయం


2.రావిచెట్ట చుట్టూరా ప్రదక్షణాలొనరిస్తే శుభోదయం

హనుమాన్ చాలీసా తన్మయముగ పాడితే శుభోదయం

నవగ్రహ స్తోత్రాలను శ్రద్ధగ పఠియిస్తే శుభోదయం

శారదాంబ కృపనందగ కుంకుమ ధరియిస్తే శుభోదయం

ధర్మం దారి తప్పిన వేళ

హింస పెచ్చరిల్లిన చోట

జనుల వెతలు పంకించి

జనన కారణాలెంచి

జరామరణాల యోచించి

జ్ఞానసిద్ధి పొందాడు భోదివటచ్ఛాయలో

బుద్ధునిగా మారాడు సిద్ధార్థుడు గయలో


1.ఆలుబిడ్డలని వదిలేసాడు

రాజ్యమే త్యజియించాడు

బౌధ్ధ ధర్మాన్ని బోధించాడు

బౌద్ధమతమునే స్థాపించాడు

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి


2.అహింసనే పాటించాడు

సన్యాసిగనే జీవించాడు

వేలమంది శిశ్యులతో 

ప్రవక్తగా సూత్రాలే ప్రవచించాడు

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి

Tuesday, May 25, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ 


మధురమె నీ తలపు

మూయకే మది తలుపు

నా మనసే కడు తెలుపు

నా కవితలు అది తెలుపు


1.వయసే ఉసిగొలుపు

వగరే తొలి వలపు

ఆకర్షణయే కలుపు

నిజప్రేమనే మనల  కలుపు


2.నీ పరిచయమొక మలుపు

నీ నవ్వే మేలుకొలుపు

నా బ్రతుకున నువు గెలుపు

అనుమానపు బూజు దులుపు

 రచన్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊయలూపనా జోల పాడనా

తలను నిమరనా జోజోకొట్టనా

అదమరిచి నిదురోవగ నేస్తమా

నా ఎదలో ప్రవహించే రక్తమా


1.తలపుల్లో నువు మెదిలితె కవనము

కనులముందు కదలాడితె గీతము

నభూతోనభవిష్యతి మన స్నేహితం

కడతేరనీ ఒకరికి ఒకరమై ఇలా జీవితం


2.నేను కన్నకలలన్ని కుప్పబోయనా

అనుభవాలు నెమరువేసి కథలు చెప్పనా

వేలుపట్టి నడిపిస్తా యుగాల అంచులదాకా

నమ్మకంగ తోడొస్తా విశ్వపు అవధులదాకా

 https://youtu.be/l55-Ax52aOQ

రచన,స్వరకల్పన&గానం:డా రాఖీ


జయ జయహో నారసింహ-

జయతు జయతు జయతు

త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మి కొలుతు

స్వామీ నీవే మా ధర్మపురి వేలుపు

ఆపద్బాంధవా ఆలకించు ఈ దీనుని పిలుపు


1.మృగవదన జ్వలిత నయన శ్రీధరా

క్రూరదంష్ట్ర తీక్షణ నఖ చక్రధరా

భీకరాకారా భయనివార ఉగ్రనారసింహా

శ్రీకరా శీఘ్రవరద యోగనారసింహా


2.హిరణ్యకశ్యపాంత దుర్జన నాశకా శ్రీహరీ

ప్రహ్లాద సంరక్షక సజ్జన పోషకా నరహరీ

స్తంభ సంభవా స్వామి అంబుజ చరణా

సాష్టాంగ వందనాలు కరుణాభరణా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ కన్నులే మధువొలుకే దొన్నెలు

నీ పల్వల్వలే మగ్గిన పనస తొనలు

నీ బుగ్గలే సిగ్గులే సింగారించే చిన్నెలు

ఎన్ని ఉన్నాయో నీలో ఎనలేని వన్నెలు

సరళరేఖలా ఎదలో కాలుమోపావే

సరస కేళిలో సాంతం చిచ్చు రేపావే


1.జీరాడే ముంగురులతో రాజీపడి

ఊగాడే జుమ్కాలతొ పేచీపడి

ముక్కెర చక్కదనం కొనియాడి

పాపిటి బిళ్ళనే తనివార ముద్దాడి

మచ్చిక చేసుకుంటి అచ్చికబుచ్చికలాడి

తనుకానిగ నే మన తరమా వగలాడి


2.నీరుగారి పోకుండా నీ వంపులకు

రసాభాస కాకుండా కవ్వింపులకు

లొంగదీసుకోవాలి నీ వయసు పొంగులను

కట్టడిసేయాలి మిడిసిపడే హంగులను

నీ వ్యూహం ఛేదించే సవ్యసాచినవ్వాలి

నీ దాడిని తిప్పికొట్టి యోధుడిగా గెలవాలి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చావనన్న చావనీయవు

నా బ్రతుకు నన్ను బ్రతుకనీయవు

నను కాదు పొమ్మంటే ఒకటే నిశ్చింత

నువు వద్దని చెప్పేస్తే నాచావు నేఛస్తా


1.సద్దుమణిగి ఉన్నవేళ అలజడి రేపుతావు

నిద్దరోతున్న మాపు కలలో దూరుతావు

ఊరించకమానవు ఉడికించక ఆగవు

చచ్చేచావు నీతోటి నువు వచ్చేదాకా

ఎలా మసలుకోనే నువు మెచ్చేదాకా


2.అందమంత ఆరబోసి ఆశలు కలిపిస్తావు

విందు మందు ముందరుంచి నోటిని కుట్టేస్తావు

తప్పుకోను మనసురాదు తిప్పలతో బ్రతుకు చేదు

బజారుపాలాయే నాకున్న బింకము

కైజారై గుచ్చింది గుండెలొ నీపొంకము

Monday, May 24, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తల్లడిల్లజేస్తోంది ఉల్లిపొర తెల్లచీర

ఉత్సుకత పెంచుతోంది కుట్లుతెగు బిగుతు రవిక

జారుతున్న కొంగు పాడె జావళి గీతిక

నంగనాచి నాభివేసె లొంగదీయు పాచిక

తట్టుకొన తరమౌనా తాపసులకైనా

తరించనీయవె నీ   దాసునిగా నైనా


1.గుండెదడ హెచ్చుతుంది నీ అందెలు కన్నా

రక్తపోటు పెరుగుతుంది నీ గాజుల సడివిన్నా

తడబాటే మాటల్లో కంటిముందు నువ్వుంటే

ఎడబాటే నాకునాతొ ఎదురుగ నీ నవ్వుంటే

తట్టుకొన తరమౌనా తాపసులకైనా

తరించనీయవె నీ   దాసునిగా నైనా


2.మనసు చెదరగొడుతుంది పిరుదులపై నీ జడ

ఆశలేవొ రేపుతుంది దూంముడి చోళీ నాడ

చూపుతిప్పనీకుంది నడుం ముడత మతిచెడ

పద్మినీజాతి స్త్రీల పొంకాలన్ని  నీ కడ 

తట్టుకొన తరమౌనా తాపసులకైనా

తరించనీయవె నీ   దాసునిగా నైనా


https://youtu.be/6-NR3AXYgZ8

 నేడు నరసింహ జయంతి ,

అందరికీ స్వామివారి కృపాదృక్కులతో

🙌


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంతర్యామి శ్రీహరి

భక్తాంతర్యామి నృకేసరి

సర్వాంతర్యామి ధర్మపురీ నరహరి

ప్రహ్లాద వరదా ప్రణతోస్మి పాహిపాహి దనుజారి


1.అణువణువున కలిగిన నీ ఉనికి

ఋజువు పరచి చూపించ లోకానికి

నరమృగ రూపాన గోదావరి తీరాన

మము పరిపాలించగ మా ధర్మపురాన

సంభవించావు ప్రభూ శిష్ట రక్షణకై

ఉద్భవించావు స్వామి దుష్ట రక్షణకై


2.వరగర్వితుడా హిరణ్య కశిపుని

సంహరించినావు నరసింహాకృతిని

అక్కునజేర్చినావు గ్రక్కున ప్రహ్లాదుని

మిక్కిలి ప్రేమతో శాంతము చేకొని

కటాక్షించినావు శేషప్పను సైతం

అనుగ్రహించు అందించు మాకు నీ ఊతం

Sunday, May 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వేసవిలో చలి పుట్టిస్తుంది నీబిగి కౌగిలి

హిమగిరిపై సెగ రగిలిస్తుంది నీబాహులోగిలి

నీవే అధినాయికవు శృంగార లోకానికి

నీవే సామ్రాట్టువు రసానంద రాజ్యానికి


1.స్నానమాడుదాం ముద్దుల జడిలో

 ఈదులాడుదాం  స్వేదపు నదిలో 

 జగడమాడుదాం జతకూడికలో

 మునిగితేలుదాం రతివేడుకలో


2.పాలుపంచుకుందాం యుగళగీతిలో

పందెమేసుకుందాం సరసమైన రీతిలో

కరిగినీరైపోదాం వేడివేడి నిట్టూర్పులలో

తిరిగి చేరువౌదాం పరస్పరం ఓదార్పులలో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గులాబీల రెక్కలన్ని ముద్దగ చేసి

మంచిగంధమ్మునే మిళితంచేసి

తేనెలో సుధలోను రంగరించి

వెన్ననూ వెన్నెలను జతగజేసి

సృష్టించాడు అపూర్వంగ నిన్ను విరించి

తలవంచాడు నీకన్న అందాలను సృజించడం మరచి


1.భువికి రాగ జంకే రంభకూ ఊర్వశికి

పున్నమైన తడబాటే నిను గని శశికి

దమయంతికి చింతనే నీతో పందానికి

వరూధినీ వివశయే నీ సౌందర్యానికి

సృష్టించాడు అపూర్వంగ నిన్ను విరించి

తలవంచాడు నీకన్న అందాలను సృజించడం మరచి


2.కవుల కలల సుందరివే నీవు

చిత్రకారుల కైనా సవాలువే నీవు

నిను చెక్కగ శిల్పి ఒకడు ఇలలో లేడు

నీతోడు కోరుకోకున్న మనిషే కాడు

సృష్టించాడు అపూర్వంగ నిన్ను విరించి

తలవంచాడు నీకన్న అందాలను సృజించడం మరచి

Saturday, May 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పేరుకు మాత్రం మానవుడు

ప్రవర్తనకైతే  పశు సమానుడు

పుణికిపుచ్చుకున్నాడు అవలక్షణాలను

ఆవుతోలుకప్పుకున్న పులిగుణాలను


1.నక్క వినయాలు నత్త  నడకలు

కుక్కతోకవంకర బుద్ధులు కప్పదాటులు

గుడ్లగూబ చూపులు గబ్బిలంలా వ్రేలాడటాలు

నల్లికుట్ల చేష్టలు పిల్లిలా తోకముడవటాలు


2. ఎలుకలా దాగడాలు ఏనుగల్లె ఆగడాలు

వానపాము పౌరుషాలు కాకుల గోలలు

మేకపోతు గాంభీర్యాలు ఆంబోతు క్రౌర్యాలు

గొర్రెదాటు పోకడలు గంగిరెద్దు తల ఊపడాలు

https://youtu.be/QOQ6b-AJr0g?si=bxLf4f4LdcXQctqu

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:ఖరహర ప్రియ

అంతరించనీ నను తరించనీ  అంతకహరుడా
అవతరించనీ నీ పదపీఠిగ నీలకంఠుడా
వివరించనీ నా వెతలను త్రిపురాంతకుడా
సవరించరా నా గతులను సదానందుడా
శంభో హరా శంకరా సాంబసదాశివ అభయంకరా

1.తోసితివి నను భవసాగర తోయముల
వేసితివి చిక్కుల చిక్కెడు బంధనముల
మరచితివి కనికరమేలనో ఈ దీనుని ఎడల
చూసితివి చోద్యము   నే మునుగ సుడుల
శంభో హరా శంకరా సాంబసదాశివ అభయంకరా

2.జాగిక సేయకు జాలిమాని  జాబిలితాల్పుడ
జటాఝూటధర జగడమ నాతో జంగమదేవర
జలధార ప్రియ జపమిక చేయుదు ఫాలనేత్రుడా
జింకతాల్పరి నా వంకలెంచకురు జయంతుడా
శంభో హరా శంకరా సాంబసదాశివ అభయంకరా


 https://youtu.be/GE1HEGzyvac

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెల్లచీర రమ్మంటోంది

మల్లెపూలు తెమ్మంటోంది

దాగలేని పరువాలు ఆగం చేస్తున్నవి

ఆగలేని మరులన్ని మారాం చేస్తున్నవి

ఝాము గడిచిపోనీకు ప్రాణసఖా

జాగుచేసి చంపబోకు నా కోరిక


1.వలపునంత వండి పెట్టినాను

విందారగించ వేడిగ వడ్డించినాను

చల్లారిపోనీకు  నా మది సెగలు

తెల్లారిపోనీకు వగరైన వగలు

ఝాము గడిచిపోనీకు ప్రాణసఖా

జాగుచేసి చంపబోకు నా కోరిక


2.గులామునై పోయాను నీ మగటిమికి

సలామునే చేస్తాను నీ రసికతకు

నవాబుగా రమ్మంటిని పడకటింటికి

రివాజుగా దివి సవారికై తయారుంటిని

ఝాము గడిచిపోనీకు ప్రాణసఖా

జాగుచేసి చంపబోకు నా కోరిక


OK


దివ్య మోహన విగ్రహం

అనూహ్యకరం పరానుగ్రహం

వేంకటాచల నిలయం వేదవేద్యం

వందే పంకజానన శోభితం పరమపూజితం


1.శంఖ చక్ర యుగధారిణం భవ తారణం

దశవిధావతారిణం రమా రమణం

భక్త వశీకరణం విష్ణుం ఆర్త త్రాణ పరాయణం

శరణాగత బిరుదాంకితం శరణం శరణం శరణం


2.శ్రీధరం ఇభరాజ వరదం మాధవం

గోవిందం గోవర్ధ గిరిధరం ముకుందం

సదానందం పరమానందం సచ్చిదానందం

హరిం మురహరిం నరహరిం కరుణాకరం

Friday, May 21, 2021

 https://youtu.be/zCx89pLTIlo?si=b-CD0r0XZzJr_an4


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విద్వత్తు సదనం మేధస్సు

కళలకు నిలయం మనస్సు

బ్రతుకునకతి ముఖ్యం విద్యా వినోదం

నమోస్తుతే భారతీ నా కవి నీ ప్రసాదం


1.అక్షయమౌ అక్షరాలు నీ వరాలు

మధువొలికే పదాలు నీ పదాలు

సీతాకోకచిలుకలు మధుర భావ వీచికలు

తలపున నీ కదలికలే  కవన సూచికలు

నమోస్తుతే భారతీ నాకీవే శరణాగతి


2.దేహచక్ర సప్తకమే సప్తస్వరాలు

ఆహ్లాద దాయకము  అనురాగ రాగాలు

ఉల్లముకుల్లాసమే లయ విన్యాసాలు

సాయుజ్యాన్వితమె సంగీత గీతాలు

నమోస్తుతే భారతీ నీ దయతో సంప్రాప్తాలు

https://youtu.be/mvQtnRqi86w


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పదహారణాల అసలు సిసలు తెలుగుదనం 

పదహారు ప్రాయాన మిసిమి మిసల పడుచుదనం

తెలుగింటి అమ్మాయి సంక్రాంతి సన్నాయి

కంటికింపు మనవారికి కంటగింపు పరులందరికి


1.పొడుగాటి నాగంటి వాలుజడ 

నప్పేటి జడకుప్పెలు ఊగాడ

జఘన మృదంగంమీద

లయవిన్యాస విలాసమాడ

కుర్రకారు గుండెల్లో దడ దడ

మావయ్యలు సైతం తడబడ


2.చారడేసి కన్నుల్లో కలువల జాడ

నిగారింపు బుగ్గలే పెరుగు ఆవడ

తేనెపట్టు గుర్తొచ్చే పెదవులు చూడ

గుట్టు బట్టబయలవుతూ చోలి కడ

పట్టుదలే పట్టుతప్పే పట్టు పావడ

మువ్వల పట్టీలతో జవ్వని తిరుగాడ

Tuesday, May 18, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొండలరాయుని మేలుకొలుపులలో భూపాలం శుభోదయం

గరుడస్తంభపు చిరుచిరుగంటల సడి హిందోళం శుభోదయం

కోవెల గోపుర సమీరాలలో మలయమారుతం శుభోదయం

కోనేటి తామరతూడులు కొసరేటి హంసనాదం శుభోదయం

రసోదయం రాగోదయం నవోదయం శుభోదయం


1.కొక్కొరకో కోడికూతల ఉదయరవిచంద్రిక శుభోదయం

కువకువ ధ్వనులతొ పల్లెను లేపే చక్రవాకం శుభోదయం

ఎద్దుల మెడలో రవణులు చేసే దేశ్ రాగం శుభోదయం

లేగలు మేకలు మందలొ అరుపుల ఆర్తిముల్తాన్ శుభోదయం


2.తూరుపు వాకిట భానుడి కిరణం చంద్రకౌన్స్ శుభోదయం

పచ్చికమీద తళుకులీనే తుషారమయే వలజే శుభోదయం

నేలకు దుమికే జలపాత హోరగు రేవతిరాగపు శుభోదయం

మంగళకరమౌ కర్పూరహారతి మధ్యమావతి శుభోదయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రెక్కలే పుట్టుకొస్తె ఎంత బాగుండు

చుక్కలా వెలిగిపోతే ఎంత బాగుండు

వాలిపోనా ఈక్షణమే నీ ఎదుటన

మారిపోనా తిలకమై నీ నుదుటన

నా స్ఫూర్తి వైనావు నా ఆర్తివైనావు

కాలాల అంచులదాకా ఈదాడుతుందామా

లోకాలు మరిచేలాగా ముద్దాడుకొందామా

చెలీ ప్రియా  ఓ చంద్రముఖి

నాకోసమే జన్మించిన ప్రాణసఖీ


1.నా ప్రేమ తెలపడానికి ఏ భాష చాలదు

అది నిన్ను చేరేవరకు నా శ్వాస ఆడదు

ఒక ముద్దుకోసం హద్దులన్ని దాటగలను

రససిద్ది కోసం తనువంత మీటగలను

అనురాగం పలికిస్తూనే నవలోకం చేరుస్తాను

ఆరాధన చేస్తూనే తమకాలిక తీరుస్తాను

అనుమతించుదాకా మతిచలించునే చెలీ

బహుమతీయరాదే నులి వెచ్చని కౌగిలి


2.స్వర్గాన్ని ఉన్నఫళంగా భువిపైకి దింపేస్తాను

అమరులైన పొందలేని అమృతాన్ని వంపేస్తాను

దేహాల ఊయలలో దిశలకొసలు చూపిస్తాను

మోహాల మాయలలో కరిగినీలో ప్రవహిస్తాను

రసనతో చిత్రమైన చిత్రాలను వేయవే

ఆగిపోని యోగమందున మన ఆయువే

ఇరువురము గెలిచేందుకు వైరులమై పోరనీ

కాయాల లోయలలోనా స్వేదనదులు పారనీ

Monday, May 17, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొంచం కొంచంగా ఎంతో నచ్చావు

నీ వాడిచూపులతో ఎదనే గుచ్చావు

సీదాసాధాగానే ఉన్నా నన్ను నన్నుగా మెచ్చావు

నిద్రాణమైన  ప్రణయాన్ని ఉల్కిపడేలా గిచ్చావు

కోరికోరి వలచావు ప్రియా నా మనస్సునే గెలిచావు


1.చిరుబురులాడే కోపంలో నీమోము

ఎంతగా కందిపోయేనో చెప్పలేము

వెక్కిరించీ వేడెక్కించును నీ బుంగమూతి తీరు

ముద్దాడగలిగానా నిన్ను  నా ఆశలన్నీ తీరు

కోరికోరి వలచావు ప్రియా నా మనస్సునే గెలిచావు


2.కావాలని నను కలవాలని నీకెందుకలా

నా ఒడిలో నువు వాలాలని ఏవేళా నా కలా

ఆవలించనీకుండా కావలించుకుంటుంటే అలకలా

చెదిరిపోని మనబంధం ఆదర్శమవనీ చిలకాగోరింకలా

కోరికోరి వలచావు ప్రియా నా మనస్సునే గెలిచావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నడిఈడు లోనా సడిచేసెనే వలపులు 

పడిలేచు అలలా మిన్నుకెగిసెనే మరులు

పురులు విప్పినాట్యమాడెనే తీపిరేపు తలపులు

కోడెనాగులై బుసలుకొట్టెనే తనివి తీరని తపనలు

ఆ నందనందనుడే ఆనందమందించనీ

నా డెందమందున్న సెగనంతమొందించనీ


1.మధించకుంటె నాడు క్షీర జలధిని

సాధించతరమయేన నిధులనీ సుధని

చిలికితేనేకదా పాలనీ ఎద మురిపాలనీ

వెలికితేగలిగేము వెన్ననీ మది వేడుకనీ

ఆ నందనందనుడే ఆనందమందించనీ

నా డెందమందున్న సెగనంతమొందించనీ


2.అణువణువున గిరిధారి కను రాధను

క్షణమైన సైచలేను నాలో విరహ బాధను

దాచి ఉంచాను మ్రోయించగా యవ్వనవీణను

రాసలీలలాడువేళ రసికతనెరపుటలో ప్రవీణను

ఆ నందనందనుడే ఆనందమందించనీ

నా డెందమందున్న సెగనంతమొందించనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అనురాగమే పొడసూపనీ  శుభోదయం

అనుబంధమే పెనవేయనీ శుభోదయం

అనుభూతులే మధురమవనీ శుభోదయం

అనుకూలమై ఇక కాలమే చెలఁగనీ శుభోదయం


1.అనుమతించనీ ఎద ఎద మైత్రినీ శుభోదయం

అనుసరించనీ సాంప్రదాయలనీ శుభోదయం

అనుకరించనీ పురుషోత్తములని శుభోదయం

అనుగ్రహించనీ ఆ దైవమే మనని శుభోదయం


2.అనుయోగమే కొనసాగనీ నెగ్గేదాకా శుభోదయం

అనుమానమే వసివాడనీ కడదాకా శుభోదయం

అనునయమే సమకూరనీ వెతలందునా శుభోదయం

అనుస్మృతులే రంజింపనీ హృదయాలనే శుభోదయం

Sunday, May 16, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను చూడాలని నాకెంతో తహతహ

ఒక్కసారి కనిపిస్తే యమహో యమహ

అపూర్వమౌ నీ అందం దేవకన్య తరహా

ఆ అందం అందినంత బ్రతుకంతా ఆహాఁ


1.ఎత్తగలను ఎన్ని జన్మలైనా  

నీ అధరామృతమునేనందగ

మరణించగలను ఈక్షణమైనా

ఒకే ఒక సారి నీ పొందుపొందగ

ననుబ్రతికించుట నీచేతిలోనే 

బుగ్గల నునుసిగ్గు చాటు భామా

ఇంతకన్న ఎలాతెలుపగలను 

చాటుమాటు నాఘాటు ప్రేమా


2.ప్రతి నిమిషం నీజపమే నామది

వరమిచ్చే వరకు నిను వదలనంటిని

నా మనోనివేదనే నమ్మవే ఇది 

అనుకోకు చెలీ నాదొక గాలి పాటని

ఒక్కసారి తెలుపవే నీ ప్రేమని

ఐపోతా బ్రతుకంతా నీ బానిసని

సుందరీ నా ఎదురుగ నీవుంటే

కవితలు వెల్లువెత్తు నినుకంటే

 

https://youtu.be/Vo8sDPJ5O20?si=HhFWV2Y55VhmPPHG

(విశ్వకవి రవీంద్రుని కవిత ఆధార నా స్వేఛ్ఛాగీతిక)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇప్పుడే తెలుపు నేస్తం నా మరణ సంతాపం

వెంటనే వెళగ్రక్కు నేస్తం నా వెలితి పరితాపం

బ్రతికుండగా నే ఎరగాలి  నీ ఎద విలాపం

నీ కనుకొలుకుల నుండి నువు చేసే అశ్రుతర్పణం


1.పోయినోళ్ళందరూ మంచివాళ్ళే అనుకుంటే

నా గురించి చెప్పు భాయి నాల్గు మంచిముక్కలు

నేను లేనిలోటును అనుభూతి చెందుతుంటే

ఈ క్షణం తేల్చుకోవోయి జమాఖర్చు లెక్కలు


2.తదనంతరమిచ్చేటి బిరుదులేవొ ఉటంకించు

ఫోటోకు ఎందుకు దండ నా మెడకే తగిలించు

ఎవరెవరు పొగిడేరో ఎంతగా నా వెనక తెగడేరో

నాముందే వక్కాణించక పాడెముందు పాడేరో


3.పోయాక రానేరాదు నీకు నాకు అవకాశం

మనసువిప్పి కుప్పవేద్దాం మన భావావేశం

శ్రద్దాంజలి నాఎదుటే ఘటించనీ సమావేశం

చేజారక ముందే  విలువనెంచమని నా సందేశం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ మాటలన్నీ నీటిమూటలే

నీ బాసలన్నీ గాలిపాటలే

నమ్మితే వంచించే నయవంచకివి

నట్టేట ననుముంచే ఘరానా హంతకివి


1.బూటకాల నీప్రేమకు నేనే దొరికానా

నాటకాలు ఆడుకునుటకు నేనో బకరానా

వన్నెలెన్నొ కుమ్మరించి ఎరగా వేసావు

అన్నెంపున్నె మెరుగని నన్ను తేరగా దోచావు


2.వెలుగుకై ఆశపడితే శలభమై కాలాను

నీ ప్రేమలొ మునిగిపోయి శవంలాగ తేలాను

అగ్గిపాలు చేసావే పండంటి బ్రతుకును

బుగ్గిచేసి వేసావే నా బంగరు భవితను

Saturday, May 15, 2021


https://youtu.be/DeQ4hAvoJb4

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


కైలాసనాయకా కైవల్యదాయకా

కైమోడ్పులివి నీకే కైంకర్యము నా బ్రతుకే


1. కైరవమే ననుకానీ నీకై చేసే అర్చనలో

కైవారము సేయనీ నాకైతల గుఛ్ఛముతో

కైరవై కురియనీ నీ శీతల దృక్కులు నాపై

కైవశమైతిని శివా నీ భక్తిసుధే నాకు కైపై


2.కైశికమందు గంగ కావించనీ నను పునీతం

కైలాటకమాయే స్వామి నా జీవిత నాటకం

కైటభవైరి సఖా హరహరా ననుగావర తక్షణం

కైతవాలు వెతకకిక శరణం శరణం నీ దివ్య చరణం


https://youtu.be/ce0n3fTcZ4U?si=BTbYlW0-Hk-8QUBA

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నీలాంబరి


మహాదేవా పరమశివా

మహాకాలకాల భక్తపాలా

మహామృత్యుంజయా నమోస్తు అవ్యయా

నటరాజా రాజరాజేశ్వరా నమామి ఈశ్వరా


1.భవా భవానీధవా ఆత్మసంభవా విభవ

వామదేవా కాకోలగ్రీవా ఖరువా భార్గవా

రుద్రా వీరభద్రా విరూపాక్షా నమోస్తుకాలాభైరవా

కపర్ది కామారి త్రిపురారి నమామి శంభో సాంబశివా


2.రాజరాజేశ్వరీ వరా హరా భక్తవశంకరా

నగరేశ్వరా స్థిరా వేములాడ భీమేశ్వరా

గంగాధరా చంద్రమౌళీశ్వరా నమోస్తు బాలేశ్వరా

వృషభ వాహనా విషకంధరా నమామి విశ్వేశ్వరా౹

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను తలవని క్షణమే లేదు

నిను కలవక బ్రతుకే చేదు

పెంచిపోషిస్తున్నా నీ ప్రేమ పాదు

వస్తే రానీ నా మీద అపవాదు


1.గాలివాటుగా పరిచయమైనాము

ఏటవాలుగా పయనిస్తున్నాము

కాలం కట్టింది మన మధ్యన వారధి

దైవం వరమిచ్చింది స్నేహమనే పెన్నిధి


2.ఏదో కావాలని ఎదకు ఉబలాటం

చెప్పడానికెంతగానో నాకు మొహమాటం

చెప్పలేక చెప్పలేక ఎప్పుడూ ఆరాటం

నీతో చెలిమి  వయసుకు మనసుతొ చెలగాటం

కన్నుల కురిసెను వర్షం

పెదవుల విరిసెను హర్షం

జీవితాన ప్రతి నిమిషం

ఆనందామృతం విషాద సంయుతం


1.కరోనా అంటినందుకు దుఃఖం

గండం గడిచినందుకు ప్రశాంతం

వ్యాక్సిన్ దొరికినందుకు మోదం

మరోసారి వేయనందుకు ఖేదం


2.దిన దినం క్షణక్షణం కరోనా భయం

ఎప్పుడు కడతేరుతుందో అయోమయం

రాకతప్పదను మాటే అందరికీ ఖాయం

బతికి బట్టకట్టామా అది అంతిమ విజయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోరుచుట్టు ఒక బాధ

రోకటిపోటదే గోటిపై ఎంతటి బాధ

పుండువల్లనే ఎంతో నొప్పి

పుండుమీద పుట్రవల్ల ఇంకెంత నొప్పి

కరోనా కాటుతోటె చేటనుకుంటే

నల్లబూజు(బ్లాక్ ఫంగస్)మోపై

కబళించసాగె వెనువెంటే


1.పరిసరాలనన్ని పాడుచేసిన పాపం

పర్యావరణానికే కీడు చేసిన దోషం

జీవవైవిధ్యానికే హానిచేసిన నేరం

ప్రకృతే ప్రకోపించినా విపత్తులే విరుచుక పడినా

గుణపాఠాలే నేర్వం మానవులెవరం మారం


2.తమదాకా వస్తుందా అన్న నిర్లిప్తత

మొక్కబడిగా పాటించే తూతూ జాగ్రత్త

కనీసమైనా పట్టింపులేని జాగరూకత

తెగేదాక లాగుతూ తెగిందంటే వెక్కుతూ

నెత్తినోరుకొట్టుకుంటాం,దీనంగా మొత్తుకుంటాం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శుభోదయం నేస్తమా ప్రియనేస్తమా

నీ నిలువెల్లా సుప్రభాతం ప్రాప్తమా

నిదురలేచు శుభవేళ ఎదురుగా నీ మోమే

అదిరిపాటు చెందేలా నా మోవితొ నీమోవే

శుభోదయం రసోదయం హసోదయం


1.నీలికురుల మబ్బుల మధ్యన

పారాడే పాపిట బిళ్ళనే ప్రత్యూషం

కనుబొమల కనుమల నడుమన

వెలిగే సిందూర తిలకం రవిలా విశేషం

అధరసుధా సాగరాన అలలపై తేలే

నవ్వుల కిరణాలతో హర్షోదయం

శుభోదయం రసోదయం హసోదయం


2.తలకునీళ్ళోసుకుని ఒడుపుగా విదిలిస్తే

నా ఒళ్ళుఒళ్ళంతా తుషారోదయం

కావాలనిలేదంటూ కావలించుకుంటుంటే

పొద్దంతా హద్దులుదాటే పరవశోదయం

మనసెరిగిన ఆలిచేసే చిలిపి అల్లరులే

ఉవ్వెత్తు ఉత్తేజంతో ఉల్లాన ఉల్లాసోదయం

శుభోదయం రసోదయం హసోదయం



శిష్ట రక్షకా దుష్టశిక్షకా కలియుగ వరదా

దీనబాంధవా ప్రేమ సింధువా ఆర్తత్రాణబిరుదా

ఎందుకు నీమౌనం దేనికి నీజాప్యం

పంచాయుధ పాణీ కరోనా అల్ప ప్రాణి

అంతమొందించవేమి గోవిందా నమోనమామి


1.వాడి వాడి వాడి వీడెనా  సుదర్శనానిది

ఊదిఊది నెర్రెవాసెనా పాంచజన్యానిది

చిలుంపట్టి బలం తగ్గెనా కౌమోదకిది

వధించగ పదను ఒగ్గెనా నందకానిది

ఎక్కిడగ పటిమ ఉడిగెనా సారంగానిది

పంచాయుధ పాణీ కరోనా అల్ప ప్రాణి

అంతమొందించవేమి గోవిందా నమోనమామి


2.గజేంద్రమోక్షగాథ నెరనమ్మియున్నాము

ప్రహ్లాదు గాచిన చరిత్రనే విశ్వసించుచున్నాము

ద్రౌపదీ మానసంరక్షణ కథవినియున్నాము

ధ్రువుడిని సరగున బ్రోచినగతి నెరిగినాము

నీ ఉనికే కల్పనయని భావించకున్నాము

పంచాయుధ పాణీ కరోనా అల్ప ప్రాణి

అంతమొందించవేమి గోవిందా నమోనమామి

Tuesday, May 11, 2021

 రచన, స్వరకల్పన&గానం:డా.రాఖీ


(నేటి {10th  MAY}మా  వివాహ 31 వ వార్షికోత్సవం సందర్భంగా నా ప్రియమైన శ్రీమతి 'గీత'కు ప్రేమకానుక)


భార్యకు సరియైన   పర్యాయపదమీవే

దేవేరికి ఉచితమైన నిర్వచనం నీవే

అర్ధాంగికి అసలైన అర్థమూ నీవె

ఇల్లాలుకు ఇంపైన రూపకమూ నీవే

ఓ చంద్రముఖీ నా ప్రాణసఖీ నా భాగ్యమీవే

ఓ చామంతీ నా దమయంతీ నా బ్రతుకు నీవే


1.నీ గొప్పతనమేలే నను భరించడం

ఘనమైన నీగుణమేలే నను సహించడం

క్షణమైన నువులేక యుగమౌ నిరీక్షణం

నీతో దాంపత్యం నిత్యనూతనం విలక్షణం

ఓ చంద్రముఖీ నా ప్రాణసఖీ నా భాగ్యమీవే

ఓ చామంతీ నా దమయంతీ నా బ్రతుకు నీవే


2.సీత సైతం దాటలేని నాపాలిటి గీతనీవే

జీవితగతికే ప్రగతిని కూర్చే కృష్ణ గీతనీవే

ఏడేడు జన్మలకు విధిలిఖిత నా నుదుటిగీతవే

నా కలం ఆలపించే ప్రతి మధుర గీతమీవే

ఓ చంద్రముఖీ నా ప్రాణసఖీ నా భాగ్యమీవే

ఓ చామంతీ నా దమయంతీ నా బ్రతుకు నీవే

Saturday, May 8, 2021

https://youtu.be/UUcya6cRiIU


 "మాతృదినోత్సవ శుభాకాంక్షలతో"-


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ధర్మవతి


కాలం మారింది వయసు మీరింది

ఏ మాత్రం మారంది అమ్మా  నీ మనసే

చెక్కుచెదరకుంది ఇప్పటికీ నీ ప్రేమే

నా పాలిటి దేవతవే అమ్మా పాదాభివందనాలు

"ననుగన్న దినమిది" మన్నించి కురిపించు దీవెనలు


1.కథలెన్నో చెప్పమని వేధించా  చిననాడు

నిత్యం నిను పాడమనీ సతాయిస్తి అలనాడు

మౌనంగా ఉండమంటినిపుడు ఆయాసపడవద్దని

ధ్యానించమంటిని నిరతము ఐహిక ధ్యాస వద్దని

నా పాలిటి దేవతవే అమ్మా పాదాభివందనాలు

"ననుగన్న దినమిది" మన్నించి కురిపించు దీవెనలు


2.ఊతకర్ర కొనియిస్తిని చేయిపట్టి నడిపించిన నీకు 

చేరువైన మనకపోతిని కనురెప్పగ ననుకాచిన నీకు

పథ్యమంటు నీనోరుకట్టివేస్తిని రుచులు కొసరితినిపిస్తివే

ప్రతిదినం పలకరించనైతిని చీటికిమాటికి నన్నే పలవరిస్తివే

నా పాలిటి దేవతవే అమ్మా పాదాభివందనాలు

"ననుగన్న దినమిది" మన్నించి కురిపించు దీవెనలు



శ్రీశ్రీనివాసం శ్రితపారిజాతం

మా ప్రణతులివే గైకొనుమా సతతం

పద్మావతి అలమేలు మంగా సహితం

చేకూర్చర  సర్వదా మహి మహితహితం

గోవింద గోవింద పాహి ముకుందా

నారాయణ వాసుదేవ రమానందా పరమానందా


1.కట్లుబాట్లు మాకుంటే భరించుకోలేము

మా స్వేఛ్ఛను హరిస్తే సహించగాలేము

ఆంక్షలన్నవెపుడు మాకు   ఆకాంక్షలు కాబోవు

విచ్చలవిడి బ్రతుకె మాకు సంబరాల తావు

ఐనా సరె మమ్ములను నీవె ఆదుకోవాలి

కరోనా బారిబడితె నీవే చేదుకోవాలి॥గోవిందా॥


2.గాలిలోన దీపముంచి నీ ఉనికిని ప్రశ్నిస్తాం

చేతులైన కాపుంచక నీ మహిమను ఆశిస్తాం

చిత్తశుద్ది మావద్ద ఎంత మాత్రమూ లేదు

దైవభక్తి అంటేనే మామనసుకు కడుచేదు

మాపని ఏదైనా నీ పని మము సాంతం కావడమే

నీవిక చక్రం సంధిస్తే కరోనా అంతం కావడమే॥గోవిందా॥

Thursday, May 6, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చిన్న చిన్న విషయాలకె పొంగిపోతాం

కాస్త గుర్తింపుకే సంబరపడతాం

చిన్నపాటి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే 

ఏమాత్రమైన ప్రయత్నాన్ని ప్రశంసిస్తే

అదే ఘనవిజయమనీ ఉప్పొంగుతాం

రంధ్రాన్వేషణతో నొప్పిస్తే కృంగిపోతాం

అల్పసంతోషులం కవులం-అనల్ప సంతుష్టులం

అలుపెరుగని సాహితీ సేవకులం-కవన హాలికులం


1.ఉన్నదాన్నే ఎల్లరూ ఎరిగినదాన్నే

సరికొత్తగా ఆవిష్కరిస్తాం,పరిష్కరిస్తాం

విప్పినదాన్నే ఎవరో చెప్పినదాన్నే 

మాదైన పంథాలో స్పర్శిస్తాం,సృజియిస్తాం

కర్చీఫ్ కప్పినా కాశ్మీర్ శాలువగా భావిస్తాం

చాక్లెట్ నిచ్చినా నోబెల్ బహుమతిగా ఆనందిస్తాం

అల్పసంతోషులం కవులం-అనల్ప సంతుష్టులం

అలుపెరుగని సాహితీ సేవకులం-కవన హాలికులం


2.స్పర్ధనే మాకెందుకొ సమకాలీనులంటె

ఈర్ష్యనే లోలోన మా సాటి కవులంటే

నభూతో న భవిష్యతి మాదైన కవితంటే

తప్పులెన్న తహతహనే పరుల రాతలంటే

గురువుగా భావిస్తే చేయిపట్టి నడిపిస్తాం

అగ్రతాంబూలమిస్తె ఆకసానికెత్తుతాం

అల్పసంతోషులం కవులం-అనల్ప సంతుష్టులం

అలుపెరుగని సాహితీ సేవకులం-కవన హాలికులం

Tuesday, May 4, 2021

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉషస్సులో రవి బింబం

నిశీధిలో శశి బింబం

సుందరమేనీ ముఖారవిందం

తొలిచూపులోనే వేసింది బంధం

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు


1.నీ వాల్జడలో పూలమాలను నేనై

నీ పాపిట మెరిసే సిందూరము నేనై

నుదుటన వెలిగే తిలకము నేనై

నీ చెవులకు ఊగేటి జూకాలు నేనై

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు


2.నీ సోగ కన్నులకు కాటుక నేనై

సంపంగినాసికకూ ముక్కుపుడకనై

నీ సొట్ట బుగ్గలకూ నునుసిగ్గు నేనై

మందార పెదవులకూ చిరునవ్వునై

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు


3.శంఖమంటి కంఠాన నే వజ్రహారమై

నిను హత్తుకోగా బిగుతు రవికనేనై

నిన్నల్లుకోగా నేనే చెంగావి చీరనై

నీ నడుము చుట్టకోగా వడ్డాణమునై

అణువణువు నను తాకనీ నీ తనువు

మనసుకు మనసుకు జరుగనీ మనువు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బ్రతుకు మీద ఆశపుట్టగలదు 

కాటికి కాళ్ళు జాపుకున్న వారికైనా

రతిపట్ల ధ్యాస మరలగలదు

ఎటువంటి ఘోటక బ్రహ్మచారికైనా

యతిరాజుకైనా మతితప్పునే

యువతి నీరీతి అందగత్తెవల్ల

నీ పాదాక్రాంతులవరన్నది ఒప్పనే

పురుషజాతి సాంతం పుడమెల్లా


1.ప్రతి కాంత సృష్టిలోనె ఒకవింత

కాంచినంతనే కలుగును కవ్వింత

చెంతచేర్చుకోవాలని నిరంతరం చింతననే

చేరువైతె పులకింతనే దూరమైతె పెనుచింతనే

సౌగంధీ  ఆనందీ పరిమళ భరితమే నీ సౌందర్యం

విశ్వమంత విస్తరించె  నీ సోయగ సమ్మోహన సౌరభం


2.సుమ కోమల స్నిగ్ధ లావణ్యము 

మాలతీ లతా ముగ్ధ సౌకుమార్యము

చకితమె నీసొగసు అతులితమే నీ హొయలు

మంజులమే నీ గాత్రము నా కల నువు కళత్రము

సొంతమైతివా జీవితమంతా అనంతమౌ సంతసము

బ్రాంతివైతివా బ్రతుకంతా అవధులే లేని పరితాపము

Monday, May 3, 2021

OK

అలరులు అలరిన పొదరిల్లు

నవ్వుల వన్నెల హరివిల్లు

అనురాగం ఆవరించిన మా ఇల్లు

ఆనందంతొ అల్లుకున్న అందమైన బొమ్మరిల్లు


1.గారాల ముద్దులపట్టి మాబొట్టె

సిరులెన్నో కొనితేగ మాఇంట పుట్టె

నట్టింట నడయాడే సాక్షాత్తు మాలక్ష్మి

కూతురే  లోకంగా మా మనస్సాక్షి


2.ఆడింది ఆటగా నడిచిందే బాటగా

ఎదిగింది మా అమ్మాయి విరితోటగా

కోరికలను నొక్కిపెట్టి ప్రతిపైసా చదువుకె పెట్టి

 చదివించాము మా పాప మాటకే పట్టంగట్టి


3. ఉన్నట్టుండి ఉరుమేలేక పడిపోయే పిడుగేదో

ఆకర్షణ మైకంలో వేసింది తనయ తప్పటడుగేదో

మా ప్రేమలొ లోపముందో ఏ దేవుడి శాపముందో

జాలిమాని మా ఎడల పెడ దారిచూసుకుందే

అర్హతే లేనివాడితో అయ్యో లేచిపోయిందే


ఎండిన మండిన పొదరిల్లు

కన్నీళ్ళు పారెడి మా కళ్ళు

వేదనయే ఆవరించిన మా ఇల్లు

విషాదం పరుచుకున్న శిథిలమైన బొమ్మరిల్లు


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రక్తసంబంధమేనా ఇలలో అనుబంధము

మానవీయ బంధమే కదా బంధాలకెల్ల అందము

మందికొరకు పిలుచుకుంటె ఆలంబనమవుతాయా

వావి వరుసలే చెలియలి కట్టను కడతాయా

ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా

బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా


1.పైనపటారం లోనలొటారం మోసపు ముసుగులు

ఈర్ష్యాద్వేషాలతో మనిషి మనిషిలో లొసుగులు

దాచుకున్న కత్తులతో వెన్నుపోటు ఆలింగనాలు

అవకాశవాదంతో ఎదుటివాణ్ణితొక్కి ఎక్కు అందలాలు

ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా

బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా


2.చేటు లేదు శత్రువుతో మెలిగితే అప్రమత్తులమై

హానిలేది అపరిచితులమైనపుడు అనిమిత్తులమై

పయోముఖ విషకుంభాలే చాపక్రింది బంధాలు

గోముఖ వ్యాఘ్రాలే నమ్మించి వంచించే గంధాలు

ప్రతివారిని ప్రేమించే హృదయం చాలదా

బూటకాల నాటకాల వంతెనౌ బంధం కూలదా


https://youtu.be/mz0zigOeVDE

జాతికి జాగృత గీతమే భగవద్గీత

యువత దిశా నిర్దేశనమే కృష్ణగీత

మానవతా సందేశ యుతమే గీత

హైందవ సంస్కృతికాలవాలమే గీత

గీతను తలనిడి అడుగేస్తే బంగారు భవితరా

గీతాసారమే ఇహపర సౌఖ్యానికి పూబాటరా


1.జీవితమొక రణక్షేత్రం -అనుక్షణం అని అనివార్యం

వెనకడుగే నిషిద్దం సర్వదా యుద్దానికి సంసిద్ధం

నెగ్గినా ఓడినా  శిరోధార్యమేదైనా

ప్రయత్నించు అనవరతం ఫలితం చేదైనా

వ్యక్తులకన్న ముందు పరిస్థితే నీ విరోధి

నిన్ను నీవు గెలవడంలో నిజమైన విజయమున్నది


2.సహానుభూతితో కలుగదు నీకు ఏ అసహనం

విశాల భావాలతొ మారగలదు దృక్పథం

విశ్వసించు నిన్నునీవు సందర్భమేదైనా

అధిగమించు తడబడక ఏ సంకటమెదురైన

కర్తవ్యపాలనయే నువు చేసెడి దైవార్చన

సందేహ నివృత్తికి భగవద్గీతయే ఆలంబన



 తెల్లారుతోంది పొద్దుగ్రుంకుతోంది

కల్లలై పోసాగె నువ్వాడిన సుద్దులన్ని

ముద్దరాలా తగదిది నీకు పలికి బొంకడం

ఓ జవరాలా శోభించదు నీకు ఆడితప్పడం


1.నీ మాటను నమ్ముకొని ప్రతిపూట ఆశపడి

వేచిచూస్తున్నానే పిచ్చివాడిలాగా

నీ ఇబ్బందినేగని పెద్ద మనసు చేసుకొని 

ఓపిక పడుతున్నా నీ హితుడిగా

మాయచేస్తున్నావో మనసుపడుతున్నావో మర్మమే ఇంకా

ఆడుకుంటున్నావో వేడుకుంటున్నావో దైవానికెరుక


2.అనుకోని అతిథిలాగ ఎదురైనావెందుకో

ఆలావచ్చి ఇలావెళితె సరిపోయేది

నా గుండెకి కొక్కెమేసి నీవైపుకి లాగివేసి

గుండుసూదితో గుచ్చేవు న్యాయమా ఇది

పైశాచికానందమా  పడతి తత్వమా అగమ్యగోచరం

అనాదిగా మగజాతికి నాతీనీవల్ల తీరని అపచారం ఘోరం

Sunday, May 2, 2021

https://youtu.be/zwkTS4rjkCQ


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:షణ్ముఖ ప్రియ


అభయకరం నీ శుభనామం శివశంకరం

భవభయహరం శివా నీ ధ్యానం పురహరం

అపమృత్యునివారణకరం వందే విశ్వేశ్వరం

సర్వవ్యాధి వినాశనకరం ప్రణతోస్మి పరమేశ్వరం

కేవల పంచాక్షరీమంత్రం రక్షాకరం మోక్షకరం 

ఓం నమః శివాయ ఓంనమః శివాయ ఓం నమంశివాయ


1.భూతనాథం లోకైకనాథం దిక్పతిం

అనాథనాథం శ్రీవైద్యనాథం  వృషపతిం

దీననాథం కాశీ విశ్వనాథం అహర్పతిం

భగీరథీ ప్రాణనాథం గంగాధరం ఉమాపతిం

కేవల పంచాక్షరీమంత్రం రక్షాకరం మోక్షకరం 

ఓం నమః శివాయ ఓంనమః శివాయ ఓం నమంశివాయ


2.నాగభూషణమ్ చర్మధారిణం త్రయంబకమ్

యోగి వేషిణం భక్తపోషణం విషాంతకమ్

శూలపాణినం పంచాననం త్రిపురాంతకమ్

శశిభూషణం మోదదాయినం కరోనాంతకమ్

కేవల పంచాక్షరీమంత్రం రక్షాకరం మోక్షకరం

ఓం నమః శివాయ ఓంనమః శివాయ ఓం నమంశివాయ


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గడిచింది గతమంతా- ఎదిరిచూపులోనే

కరిగింది యవ్వనమంతా-ఎడబాటులోనే

ప్రియతమా నా నేస్తమా

మన అడుగులు సాగేదెపుడో-బ్రతుకు బాటలో

పదిలమైన నా హృదయమా

మాధుర్యం చిలికేదెపుడో-నాతో జతగ పాటలో


1.సేదదీరు శుభఘడియేదో నీ ఎదపై

పవళించు పరవశమెపుడో నీ ఒడిలో

పసిపాపలాగా లాలించవే నన్ను

కనురెప్పలాగా పాలించవే నన్ను

అక్కున జేర్చుకోవే మిక్కిలి గారాబంగా

గ్రక్కున అరుదెంచవే అలరులు కురియంగా


2.ప్రణయ గోదారిలో నన్ను ఓలలాడనీ

  పాలకడలిలోన తలమునకలవనీ

కవ్వించి నన్ను కలతల్లో ముంచకు

ఊరించి నాలో ఉద్వేగం పెంచకు

మనసనేది నీకుంటే మరిజాగు సేయకు

ప్రాధేయ పడుతోంటే ఇక జాలిమానకు




నీ సుప్రభాతాలు గాలియలల తేలియాడి

చెవుల సోక పావన శుభోదయం

నీ కోవెల గరుడ ధ్వజ చిరుగంటల సవ్వడులే

మేలుకొలుప మంగళ శుభోదయం


1.శేషశైలవాసా శ్రీ శ్రీనివాసా నీదివ్య

దర్శమమవగా ధన్యమౌ శుభోదయం

గోవింద గోవింద యను నీ నామఘోష

భక్తి భావ మినుమడించ ఆహ్లాద శుభోదయం


2.నీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై

రోజంతావర్షించగ ఆనంద శుభోదయం

ఆయురారోగ్యాలు అందరికీ ప్రసాదించ

ధన్వంతరిరూపా జగానికే నవోదయం

మానవాళికే మహోదయం శుభోదయం

నేడే మేడే కార్మిక దినోత్సవగీతం



ఎత్తిన పిడికిలి సుత్తికొడవలి

చక్రం బాడిస కత్తి గొడ్డలి 

సమస్త కార్మిక సహస్ర రీతుల ఎత్తళి

ఘర్మజలాన్నే కందెనచేసి

యంత్రపుకోఱలు శ్రద్ధగతోమి

మానవ జీవన సౌకర్యానికి

 లోకుల విలాస  సౌలభ్యానికి

రక్తమునంతా చెమటగ వడిపే

 శ్రమైక కృషితో  ఫ్యాక్టరి నడిపే

ప్రపంచ కార్మికులారా మీకు సలాం

అహరహ శ్రామికులారా మీకు జయం


1.గనిలో పనిలో  కార్ఖానాలో

క్రీకర భీకర రణగొణ ధ్వనిలో

కనీస వసతులు కొఱవడుతున్నా

భరించలేని వేడికి వెఱవక

సహించలేని చలికీ జడవక

విషవాయువులనె శ్వాసగ పీల్చే

దుర్గంధముతో  రుచులను మరచి

ప్రమాదాలతో చెలిమే చేసే

మరణపు అంచులు నిత్యం చూసే

ప్రపంచ కార్మికులారా మీకు సలాం

అహరహ శ్రామికులారా మీకు జయం


2.చెల్లాచెదురౌ కార్మిక జాతిని

వివిధ వర్గాల శ్రామిక తతిని

ఒక్కతాటిపై నడువగ జేసి

సంఘటితంగా ముందుకి నడిపి

కార్మిక హక్కుల పోరే సలుపగ

ప్రపంచ కార్మిక ఐక్యత నెరుపగ

కార్మికోద్యమం క్రమతగ జరిపి

బలిదానాలకు వెనకడుగేయక

ఎగురెను నేడే మేడే అరుణ పతాక

రెపరెపలాడేను నేడే విజయ పతాక

ప్రపంచ కార్మికులారా మీకు సలాం

అహరహ శ్రామికులారా మీకు జయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిద్దురపోతే కల్లో కొచ్చి

మెలకువలోను తలపులజొచ్చి

నిండిపోయావే నా మనసంతా

నేనే నీవైపోయానేమో అనేంత


1.చీమ చిటుకుమన్నా నీవే అనుకుంటున్నా

గాలితాకిపోతున్నా నీ కబురేదంటున్నా

ప్రాణవాయువై నన్ను బ్రతికించమంటున్నా

హృదయలయగ మారి నినదించమంటున్నా


2. వెచ్చించగ నాకోసం నిమిషమైన నీకుందా

యోచించగ నాకై క్షణమైన వీలౌతుందా

నూరేళ్ళ జీవితాన్ని నీ కంకిత మిచ్చేస్తా

మరుజన్మలోనైనా నీజతకై జన్మిస్తా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పగలు గడిచి పోయింది 

రేయి కరిగి పోతోంది

జాడైన కనరాదు జామురాతిరైనా

పాటైన వినరాదు గాలివాటుగానైనా

ఓపలేను నా ప్రియా నీ ఎడబాటు

తాళలేను నే చెలియా ఒక లిప్తపాటు


1.సరదానా ననుడికిస్తే ఓ చినదానా

నన్నాట పట్టిస్తే సంబరమా నచ్చినదానా

గుండె కోసి తెచ్చాను నీకిస్తా కానుగగా

వలపు మూట గట్టాను కుమ్మరిస్త శుల్కంగా


2.రోజులెన్ని మారాయో  తగ్గలేదు మోజసలు

దూరమెంత పెరిగిందో సడలలేదు మోహమసలు

తాడోపేడో తేల్చుకంటా ఈ పూటనే

తెగిపోతె అనుకుంటానే గ్రహపాటనే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ అందానికి పడిపోందెవ్వరూ?!

నీ పరువానికి దాసులే అందరూ

దివినుండి దిగివచ్చావో

కవిగుండె కల్పన నీవో

మనోహరి సుధామయి నీదృష్టి పడనీ నాపై

మిసమిసల మదాలసా సృష్టికే అపూర్వమై


1.వెన్నెలొలుకు కన్నుల్లో నను స్నానమాడించు

తేనెలూరు పెదవులనే తనివార అందించు

 విరులు తలవంచగా ఎన్ని వన్నెలో నీలో

మరులు కురిపించగా నాకెన్నెన్ని సైగలో

చూపుల్తొ రాసేస్తున్నావు ప్రేమలేఖలు

మాటల్లొ పలికిస్తున్నావు ప్రణయవీణలు


2.మాట ఇచ్చి తప్పకు ఎన్నడు నాతో

బాస చేసి మరువను ఎప్పుడు నీతో

ఆశగా వేచేనులే నీకై నా మనసు

అర్తిగా వగచేనని నీ కెలా తెలుసు

గొంతునులిమినట్లుండే నా తీవ్ర బాధ

గుండె మిక్సీలొ నలిగే విపరీతమైన వ్యధ



ఎంతగ నిను పొగిడాను

ఎన్నని  నిన్ను నేనడిగాను

ఉలకవు పలకవు నీవు ఓ బెల్లంకొట్టిన రాయి

కదలవు మెదలవు నీవు శ్రీ షిరిడీపుర సాయి

గుడిలోన కొలువైవున్న నీవో కొండరాయి

కన్నీటికైనా కరగని కరకు గుండెనీదోయి


1.నిత్యం అభిషేకాలు అందమైన వస్త్రాలు

గురువారమైతే చాలు ఊరేగ అందలాలు

షిరిడిసంస్థానమందు ఎన్ని రాజభోగాలు

ఊరూరా మందిరాలల్లో ఉత్సవాలె ఉత్సవాలు

ఫకీరువే నీకేలా సంబరాలు ఆర్భాటాలు

అవధూతవు నీకవసరమా ఈ వైభోగాలు


2.నమ్ముతూనె ఉన్నాను ఊహతెలిసి నప్పటినుండి

వేడుతూనె ఉన్నాను కష్టంవచ్చినప్పటినుండి

 ఏ విన్నపాన్ని విన్నదైతె ఎన్నడు లేదు 

 ఏ కోరిక తీర్చిన దాఖలాయే కనరాదు  

 అడుగడుగున ఆటంకాలు నోటికందకుండా

అనుభవించు గతిగనరాదు లేకనే నీ అండ