Tuesday, December 15, 2020

 

https://youtu.be/sGc8oS897CQ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెలి మేని బ్యూటీ హైదరాబాదు సిటీ

చెలి పలుకుల స్వీటీ నవ్వుల్లో  నాటీ

భాగ్యనగరమే చెలి తనువుకు నగలా 

విశ్వనగరికి దీటుగా చెలి విశ్వసుందరిగా


1.హెడ్ పై క్రౌనుగా అలరారును చార్మినారు

మకుటాన ఎమరాల్డే భాగ్యలక్ష్మి అమ్మవారు

లాంగైన  హేయిరేమో నల్లని మూసీరివరు

తురిమిన మల్లెపూలే నయాపురానా పూలు

నీ ఐసే ఐమాక్సు నీ లుక్సే మల్టీప్లెక్సు

నీ నోసే ఐనాక్సు నీ చిక్సే ఇనార్బిట్సు


2.కోటీ టూ ఆబీడ్సు జవరాలి కంఠసీమగా

ఎల్బీస్టేడియమే విశాలమైన చెలి ఎదగా

ప్లానిటోరియం బిర్లాటెంపుల్ కొండలే పాలిండ్లుగా

నక్లెస్ రోడ్డే నాజూకైన నడుముకు వడ్డాణంగా

ప్యారడైజే ప్రియురాలి నాభికి తార్కాణంగా

 మెట్రోరైలు ఫ్లయ్యోవరే నూగారుకు నిదర్శనంగా


3.బంజారా జూబ్లీ హిల్సే ప్రియురాలి కోకారైకలు

సాఫ్ట్ వేర్ గుట్టంతా హైటెక్సు గచ్చిబౌడిగా

హ్యాండ్ బ్యాగేమో కృష్ణానగరు ఫిల్మ్ సిటీలు

రామోజీ ఫిల్మ్ సిటీ ప్రేయసి అందాలగొడుగు

హుస్సేను సాగరే చెలి చెమటల మడుగు

ప్రియురాలి సావాసమే ఆశలేవో తొడుగు


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతివైనా దాసోహమె సాటి సుదతి అందానికి

మతినిండా మోహమే అసూయ చెందడానికి

తమకము తీరక అరమరికలు అసలు లేక 

అల్లుకపోతారు లతలై లతాంగులు సుందరాంగులు


1.జలకములాడునపుడు వలువలు దాల్చునపుడు

పరస్పరం సంగమ సంగతుల పరాచికాలాడునపుడు

బిడియము వదిలివేసి,సిగ్గు తెరల తొలగించ

ఎంచలేనంతగా ఒకరినొకరుమించి ఆనందించ

అల్లుకపోతారు లతలై లతాంగులు సుందరాంగులు


2.వావివరుసలేవైనా వయసులు వ్యత్యాసమైన

మనసువిప్పి చెప్పుకొనగ మగువలు స్వతంత్రులు

నెలసరికి ప్రసూతికి మహిళకు మహిళే గురుసదృశంగా

సందేహ నివృత్తిలో సాంత్వన ప్రవృత్తిలో పడతులాదర్శంగా

అల్లుకపోతారు లతలై లతాంగులు సుందరాంగులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాయలమారి ప్రేమపేర ఒకపోరి

మరుపురాని గురుతుల గోదావరి

యవ్వనమంతా వరదల విరహాలు పారి

చెలి చేజారి విషాద కడలి పంచన నే జేరి


1.గలగలా రావాలు కనుమరుగాయే

స్ఫటికమంటి నీరంతా మురుగాయే

ప్రహాహమిపుడు కదలక మడుగాయే

జ్ఞాపకాల బరువుతో గుండె చెఱువాయే


2.కులాల కుళ్ళుతో కలుషితమాయే

మూఢనమ్మకాలవల్ల కల్మషమాయే

ఏ గొంతు తడుపుటకో ఏరు ఎడారాయే

సర్దుబాటు బాటలో నా కంట గోదారాయే

Monday, December 14, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కమలమేదో ముఖ కమలమేదో

మందారమేదో అధరారుణమేదో

ఒయ్యారి నీ ఒంటి నిండ ప్రకృతి

సౌందర్యానికి నీవే సరైన ఆకృతి


1.నీలిమేఘమాల నీ కురులలో

కొలనులోని కలువలు నీ కన్నులలో

రాలిపడే మల్లెలే నీ మోవిలో

విరిసిన విరితోటయే నీ మోములో


2.గిరులు నీ వక్షస్థలమ్ములో

ఝరులు నీ కటిప్రదేశమ్ములో

లోయలో అగాధాలొ అరణ్యాలో

ఎదురౌతుంటాయి నీ మేనిలో


https://youtu.be/MGrZcvlP_9M?si=N59qp0X78VpYOecK

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:కానడ

చిక్కుజడల జడదారి-చిక్కునాకు ఝర్ఝరి
నా చిక్కుల పరిహారి-చిక్కితి నిను కోరి కోరి
నమో నమస్త్రిపురారి-నమోస్తుతే మదనారి
శరణు శరణు నెలదారి-కరుణాకర పాహి భూరి

1.నిండిపో నా చిత్తమందు-ఉండిపో గుండెయందు
నా మనసే కైలాసమందు-భవ రుజలకు నీవె మందు
నమో నమస్త్రి పురారి-నమోస్తుతే మదనారి
శరణు శరణు నెలదారి-కరుణాకర పాహి భూరి

2.అర్పించితి నా మదే-రసనపై నీ నామమదే
పలవరింతు పదేపదే-నీ ఎడ భక్తి నాకుసంపదే
నమో నమస్త్రి పురారి-నమోస్తుతే మదనారి
శరణు శరణు నెలదారి-కరుణాకర పాహి భూరి


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందనివే లలనామణుల అందాలు

అవి గగన కుసుమ సమములు

అనుభూతించవే అంగనల పొంకాలు

అవి తావిలేని విరుల చందాలు

ఆరాధించాలి అపురూప సౌందర్యాన్ని

తరింపజేయాలి ఆస్వాదనలో జీవితాన్ని


1. కట్టు బొట్టులలో చక్కని సాంప్రదాయము

ఆకట్టుకొనే విధములో తెరచాటు సోయగము

సిగ్గులమొగ్గలౌతు మేనంతా సౌకుమార్యము

చూసిచూడగనే కలుగు ఎదనేదోచేసే ఆహ్లాదము

ఆరాధించాలి అపురూప సౌందర్యాన్ని

తరింపజేయాలి ఆస్వాదనలో జీవితాన్ని


2.మిసమిసలతొ  కసిరేపే నెరజాణతనము

ఉసిగొలిపే పరువాల మదన రంగస్థలము

కవ్వింపు చేష్టలతో మతినేమార్చు గుణము

అచ్చికబుచ్చికలతొ బుట్టలోపడవేసే మాటకారితనము

ఆరాధించాలి అపురూప సౌందర్యాన్ని

తరింపజేయాలి ఆస్వాదనలో జీవితాన్ని

 రచన,స్వరకల్పన&గానం :డా.రాఖీ


రాగం:చారుకేశి


చల్లనివాడే రేపల్లియవాడే

చిత్తముపై  మత్తునింక చల్లెడివాడే

నల్లనివాడే అల్లరివాడే

మెలమెల్లగ ఉల్లములే దోచెడివాడే


1.కల్లాకపటమే ఎరుగనట్టుంటాడు

ఎల్లలోకాలు నోట చూపెడుతుంటాడు

కల్లబొల్లిమాయల్లో పడగొడుతుంటాడు

వల్లమాలిన మైకంలో ముంచుతుంటాడు

అహం మమ భ్రమలందుంచుతాడు


2.జాడాపత్తాకలేక దొరకనేదొరకడు

జగమంతా తానే నిండి ఉంటాడు

జనన మరణాల చక్రం తిప్పుతుంటాడు

శరణాగతులకెపుడు వరమౌతుంటాడు

తానే ఇహపరమౌతుంటాడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కవితలా మారిపో ప్రతి రోజు

నిను స్ఫూర్తిగా గొనడమే నాకు రివాజు

నీ మృదుమంజుల భాషణతో

పరుగులిడును నా కలము

నీ పద మంజీర రవముతో

నా పదములౌను మంజులము


1.తలపున మెదులును నినుగాంచగ తులసికోట

భావనలో ఊరును  పలుకరించ తేనె తేట

నువు గాత్రం విప్పినంత ప్రతిఋతువున కోయిలపాట

నీ సన్నిధి అనవరతం పరిమళించు పూదోట


2.తూరుపు సింధూరం నీ నుదుటన మెరిసింది

చుక్కలదండు మల్లెచెండై నీ జడన అమరింది

అరవిరిసిన మందారం అధర మాక్రమించింది

గోదావరి గలగలయే నగవుల రవళించింది

https://youtu.be/qf399pW4K88?si=oyn4Gav6NeYoMkYM

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:జయంత శ్రీ

నిను అర్చించుటకే నాకున్నవి ఈ అవయవాలు
సాష్టాంగ ప్రణామాల అవినీ పదముల వాలు
నీ పదముల పొగడగ  పదములకే సవాలు
తిరుమలరాయా కలిగించు దివ్యమౌ అనుభవాలు
నమో వేంకటేశా  సంకట నాశా-ప్రభో శ్రీనివాసా శ్రితజన పోషా

1.ఉఛ్వాస నిశ్వాసల నిన్నే స్మరించనీ
మూసినా తెరచినా కనుల దర్శించనీ
ప్రతివస్తువు నీవేనను భావనతో స్పృశించనీ
నే చేరెడి ప్రతితావు తిరుమలగా ఎంచనీ
నమో వేంకటేశా  సంకట నాశా-ప్రభో శ్రీనివాసా శ్రితజన పోషా

2.నే పలికెడి పలుకుల్లో గోవిందా యని ధ్వనించనీ
నా చేతలన్నీ నీ సేవలుగానే పరిణమించనీ
నిమిత్తమాత్రుడనై నీ ధ్యానమందే తరించనీ
నా చిత్తములో కేవల నీ ధ్యాసనే అవతరించనీ
నమో వేంకటేశా  సంకట నాశా-ప్రభో శ్రీనివాసా శ్రితజన పోషా


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లేవక ఆగునా నిను చూసిన క్షణానా

కాటికి కాళ్ళుచాచు ముదుసలైనా

మానక సాగునా అతి ఘోర తపమైనా

నీవెంట పడక ఎటువంటి తాపసైనా

మెరుపు తీగ నీ అందం చెలీ అందించవే

జలపాతం నీపరువం  ప్రేయసీ ననుముంచవే


1.పడి ఛస్తాను నీకోసం బ్రతికినంతకాలం

కళ్ళప్పగిస్తాను కలకాలం నీవే ఇంద్రజాలం

 తలదించుతాయి కుంచెలు నినుదించలేక

కలవరమొందుతాయి కలములు భావమందించలేక

మెరుపు తీగ నీ అందం చెలీ అందించవే

జలపాతం నీపరువం  ప్రేయసీ ననుముంచవే


2.హంపిశిల్ప సౌష్ఠవం బలాదూరు నీముందు

ఖజరహో వైభవం దిగదుడుపే నీవీయ పొందు

ఖంగుతింటారు నినుగని వాత్సాయనాదులు

వెలితనుకొంటారు నీ ఊసెత్తని అష్టపదులు

మెరుపు తీగ నీ అందం చెలీ అందించవే

జలపాతం నీపరువం  ప్రేయసీ ననుముంచవే

 https://youtu.be/boGYOEw74mo


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రాణం పోతే మాత్రమేమి-ఇచ్చిన మాటకోసం

బ్రతుకే బూడిదైతే ఏమి-చేసిన బాస కోసం

ఆడితప్పక ఆలిని సైతం అమ్మాడు హరిశ్చంద్రుడు

పలికి బొంకక సుతునివండె సిరియాళుని పితరుడు

పెదవిదాటనీయనేల నీపలుకే ఫలించలేకుంటే

వాగ్దానమీయనేల చేతల కసాధ్యమయ్యేదుంటే


1.చేప్పిందేదైనా తప్పక చేయటం సత్యవ్రత సాధన

చేసిందేదైనా ధైర్యంగా చెప్పటం సూనృత పాలన

ఆత్మసాక్షికే నీవు జవాబుదారునిగా

ఆత్మవంచన చేసుకోని ధీరునిగా

మూణ్ణాళ్ళుంటె చాలు జన్మకోసార్థకత

సంతృప్తిని పొందుచాలు శాంతీ సౌఖ్యత


2.అబద్దాలు వింతైన అంతులేని అంటువ్యాధులు

అసత్యాలు ఎంతగ నరికినా పుట్టుకొచ్చు దైత్యులు

హానిచేస్తే చేయనీ వాస్తవమెరిగించగా

ప్రాప్తమైందె దొరకనీ నిజాలనే తెలుపగా

నిదురిస్తే చాలు నేడిక నిశ్చింతగా

గడిపేస్తే చాలు బ్రతుకు యధేచ్ఛగా


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వదలలేని తంట-చల్లనైన మంట

నీడలా మనవెంట స్నేహితమంట

మేలుకొలుపు పాట-అమ్మ సద్ది మూట

బ్రతుకు పూలబాట-స్నేహితమే ఏ పూట


1.నా కోసమె నీవనే గట్టి నమ్మిక

నీ కోసమె నేననూ చెలిమి గీతిక

అనుక్షణం పరస్పరం బాగోగుల కోరిక

వెన్నుతట్టి చేయిపట్టి నడిపించే పూచీయిక


2.ఆత్మనేనూ పరమాత్మ నీవుగా

త్వమేవాహమనే తత్త్వ రీతిగా

నేను దేహమై నీవు ప్రాణమైన తీరుగా

మైత్రిని నిర్వచించలేమను వెలితి తీరగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రేమను టాక్సీగ వాడటం నీకు బాగా తెలుసు

గుండెను మిక్సీలొ రుబ్బడం నీకు మరిమరి తెలుసు

కల కందామన్నా కునుకును దోచేయడం

కలుసుకుందామన్నా మాట దాటేయడం

నీకు బాగా తెలుసు మరిమరి తెలుసు


1.తన్నుక వస్తాయి పదాలెన్నొ నువు తలపుకు వస్తే

తపనలు మొలుస్తాయి ఎదన నీవెదుటికొస్తె

తప్పించక పోమాకే ఒయ్యారి  చుప్పనాతి

గొప్పలన్ని నీవల్లే నువులేక నేనధోగతి


2.ఉడికించుట కోసమే ఉవ్విళ్ళూరుతావు

నన్నే మార్చుటకే నాటకాలాడుతావు

పడిపోయానెప్పుడో  నీ ప్రణయ పథకానికి

నీకధీనమైనానే  మూడుముళ్ళ బంధానికి

Wednesday, December 9, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


స్పందన లేదేమిసాయి రాయిలా

వందనమిడుదునోయి దయగని రా ఇలా

ప్రత్యక్ష దైవమెవరు నువు వినా సాయీ ఈ ఇల

దీక్షగనిను వేడినా లక్ష్యపెట్టవేల హఠయోగిలా


1.నిను నమ్మితె నల్లేరు నడకలా

నిను కొలిచితె బ్రతుకు పూల పడకలా

నీ కృపతో నెరవేరును ప్రతీ కలా

భువిని నీవె కరుణకు నిలువెత్తు ప్రతీక లా

వింటిని నే నీగురించి మిన్నకుంటి వెందుకలా

నా మనవిని వినిసైతం పెడచెవినినీవు పెట్టకలా


2.విశ్వసించు విధముగ చూపు నీ ఘనతల

నను తరింపజేయగ తెలుపు నీ బోధల

నీ ప్రేమ కురింపించి తొలగించు మా బాధల

అనుభవైకవేద్యముగా పాడనీ నీ గాథల

ఎందరి తలరాతలో మార్చావే విధాతలా

తొందరగా సుందరమౌ  భవితనీయి నేతలా (నేత=శ్రీ మహావిష్ణువు)

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కళ్ళార చూస్తేనే కలగాలి కైపు

ఒళ్ళారబోస్తెనో ప్రతీ వనిత వెగటు 

అతివేగా మగమతికిల ఆహ్లాదం

ఆస్వాదించగ హృదయ ప్రమోదం

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా

జ్ఞానేంద్రియాలకే స్పురించాలి అందాలుగా


1.చెవితమ్మెల మెత్తదనం 

మెడవంపుల కమ్మదనం

చుంబనాల తీయదనం

నవ్వుల సంతూర్ వాదనం

 కనుకలికే చంద్రవదనం

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా

జ్ఞానేంద్రియాలకే స్పురించాలి అందాలుగా


2.తనువు తాక పులకరం

 మేని తావి శీతకరం

 రసనాగ్రమె ప్రియకరం

నుడుగు సడులె వశీకరం

మగువ మోము శ్రీకరం

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా

జ్ఞానేంద్రియాలకే స్పురించాలి అందాలుగా





సరిచేస్తాడు లెక్కలన్ని సిరి హృదయేశుడు

కొసరికొసరి వడ్డిస్తాడు ఆ వడ్డికాసులవాడు

గుణపాఠం నేర్పుతాడు అతి తెలివి తేటలకు

తగినశాస్తి చేస్తాడు మితిమీరిన మోసాలకు

శరణుశరణు గోవిందా పాహి ముకుందా

శరణాగత వత్సలా పరమానందా


1.దశావతారాలలో అవతరించినాడు

పంచాయుధాలతో దైత్యుల దునిమినాడు

నవ విధ భక్తులకు అధీనుడై పోతాడు

ఆరుకాలాలలోను మనకతడే రక్షకుడు

శరణుశరణు గోవిందా పాహి ముకుందా

శరణాగత వత్సలా పరమానందా


2.చతుర్దశ భువనాలకు పరిపాలకుడు

ఒక్కడే స్వామి  శ్రీమన్నారాయణుడు

ద్వాదశాదిత్యులకు మూలమైన వాడు

త్రిగుణాతీతుడు భువి తిరుమల వాసుడు

శరణుశరణు గోవిందా పాహి ముకుందా

శరణాగత వత్సలా పరమానందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హలధారుడే హాలాహలధారుడు

కృషీవలుడే ఇలలోన శూలధారుడు

సేద్యకారుడే అపర సద్యోజాతుడు

అన్నదాతయే అన్నపూర్ణ ప్రాణేశ్వరుడు

వందనాలు వందనాలు సైరిక శ్రేష్ఠునికి

హృదయ చందనాలు స్వయం శ్రేష్ఠునికి


1.ప్రకృతి పార్వతినే ప్రేమించువాడు

గంగమ్మను సతతము ఆశించువాడు

ఎద్దులనే  ఆలంబన చేకొన్న కేదారుడు

నరుడయ్యీ క్షుద్బాధ హరింయించువాడు

వందనాలు వందనాలు సైరిక శ్రేష్ఠునికి

హృదయ చందనాలు స్వయం శ్రేష్ఠునికి


2.దళారీల పాలబడే భోళా శంకరుడు

అక్షయ ఫలసాయమిచ్చు నిత్యబిచ్చగాడు

ప్రాణం మానం కాచే ప్రపంచేశ్వరుడు

కర్మను తప్పని కర్షకుడే ధరణీశ్వరుడు,

కన్నెర జేస్తే రైతే ప్రళయకాల రుద్రుడు

వందనాలు వందనాలు సైరిక శ్రేష్ఠునికి

హృదయ చందనాలు స్వయం శ్రేష్ఠునికి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆదివారమంటే అది ఒక వరమే

అలసిన తనువుకు  సంబరమే

ఏమని సెలవీయను సెలవుకున్న మహిమను

ఎంతగా ఆస్వాదించను మంచై కరిగే క్షణాలను


1.ఎదిరిచూపులెన్నెన్నో గడచిన నాటినుండే

ఎప్పటికి వస్తుందో మనసైన మన సండే

ప్రణాళికలు రచిస్తూనే మది పరవశిస్తుండే

రవివారం విందంటుంటే నోరూరుతుండే


2.నిద్రనుండి లేవడానికే  వొళ్ళు బద్దకించే

సర్దుకోవడానికే సగంరోజు సంకనాకె

ఏకిపీకి చూసేలోగా ఉన్నపొద్దింక  గ్రుంకే

కన్నుమూసి తెరిచేలోగా సండే కాస్త మండే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కన్నీటి కడలే నా కడలేని  జీవితం

కలల పడవలో నా తెగని ప్రయాణం

చెక్కుకున్న చిరుఆశలే చుక్కానిలై 

ఎనలేని ఎదురుతెన్నులే తెరచాపలై


1.అడుగడుగున ముంచెత్తే-ఆరాట కెరటాలు

నడుమ నడుమల్లో  జంజాట సుడిగుండాలు

హృదయ అగాధాలలో దాగిన బడబానలాలు

మూస్తున్నకొద్దీ పడవకు పడేటివెన్నో కన్నాలు


2.దాడిచేసే సొరచేపలు విత్తపు విపత్తులు

మ్రింగేసే తిమింగలాలు పుండుమీది పుట్రలు

వశపడని కుంభవృష్టిగా శారీరక రుగ్మతలు

సునామిగా కబళించే  మానసిక వ్యాధులు

Saturday, December 5, 2020

  రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూడాలని ఉంది

నీ మనసులోన ఏముందో

చెప్పాలని ఉంది 

నా గుండె ఏమంటూందో

పటాపంచలైపోనీ సందేహాలనీ

ఊరటచెందనీ మన దేహాలనీ


1.నాకెలా ఔతుందో అది నీకూ ఔతోందోని

నీకేలా అయ్యిందో అది నాకైంది కనుకని

అది ఇది ఒకటే అన్నది నీ మది చెబుతోంది

నా మది ఏనాడో నీదైంది అన్నదే నిజమని


2.పదేపదే అదేపనిగ నను నువు కదపగా

పదపదమును పదిలంగా నీకు నివేదించగా

ముదముకూర్చ పెదవుల నందించగా

నా ఎదనే స్వీకరించు విధిమాటగ విధిగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ భావనాలోకంలో విహరిస్తున్నావో

ఏ కల్పనా మైకంలో  విరహిస్తున్నావో

ప్రత్యూష సమయాన కొలనులో కమలంగా

అనూష తరుణాన పుష్యరాగ వర్ణంగా

అలజడిని రేపలేనే   నీ మానస సరోవరానా

ఒత్తిడిని పెంచలేనే నీ ప్రశాంత జీవనానా


1.ఒత్తిగిలి బజ్జున్న పసిపాప చందంగా

మత్తుగా మధువును గ్రోలే మధుపంగా

కొబ్బరాకు మాటున జాబిలి కిరణంగా

పూరెక్కల దాపున మౌక్తికాభరణంగా


2.ఏకాంత వనసీమల్లో ఏకాగ్ర తాపసిలా

ఊరి చివర గిరిశిఖరాన చిరుకోవెలలా

మలయ మారుతాన గుల్మొహర్ మాధురిలా

మంద్రస్వరాన వీనులవిందయే రసరాగఝరిలా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఎత్తులు పయ్యెత్తులు మత్తుగొలుపులే

మది చిత్తయ్యీ పోయేటి వలపు పిలుపులే

లలనా కాదనగలనా నీదాసుడనైనందు వలన

చల్లార్పే పనిచూడు మగడా తాళజాల ఈ జ్వలన


1.సొగసులు మూటగట్టి బిగువుగ దాచిపెట్టి

ఉంచాను సఖా ఇన్నేళ్ళుగ నీ కొఱకే అట్టిపెట్టి

ఏమరుపాటుగను ప్రియా చేజారని తీరుగను

కోర్కెలు ముడుపుగట్టి  పెట్టాను  ఆతృత బిగబట్టి


2.మదనుడె గురువుగా ప్రణయ పాఠాలునేర్చి

సంగమ సంగ్రామానికి కాలుదువ్వె నా మగటిమి

కొత్తలోకాలు గెలిపించి వింత మైకాల్లొ మురిపించి

తారాస్థాయిలో హాయిని కురిపించగ నీ ఈ పెనిమిటి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోదావరి నేనై తడపనా ననులేత నీ పాదాలను

చిరు తరగను నేనై ముద్దాడనా మువ్వల పట్టీలను

గడ్డిపరకను నేనై నీ అడుగుల మడుగులొత్తనా

అరికాళ్ళకు మట్టంటకుండ అరిచేతులు నావుంచనా


1.మధురమైన జ్ఞాపకమై  గిలిగింతలు పెట్టనా

పరువపు పరవశమై పులకింతల ముంచనా

ఆనందపు చెమరింతనై అవధులు తొలగించనా

కలలోనూ కమ్మని కలవరింతనై నిను వేధించనా


2.వణికే చలిలోన కౌగిళ్ళనెగళ్ళనే రాజేయనా

నీ అంగ ప్రాంగణాన పెదాల రంగవల్లులేయనా

మనసును పొగల చక్కెర పొంగళిగా అందించనా

ఊష్ణం ఊష్ణేన ఊష్ణమని నేను ఋజువు పరచనా


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వనిదేముంది నీ మోములో

నచ్చనిదేముంది నీ వదనసీమలో

ప్రతిరేయీ పున్నమే నీ సన్నిధిలో

అనుక్షణమూ స్వర్గమే నీ కౌగిలిలో


1.ఒద్దికగా నయగారమొలుకు నీ కురులు

పాపిట మెరిసేటి పావన సింధూరము

నుదుటన వెలిగేటి కుంకుమ తిలకము

మదనుని విల్లంటి ఎక్కిడిన కనుబొమలు


2.కోటేరులాటి మిసమిస వన్నెల నాసిక 

చామంతి కాంతినొలుకు చక్కని ముక్కుపుడక

కనులలో మనసుకు పంపే ప్రేమలేఖలు

కనుచూపులో రారమ్మని ఎదకు ఆహ్వానాలు


3.చెక్కిళ్ళలో విచ్చుకున్న సుమసౌరభాలు

పెదవులతో రగిలించే ప్రణయ సందేశాలు

చుబుకమునే ముద్దుచేయ అనుమతి పత్రాలు

నగవుల సెగల జల్లులో తడవగ ఆత్రాలు

Thursday, December 3, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తొంగిచూడు రైతు మనసులోకి

చెవియొగ్గు రైతుగుండె స్పందనకి

ఏసాయం కోరని వ్యవసాయం మానని

కృషీవలుని నిరసించుట న్యాయమా

కూడుబెట్టువాని పొట్టగొట్ట ధర్మమా


1 అమ్మ ఆకలి లేని దెవ్వరికిలలోన

రైతు వల్లనేకదా ఆహార ధాన్య ఉత్పాదన

కర్షకుని ఉనికికే ప్రభుత చేటు తేవాలా

జనమెక్కిన కొమ్మనే జనం నరుక్కోవాలా


2.కరువులు వరదలు ప్రకృతి భీభత్సాలు

విత్తనాల ఎరువుల వ్యాపారుల కుత్సితాలు

పురుగు మందు కల్తీలతొ కృంగే  వాస్తవాలు

కృషాణ కర్ణుడి పతనానికి కారణాలు వేలు


3.దిగుబడి రాబడి అంతంత మాత్రమాయె

గిట్టుబాటు ధర ఎన్నడు చట్టబాటపట్టదాయే

మద్దతు ధరసైతం హాలికునికి అయోమయమాయే

సంపన్నుల మయసభలో సైరికునికి అవమానమాయే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దారులన్నీ మూసుకపోయిన వేళ

చేష్టలుడిగి నిస్సత్తువగా నిలిచినవేళ

ఉదాసీనంగా మౌనంగా

నిర్లిప్తంగా దీనంగా

బ్రతుకే బరువై భవితే కరువై

మనసే మరుగై కన్నీరు చెఱువై


1. తలవంచక తప్పదు విధి ముందు

ఎంచకతప్పదు శాపంగా మదియందు

పగవాడికైనా రాకూడని దుస్థితి

ఏ జన్మకైనా పట్టరాని దుర్గతి

చూస్తూ ఉండలేము నిస్సహాయంగా

జీవితమే మారింది అయోమయంగా


2.చావనేదెంతటిదీ బ్రతుకు నరకమైతే

కాడనేది నందనమే ఇల్లువల్లకాడైతే

సమాంతర పైనము బాధలు కలతలతో

అంతెరుగని వైనము కడగండ్లు వెతలతో

నూరేళ్ళలో ఏనాడో ఉషోదయం

నా కళ్ళు ఎపుడౌనో వెన్నెలమయం

Monday, November 30, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వేలాల మల్లన్న వేములాడ రాజన్నా

దయగల్ల ధరంపురీ శ్రీరామలింగన్నా

ఎట్లనిన్ను పిలిచినా అట్లనే ఓయంటవ్

నోరుతెరిచి ఏదడిగిన సంబరంగ సయ్యంటవ్

భోళా శంకరునివి కాలకూట ధరునివి

గౌరమ్మ వరునివి ఘోరపాప హరునివి


1.మిద్దెలొద్దు మేడలొద్దు పదవులు అధికారమొద్దు

మణులు మాణిక్యాలు వరహాల మూటలొద్దు

చేసుకున్నవారికి నోచుకున్నంత మహదేవ

ప్రాప్తమున్న కాడికే దయచేయర సదాశివ

భోళా శంకరునివి కాలకూట ధరునివి

గౌరమ్మ వరునివి ఘోరపాప హరునివి


2.పస్తులుంచకుంటె చాలు పరమాన్నంబెట్టినట్టే

కంటికి కునుకుంటెచాలు కైలాసం ముట్టినట్టే

పిల్లా పాపలను సల్లంగా సూడు స్వామీ

కన్నతండ్రివి నీవె కదా మముకడతేర్చవేమి

భోళా శంకరునివి కాలకూట ధరునివి

గౌరమ్మ వరునివి ఘోరపాప హరునివి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


క్యాచీగా ఉండె ట్యూనేదో

మాచీగా ఉండె ఫీలేదో

నీతో  నన్నే కనెక్ట చేసేనే

నన్నే నీలోకి ఇంజెక్ట్ చేసెనే


1.లైఫంటే రియల్ ఫ్రండ్షిప్పే

ఎంతమంది ఎక్కితే అంతగొప్పే

లవ్వంటే రిలేషన్ షిప్పే

క్లారిటీ మిస్సైతె కడు ముప్పే


2.ఎంజాయ్ చెయ్యాలి ఎవ్రీ మినిట్

నోఛాన్స్ ఫర్ ఇఫ్ ఐండ్ బట్

ఓపెన్గ పలికించు నీ ఎద ట్రంపెట్

వేస్ట్ చేయబోకేది దొరికినా ఫుక్కట్

Sunday, November 29, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొమ్ముకాస్తూ కొంత మీడియా

అమ్ముడవుతూ వింత మీడియా

విలువలు విప్పేకుసుకుంది మీడియా

నిగ్గు తేలని వార్త వాగితె అది వాడియా


1.చదువరులే కరువైన తరుణంలో

పేపర్ లెస్సైన ఎన్విరాన్ మెంట్ లో

ఖర్చేమో తక్కువైన అంతర్జాలంలో

కన్ఫ్యూజన్ పెంచుతోంది నెటిజన్లలో


2.పార్టీల జాగ్గీర్లు టీవీ ఛానళ్ళలో

ఆత్మస్తుతి పరనింద నిత్యం ఆనోళ్ళలో

చదివేస్తే ఉన్నమతీ పోయిన చందంగా

సంచలనవార్తలే సమ్మోహనాస్త్రంగా


3.దొరికిన ఏ వేదిక వదలని లీడర్ లా

ఫేక్ లీకు విషయాలకు తామే ప్లీడర్ లా

ఫేస్బుక్ వాట్సప్ గ్రూపుల్లో వైరలయేలా

సమాంతరంగ సాగుతోంది సోషల్మీడియా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెలతెలవారిన వెలుగులలో

తెరిచీ తెరవని కన్నులలో

కదిలిన రూపం నీదే మిత్రమా

స్నేహానికి ప్రతిరూపం నీవే నేస్తమా

శుభోదయం మనసుకు శుభోదయం

శుభోదయం మనకిదె శుభోదయం


1.ఆకాశానికి వేసేద్దాం ఆశల నిచ్చెన

నిన్నకు రేపుకు నిర్మిద్దాం ఊహల వంతెన

దేహం వేరగు ప్రాణం ఒకటగు మిథునంగా

పరస్పరం ఆలంబనతో జీవిద్దాం హాయిగా

శుభోదయం మనసుకు శుభోదయం

శుభోదయం మనకిదె శుభోదయం


2.బీడుకు తోడై కలపండించే చినుకవుదాం

నైరాశ్యపు ఎడారినే నందనవని చేద్దాం

విచ్చని పెదవుల చిరుచిరు నగవుల పొద్దవుదాం

ఆకలి ప్రేగుల ఆర్తిని బాపగ అన్నపు ముద్దవుదాం

శుభోదయం మనసుకు శుభోదయం

శుభోదయం మనకిదె శుభోదయం

Saturday, November 28, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నునుసిగ్గును నేర్చుకుంది నిను చూసి సిగ్గు

చక్కదనం నెగ్గలేక నినుగని తల ఒగ్గు

దరహాసం కోరుకుంది నీ నగవుల నిగ్గు

అందగత్తెలెందరున్నా నామది నీవైపే మొగ్గు


1.అల్లుకుంది నీ రాకతొ పరిమళమేదో

పరచుకుంది మనసంతా పవిత్రభావమేదో

లాగుతోంది నీకేసి గతజన్మల బంధమేదో

మౌనభాష తెలుపుతోంది ప్రణయభావమేదో


2.కలిసే ఈ క్షణానికై యుగముల నిరీక్షణే

కనుచాటైతివా అది ఊచకోత శిక్షనే

తపస్సులే ఫలించినా దొరకని మోక్షానివి

నూరేళ్ళ నాబ్రతుకున నీవే పరమలక్ష్యానివి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బాంచెన్నీకల్మొక్తా నాకోటెయ్యి

సచ్చి నీ కడుపున బుడ్తా నన్నేగెల్పియ్యి

పదవినాకు ముఖ్యం కాదంటే సంకనాకిపోతా

అధికారమే లక్ష్యం లేదంటే నే వీథిపాలవుతా


1.రోడ్డుసంగతెందుకు గాలిమోటరే ఇస్తా

డ్రైను విషయమెందుకు నీకు వైను నే పోస్తా

కరెంటుమాట నసలెత్తకు జనరేటర్ పంపిస్తా

డీజిలెట్లా అని అడుగకు ఉచితంగా నే పోస్తా


2.త్రాగునీటికోసం వాటర్ బాటిళ్ళిస్తా

గ్రంథాలయాలెందుకు వాట్సప్ గ్రూప్పెడ్తా

పార్కులు ప్లే గ్రౌండ్ లేల పబ్జీలాంటి దందిస్తా

దురాక్రమణ చేసినా నీ వైపే నిలబడతా


3.మెత్తగ రోజూ నీగడ్డం నేగీకుత

  మీపిల్లల చీమిడైన నే తీసిపెడతా

అరచేయి అని చెప్పి మోచేయి నాకిస్తా

అరచేతిలొ వైకుంఠం అలవోకగ చూపిస్తా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దినదిన గండమే నీ కడుపుకు మెతుకు

చిరుగని గుడ్డకైన నోచలేదు నీ బ్రతుకు

తలదాచుకోనులేదు-నీకంటూ ఓ చోటు

సర్కారు ఇండ్లకు ఏమొచ్చొనొ గ్రహపాటు

అత్యంత విలువైంది నీకుంది  నీదైన ఓటు

తరుణమిదే ఓటుతొ నీ మనస్సునే చాటు


1)నీ ఉనికికి గుర్తింపే దేశాన నీ ఓటు

ఓటు వేయబోకుంటె నీకునీవె చేటు

గీతోపదేశమిదని ఓటువెయ్యి నరుడా

ఆత్మోపదేశానికె ఓటువెయ్యి పౌరుడా

వదులుకోకు అవకాశం  ఏ పూట ఓటువేయగా

చే జార్చుకోకు అధికారం నే తలరాత మార్చిరాయగా


2)కులపు గజ్జి సంకనెపుడు నాకబోకు

మతపు కుళ్ళు ప్రభావాన్కి లోనుకాకు

ఉమ్మేసిన బిర్యాని మద్యానికి సొల్లకార్చకు

ఒక్కనాటి బాగోతాన్కి బట్టలిప్పి ఆడకు

నిన్ను నువ్వు అమ్ముకోకు ఎన్నికల అంగట్లో

నీకు నీవె కొట్టుకోకు ఐదేళ్ళు మట్టి నీ నోట్లో

 https://youtu.be/pjZWgUKxH7c?si=oXF01aDtNMnM947o

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : మోహన

చంచలవే చెలీనీవు  ధనలక్ష్మిలా
సిగ్గరివేనీవు కరిమబ్బుచాటు శశిలా
తొంగిచూసి వెళతావు బెంగను కలిగించి
సెలికి తుర్రుమంటావు  ఎదలయ పెంచి

1.మనసుని తాకేవు పిల్లతెమ్మెరవై
తపనల తీర్చేవు వాన తుంపరవై
ప్రణయవీణ మీటుతావు స్వరఝరివై
సరాగాల ముంచుతావు రసధునివై

2.కలగా మారేవు రెప్పపాటులో
కవితగ వెలిసేవు ఒక్క ఉదుటిలో
స్ఫూర్తివైతావు  కవనార్తిని బాపగా
మూర్తివైతావు ఆరాధన చూపగా


 https://youtu.be/tN_U8w0pOBI


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మురిపించులే నెమలి పింఛము

మైమరపించులే నీ మురళి గానము

స్ఫురణకు రాగానే తనువే పరవశము

స్పృశించ రసానుభూతికై నామానసము

స్పృశించర సానుభూతికైనా మానసము


1.జీవము నీవైన దేహము నేను

భావము నీవైన మోహము నేను

విరహించితి విరమించితి నీకై ఇలను

భ్రమించితి రమించితి నాలో నేను

స్పృశించ రసానుభూతికై నామానసము

స్పృశించర సానుభూతికైనా మానసము


2.అన్నిట నినుజూచి నన్నే మరచి

సన్నుతి జేసితి మన్నన యాచించి

వెన్నల కన్నెల తిన్నగ వలచీ

వెన్నెల వేళల నన్నేల కలచీ

స్పృశించ రసానుభూతికై నామానసము

స్పృశించర సానుభూతికైనా మానసము

 (నేడు క్షీరాబ్ధి ద్వాదశి-సందర్భంగా)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మథించనీ నా మానస సాగరాన్ని

శోధించనీ నా అంతరంగ అగాధాన్ని

సచేతనాయోచన సురులొకవైపు

వికృతాలోచనాన్విత అసురులింకోవైపు

చిలుకనీ నా పలుకుల మురిపాలనీ

గాలించనీ నాచిత్తపు అంధకారాలనీ


1.అజ్ఞానమే ఘన మంధర పర్వతమై

సంకల్పమే తెగని వాసనల వాసుకియై

విచక్షణే ప్రణాళికల ఓరిమి కూర్మమై

గుణపాఠమే దిగమ్రింగు కాలకూటమై

చిలుకనీ నా పలుకుల మురిపాలనీ

గాలించనీ నాచిత్తపు అంధకారాలనీ


2.పథసూచిక కామధేనువేకాగా

ప్రేరణయే కల్పవృక్షమై అలరగా

శశి సిరి ప్రోద్బల ప్రోత్సాహకాలై వరలగా

ఫలితామృతమే సంతృప్తినీయగా

చిలుకనీ నా పలుకుల మురిపాలనీ

గాలించనీ నాచిత్తపు అంధకారాలనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రేమించనైనా సరే ప్రేమించవు

ద్వేషమైన నాపైన ఏల త్రుంచవు

కడగంటి చూపుకై పడిగాపులు పడితినే

కరకు హృదయమున్న అందాల పడతివే

ఎలా కరిగించను నీ ఎదను

ఎలా చిగురింపజేయను నీలో ప్రేమను


1.భోజుని ముందెవరైనా చెప్పేరు కవిత్వమే

 ఎదుటన నువ్వుంటే   కవితలేనా రాతు కావ్యమే..!!

నిదర్శనాలెన్నున్నా నమ్మవేం నీదర్శనమది భాగ్యమే

నే కవియను మాట నువులేక ఎప్పటికీ నాకయోగ్యమే

కమ్మనైన కవితలే రాయనా పులకించగా

రమ్యమైన గానమే చేయనా పరవశించగా

 

2.స్వర్గసౌధాలనే నీ పాదాల పరంచేయనా

స్వర్ణాభరణముల నిన్నే అలంకరించనా

చీనీ చీనాంబర చేలాంచలములే చెలీ నీకందించనా

నీ పదములు కందకుండ నా అరచేతులుంచి నడిపించనా

 కానుక నీయనా నా పసి మనసునే అర్పించి

అంకితమీయనా జీవితమే నీవశమొనరించి

 https://youtu.be/dTuyf1eNhAw


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అల్లాగా ఇల్లాగ ఎవరిని పిలవలేను

ఏసాయని  నోరుతెరచి అడగలేను

చిత్తమా తెలుపుమా సాయిని తలవగ మనసాయేనని

కలలోను ఇలలోను మనపాలిటి దైవమన సాయేనని

సాయిరాం- షిర్డి సాయిరాం -సాయిరాం జయ జయ సాయిరాం


1.ప్రతిక్షణం సాయినే స్మరిస్తా

సాయిబోధలే అనుసరిస్తా

గురువారం గుడికి వెళ్ళిదర్శిస్తా

సాయి దివ్యపాదం స్పర్శిస్తా

సాయిరాం- షిర్డి సాయిరాం -సాయిరాం జయ జయ సాయిరాం


2.పంచప్రాణాలు భక్తిగ వెలిగిస్తా

పంచహారతులు సాయికి అర్పిస్తా

పంచోపచార పూజైనా సాయికి నేచేస్తా

పల్లకిసేవలో హాయిగ నా భుజమందిస్తా

సాయిరాం- షిర్డి సాయిరాం -సాయిరాం జయ జయ సాయిరాం

Wednesday, November 25, 2020



దేనికి   ననుదూరం చేసావు

ఎందుకు  క్రిందకు తోసావు

నువ్వు నేను ఇద్దరమే ఉన్న లోకం నుండి

నాలో నీవు నీలో నేను అన్న మైకం నుండి

ఈ శోకాల సంద్రంలో పడద్రోసావు

నాటకాల రంగంలో ఆడిస్తున్నావు

ఓం నమో నారాయణా ఆర్తత్రాణ పరాయణా

 ఓం నమో మాధవా రమాధవా ఆపద్బాంధవా


1.లంపటాలనేవేవో అంటగట్టావు

జంజాటాలలో నిండా ఇరికించావు

అంతా నేనే మొత్తంనాదే  అనుకునేలా చేసావు

వింతైన మాయలతో చింతలెన్నో రేపావు

కన్నులకే స్వార్థపు పొరలను కప్పావు

విజ్ఞతకే చీకటి తెరలను దింపావు

ఓం నమో దామోదరా పరమదయాళా ధరా

ఓం నమో చక్రధరా శ్రీధరా భక్తవత్సలా దొరా


2.ప్రలోభాలతో చిత్తమునే చెరిచావు

లోభత్వముతో విత్తములో ముంచావు

అంతా నీకోసం  నా  వెంటతెమ్మంటావా

ఇసుమంతా తేలేనని వెక్కిరిస్తుంటావా

కేళినింక ఆపరా పరాత్పరా తాళలేనురా

చేదుకోర వేగమే ఆగలేను వేగలేనురా

ఓం నమో భగవతే వాసుదేవాయ కావరా

ఓం నమో తిరుమల వేంకటేశాయ బ్రోవరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రుసుములు చెల్లించినా సేవలు మృగ్యము

ఖరీదైనదైనా వస్తువు నాణ్యతే హీనము

భారతావనిలో గతిలేక బ్రతుకెంతొ దుర్భరము

తాతలు తాగిన నేతుల చరితలైతె మధురము

కళ్ళు తెరువు పౌరుడా కనీస హక్కులకై

పోరాడర వినియోగదారుడా వస్తుసేవల లెక్కలకై


1.పన్నులు ఎగ్గొట్టే తత్వమే ఎచటైనా

బిల్లడిగితె ఖాతరే చేయరెప్పుడైనా

విలువను మించిన మూల్యమే వస్తువేదానికైనా

ఆనవాయితైన టిప్పులే సేవలు అంతంత మాత్రమైనా

కళ్ళు తెరువు పౌరుడా కనీస హక్కులకై

పోరాడర వినియోగదారుడా వస్తుసేవల లెక్కలకై


2.టికెట్ కొని బస్సెక్కినా సీటే దొరకదాయె

ఆటోలో వెళ్ళినా మీటర్ దాటి వసూలాయె

పర్యామరణమంటూ క్యారీబ్యాగుకు చోరీయే

తయారీ ఆపివేయ ప్రభుతకు చోద్యమాయే

కళ్ళు తెరువు పౌరుడా కనీస హక్కులకై

పోరాడర వినియోగదారుడా వస్తుసేవల లెక్కలకై


3.ఇంటి టాక్స్ కట్టినా డ్రైనేజి రోడ్డు కరువాయే

బిల్లులు చెల్లించినా కరెంటు నీటి కటకటాయే

పార్కింగ్ కు చోటులేక వాహనాల వెతలాయే

మితిమీరిన అనుమతులే కడగండ్లకు మిషలాయే

కళ్ళు తెరువు పౌరుడా కనీస హక్కులకై

పోరాడర వినియోగదారుడా వస్తుసేవల లెక్కలకై

Tuesday, November 24, 2020

 కట్టబడిన దారం పతంగి మతిలొ ఘోరం

కట్టడిచేసే చుక్కాని నావ దృష్టిలో కౄరం

కట్టుబాట్ల సమాజం నాతికిపుడు పెను భారం

త్రెంచుకుంటె నియంత్రణం బ్రతుకు అథఃపాతాళం


1.గాలివాటుకే తేలిపోతానంటేనో గాలిపటం

రెక్కలున్న పక్షిలాగ భావిస్తే కడు మూర్ఖత్వం

ఏ చెట్టుకొమ్మకో చిక్కి చిరిగితే లంపటం

ఏ ముళ్ళపొదలొ వాలినా గుచ్చదా కంటకం


2.కడలి అలలపై పడవ ఊగాలనుకొంటే

ఇఛ్ఛారీతిగ తన పయనం సాగాలనుకొంటే

ఊహించని ఉప్పెనేదొ ముంచాలని చూస్తుంది

వాయుగుండమొకటి  గల్లంతు చేస్తుంది


3.నా దేహం నా ఇష్టం అని అంగన వాపోతే

అందాల ఆరబోత స్వేఛ్ఛగా తలపోస్తే

విశృంఖలత్వమే జన్మహక్కుగ వాదిస్తే

అత్యాచార పర్వానికి తరుణియే తెరతీస్తే

Monday, November 23, 2020


https://youtu.be/Sm6QEWQ2U1U

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


ప్రత్యక్షర సరస్వతి ప్రత్యక్ష భారతి నమామ్యహం

సాక్షన్మోక్షకరి సప్తస్వర ఝరి వీణాధరీ ప్రణమామ్యహం


1.చతురానన దేవేరి చతుర్వేద పారాయణి

చతుర కవన వరదాయిని  చతుర్భుజి జనని


2.సప్త మాతృక స్వరూపిణి  సప్తవర్ణ సంశోభిణి

సప్త ఋషీ సంసేవిని సప్త వ్యసన పరిహారిణి

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:రేవతి


పరమేశ్వరా నినదించరా నా ప్రాణ ప్రణవమై

హే నటేశ్వరా నర్తించరా నా హృదయరావమై 

నా ఈర్ష్యనే దహియించరా నీ నయన జ్వాలలా 

నా అహమునే అదిమేయరా  నీ తాండవ పదముల 

కాలకాల నీలకంఠ ఝటాజూట గంగాధరా శంభో

శూలపాణి చంద్రమౌళి భస్మాంగా దిగంబరా ప్రభో

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.నా నడకల అడుగులు తడబడగా

చేయిపట్టి నడిపించు ననుగన్నతండ్రిగా

పున్నామ నరకాన్ని తప్పించగా

పుట్టరా నా కడుపున పుత్రుడిగా

భవా సదాశివా భవానీ భరువా భక్తబాంధవా ద్రువా

ఆత్మసంభవా సాంబశివా నభవా విశ్వంభర విభవా

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2.జీవన్ముక్తి పథము నను జేర్చెడి

సద్గురుడవు నీవై సరగునరా హరా

జన్మరాహిత్యమే నాకిపుడొసగెడి

పరాత్పరుడవై నీవే పదపడిరా శంకరా

కైలాసవాస నాగభూష మహేశా గిరీశా గిరిజేశా

సకల భూతేశా సర్వ జీవేశా విశ్వేశా దేవేశా గుడాకేశా

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

Sunday, November 22, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఆత్మలింగేశ్వరా ఏమిటీ అంతర్మదన

శ్రీరామలింగేశ్వరా  ఎంతకూ ఆరని తపన

ఎన్నో ప్రసాదించినా ఎందుకీ అశాంతి

ఈ అంధకార బంధుర జీవనంలో నీవే విద్యుత్కాంతి

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


1.ఐహికమౌ ఈప్సితాలు అంతెరుగని వాసనలు

భౌతికమౌ కామనలు భవ రోగ దుఃఖములు

 మాయాన్విత నీసృష్టి నిరంతరం బాహ్యదృష్టి

కురిపించు దయావృష్టి కలిగించగ పరితుష్టి

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


2. ఒకవైపున గమ్యము వ్యతిరేక పయనము

జన్మ మోక్ష కారణం  జనన మరణ వ్యతికలనం

అంతర్ముఖుడ గావించు అద్వైతమునెరిగించు

నిత్యకైవల్యమౌ నీ పదమును అనుగ్రహించు

ఓం నమః శివాయ ఓం నమః శివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జీవిస్తున్నా నేనో జీవచ్ఛవంలా

ఉండీ లేక బ్రతుకే నరకంలా

చినుకే రాలని బీడులా

చివురే వేయని మోడులా

నువు లేక నే ఎడారిలా గొంతే తడారిఇలా

పున్నమి జాబిలినే కోరే చకోరిలా


1.అనుభూతులె రాయని పుస్తకమై

నీమధురోహయె వీడని జ్ఞాపకమై

 నీతో గడిపిన సమయం వెన్నెల్లో గోదారియై

నీతో వేసిన అడుగులే పొగడపూల దారియై

కాలపు చదరంగంలో బలియైన తొలిబంటునై

అంతస్తుల వైకుంఠపాళిలో పామునోటి పావునై


2.గుడిమెట్లు నిన్నెపుడూ గుర్తేచేస్తుంటే

బడి గోడల రాతలూ చెరిగిపోకుంటే

ఎలామరచిపోగలను నీ పెదవంచు మధురిమను

ఎలా వదులుకోగలను నీ కౌగిటి ఘుమఘుమను

పదేపదే నినదిస్తుంటా నీ హృదయ నాదానిగా

మరోజన్మ ఎత్తైనా నిను చేసుకుంటా నాదానిగా

 

https://youtu.be/YZW7XCta0cE?si=bOs2_lHogol7ZXWw

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేతిబీరకాయలో నేతిరీతి

నేటి రాజకీయాలలో  నీతి

పదవి ఒక్కటే ప్రాధాన్యం 

ప్రజాసేవ అన్నది శూన్యం

లాభసాటి వ్యాపారం  రాజకీయం

పార్టీ ఏదైనా అన్నిటికీ అధికారమే ధ్యేయం


1.నిన్నటి బూతుల పార్టీ నేడది అదర్శవంతము

ఈనాటి విలువల పార్టీ రేపటి డర్టీ పార్టీగ విధితము

మ్యాజిక్ ట్రిక్స్ ని మించినవే పాలిట్రిక్స్

గెలవగ మాయోపాయాలదే పొలిటికల్ గేమ్

లాభసాటి వ్యాపారం  రాజకీయం

పార్టీ ఏదైనా అన్నిటికీ అధికారమే ధ్యేయం


2.గుడ్డిలొ మెల్ల పార్టే ఎంపికలో అవకాశం

తక్కువ అవినీతి లీడర్ ఎన్నికే ఓటరు ప్రారబ్ధం

కులమతాల ప్రభావము కరెన్సీ ప్రలోభము

వాగ్దాన ప్రవాహము తాయిలాల పంపకము

లాభసాటి వ్యాపారం  రాజకీయం

పార్టీ ఏదైనా అన్నిటికీ అధికారమే ధ్యేయం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కరువే కరువు మగజాతి సరసులకు

కనుచూపు సాగుతుంది కలికిపై కనిపించనంతమేరకు

మగ బలహీనత భలేతెలుసులే నారీమణులకు

విచ్చుకత్తులే వాడేరు రెచ్చగొట్టి చిచ్చుపెట్టేందుకు


1.అందాలకు కేంద్రకాలు ఎరిగేరు నెరజాణలు

మీటకుండ మ్రోగేటి సింగార రసవీణలు

నాభిచూపి నట్టేల్లో బ్రతుకునే ముంచేస్తారు

నడుము కదిపి రారాజులనే గులాంగిరీ చేయిస్తారు


2.చూపుతో చూపుకలిపి మత్తుమందు చల్లేస్తారు

వీపు సైతం చూపి మరీ కనికట్టు చేసేస్తారు

అధరవిన్యాసాలతో పూబాణాలే వేస్తారు

దరహాస చంద్రికలతో దాసులుగా మారుస్తారు

టెంకాయ కొడతాను వేంకటేశుడనీకు

ఏ వంక మావంక నీవింక రానీకు

వెంట్రుకల ముడుపునే ఇడుదునయ్యా స్వామి

ఇడుములను మానుండి కడతేర్చవయ్యా

ఏడుకొండలవాడ గోవిందా వడ్డికాసులవాడ గోవిందా

అపద మొక్కులవాడ గోవిందా ఆనందదాయకా గోవిందా


1.కాలినడకన కొండలేడూ ఎక్కి 

చక్కనీ నీ మోము దర్శింతుమయ్యా

ఆయురారోగ్య భోగభాగ్యాలనే

మాకొసగి మమ్మిపుడె కరుణించవయ్యా

ఏడుకొండలవాడ గోవిందా వడ్డికాసులవాడ గోవిందా

అపద మొక్కులవాడ గోవిందా ఆనందదాయకా గోవిందా


2.పాలకడలిలోన ఫణిరాజుపైన 

పడుకొని బడలికను బాసేటి స్వామి

అలసినాను నేను సంసార కడలీది

చేయూతనాకిచ్చి చేదుకోవయ్యా మమ్మాదుకోవయ్యా

ఏడుకొండలవాడ గోవిందా వడ్డికాసులవాడ గోవిందా

అపద౹మొక్కులవాడ గోవిందా ఆనందదాయకా గోవిందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సరసమంతా భావనలోనే

రసికతంతా కామనలోనే

అందమన్నది ఉత్ప్రేరకమే

పరువమన్నది ఒక కారకమే

తమకాల గమకాల్లో

అప్సరస అప్పలమ్మ ఒకరకమే


1.సౌందర్యపు కొలమానం చూసే నయనం

ఏది గొప్ప ఏది తక్కువ తూచలేదు తులనం

ఉపమానమెప్పుడు కాబోదు సరిసమానం

దైవదత్తమైన మేనే మనిషికి తగు బహుమానం


2.జగన్మోహినియన్నదే  కవుల కావ్యకల్పనయే

అతిలోకసుందరి యంటూ లేదనేది వాస్తవమే

మనవైన వీక్షణలన్నీ ఆపేక్షతా సాపేక్షాలే

మనసైన ఏ మగువైనా అందించు మోక్షాలే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక గూగుల్ సెర్చ్డ్ పిక్కే కదా శుభోదయం

ఒక కాపీ పేస్ట్ లుక్కే కదా శుభోదయం

ఒక వాట్సప్  బ్రాడ్ కాస్ట్ పోస్టే కదా శుభోదయం

ఒక మెసెంజర్ లిస్ట్ సెండే కదా శుభోదయం

మనస్ఫూర్తిగా స్నేహస్ఫూర్తిగా పరామర్శయే శుభోదయం

ఉదయాన్నే సహృదయంతో పలకరింపే శుభోదయం


1.తడిగా మడిగా వడివడిగా అలవడునొక శుభోదయం

గొడవగొడవగా అలజడిరేపుతు ఆరంభం ఒక శుభోదయం

దీక్షా దక్షత లక్షణమై పరీక్షల సాధనలో ఒక శుభోదయం

నడినెత్తికి పొద్దెక్కినా మెలకువకై బద్దకించెడిదొక శుభోదయం

మనస్ఫూర్తిగా స్నేహస్ఫూర్తిగా పరామర్శయే శుభోదయం

ఉదయాన్నే సహృదయంతో పలకరింపే శుభోదయం


2.మొక్కుబడిగా చెప్పేనుడిగా నప్పేనా శుభోదయం

ఆశయాలను ఆకాంక్షలను వక్కాణిస్తే శుభోదయం

చేసిన తప్పులు చేయక మెదిలితె అదేకదా శుభోదయం

క్రమశిక్షణతో ఘనలక్ష్యముతో అడుగేస్తే అది శుభోదయం

మనస్ఫూర్తిగా స్నేహస్ఫూర్తిగా పరామర్శయే శుభోదయం

ఉదయాన్నే సహృదయంతో పలకరింపే శుభోదయం

Wednesday, November 18, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఓసాయీ శ్రీసాయీ-నీ రూపాలే మా మదిలో వెలిసాయి

ఓసాయీ మా సాయీ-నీ  కన్నుల వెన్నెలలో మా బ్రతుకులు తడిసాయి

ఓ సాయీ ఓ సాయీ-నీ వాదుకొంటావని మా మనసులు వేచి చూసాయి

ఓ సాయీ ఓ సాయీ-అంటూ పిలిచి పిలిచి మా నోళ్ళే అలిసాయి

సాయీ  సాయీ షిరిడీ సాయీ-ఇకనైనా మా పైనా దయగని రావేలనోయీ


1.సాయీ నీవున్న చోటల్లా హాయే హాయీ

హాయి ఉన్నచోటల్లా అది నీ కృపవల్లనేనోయీ

తెలవారునా కలతీరునా ఈ మా కష్టాల రేయీ

తినునంతలోనే జరిగింది ఏమో చేదాయెగా బ్రతుకు మిఠాయి

ఓ సాయీ ఓ సాయీ-అంటూ పిలిచి పిలిచి మా నోళ్ళే అలిసాయి

సాయీ  సాయీ షిరిడీ సాయీ-ఇకనైనా మా పైనా దయగని రావేలనోయీ


2.వక్రంగ మారే మా నుదుటిగీత మరి మరి మార్చి రాయీ

నవనీతమైన నీ హృదయమేల అయ్యింది బండరాయి

అర్థాంతరంగా ఐనా సరే మా నాటిక తెరదించవోయి

ఏ నాటికైనా మా నాటికైతే వైరులకైనా వలదింక వలదోయి

ఓ సాయీ ఓ సాయీ-అంటూ పిలిచి పిలిచి మా నోళ్ళే అలిసాయి

సాయీ  సాయీ షిరిడీ సాయీ-ఇకనైనా మా పైనా దయగని రావేలనోయీ

 (అంతర్జాతీయ మగమహారాజుల వేడుక జరుపుకుంటున్న సాటి పురుష పుంగవులందరికీ)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మన ప్రమేయమే లేనిది పుట్టుక

చేసుకోలేము నచ్చినట్టు ఎంపిక

తీర్చిదిద్దుకున్నప్పుడె బ్రతుకు సార్థకం

విచక్షణే శిక్షణైతె వికాసమే బహుమానం

శుభాకాంక్షలివేనీకు పుట్టిన రోజున

ఆచితూచి అడుగేస్తూ సాగు ప్రగతి పథాన


1.విద్య వినయము శీలము సంస్కారము

మనని మనం చెక్కుకొనగ భవిత భవ్య శిల్పము

కన్నవారి ఎడల కలిగితీరాలి మమతానురాగము

పరుల పట్ల చూపగలగాలి  సౌహార్ద్రతా భావము

శుభాకాంక్షలివేనీకు పుట్టిన రోజున

ఆచితూచి అడుగేస్తూ సాగు ప్రగతి పథాన


2.మానవీయ విలువలతో మనం మనగలగాలి

దానము పరోపకారము కాస్తైనా అలవడాలి

జీవకారుణ్యమే దయమీరగా కనబరచాలి

విశ్వజనీనమైన ప్రేమ జగమంతా పంచాలి

శుభాకాంక్షలివేనీకు పుట్టిన రోజున

ఆచితూచి అడుగేస్తూ సాగు ప్రగతి పథాన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మరణించే పనిలేదు భౌతికంగా

చావుని తలపోసినా అంతే నైతికంగా

జీవశ్చవాలుగా సాగేటి జీవితాలెన్నో

నరకమే మేలని భావించే బ్రతుకులెన్నో


1.చెప్పుకోలేని తీవ్ర మనోవేదన

తప్పుకోలేని బాధ్యతల యాతన

ఎప్పటికీ ఆరిపోని గుండెమంటలు

ఉప్పెనలా ముంచెత్తే అశ్రుధారలు


2.ఎంత ఈదినా ఒడవని జలధి

ఎంత వేచినా లేదాయె వెతలకు సమాధి

మృతి కొకపర్యాయమే జ్వలించే చితి

అనుక్షణం మరణంతో బ్రతుకంతా హారతి

https://youtu.be/Nprz_emrMdg?si=Wtasv2F9Sjk-8Kpz

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం :హంస నాదం


మూసిన కనుతెరవగ హామీ లేదు

ఈ రాతిరి తెలవారగ ఊహే లేదు

అందుకే అందుకో నేస్తమా ఈ శుభరాత్రి పలకరింత

చివరి పలుకు నీతోగనక మిత్రమా ఎద పులకరింత


1.శుభోదయంతొ మొదలైంది ఈ రోజు

కొత్తదనం లేకుంటే ప్రతిరోజో రివాజు

మంచిచెడుల వేసుకోవాలిపుడు బేరీజు

అంటుకుంటె దులపాలి చింతల బూజు

ఉన్నతికీ అధోగతికి నీకు నీవె తరాజు


2.పరిపక్వత చెందాలి నిన్నకు నేటికీ

ప్రగతిని సాధించాలి దీక్షగ ముమ్మాటికీ

గతపు రథం ఎక్కితే భవిత పథం చేరలేవు

నిశ్చింతగ గడిపితే ఇపుడే ఆనందతావు

కంటినిండ కునుకు పడితె కలలరేవు చేరేవు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మరెలా మరుమల్లెవై విరియకుంటే

తమరిలా చిరుజల్లులా తడపకుంటే

ప్రేరణ లేక నేను కవిగ శూన్యమే

స్ఫూర్తిని కానకుంటె కవిత మృగ్యమే


నను చంపివేయకే కనిపించక

నా కొంప దీయకే మురిపించక

దుంపతెంచబోకే కవ్వించక

నట్టేట ముంచబోకే దాటించక


1.నీ ఊహ మెదిలితే కలం కదులుతుంది

నీ భావన కలిగితే అది కవితౌతుంది

నీ తలపు రేగితే గీతమై వెలుస్తుంది

కలలోకి వస్తెచాలు కావ్యమే మొలుస్తుంది


2.క్రీగంట చూసినా ఒళ్ళుపులకరిస్తుంది

కాసింత నవ్వితివా ఎదలయ హెచ్చుతుంది

పట్టించుకుంటివా పట్టరానిరానందం

ప్రశంసించ బూనితివా  కవనసంద్రం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కస్తూరి పరిమళం ప్రియతమా నువ్వు

సిరిమల్లెల  ఘుమఘుమే నీ నవ్వు

కేసరి కమ్మదనమే నీ మానసం

జవ్వాజి సౌరభం నీ అనురాగం


1.యాలకులకున్న పసి నీ పలుకులు 

   మొగిలి పొదల వేదు నీ జిలుగులు 

   శ్రీచందన గంధాలు నీ పరువాలు

  పారిజాత నెత్తావులు ప్రణయాలు


2.మట్టివాసనే నీ సహజ సౌందర్యం

  మంచినెయ్యి గుభాళింపు నీతో నెయ్యం

 చంపకపుష్పాల వలపు నీ వలపు

 మరువపు నిగ్గారు నీతో పొందు పొందు

https://youtu.be/HtDxNBRBOb0?si=XUpxbBLtohd7ZYt8


 రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


అరవింద నీ వదనం నెఱి యందము

అరవిరిసిన అధరాల్లో మకరందము

ఓరకంటి చూపుల్లో కవ్వింతల వింతలే

దోరదోర బుగ్గల్లో సిగ్గుల పులకింతలే


1.నుదుటన మెరిసింది పావన సింధూరం

పాపిటి బిళ్ళతో ఇనుమడించె సౌందర్యం

మిసమిసలు ఎన్నెన్నో నీ పసిడి మేనులో

గుసగుసల జూకాలే మిడిసేను నీ వీనుల్లో


2.కృష్ణగంగయై దూకే నీ కురుల జలపాతం

అలవోకగ స్పృశించే చిలిపి మలయమారుతం

నీ హావభావాల్లో నిత్యమూ ఆనంద నందనం

నీ స్నేహ కవనాల్లో ప్రాప్తమే అనురాగ చందనం

Tuesday, November 17, 2020


https://youtu.be/kCCkOarRzdc?si=SEvxbXTanh9RfUMk

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అన్నీ ఉన్నట్టే ఉంటాయి కొందరికి

అనుభవయోగ్యతే పూజ్యమై

ఏవీ ఉండనే ఉండవింకొందరికి

ప్రతివిలాసము అనుభవైకవేద్యమై

లోటేదో చేస్తాడు నిటలేశ్వరుడు

లేనిచోట మరొకటేదొ పూరిస్తూ

పాటలెన్నొ రాయిస్తూ పరమేశ్వరుడు

పాటవమే లేక నా నోటి పాటకూ


1.తాగిన గరళాన్ని కాస్త నా గళాన నింపి

గాత్రాన్నిచేసాడు కర్ణకఠోరం

మూడోకంటిలోని మంట కంఠాన నిలిపి

నా గొంతును మార్చాడు కడు దుర్భరం

గుండెనుండి తేనెపిండి చేస్తాశివాభిషేకం

నా స్వరమున మధురిమకు హరునిదేభారం


2.సపస సాధనంటె సదా సదాశివనామమె

రిషభ గాంధార మధ్యమ ధైవత నిషాదసంయుతమె

సంగీతార్చనలో తరించనీ నే జన్మ జన్మలూ

నాదశరీరుడా నటరాజులొ లయమవనీ పంచప్రాణములూ

నవనాడుల మీటుతూ నవరాగమాలపించ

నే పునీతమై కడతేరనీ శివైక్యమై

Ok 

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సక్కనైన మొకమున్న సిన్నదాన

సూడనైన సిక్కవాయె ఏ పొద్దున

పున్నామికైనా కానవచ్చు సందమామ

పున్నెమెంతొ సేయాలి దినాము నినుజూడ


1.గుడిమెట్లకాడ నేను కాపుకాస్తిని

ఏటిగట్టు దాపున ఎతికి చూస్తిని

సంతకైనా వస్తావని సంబురపడితిని

ఆడ ఈడ జాడగనక దిగులు పడితిని


2.నీ సోపతి నీలవేణి నడిగినా చెప్పదాయె

మీ చెల్లెలు మంగైతే చెంగున పారిపోయె

తెగబడి మీఅన్ననడుగ వీపు బడితె పూజాయే

గుండెకే ముల్లుగుచ్చ నీవందని రోజాయే


చిత్రం: Agacharya Artist

 రచన,స్వరకల్దన&గానం:డా.రాఖీ


గూడులోకి దూరే పిల్ల పిచ్చుకలా

పసిడి పంజరంలో రామ చిలుకలా

మెలకువ రాగానే మరిచేటి కలలా

తెల్లవారి చందమామ జ్యోత్స్నికలా

ఎందుకలా సూర్యకళా గుండెనెపుడు గిల్లకలా


1.ఘనఘనాల మాటు సౌధామినిలా

   ఎంతకూ వేకువవని శర్వర యామినిలా

   తలతిప్పని రాజవీథి గజగామినిలా

   జలతారు ముసుగులో సురభామినిలా

   ఎందుకలా సూర్యకళా గుండెనెపుడు గిల్లకలా


2.బెదురు చూపు చూసే హరిణిలా

   కొత్తావకాయతొ నిండిన భరణిలా

   ఉత్సవాలకే రంగులీను పుష్కరిణిలా

   ఊరించి ఉడికించీ కరుణించని తరుణిలా

   ఎందుకలా సూర్యకళా గుండెనెపుడు గిల్లకలా

OK



ఆవుల కాచినోడె అర్జునుడు

ఆపన్నుల బ్రోచినోడె భగవంతుడు

శివుడైనా కేశవుడైనా 

సరగున కరుణించిన స్మరణీయులు

హరుడైనా శ్రీ హరియైనా

వరములనిచ్చినపుడె ఆదరణీయులు


ఆవుల కాచినోడె అర్జునుడు

ఆపన్నుల బ్రోచినోడె భగవంతుడు

శివుడైనా కేశవుడైనా 

సరగున కరుణించిన స్మరణీయులు

హరుడైనా శ్రీ హరియైనా

వరములనిచ్చినపుడె ఆదరణీయులు


గుళ్ళూ గోపురాలు వందలు వేలు

అడుగడుగున మ్రొక్కులు ముడుపులు

పూజలు ఉత్సవాలు ఎన్నో పర్వదినాలు

భజనలు స్తోత్రాలు విన్నపాలు ప్రార్థనలు

విభవానికి కొదవలేదు కృప జాడైతె లేదు


ఆవుల కాచినోడె అర్జునుడు

ఆపన్నుల బ్రోచినోడె భగవంతుడు

శివుడైనా కేశవుడైనా 

సరగున కరుణించిన స్మరణీయులు

హరుడైనా శ్రీ హరియైనా

వరములనిచ్చినపుడె ఆదరణీయులు


అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు

దైవత్వం నొక్కితెలుపు ఉపాఖ్యానాలు

మనదాకా రానప్పుడు మహిమలెన్నైతెనేమి

కట్టుకథలు లీలలైతె  గుట్టలుగా లాభమేమి

ఉనికి ఋజువు పరచగా అవతరించరేమి

-తరింపజేయరేమి


ఆవుల కాచినోడె అర్జునుడు

ఆపన్నుల బ్రోచినోడె భగవంతుడు

శివుడైనా కేశవుడైనా 

సరగున కరుణించిన స్మరణీయులు

హరుడైనా శ్రీ హరియైనా

వరములనిచ్చినపుడె ఆదరణీయులు


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


"దొందూ దొందే"


ఇస్తా అన్న మగవాడిని నమ్మకు

మనసిస్తా అన్న మగవాడిని నమ్మకు

వస్తా అన్న మగువనైతె నమ్మకు

తోడొస్తా అన్న మగువనెపుడు నమ్మకు

వ్యాపార లావాదేవీ లవ్వంటే

ఇచ్చి పుచ్చుకోవడమే ప్రేమంటే


1.నచ్చినంత వరకే డేటింగ్ ఔటింగ్

బోరుకొట్టినప్పుడిక హాప్పీగా బ్రేకప్ 

గాలివాలు చూసి తూర్పార పట్టాలి

పర్స్ బరువుచూసి బాయ్ ఫ్రెండ్ ని పట్టాలి

క్రేజ్ తగ్గనప్పుడే షాపింగ్ షాకెట్టాలి

క్రెడిట్ డెబిట్ కార్డులన్ని డిమ్కీ కొట్టాలి

కొత్తవాడికోసం సెర్చింగ్ మొదలెట్టాలి


2.ఎవరినెలా పడగొట్టాలో డ్రామాలాడాలి

ప్రేమాదోమా లవ్వు లస్క్ హస్కే కొట్టాలి

రిచ్ నెస్ కనబరచి బురిడీ కొట్టించాలి

హోటళ్ళు పబ్బులంటు బుట్టలొ వేయాలి

దొరికినకాడికి వొళ్ళు జుర్రుకోవాలి

గిట్టుబాటయ్యేలాగ ఓ పట్టె పట్టాలి

అటుదిటుకాగానే మరో పిట్టను పట్టాలి

Sunday, November 15, 2020

https://youtu.be/kN2AdaZHqgc?si=syUDH0aMTWMJ4FFm

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: బౌళి

నీ ఆనతిలేక జగతి పరుగెట్టునా
నీ ఆజ్ఞలేకనే చీమైనా కుట్టునా
నీ సంకల్పముతో సృష్టి స్థితి లయములు
నీ అభీష్టమే జన సృజన మరణ పాలయములు
ఈశ్వరా నటేశ్వరా విశ్వేశ్వరా పరమేశ్వరా
హరహరా పరాత్పరా శశిధరా నీలకంధరా

1.మా నడతకు మా నడకకు హేతువునీవే
మాలో మానవతకు దానవతకు కారణమీవే
మేమొనరించెడి నేరములు దోషములు నీవే
చేసే పచ్చిమోసాలు వేసే పిచ్చి వేషాలు నీవే
పరీక్షలు మాకేల అక్షరరూపా శివా విరూపాక్షా
శిక్షలు వేయేల వేయనేల వ్యోమకేశా త్ర్యక్షా

2.ఆకలిదప్పులు నిద్రాభయములు నీ వరాలు
వ్యాధులు బాధలు నలతలు నొప్పులు గ్రహచారాలు
నిగ్రహ శూన్యులము పరిగ్రహించు మా అపచారాలు ఆగ్రహమేలనయ్య అనుగ్రహించు నీవైన ఇహపరాలు
ఈశ్వరా నటేశ్వరా విశ్వేశ్వరా పరమేశ్వరా
హరహరా పరాత్పరా శశిధరా నీలకంధరా



https://youtu.be/Y30TITYGLxM?si=PgCfBERkiggvk3wu

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


కన్నులు దివ్వెలు చూపులు దీపాలు

చిరు నవ్వులు సరదాలు మతాబులు

కసుబుసులు చిటపటలే పటాసులు

అలకలు అనునయాలు పూలబాణాలు

అను నిత్యం ఇంటింటా దీపావళి

ప్రతి పూట అనుకుంటే ఆనంద రవళి


1.పొరపొచ్చాల నరకులనే దునుమాడి

  సర్దుబాటు బాటలో సత్యభామా కృష్ణులు

  కాపురాన ఆధిపత్య ఊసేలేక 

 సంసారం సాగించగ తారాజువ్వలా

అను నిత్యం ఇంటింటా దీపావళి

ప్రతి పూటా మదిమదిలో ఆనంద రవళి


2.పిల్లల అల్లరులే కాకరపువ్వొత్తులు

మిడిపాటులే ఎగసే చిచ్చుబుడ్డీలు

ఒడిదుడుకుల సుడులే విష్ణు భూచక్రాలు

సంతతి ఉన్నతి నింగికెగయ రాకెట్టులా

అను నిత్యం ఇంటింటా దీపావళి

ప్రతి పూట అనుకుంటే ఆనంద రవళి



 https://youtu.be/kjg1sgcHa0M


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉక్తులమ్మా  కదలకుండ నా కవితల నివసించవే

సొత్తులమ్మా రూకల కలతలన్నీ పరిహరించవే

సత్తువమ్మా  నా తనువు నలతలన్నీ దహియించవే

ముగ్గురమ్మల మూలపుటమ్మా ఇల వెతలనే కడతేర్చవే


1.పోతనకు తెనాలి రామకృష్ణకవికి

కాళిదాసుకు రామకృష్ణ పరమహంసకు

శంకరాచార్యునకు ఛత్రపతి శివాజీకి

ఏ తీరుగ తీర్చినారొ ఇడుములను

ఏ విధముగ కూర్చినారొ గెలుపులను


2.పట్టుమని పదిలిప్తలు మది నిలుపగలేను

సారస్వత సాగరాన్ని  ఆపోసన పట్టలేను

భవబంధాలనుండి బయటపడగలేను

ఏ తీరుగ తీర్చెదరో నా ఇడుములను

ఏ విధముగ కూర్చెదరో నా గెలుపులను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాటల మూట విప్పితే ప్రియా - 

ముత్యాలను ఎద దాచుకుంటా

పలుకుల వాన  కురిస్తే చెలీ -

తేనెధారలే వీనుల జుర్రుకుంటా

మనసైన నేస్తమా మౌనమే ప్రాప్తమా

భావనలే ఆత్రమవగ నేత్రభాష మాత్రమా


1.మదిసొదనే ఎరుకపరుచ సైగలే కష్టతరం

నా ఆర్తిని నివేదించ భాషకూడ పిపీలికం

అనుభూతిని సాంతం ప్రసరించనీ

నను మొత్తంగా నీలోకి ప్రవహించనీ


2.ప్రణయమే మనమధ్య ఒక  యానకమై

మన నడుమన చొరబడు గాలికే భయానకమై

ఉపిరిలో ఊపిరిగా నను మననీ

ఒకే ప్రాణమని లోకమనని మనని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: భూపాలం


కోవెల వేలుపు మేలుకొలుపులే శుభోదయం

కువకువ సడులే రేగెడి వేకువ శుభోదయం

తూరుపు వాకిట అరుణ రుచస్సే శుభోదయం

గరికపైన మెరిసే తుషార బిందుల శుభోదయం


1. కనుమల  పొడసూపెడి రవికిరణం శుభోదయం

   కొలను తామరలు విరిసిన తరుణం శుభోదయం

   పడుచు భామల రంగవల్లుల వరవడి శుభోదయం

   ఆలమందలు మేతకు చనెడి అలజడి శుభోదయం


2.చిరుచిరు బుడతలు బడులకు వెళ్ళే శుభోదయం

పెరుగు పాలమ్మిలు పరుగున వాడలు తిరిగే శుభోదయం

కూరగాయల బేరం చేసే నారయ్యలు అరిచే శుభోదయం

పేపరు వేసే కర్మవీరుల   సైకిల్ సవ్వడి శుభోదయం

https://youtu.be/31kHrpJbcbA?si=KAQ7ij5Y6JOqfTXd

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: చంద్రకౌస్ / ముఖారి

అంగాంగాన శృంగార రస పాతమై
అణువణువు రతికేళి కొక ఊతమై
నాడులు మీటగా చెలీ నాదాలు రవళించెనే
నీ తనువును తడమగ తమకాలు వికసించెనే
మేనే హరించనీ నను నీలో విహరించనీ 
వాసన మించనీ రమించనీ అధరసుధతో తరించనీ

1.జయదేవ అష్టపదుల రాధికవో
విశ్వామిత్ర తపోభంగ మేనకవో
పురూరవుని మురిపించిన ఊర్వశివో
ప్రవరుని వలచిన అపర  వరూధినివో
మేనే హరించనీ నను నీలో విహరించనీ 
వాసన మించనీ రమించనీ సుధతో తరించనీ

2.ప్రణయసాగరాన్ని మనమే మథించనీ
చుంబనమే చింతామణి కౌగిలి కామధేనువే
రసనాగ్ర సంధానము కల్పవృక్షమే
తపనల తహతహ హయమా ఉచ్ఛైశ్రవమే
మేనే హరించనీ నను నీలో విహరించనీ 
వాసన మించనీ రమించనీ సుధతో తరించనీ


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాయలు చేయాలి సాయి షిర్డి సాయీ

నువ్వు మహిమలు చూపాలి సాయి

గారడిచేయాలి సాయీ బాబా సాయీ

నువ్వు లీలలు చూపాలి సాయి

పనికొచ్చు మాటలు నమ్మరు జనులు నేటికాలాన

పరమిచ్చు బోధలు పట్టించుకోరు ఉత్తపుణ్యాన


1.ధునిలో విభూతి మాకెందుకయ్యా

పిడికిట్లొ పుట్టించి చూపు దాంతొ కష్టాలెడబాపు

పదకొండు సూత్రాలు మాకేలనయ్యా

పసిడి గొలుసైన ప్రసాదించు కనకవర్షాలనె కురిపించు

పనికొచ్చు మాటలు నమ్మరు జనులు నేటికాలాన

పరమిచ్చు బోధలు పట్టించుకోరు ఉత్తపుణ్యాన


2.షిరిడీని దర్శించ సమయం లేదయ్య

కనుల ముందే సాక్షాత్కరించు కోరిందల్లా తీర్చు

సేవచేయగమాకు మనసైతె రాదు

ఆయురారోగ్యాలనందించు పదవులెన్నొ కట్టబెట్టు

పనికొచ్చు మాటలు నమ్మరు జనులు నేటికాలాన

పరమిచ్చు బోధలు పట్టించుకోరు ఉత్తపుణ్యాన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కష్టాలెన్నో ఇచ్చావా ఫరవాలేదు ప్రభూ

కన్నీళ్ళను ఇగిర్చావా ఇబ్బందేం లేదు ప్రభూ

జీవన పోరాటానికి వెనుకాడిందే లేదు ప్రభూ

పరమ దయాళా నినువేడేదొకటే  అనునిత్యం

చెరగనీకు మా ఎదలో స్థైర్యం పెదాల దరహాసం 


1.సృష్టిలోని వేదననంతా గుండెనిండ నింపావు

పుండుమీద కారాన్నింకా చల్లుతూనే ఉన్నావు

గాయాలెపుడు మానకుండా కెలుకుతూనె ఉన్నావు

నయమవడమేమోగాని అనునయమూ పొందనీవు

పరమ దయాళా నినువేడేదొకటే  అనునిత్యం

చెరగనీకు మా ఎదలో స్థైర్యం పెదాల దరహాసం 


2.చుట్టూరా మంటబెట్టి వినోదిస్తుంటావు

కొట్టుమిట్టాడుతుంటే వెక్కిరిస్తు ఉంటావు

నట్టనడిమి సంద్రంలో నెత్తిన బరువెడతావు

సాయంమాట ఏమోగాని కసాయిగా తోస్తావు

పరమ దయాళా నినువేడేదొకటే  అనునిత్యం

చెరగనీకు మా ఎదలో స్థైర్యం పెదాల దరహాసం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పలుకే బంగారమాయేనా

కులుకే సింగార మాయేనా

కునుకే జాగార మాయేనా

అలకే నయగారా మాయేనా


పసిడి నాకేల పలుకు పంచదారలా

సరసమేల తడుపు కాంతిధారలా

చిత్రమైన కాంచనీ చిత్తము నిండేలా 

స్ఫూర్తికాస్తమించనీ భావన పండేలా 


ఎదుటికొచ్చావంటే నిండిపోతుంది ఎద

నిదుర పట్టిందంటే పండిపోతుంది కల

అలకనీకు అందమే చేస్తాను నిను ముద్దు

యుద్ధమే ముగిసాక మనశ్శాంతికేది హద్దు

Wednesday, November 11, 2020

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హరిహరులకు కరతలామలకమే 

సంగీతనాట్యాల మదియాడును జలకమే

వేణుగానలోలుడు ఒకరు-వీణావాదనానురక్తుడొకరు

తాండవ కృష్ణుడే ఒకరు-నటరాజే సాక్షాత్తు ఒకరు


1. ప్రదోష కాలాన దూర్జటి 

 ప్రదర్శించు ఆనంద తాండవం

పార్వతీమాతతో ఏకాంత సమయాన 

మ్రోయించును అనాలంబ వీణావాదనం


2.జగన్నాటక సూత్రధారి మురారి

మర్ధించనెంచి చేసె కాళీయుని పై నర్తనం

బృందావనిలో రాధమ్మతో రాసలీలవేళ 

వాయించెడి పిల్లన గ్రోవి కర్ణామృతం

Tuesday, November 10, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిన్న ఒక పీడకల నేడే శుభోదయం

రేపనేది ఉండదిక నేడే శుభోదయం

ఆచితూచి అడుగే వేస్తే నేడే శుభోదయం

పంచదార పలుకే నుడివితే నేడే శుభోదయం

శుభోదయం శుభోదయం శుభోదయం


1.వినడాన్ని పెంచుకుంటే నేడే శుభోదయం

మౌనాన్ని ఆశ్రయిస్తే నేడే శుభోదయం

చిరునవ్వులు రువ్వుతుంటే నేడే శుభోదయం

నలుగురికి నొవ్వకుంటే నేడే శుభోదయం

శుభోదయం శుభోదయం శుభోదయం


2.తొందరపాటు మానుకుంటే నేడే శుభోదయం

    బాధ్యతను వీడకుంటే నేడే  శుభోదయం

    ఫలితం ఆశించకుంటే నేడే శుభోదయం

    ఉండీలేనట్టు ఉంటే నేడే శుభోదయం

   శుభోదయం శుభోదయం శుభోదయం


https://youtu.be/QBmDnUqSnlE?si=wdpPumZj7HPEnpzh


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఆకృతి ప్రణవనాదమై-నీ జాగృతి చతుర్వేదమై

ప్రకృతి నీ భౌతికత్వమై- పంచభూతాత్మకమై

సంసృతియే విశ్వతత్వమై -తాపత్రయాత్మకమై

జగతియే అర్ధనారీశ్వరత్వమై అద్వైతతత్వమై

పంచాక్షరి మంత్రమే పవిత్రమై భవతారక సూత్రమై

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


1.గజముఖుడే సంకల్పమాత్రుడై

షణ్ముఖుడే కార్య కృపాపాత్రుడై

సంకేతాలతో సాఫల్యము కూర్చగా

ఉపాసన బలముతో ఈప్సితమీడేర్చగా

జగతియే అర్ధనారీశ్వరత్వమై అద్వైతతత్వమై

పంచాక్షరి మంత్రమే పవిత్రమై భవతారక సూత్రమై

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


2. నిను శోధించగా అంతర్ముఖుడనై

నను నివేదించగా కార్యోన్ముఖుడనై

బంధాలు తొలగ బ్రహ్మానందమునై

తామరాకు మీది నీటి బిందువునై

జగతియే అర్ధనారీశ్వరత్వమై అద్వైతతత్వమై

పంచాక్షరి మంత్రమే పవిత్రమై భవతారక సూత్రమై

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విషయం చిన్నదే మగటిమికెంత గడ్డు

చూపుతిప్పుకునుటకు అదేపెద్ద అడ్డు

పనిలేక పడుండదేం నంగనాచి బొడ్డు

పడతి పొంకాలలో ఊరించేదా లడ్డు


1.దోసగింజ పోలికతో మది దోస్తుంది

   ముత్యమంత సొగసుతో మత్తిస్తుంది

   లోతెంతో తెలియకుండ వలవేస్తుంది

   తొంగితొంగిచూస్తూనే కనికట్టు చేస్తుంది


2.గర్భాన ఉన్నప్పుడు నాభితానె సాకింది

   బ్రహ్మావిర్భావానికీ కారణభూతమైంది

   దృష్టిదాటి పోనీడు తన సృష్టిని విధాత

   మణిపూరక చక్రానికి నాభియే అధినేత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందమా అభివందనం

వయసుకు నువుశ్రీ చందనం

వలపునకే  సులువైన ఇంధనం

మనసుకు నీవే మాయాబంధనం

ప్రకృతి చిత్రమే ప్రన్నదనం విశ్వరూపమే విన్నాణం


1.సర్వేంద్రీయాణాం నయనం ప్రధానం

ప్రధాన నయనానికి సౌందర్యమె ప్రమోదం

అతివ అంగాంగం అనతిశయ సుందరం

మతికే చూపునిస్తె మహదానందకరం 

నడక వయ్యారం నగవు మణిహారం రమణి రమణీయం


2.పురుషుడికిల అస్తిత్వమె ధీరత్వం 

వర వక్షస్థల విశాలతే వనితాకర్షకం

మెలితిరిగిన మగటిమిగల బాహువులు

గాఢ పరిష్వంగ కామనా హేతువులు

మూతికి మీసం చేతల రోషం వెరసి మగతమే మురిపెము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోపానికి పెద్ద దిక్కు అందాలముక్కు

కోటేరులాంటి ముక్కు కోరుకునే మొక్కు

సంపంగి ముక్కైతే సుముఖకు లక్కు

చప్పిడిముక్కైతే పోల్చగ చచ్చే చిక్కు


1.నాసికయే సూర్యచంద్ర నాడుల మార్గం

నాసికయే ప్రాణవాయు సింహద్వారం

నాసిక  వాసన కొరకై పరిశీలనాంగం

నాసిక రామాయణ కావ్య ప్రధానాంశం


2.ముక్కు ముక్కెరది వీడలేని బంధం

ముక్కులేక కళ్ళజోడు తిప్పలేమనందాం

ముక్కుసూటితనమే బహు చక్కని వ్యక్తిత్వం

ముక్కుమూసుకుని చేసే తపమే నిస్సగత్వం

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


జన్మ ఖైదు జైళ్ళు నీ కళ్ళు

చూపులు వేస్తాయి మనసుకు సంకెళ్ళు

ఆ కళ్ళు పెంచేను తమకాల ఆకళ్ళు

చూస్తూనె ఉండిపోతాం బ్రతికినన్నాళ్ళు


1.నీ అందచందాలు నేనెంచలేను

నీ మేని పొంకాలపై దృష్టైన లేదు

నీ హావభావలు గమనించలేను

స్థాణువైపోయాను కనగానె నీ కన్నులను


2.హాయిగొలుపు నీ కళ్ళు వెన్నెల లోగిళ్ళు

మత్తైన నీకళ్ళు ఎదలోకి గుచ్చే ముళ్ళు

ఆకర్షించు నీకళ్ళు సూదంటురాళ్ళు

మాయచేయు నీకళ్ళు అమ్మవారి గుళ్ళు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమన్న ఉందా నీ అందం

నా ముందరి కాళ్ళకది బంధం

గాలిమోసుకొచ్చింది నీ సుగంధం

పరవశించిపోయింది నా డెందం


1.ఇష్టపడుతోంది మిళింది  నీ మోవి మకరందం

పోల్చుకుంటోంది హరివిల్లు నీ మేని చందం

కళ్ళలోనె ఇల్లుకట్టి నిన్ను దాచుకుంట 

గుండెనే తొలగించి నిన్ను నిలుపుకుంట


2.వందలాది కైతలకు చాలకుంది  చక్కదం

కలం రాసి అలసిపోక పొందుగా ఆనందం

నే పడిచస్తాను నీ నవ్వుకోసం

అర్రులు చాస్తాను ఔననుట కోసం


https://youtu.be/CjrUP5BuhNk

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


మహాదేవి మనసా స్మరామి

వాగ్దేవి వచసా భజామి

శ్రీదేవీ శిరసా నమామి

శూలధరీ శుభకరీ యశక్కరీ

ప్రణతోస్మి సౌందర్య లహరి

నీరాజనం నీకిదే శాంకరి


1.మలక్పేట స్థిరవాసిని

మహిషాసురమర్ధినీ

మానస సంచారిణీ

మహదానందకారిణి

ప్రణతోస్మి సౌందర్య లహరి

నీరాజనం నీకిదె శివకామిని


2.మనో వికాస కారిణి

చతుషష్టికళా విలాసినీ

కవిగాయక వరదాయిని

వీణా పుస్తక హస్తభూషిణీ

ప్రణతోస్మి సౌందర్య లహరి

నీరాజనం నీకిదే పూత్కారీ


3.సౌభాగ్య దాయిని శ్రీకరి

  జననీ సకల సంపత్కరి

డోలాసుర భయంకరీ

ధర్మపురి నరహరిసతి సిరి

ప్రణతోస్మి సౌందర్య లహరి

నీరాజనం శ్రీహరి మనోహరి

Sunday, November 8, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:తోడి


ఉండీలేని రూపము నీది

సైకత నిర్మిత లింగము నీది

పార్వతి మాత పానవట్టము

శంభో  నీవేలే నా ఆత్మచుట్టము

ప్రణతోస్మి శ్రీరామలింగం శరణమహం సదాశివం


1.భవానీ నా దేహము భవా నీవె ప్రాణము

భవజలధిని దాటించే నావ నీ నామము

శ్రుతి తప్పని నా ఊపిరి ఉమాదేవి కాగా

లయ నీలో లయమయేలా నువు నాట్యమాడగా

ప్రణతోస్మి శ్రీ రామలింగం శరణమహం సదాశివం


2.ఐహికేఛ్ఛ తగ్గించి మతి నీ గతిగాననీ

మోహపాశాలన్నీ సమూలంగ సడలనీ

చతికిల పడనీయక నను నీపథమే సాగనీ

ఊరు దూరమవనీ నీ తావు కాడు చేరువవనీ

ప్రణతోస్మి శ్రీ రామలింగం శరణమహం సదాశివం



రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కన్నతల్లినే కలుసుకొన్నదే శుభోదయం

అమ్మ చల్లని దీవెన పొందగ మహోదయం

పుట్టినూరులో కాలుపెట్టిందె పావన ఉదయం

అన్నదమ్ములతొ గడుపగలిగిందె ఆనందోదయం


1.బాల్యమిత్రులతొ సమావేశమే  ఉల్లాసోదయం

మధురస్మృతుల మననంతో హసోదయం

సమాజసేవకు నడుంకట్టగల మా నవోదయం

 ప్రేరణనొసగే ప్రబోధగీతం పాడితె చైతన్యోదయం


2.ఎంతో కొంత వితరణ చేయగ దానోదయం

మితాహారమే భుజియించగ ఆరోగ్య ఉదయం

కుశల ప్రశ్నలతొ పలకరించగ స్నేహోదయం

కాఫీ చాయల కమ్మని రుచులతొ రసోదయం


శుభోదయం రసోదయం మహోదయం!!

Saturday, November 7, 2020


అప్పలమ్మా ఏమని చెప్పనమ్మా

నీ తనువున ఎన్నెన్ని గొప్పలమ్మ

మనసేదోచేసే ఒప్పులకుప్పలమ్మా

వయసును కాల్చేసే నిప్పులమ్మా


1. నవ్వితె మ్రోగేను గుండెలో డప్పులమ్మ

   నీ వాలుచూపుతో వేవేల తిప్పలమ్మా

  బ్రహ్మచర్యాని కెన్ని ముప్పులమ్మా

  చేయకతప్పదెన్నొ నీకై అప్పులమ్మా


2.నీవెంట పడగ అరిగేను చెప్పులమ్మా

నువు కాదంటే ఉడకవెవరి పప్పులమ్మా

నీ అందాలు ఊరించే అప్పాలమ్మా

నిను విసిగిస్తే కాయాలి నా తప్పులమ్మా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


(యువతకు ఇది బొరుసు వైపే..!

బొమ్మవైపు ఉంది మూడు సింహాల చిహ్నం..!!)


గడిపినంతసేపే బ్రతుకు

దొరికినంత వరకే మెతుకు

హితబోధలు పనికిరావు నేటియువతకు

ఖర్మకు వదిలేస్తేసరి మనశ్శాంతి మనకు


1.విద్యలొ ఉన్నతులే వివేక మితిమతులు

ఉద్యోగం నిర్లిప్తతె విచక్షణా రహితులు

భవితపట్ల బెరుకు లేదు తెలియదు పరిమితులు

వైఫల్యం ఓర్వలేక ఏతావతా తథాగతులు


2.ఆశలేమొ నింగిలో సంపాదన ఉట్టిలో

పొదుపు మాటేమొగాని అదుపేది ఖర్చుల్లో

ఓపిక ఊసేలేక విలాసాలు అప్పులతో

నిన్నచేదు రేపులేదు ఈనాడొక్కటే లెక్కలో



చరాచర జగత్తు నీవె వేంకటేశా

నిరామయ నిరంజన నిర్మల వేషా

కౌస్తుభ వక్షాంకిత మణిమయభూషా

వైజయంతి మాలాలంకృత సర్వేశా

అంతరింప జేయి ప్రభూ మన మధ్య దూరము

అంతర్యామీ నను చేర్చు స్వామీ భవసాగరతీరము


1.మంజుల రూపము నీ మంజుల విగ్రహం

మంజుల వదనము నీ మంజుల వీక్షణం

మంజుల హాసము నిత్య మంగళ కరము

మనుజులకొక వరము నీ అభయకరము

అంతరింప జేయి ప్రభూ మన మధ్య దూరము

అంతర్యామీ నను చేర్చు స్వామీ భవసాగరతీరము


2.నిను మోహించనీ మహా శివుడేడి విశ్వాన

నీ మాయకు లోబడని నరవరుడేడి లోకాన

జగన్నాటకంలో నడుపు నాపాత్రను  నీ వైపు

శరణాగతి నొసగెదవని  తట్టితిని నీ తలుపు

అంతరింప జేయి ప్రభూ మన మధ్య దూరము

అంతర్యామీ నను చేర్చు స్వామీ భవసాగరతీరము

 రచన,స్వరకల్పన&గానండా.రాఖీ


మనది కానిదేదీ మనదసలే కాదు

మనకు చెందే ప్రతీది మనది కాకపోదు

ఇచ్చిపుచ్చుకున్నప్పుడె గౌరవము మర్యాదా

తేరగ పొందేదేదైనా ఒంటికి పడుతుందా

ఇంట ఇముడుతుందా

పైవాడు చూస్తాడు జమాఖర్చులు

కక్కించిమరీ సరిచేస్తాడన్ని లెక్కలు


1.పుణ్యమాశించి చేసేది దానము

సానుభూతితో వేసేది బిచ్చము

ఆపన్నులనాదుకొనట వదాన్యత

మనవంతు అందజేస్తె అది చందా

పైవాడు చూస్తాడు జమాఖర్చులు

కక్కించిమరీ సరిచేస్తాడన్ని లెక్కలు


2.కనుగప్పి చేసేది దొంగతనం

అడ్డగించి దోచేది అది దోపిడి

అవసరార్థమిచ్చేది చేబదులు

వడ్డీ చెల్లించి తీర్చేవి  ఋణాలు

పైవాడు చూస్తాడు జమాఖర్చులు

కక్కించిమరీ సరిచేస్తాడన్ని లెక్కలు


3.వస్తుసేవల తగు చెల్లింపే ధర

సంతృప్తితొ ఇచ్చేది నజరాన

ఆవకాశవాది కిస్తే శాపాలమూట

దబాయించి దండుకుంటె మామూలట

పైవాడు చూస్తాడు జమాఖర్చులు

కక్కించిమరీ సరిచేస్తాడన్ని లెక్కలు

 

https://youtu.be/yDq-JFNf3ag?si=6mzKduvjT_nsHn4e

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెలుసుకో సోదరా-ప్రమద ఎంతటి ప్రమాదమో

ఎరుగరా నేస్తమా -అతివ ఎంతటి అపాయమో

రంగులు చూసి పొంగులు చూసి పొంగిపోమాకురా

కలలలొ తేలి మత్తులొ మునిగి చిత్తైపోమాకురా, చితికి పోమాకురా 


1. కాల్బంతి ఆడుతుంది నీ గుండెనె  బంతిగా

    పీకికుప్ప పెడుతుంది నీ మనసునె బొమ్మగా

    అమ్మాయే ముంచుతుంది నిను నిలువెల్లా

    అమ్మాయలొ పడ్డావా బ్రతుకు వెల్లకిల్లా తల్లక్రిందుల్లా


2.అరిటాకువు నీవె సుమా అంగననే కంటకం

    నీ భవితను వండుతుంది డోకొచ్చే వంటకం

    నిలువుదోపిడే చేసి నిలబెడుతుందీ నిను నడి వీథిలో

    ఇంతైనా బుద్దిరాక తగలడుతుంది నీ మది తన యాదిలో

మనాదిలో 


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చేదైన నిన్నటి అనుభవం గుణపాఠమై

మధురోహల రేపటి శిఖరమే గమ్యమై

సాగనీ ఈనాటి నీపయనం నిరాటంకమై

ఈ ప్రశాంత ప్రభాతమే సుప్రభాతమై

నా ప్రబోధ గీతమై


1.ఎన్నుకునే అంకురమే నాణ్యత గలదై

నాటుతున్న నేలయే సారవంతమై

చెదరని బెదరని నీ కృషియే ప్రావీణ్యత గలదై

వెలయించనీ నీ దీక్షావృక్షం సత్ఫలితాలనే సఫలమై

ఈ ప్రశాంత ప్రభాతమే సుప్రభాతమై

నా ప్రబోధ గీతమై


2.మార్గమే కఠినమైనా నిర్గమ దుర్గమమైనా

అడుగెయ్యి ఒడుపుగా మడమతిప్పకుండా

మలుపులు గోతులు దారంతా మామూలే

నిశ్చయం ఊతమై ధైర్యమే నేస్తమై గెలుపే ధ్యేయమై

ఈ ప్రశాంత ప్రభాతమే సుప్రభాతమై

నా ప్రబోధ గీతమై

Thursday, November 5, 2020

 *రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ*


శుభోదయం ఇది     పలకరించుతున్నందుకు

శుభోదయం    మది పులకరించుతున్నందుకు

శుభోదయం మన మైత్రి    వికసిస్తున్నందుకు

శుభోదయం సమస్త ధరిత్రి   హసిస్తున్నందుకు


1.)శుభోదయం మానవత మనలో బ్రతికున్నందుకు

శుభోదయం  జనతకు మమతకు శ్రుతిఉన్నందుకు

శుభోదయం సమాజాన కొంతైనా బాధ్యత ఉన్నందుకు

శుభోదయం జగాన వింతైనా అనుబంధాలున్నందుకు


2.)శుభోదయం అవినీతిలో నీతి మిగిలున్నందుకు

శుభోదయం న్యాయం కాస్తైనా అన్యాయం కానందుకు

శుభోదయం జాతీయ వాదాన్ని నిలుపుకున్నందుకు

శుభోదయం భారతీయ గౌరవాన్ని గెలుచుకున్నందుకు

 ఎన్ని నేనులో ఒకనేనై-ఒకనేనే ఎన్నో నేనులై

నిన్ను నిన్నుగా నిలుపుటకు-నిన్ను నీకే తెలుపుటకు

విశ్వప్రేమనే పంచానే-విశ్వాసమునే పెంచానే

అన్నెంపున్నెం ఎరుగని చిన్నారి

జీవితమేంటో చూసిన నారి

వీడకు ఎన్నడు నీ రహదారి

దారితప్పితే బ్రతుకంతా ఎడారి


1.మత్తెక్కించును మరిమరి మరువము

పరుగెత్తించును పదపడి పరువము

పిలిచేదైనా వలచేదైనా వలపే చేదై

బృందావనాన వేచిన విరహపు రాధై

 దాగిన మాగిన రేగిన కోరికలే చకోరికలై 

అర్ధాంతర జీవితమే నెరవేరలేని ఓ కలై


2.యుక్తిగ ఎంచితె రక్తి భక్తి ముక్తీ సమమే

అనురక్తిగ వేడగ శ్రీ కృష్ణుడు  మీరాపరమే 

అలజడి చెలఁగిన మానస సరోవరం వరమా

శివధ్యానమే పరధ్యానమై సదా కలవరమా

అర్ధనారీశ్వరతత్వమే అద్వైత సూత్రమై

సకల జగతికి మానవ జన్మకి కారణమాత్రమై


Wednesday, November 4, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గొడుగును కానా నేస్తమా ఎండకు వానకు 

ముందడుగును కానా నువు గమ్యం చేరేవరకు

మంచినీటి మడుగౌతా ఎడారిలో నీదాహం తీర్చేందుకు

పంచదార నుడుగౌతా నీపెదాలనే అలరించేందుకు


1.నీ గుండె చప్పుడైపోతా నీతో గుసగుసలాడేందుకు

ఉఛ్వాస నేనౌతా నీ నిశ్వాసతొ యుగళగీతి పాడేందుకు

నీ కన్నీరు తుడిచేటి చూపుడు వేలుగా మారిపోతా

నిను అక్కునజేర్చుకొని సాంత్వన చేకూర్చే ఆప్తుడనౌతా


2.ఏ లోటురానీయని ఎడబాటుకు చోటీయని తోడౌతా

రేయైనా పగలైనా నీఆర్తిని నెరవేర్చే అద్భుత దీపమౌతా

పాదాలుకందకుండ అరిచేతుల నడిపించే సఖుడనౌతా

కోరకనే వరమిచ్చే నీఎదలో వసియించే వేలుపునౌతా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనసున ఉన్నది చెప్పేసెయ్

గుప్పిటికాస్తా విప్పేసెయ్

ఎన్నాళ్ళింకా దాయడం ఎదలో దావానలం

పంచే ప్రపంచమేలేదా నిప్పును అర్పే సలిలం


1.నలుగుతన్నదీ బ్రతుకంతా కలుగుకు పరిమితమై

వెలగనిస్తేనె జ్యోతిని తొలుగును తిమిరం హతమై

పసిడిదైతెమాత్రమేమి బంధిఖానయే పంజరము

రెక్కలున్నా ఎగరలేకా నిస్సహాయగా పావురము

త్రెంచేసెయ్ శృంఖలాలను వంచేసెయ్ చువ్వలను


2.మీనం మేషం లెక్కలలో జీవితమెప్పుడు దక్కదులే

తిరిగిపొందనిదె కాలమన్నది చేజార్తె క్షణమిక చిక్కదులే

మానవజన్మకు పరమార్థం పరమానందమొకటేలే

మనువు నుడివిన మనువంటే బాసల బాటలొ బాసటలే

సాధన చెసెయ్ సామవేదమే సాధించేసెయ్ గాంధర్వమే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


వివరించి చెప్పాలా -విరించినీ కన్నవాడికి

చాటింపు వేయాలా-జగముల జనకునికి

మన వెత తెలపాలా నన్ను నిన్ను -నిన్ను నిన్ను

కన్నతండ్రికి

మన కత చెప్పాలా అంతర్యామికి

సర్వాంతర్యామికి


1.మనకేల ఆరాటం మనుగడకోసం

నారుపోసిన దైవం నీరూ పోయడా

మనకెందుకు ఉబలాటం రేపటికోసం

విదియన లేనిశశి తదియన తా కనరాడా

సూర్యుని రథచక్రపు శీలకాదుగా మనం

మన వినా ఆగదెపుడు ఈ కాలగమనం

నిమిత్తమాత్రులం విచిత్ర ఆత్రులం 

జగన్నాటకానికి ప్రేక్షక పాత్రులం


2.నాతల్లి  నాఆలి  నాపిల్లల వికాసం

నాఇల్లు నాఆస్తి అనుకునే మన అయువు నిముసం

వేల సుఖాలనే పొందిన మన మానసం

ఒక్క దుఃఖానికే చేయనేల దైవదూషణం

పుట్టుకపోషణ కారణభూతమైన భగవంతుడు

ఎరుగడా అడుగడుగున మనను నడుపుడు

ఆశించుట మానినపుడు ఏదైనా స్వర్గం

 స్వీకరించి ఆచరించు దైవదత్తమే సర్వం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కోరిందెంత కొండంతా? నీ గుండెంత

ఇచ్చిందెంత ఇసుమంతా? నా మనసంత

కొలమానం అంటూ ఉందా విశ్వైక ప్రేమముందు

రుగ్మతలన్నీ  పోగొట్టేది ఒకటే ప్రేమమందు


1.మిలమిలమెరిసే నీ చూపులే దారిదీపాలై

కిలకిలనవ్వే నీ నవ్వులే సాంత్వన రూపాలై

వెనకడుగే వేయనీయనీ నీతోడే  ప్రేరకమై

వదలమాకే నా చేయినీ స్ఫూర్తిదాయకమై


2. నీ పలుకే ప్రతీకగా బ్రతుకే వెలగనీ

నీ పదమే నా పథమై పయనం సాగనీ

సంశయాలు తీర్చేటి నా భగవద్గీతవై

సమాయత్తపరిచేటి పాంచజన్యమై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏముంటుంది మనసును మించెడి కానుక

ఏదౌతుంది మైత్రితో తూగెడి బహుమతి

నేస్తమా సర్వం సహా నా సమస్తమా

అందిస్తాను బ్రతుకే కట్నంగా

అర్పిస్తాను భవితే ఇష్టంగా


నువ్వునువ్వని భావించే నువ్వే నా ప్రతిబింబం

నన్నేఆవిష్కరించేటి నువ్వు నా అంతరంగం

నటప్రేక్షక సమాగమానికి నీవే నా రంగస్థలం

నాకు నేనే ప్రేరణ పొందగ నీవే నాకిల

ఉత్ప్రేరకం


ద్వైదీభావన కలిగేటందుకు ఏదీ ఆస్కారం

బాధ నాదయీ నొప్పి నీదయే స్నేహ సంస్కారం

మనో మథనాన కవనామృతమే నిత్య పురస్కారం

నీ చిరునవ్వుల ప్రశంసలే నా సందేహ

పరిష్కారం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎదకూ మేధకూ ఎంతటి వ్యత్యాసం

మనసుకు బుద్దికి ఉండదేల సాపత్యం

ప్రశాంత సరోవరం మానసం

చంచలమౌ సాగరం చిత్తము


1.గణితసూత్ర కచ్చితం ఆలోచనం

మానవీయ దృక్పథం హృదయగతం

ఆత్మ సంబంధమే లలిత కళావితరణం

దేహావసరమైనది క్రీడా వ్యాయామం


2. నిటారుగా గమించేను విజ్ఞానం

 క్షతిజసమాంతర వ్యాప్తి మనోల్లాసం

భుక్తికొరకు ఆర్జనకై ఉపయుక్తం మేధస్సు

ముక్తిదాయకం ఆనందమయం మనస్సు

Tuesday, November 3, 2020


https://youtu.be/nzJe_8EolkM

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీదీ నాదీ ఒకటే భావం

నీకూనాకూ ఎపుడూ స్నేహం

అనుభవాలు కూర్చాయి అనుబంధం

అనుభూతులు చల్లాయి మైత్రీగంధం


1.నింగీనేలా గాలీనీరూ మనకొకటే తీరు

వేసవి వేడి  జాబిలి వెన్నెలా మనపై సమంగ జారు

భరించారు ఒకేలా మీ అమ్మా మా అమ్మా ప్రసవ వేదన

 ఊపిరి శ్రుతిగా లబ్ డబ్ లయగా మనం బ్రతుకు పాట సాధన


2.మనసు నీదిగా మాటనాదిగా నా కవిత

గీతం నాదైనా నీ ఎదలోనిదే నా భావుకత

ఇనుమునైన నన్ను పసిడిగ మార్చే పరసువేది నీవు

 నిమిత్తమాత్ర పాత్ర నేనై నీవే ఆవాహనమైనావు

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఫేస్ బుక్కు కంటె నీ ఫేసిష్టం

వాట్సప్ కంటె నీ వలపిష్టం

ట్విట్టర్ కంటె నీ టెక్కిష్టం

టెలిగ్రాంకంటెనీ అనుగ్రహమిష్టం

సోషల్ మీడియాలొ మునిగతేలుతున్నా

అన్నీ నీకొరకే ప్రియతమా ఆత్రంగా వాడుతున్నా


1.గుడ్మాణింగ్ పిక్స్ కొరకు రాత్రంతా గూగులించి

నువు నిద్ర లేవక ముందే పోస్టుల్ని చల్లుతున్నా

మనుముందుగ నేనే  నిన్ను పలకరించాలని

మెసెంజర్కు వాట్సప్పుకు పరుగులు పెడుతున్నా

నువు తుమ్మినా దగ్గినా నీ ప్రతి స్టేటస్ కు

లైక్ లు కామెంట్లు మిస్సైపోకుండా కుమ్మరిస్తున్నా


2.తప్పులతడకల రాతల్నీ వంకర టింకర నీసెల్ఫీన్నీ

ఫ్రెండ్సందరికీ షేర్ చేస్తు వార్నీ షేర్చేయమంటున్నా

నీ కాకమ్మ కబుర్ల యూట్యూబ్ ఛానల్ ఫాలోయింగ్ కు

ప్రమోటర్ నేనై సబ్ సబ్ స్క్రై బ్ కోసం చాటింపు వేస్తున్నా

ఇన్నివిధాల నా యత్నాలన్నీ నిన్నింప్రెస్ చేయడానికే

నేను తీసుకున్న క్రెడిట్ డెబిట్ కార్డులన్ని నీకోసమే

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాభికాదు రసికుల మది రెచ్చగొట్టేది

అరవిరిసిన నవ్వులే  చిచ్చుపెట్టేది

నడుంకాదు సరసులనిల మాయచేసేది

అర్ధనిమీలిత నేత్రాలే వలవిసిరేది

పరచిన అందమెపుడు ఉత్తేజపరచదు

విప్పిన యే గుప్పిటి ఉత్సుకతే రేపదు


1.నునుసిగ్గుల లేలేత చెంపలు దింపేను ముగ్గులోకి

నగవులతో జతకట్టిన బుగ్గసొట్టలు లాగేను రగ్గులోకి

అచ్చికబుచ్చిక పలుకుల సమాయత్తమే రస రమ్యము

సురుచిర సుకుమార  శృంగార సంగరమే కడు భవ్యము


2.పయోధరాలదేముంది మధురాధరాలదే అలజడి

ముందువెనక తపనల తడితడి ఎద తనువుల సందడి

రసనలు రచించే వైవిధ్య కావ్యాలే చిరస్మరణీయము

హరివిల్లుగ చెఱకువిల్లుగ వన్నెలొలుకబోయ రమణీయము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సముద్రాలు ఏడన్నది ఎవరు?

కడలికి కడ ఉందన్నదెవరు?

ప్రతి నయనం ఒక అశ్రు సంద్రం

ప్రతి హృదయం వేదనా సాగరం

తీరంచేరని అలలే నెరవేరని కలలు

బడబానలం అంతరంగాన దాచుకున్న తరంగాలు


1.నిశీధిఅగాధాంబుధిలో ఎడతెగకుంది త్రోవ

జలధినధిగమించగ  పెదాలచిరునగవే నావ

మింగజూచే తిమింగలాలే నిరాశా నిస్పృహ

నింగికెగయు కెరటాలే ఆశా మధురోహ

తీరంచేరని అలలే నెరవేరని కలలు

బడబానలం అంతరంగాన దాచుకున్న తరంగాలు


2.ఎవరోమరి చేరేరు సుందరమౌ దీవులు

ఎవరికో లభించేను ముత్యాలు పగడాలు

బ్రతుకు జీవుడా అంటూ ఒడ్డున పడితేచాలు

గట్టెక్కితే చాలు నిత్యం ఎదురయ్యే గండాలు

తీరంచేరని అలలే నెరవేరని కలలు

బడబానలం అంతరంగాన దాచుకున్న తరంగాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పక్షపాతి భారతి ప్రియపతి - నీ ఎడల నిరుపమ లేమ

నాల్గుమతుల తులనం చేసి -సృజించాడు నినుఆ బ్రహ్మ

అందంమంత కుప్పగపోసి-అందజేసె సుందరినీకు

ఆనందాన్ని సేకరించి-ధారబోసె హాసిని నీకు


1.మేలైన మీనాలే  నీ నయనాలకు అచ్చెరువొందు

దొండపండ్లుగా  నీపెదవులగని రైతులే భ్రాంతి చెందు

నవ్వుల్లొ రాలుతుంది నాగమల్లి పూలజల్లు

చూపుల్లొ విరుస్తుంది అబ్బురాల హరివిల్లు


2.నిను తిరిగి చూడకుంటే మదికి అవకరమేదో

నిను చూసి చలించకుంటే ఆరోగ్య  లోపమేదో 

పడతులెవరైనా ఇలలో ప్రస్తుతించగలరే నిన్ను

ప్రవరాఖ్యుడైనా సరే పాదాక్రాంతుడవునే నమ్ము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:తిలాంగ్


విరమింపజేయి శివా నా జీవితాన్ని

తెఱనికవేసేయి ఈశ్వరా ఈ నాటకానికి

చరమగీతమే పాడవోయి నా బ్రతుకునకు

పరమ పదమందించవోయి ఈ నా జన్మకు


1.జన్మకు ఒకసార్థకతే శంకరా లేదాయే

బ్రతుకున కొక  సాఫల్యతే హరా కరువాయే 

ఆనందం ఆచూకే  ఏచోటా కానరాదాయే

మధురానుభూతులే ఏనాడైనా మరీచికలాయే


2.పాటుపడలేదేనాడూ పరమేశా పరులకోసము

బావుకున్నదంటు లేదాయే గౌరీశా నాకోసమూ

ఎందుకు పుట్టించావో నిటలాక్షా నీకెరుకేనా

వృధాగా సృజించబోకు నీలకంఠ  ఎవ్వరినైనా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రేమించిందా రమణి రాధిక

కోపించిందా కలికి కాళిక

జీవితాలు వెలిగించే దివ్య దీపిక

మగవాడి మనుగడకు స్ఫూర్తిదాయక


1.మనసైన రాముడికి మలయవీచిక

దశకంఠ దనుజులకు అందని మరీచిక

జ్వాలనే శీతల పరిచే శీల సూచిక

తరతరాల తరింపజేసే ఆదర్శ సంచిక


2.కాలానికి కట్టుబడింది పంచభతృక

పరాభవం సైచింది నిండైన ఓపిక

పంతమే పూనింది యజ్ఞపుత్రిక

కురుక్షేత్ర రణానికి ప్రారంభ గీతిక


చిత్రాలు: Sri. Agacharya Artist

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పదాలకెంత ఉత్సుకత

నీ అందాలు ప్రస్తుతించ

పెదాలకెంత ఆతురత

నీ అధరామృతం ఆస్వాదించ

చెలీ నువులేక జగమంత శూన్యమే

చెలీ నువువినా బ్రతుకెంత దైన్యమే


1.శ్రీగంధకలప తోనే చెక్కాను కలము చెక్కణాల

కస్తూరి పరిమళాలే కలిపాను సిరా గుభాళింపగ

ఎదలోని అపురూప భావ సంచయం క్రోడీకరించా

సృష్టిలో నీకు నీవె సాటియనగ అపూర్వంగ ప్రవచించా

చెలీ నిను పొగడక కవనం శూన్యమే

చెలీ నిను పొందక జీవనం దైన్యమే


2.క్షీరసాగరం లోని పాలరుచి బాగాతెలుసు

రేపల్లె గొల్లవాడలో వెన్నకమ్మదనమూ ఎరుకే

తేనెపట్టులోని మధువుతీయదనం అనుభవమే

నీచుంబన రసమే పాలువెన్నతేనెల సంగమమే

చెలీ నీ కలయిక  రసరమ్యమే

చెలీ నీ ఎడబాటిక  విషతుల్యమే

https://youtu.be/GQx_xN4kCGs?si=jiQPQ5god_zsmrJj

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళం

నా తనువే మోహన మురళి
వెదురేల బెదురేల పలికించ రసరవళి
నా మనసే నవనీత కబళి
దోచనేల దాచనైతి గ్రహించ నా సరళి
కన్నెముద్దులు వెన్నముద్దలు నీకే నైవేద్యం
నీరాసకేళి ఎంతోహృద్యం అనుభవైకవేద్యం

1.నవరంద్రకాయమందు ఒలికించు నవరసాలు
అష్టాంగయోగముతో కదిలించు కుండలినీమూలాలు
సప్తచక్రాలతో సిద్ధింపజేయి అలౌకికానందాలు
షడ్రిపులను దునుమాడి తెరిపించు మోక్షద్వారాలు

2.పాంచభౌతిక దేహం నీ పరమే చేసితిని
పురుషార్థ చతుర్థ్యాల నిను నెరనమ్మితిని
గుణత్రయాలనే నీవాక్రమించ స్వామీ వేడితిని
ద్వైతభావరహితమై నీవూనేనేకమై రమించితిని


Friday, October 30, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తాతకు దగ్గులు నేర్పితే ఎలా

గురువుకు నామం పెడితే ఎలా

హనుమంతుడి ముందే కుప్పిగంతులా

శ్రీరాముడి ముందే శూర్పణఖ వేషాలా


1.ఉండచోటిస్తే ఇల్లునాక్రమించాలా

పండు తినమంటే గుండెకే ఎసరెట్టాలా

ఏకులాగవచ్చి మేకులాగుచ్చుకోకు

బండారం బయలైతే ఏమాత్రం నొచ్చుకోకు


2.వంచన మించిపోతే సాక్ష్యాలు కోకొల్లలు

తోకఝాడింప జూస్తే ఋజువులు వేనవేలు

బుద్దిగా ఉండేవారికి భవితంతా బంగారం

మాటనిలుపుకునే వారికి లోకమే స్వర్గధామం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


అభినుతులో వినతులో

మహిమాన్విత నీ చరితలో

ప్రభవించును నా కవితలలో

నినదించును నా గీతాలలో

వేంకటాచలపతి నా కేల దుస్థితి

నీవేగా నాకిల స్వామీ శరణాగతి


1.ఎలా కాదనగలను నీ లీలలను

ఎలాకొట్టివేయను దృష్టాంతాలను

కనులముందె జరిగిన అద్భుతాలను

అసంభవాలె మార్పుచెంద సంభవాలను

వేంకటాచలపతి నిలువవయ్య నా మతి

నీవేగా నాకిల స్వామీ శరణాగతి


2.నందనవనమునే మసనముగా మార్చినావు

ఆనంద సౌధముకే చిచ్చును రగిలించినావు

స్వప్నాల నౌకనే సాగరాన ముంచినావు

ప్రశాంతమానసాన అలజడి సృష్టించినావు

వేంకటాచలపతి చక్కదిద్దు పరిస్థితి

నీవేగా నాకిల స్వామీ శరణాగతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మబ్బులమేలిముసుగు చందమామకు

సిగ్గుల జలతారు ముసుగు కలువభామకు

అడ్డుతొలిగితే సులువౌ అనురాగ ధారకు

బిడియమొదిలితే సుగమం ప్రేమసీమకు


1.మొదటిసారి చూడగానె మొదలౌను స్పందన

కనులు కనులు ప్రసరించే అయస్కాంత భావన

ఎదలోన కదలాడు చెప్పలేని అలజడి

ఎరుకపరుచలేక పెదవులు ముడివడి


2.కదలలేక అడుగులు మొరాయించు ఘర్షణ

గుండెను పెకలించి దోచుకెళ్ళు నరకయాతను

వలపుల వలలో విధిలేక చిక్కుబడి

విలవిలలాడునే విరహపు సుడిబడి


PIC courtesy:Sri. Chandra Haasam

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అమ్మచీరకొంగు-బహళార్థాలకే హంగు

అమ్మ చీరకొంగు అనేక సాధనాల ప్రోగు

పట్టుచీర ఐనా నేత చీరైనా 

సంతతి చింతలో అంతా దిగదుడుపే

సిల్కు చీర ఐనా చీనాంబరమైనా

బిడ్డ ఎడల ప్రేమముందు బలాదూరే


1.ఎండ లోన నీడ నిచ్చు మానౌతుంది

వానలోన తడవ కుండ గొడుగౌతుంది

ఉక్కపోతలోన చక్కని వీవెన ఔతుంది

చలినుండి కాచెడి దుప్పటిగా మారుతుంది


2.పాలుపట్టువేళ శిశువుకు పరదా ఔతుంది

నిదురించే పసిపాపకు పట్టుపానుపౌతుంది

బిడియపడే పిల్లలకు అభయహస్తమౌతుంది

కన్నీరు తుడిచి ఓదార్చే ప్రాణనేస్తమౌతుంది

https://youtu.be/G7uMN9C8n24?si=zXHkNxsZsTzIROLU

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:కీరవాణి

కనులు మూసుకున్నాడు కమలనాభుడు
మొహంచాటు చేసాడు  మంగావిభుడు
స్థాణువైపోయాడు పాండురంగడు
వృద్ధుడైపోయాడు నృసింహుడు
ఉన్నదాన్ని గుంజుకున్న నంగనాచులు
తిరిగి సమకూర్చలేని తింగరి బూచులు

1.కడలి పాలు విరుగుతాయి మా కన్నీటి ఉప్పుపొగిలి
యాతన పడతాడు మా గుండెకలత ఉసురు తగలి
ఖైదీఔతాడు మా చిత్తపు చెఱసాలలో నిత్యం రగిలి
సేవలు గొంటాడు చేతకాక గుదిబండగా మిగిలి
ఉన్నదాన్ని గుంజుకున్న నంగనాచులందరూ
తిరిగి సమకూర్చలేని తింగరి బూచోళ్ళు

2.కరకు వాడౌతాడా లక్ష్మమ్మ పాదసేవ చేయుచుండ
కఠినాత్ముడౌతాడా కరుణామయి సిరి ఎద కొలువుండ
క్రూరచిత్తుడౌతాడా చెలఁగి రుక్మిణమ్మ చెంతనుండ
దయవిడనాడేనా తల్లి శ్రీదేవి దాపున విలసిల్లుచుండ
ఉన్నదాన్ని గుంజుకుంటే చోద్యమేగా
తిరిగి సమకూర్చకుంటె బ్రతుకు నైవేద్యమేగ


Tuesday, October 27, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమాశించావయ్య ప్రభూ ఈ మానవ సృష్టి చేసి

సాధించినదేమయ్యా ఈ అల్ప మనుజులనుండి

పునరపి జననం పునరపి మరణం

బ్రతుకంతా క్షణక్షణం మనుగడకోసం రణం


1.జిట్టెడు పొట్టను ఇచ్చి పట్టెడె పట్టగ చేసి

పడరాని పాట్లనే పడగజేయడం న్యాయమా

తక్కువైతే నీరసం ఎక్కువైతే ఆయాసం

 ఆకలీ అన్నమే ప్రాధాన్యం చేయగ భావ్యమా


2.జిహ్వచాపల్యం మనిషికి  మరొక ఉత్పాతం

మద్యసేవనం ధూమపానము పరమ దరిద్రం

మాదకద్రవ్యాలకై బానిసలవడం దారుణం

మానవత్వం మృగ్యమై పైశాచికతత్వం నీచం

 https://youtu.be/qu86w8vEL2A?si=jEiSB-5VOF2Rs4us

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం : సరస్వతి 

చెప్పిందే చెప్పితే చెప్పనీ

పాడిందే పాడితే పాడనీ

నిను పదేపదే స్మరించడం నాధ్యేయం

నిన్నదేపనిగ భజించుటే నా నియమం

నమో నమో ఈశ్వరా గిరిజా ప్రియవరా

శంభో శంకరా సాంబసదాశివా శుభకరా


1.నిష్టగా నీ గుడికి నేను చనకపోతిని

నాదృష్టిని మాత్రం నీనుండి మరల్చనైతిని

ఇష్టమే ఇందుధరా నీఎడ కరుణాకరా

స్పష్టమే నినువినా ఒరులనెపుడు నమ్మరా

నమో నమో ఈశ్వరా గిరిజా ప్రియవరా

శంభో శంకరా సాంబసదాశివా శుభకరా


2.వేదమంత్రాలనే నేను వల్లించకపోతిని

ఎదలయలో  నీనామం లయమే చేసితిని

వేదనే నీదిరా మదనంతకా ప్రభో మోదమీయరా

నీ పదమే పరమపదము- నాకిక దయసేయరా

నమో నమో ఈశ్వరా గిరిజా ప్రియవరా

శంభో శంకరా సాంబసదాశివా శుభకరా

OK

Sunday, October 25, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:అమృత వర్షిణి


అమ్మే దేవత

ఎద ఎద కవిత

అనురాగ పూరిత

మన జీవన దాత


1.అమ్మ కడ కడుపే నిండుగ

అమ్మ తావు హాయే దండిగ

అమ్మ చేతి దీవెన మెండుగ

అమ్మ ఉంటె నిత్యం పండగ


2.అమ్మ చెంత సదా లాలనం

అమ్మ ఇలన సత్య భావనం

అమ్మే కద రక్త బంధనం

అమ్మకు పాదాభి వందనం

 

https://youtu.be/WiwwHgmk9p0?si=RMY2dDm2lZzuXmCX

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక దసరా విజయం దేవీ భాగవతం

ఒక దసరా విజయం శ్రీరామచరితం

ఒక దసరా విజయం మహాభారతం

ఒక దసరా మననం శ్రీ సాయి జీవితం

అశేష భరతావనికీ దసరా విశేష పర్వదినం

సకల బంధుమిత్రులందరికీ దసరా శుభకామనం


1.పితృవాక్యపాలనం ఏకపత్నిసహజీవనం

సకల జీవజంతు ఆదరణం స్నేహభావనం

దానవ దమనం అప్రతిహత రామబాణం

రావణసంహారం శ్రీ సీతా రామ విజయం 

సకల బంధుమిత్రులందరికీ దసరా శుభకామనం


2.వరగర్విత మహిషాసుర దేవతా పీడనం

ముక్కోటి దేవతల శరణాగత అభ్యర్థనం

దశభుజ విజయ దుర్గా అవతరణం

కంటక సంకట మహిషాసుర సంహరణం

సకల బంధుమిత్రులందరికీ దసరా శుభకామనం


3.కౌరవ మాయాజూద పర్యవసానం

పాండవ వనవాసం అజ్ఞాత జీవనం

ఉత్తరగోగ్రహణ సందర్భాన్విత రణం

ఉతరకుమారసారథ్య అర్జునవిజయం

సకల బంధుమిత్రులందరికీ దసరా శుభకామనం


4.షిరిడీపుర సాయి సామాన్యజీవనం

శిథిల ద్వారకమాయిలో  సర్వదర్శనం

అవధూతగా ఏకాదశ సూత్ర బోధనం

మానవతకు కరుణకు సాయిబాబ నిదర్శనం

సకల బంధుమిత్రులందరికీ దసరా శుభకామనం

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


తరాల అంతరాలలో నిరంతరం ఒక సమరం

నేటికి నిన్న ఎప్పటికీ మరపురాని జ్ఞాపకం

నయా జమాన పిల్లలది కడుదూకుడు తత్వం

వయోజనుల అనుభవాల సూచనలే చాదస్తం


1.అదుపాజ్ఞలు ఆత్మీయత వెన్నతొ పెట్టిన విద్య

గౌరవమర్యాదలు వినయవిధేయతలతో సయోధ్య

జననీ జన్మభూమి భావనయే సర్వులకారాధ్య

సంపాదన తక్కువైన పొదుపు మదుపులే శ్రీరామ రక్ష

కట్టుబాట్ల బాటలో వివాహబంధమే ఒక లక్ష్మణరేఖ


2.స్వయం వికాససూత్రాన వ్యక్తిగత ప్రాధాన్యత

ఉన్నత ఉద్యోగవేటలొ చదువొక గాడిదమోత

విదేశీ మోజులో రోజుకో సంస్థతో బ్రతుకంతా అస్థిరత

భవితనసలె తలవకనే కిస్తులతో నిత్యం విలాసాలజత

కట్టడేకనరాక  విలువలు హతమైన విశృంఖల ఆధునికత


OK

Friday, October 23, 2020

 

https://youtu.be/DckDqt-Sqps

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కన్నవారి కడుపుచక్కితెలుపాలా

జగములనే కన్నతల్లికి

కడుపుతీపి పరులు ఎరుకపరుచాలా

అమ్మలనే గన్న పెద్దమ్మకు

ఎందుకు జనని నువు దయగనని

ఈజన్మనీ కడతేరనీ నీపదముల కడ తేలనీ

శ్రీవాణీ నారాయణీ దాక్షాయణీ శ్రీచక్ర నగర సామ్రాజ్ఞీ

నమోస్తుతే మాతా మహిషాసుర మర్ధిని 



1.కడకంటిచూపుకే మురిసేరు ముక్కోటి దేవతలు

నీ అదుపాజ్ఞలలో మసలేరు త్రిమూర్తులు

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి 

చండముండాది  దండి దైత్య నాశకి

శుంభ నిశుంభాది దానవ శమని

కినుక నీకేలనే శుకశౌనక వందిని

తుదముట్టనీ నాబ్రతుకుని నీ పదములు పట్టనీ


2.ఇచ్చావు ఎన్నెన్నో నా ఇఛ్ఛ నడగకనే

తుచ్ఛమైన వీయనేల సంతృప్తి మినహా

అనుభవించి సంతసించబోవునంతలోనే

ఉన్నది ఊడ్చేసినావు ఉత్పాలి(ఆరోగ్యము) తో సహా

శ్రీ పీఠ సంవర్ధినీ మేధో ప్రవర్ధిని

కంటగింపు ఏలనే సంకటములు దాటించగ

ముగియనీ జీవితాన్ని నీ పదముల నరయగా

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిదుర రాదు మనసు చేదయీ

తెలవారునా ఈరేయీ

కలతీరునా తరువాయి మరీచికై హాయీ


1. చెలికాని తలపులు తలగడ లాగా మెత్తగ తాకెనే

 తొలివలపులు తపనలు మరి మరి పెంచెనే

మాటలతో సరసపు చేష్టలతో మురిపించెనే

రెక్కల గుర్రం ఎక్కడమన్న ఊహను మెరిపించెనే


2.ఉడికించిన తడిపొడి కాంక్షలు ఆశగా చెలగే

ఊరించిన కసికసి ఊసులు ఉసూరుమనసాగే

ప్రణయభావనలు ప్రలోభాన మది కొనసాగే

కలయిక ఇక కడలేని ప్రతీక్షగ అనుక్షణంమనసాగే


PAINTING:Sri. Agacharya Artist


https://youtu.be/GBw6Q1dx8D8

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:యమన్ కళ్యాణి


జయకళ్యాణి వీణాపాణి శ్రీవాణీ

జయజయ భారతి జయసరస్వతి నీవే శరణాగతి

నడపవె నా మతి నిరతము సద్గతి

నమామి భగవతి బ్రహ్మసతి


1.వ్యాసపురీశ్వరి వాగీశ్వరి జ్ఞానప్రదాయిని

కాశ్మీరేశ్వరి ముఖనివాసిని కవన ప్రసాదిని

వర్గలువాసిని మేధావిని విద్యా వర్ధిని

అనంతసాగర  గేహిని అక్షర వితరణి


2.శృంగేరి స్థిత శంకర పూజిత శారదామణి 

కాళేశ్వర విలసిత సుస్వర రూపిణి వేదాగ్రణి

చింగావన స్థిరవాసిని సంగీత సామ్రాజ్ఞి

ధర్మపురీ  గౌతమితీర వసని గీర్దేవి

Thursday, October 22, 2020

 https://youtu.be/X5SeETe8UZw?si=YjUuFm8Dkz9fSa1P

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శైలపుత్రి హే బ్రహ్మచారిణీ చంద్రఘంటా నమోస్తుతే

కూష్మాండ హే స్కందమాతా కాత్యాయినీ నమోస్తుతే

కాళరాత్రి హే మహాగౌరి హే సిద్దిధాత్రీ నమోస్తుతే

భద్రకాళిహే కనకదుర్గ హే శారదాంబా నమోస్తుతే

నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే


1.హే భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీలలితా పరిపాలయమాం

మణిద్వీప సుస్థిరవాసిని శ్రీచక్ర సంచారిణీ పాహిమాం

జయ జగదీశ్వరి శ్రీ పరమేశ్వరి పాహిమాం పాలయమాం

అఖింలాండేశ్వరి చాముండేశ్వరి శ్రీ దేవీ శరణమహం


2.దనుజహారిని దైత్యదమనీ దాక్షాయణీ మనసా వందనం

మహిషమర్ధిని శత్రునాశిని విజయకారిణీ వచసా వందనం

జ్ఞానవర్ధినీ వేదరూపిణీ శ్రీ సరస్వతీ  శిరసా వందనం

నారాయణీ కనకవర్షిణీ మోదదాయినీ తవ చరణం శరణంశరణం


PAINTING:Sri. Agacharya Artist

https://youtu.be/vby_USQHbsQ?si=za4UIP3iahm4QLbC

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:నాదనామక్రియ

సమాయత్తమైపోవె మనసా అనంతయానానికి
బంధనాలు త్రెంచుకో నీ ఒంటరి పయనానికీ
ఇహముతో మోహపాశ మెందుకు
దేహమైన వదులుకోక తప్పదు

1.చరమాంకం చేరుటకై తోసివేయి బరువులు
ప్రాపంచిక విషయాలకు మూసివేయి తలుపులు
మహాప్రస్థానమే అవస్థలేక సాగగా
సంసిద్ధతతో స్వర్గతి సిద్ధించుగా

2.మమకారము కడుకారము వైరాగ్యానికి
చాపల్యము అవరోధము నిర్వేదానికి
బాధ్యతలంటూ బాధలపాలవకు
జంజాటాలతో గిలగిలలాడకు

3.నువులేని లోటుతో లోకమాగుననుకోకు
నీ పరోక్షవేళలో జగతి గతిని యోచించకు
నాడునేడు ఎప్పడూ నీకునీవే
వాస్తవాన్ని మరువక మనసా నిర్గమించవే



https://youtu.be/f0LHKMTwSm8?si=WpK0n3ccZbOlVPpm

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను పిచ్చివాడన్నాడు ఒక తుచ్ఛుడు

నిను బిచ్చగాడన్నాడు ఒక త్రాష్టుడు

మతమునంటగట్టాడు ఒక మ్లేఛ్ఛుడు

ఆకృతులరంగు పులిమాడొక మూర్ఖుడు

సాయీ నీవే సత్యమైన అవధూతవు౹ౘౘ

సాయీ నీవే నిలువెత్తు మాన వతవు


1.సాటి మనిషిగానైన ఎంచలేని మూఢుడు

సాక్షత్తు దైవంగా నిన్నెలా నమ్మౘగలడు

నీ బోధల సారమే ఎరుగలేని జడుడు

సద్గురువునీవని ఎలా భావించంంంగలడు

సాయీ నీవే సచ్చిదానందుడువు

సాయీ నీవే నిత్య జ్యోతిరూపుడవు

ఃంఃఃఃఃౘఃఃఃః

2.శిథిలమైన మసీదునీ ఆవాసమంటివే

పాలరాతి మందిరాలు పట్టిఉంచగలిగేనా

చిరుగుల కఫ్నీనీ నీ మేన దాల్చితివే

పట్టుపీతాంబరాలు నీకు కట్ట మెచ్చేవా

నీ జీవితవిధానమే ఆచరణ గీత

నీ నిరాడంబరమే స్ఫూర్తిదాత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతడు-కలయికలోనే  కల నెలకొన్నది

అతడు-నెరవేరితే కల వరమౌతుంది

ఆమె:చెదిరిపోతే కలవరమౌతుంది


ఆమె:వలపను దానిలో వలదాగున్నది

అతడు-బతుకే చిగురించులే వలచినంతనే

ఆమె:వెతలే రగిలించులే వలపన్నింతనే


అతడు-1.పరిచయమైన తొలిక్షణమేదో తీక్షణమైనది

పరస్పరం ఎదురైన వీక్షణమే సలక్షణమైనది

ముడిపడిన బంధమే మూడు ముడులుగామారే

తోడుగా నడిచిన పథమే ఏడడుగులై సాగే

కలయికలో కన్న కల నెరవేరి వరమాయే

వలపంత కుమ్మరించ కాపురమే గోపురమాయే


ఆమె-2.తారసపడిన వేళయేదో వెంటాడే కాళమైనది

ఇరు మనసుల తొందరపాటే గ్రహపాటైనది

ప్రణయమూ పరిణయమూ నగుబాటైనది

సర్దబాటు బాటలేక బాస నీటి మూటైనది

కలలన్ని చెదిరిపోగా  భవిత ఎడారిచోటైనది

వలపన్నగ చిక్కుబడి బ్రతుకు చితికిబాటైనది

Tuesday, October 20, 2020

https://youtu.be/aLropqJLumM

 నీ పాటగా సాగనీ జీవితమే 

నీ పదముగా చెలఁగనీ నా కవితయే

అన్యమేల రాయగ గాయాలౌ గేయాలే

ధన్యమవని నిను నుడువగ నా గీతాలే

శ్రీ సరస్వతీ మాతా సకలలోక జననీ

కర్త కర్మ క్రియలెపుడు నాకు నీవె వేదాగ్రణి


1. సరసమౌ నవరసాలు నాలో కనుమరుగవనీ

ఐహికమౌ విషయాలిక అంతరించిపోనీ

అవకాశాలే అందగజేయకు అరవిందలోచనీ

నాచిత్తము మరలనీకు నినువినా నిరంజని

శ్రీ సరస్వతీ మాతా సకలలోక జననీ

కర్త కర్మ క్రియలెపుడు నాకు నీవె వేదాగ్రణి



2.చావు పుటుకలేవైనా   దుఃఖాన్వితాలు

కరుణరసం ఒక్కటే ప్రతి మనసుకు చేవ్రాలు

ఆర్ద్రత పూరితమౌ భక్తియే సాహిత్యపు ఆనవాలు

నా అక్షరసూనాలికపై సదా నీ చరణాల వ్రాలు

శ్రీ సరస్వతీ మాతా సకలలోక జననీ

కర్త కర్మ క్రియలెపుడు నాకు నీవె వేదాగ్రణి



3.నే లిఖించు ప్రతివర్ణం నీ బీజాక్షరమవనీ

వెలయించెడి ప్రతివాక్యం దివ్యమంత్రమవనీ

మనోవాక్కర్మలన్ని నీపై కేంద్రీకృతమైపోనీ

చరణాలే శరణుకోరి  నీవైపే సాగనీ

శ్రీ సరస్వతీ మాతా సకలలోక జననీ

కర్త కర్మ క్రియలెపుడు నాకు నీవె వేదాగ్రణి








https://youtu.be/qem9vBTTrvU?si=7GkzmsuP1CxxD_63

అనంత వర్ణ సంశోభితం పుష్పజాతి సౌందర్యం

అద్భుత సౌగంధికా విరాజితం విరుల పరిమళం

అనన్య లావణ్య సమాశ్రితం కుసుమ కోమలం

జన్మసాఫల్య ధన్యజీవనం పావనం ప్రసూనం


1.మందార పుష్ప  పూజిత  ప్రియం విఘ్నేశ్వరం

పంకజార్చిత పరమ  సంతుష్టం పరమేశ్వరం

అర్క పూమాలాలంకృత సంప్రీతం కపీశ్వరం

చంపక సేవంతికాలంకృతం శ్రీమాతాప్రియకరం


2.దాంపత్యానుకూలదాయకం కుందకుసుమ సౌరభం

మలయమారుతాన్విత ఆహ్లాదకారకం పారిజాత పరిమళం

బతుకమ్మ స్వరూప వలయనిర్మితం విరి ప్రభాస విరాజితం

గులాబీ అలరులకే ప్రేమకు ప్రతిపాదనగా ప్రథమతాంబూలం

 పలుకలేవ మమతల మకరందమొలుక

తెలుపలేవ వలపులు శ్రీగంధమే చిలుక

ఎదదాగిన మంజుల సడినుడి ఎవరికెరుక

వేచినకొలది వెతలు పెరుగ బ్రతుకే మరీచిక

గతిగానవే నా మానసం-మతినిండినే నీ ధ్యానం


1.అంతరంగాన అంతేలేని చింతల సాగరం

పెదవుల చెలఁగును నగవుల నయగారం

అనునయ మొకటే హృదయానికి తగు ఔషధం

సాంత్వనకూర్చే ప్రేమ సింధువా నీకిదె ఆత్మీయ చందనం

గతిగానవే నా మానసం-మతినిండినే నీ ధ్యానం


2.జీవితమంతా చేస్తాను నీకే అంకితం

ఏకాకి నేనిక లోకాన సర్వం నీవేగా నేస్తం

నీ సహచర్యం నాకిల ధైర్యం కావేలా సంప్రాప్తం

అందించవే ఇక జన్మజన్మలు నీ స్నేహ హస్తం

గతిగానవే నా మానసం-మతినిండినే నీ ధ్యానం


https://youtu.be/JGCbcHftHuA?si=4wx_IU8Ldhy-_x5h

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శ్రీ ఆంజనేయం దివ్య మహాకాయం

రామనామమంటె నీకు ఎంతో ప్రియం

నిన్ను తలచినంతనే  భయమే మటుమాయం

నీ అనుగ్రహమ్ముతో  విజయమే మంచినీళ్ళ ప్రాయం

నమో నమో జితేంద్రియా నమోస్తుతే సంజీవరాయా


1.రామ భజన జరుగు చోట నీ ఉనికి ఖాయం

రామకథను వినుట కనుట నీ అవతార లక్ష్యం

రామాయణ పారాయణ నీకు ప్రథమ కర్తవ్యం

రామగాన రసపానమే నీకు సదా ముఖ్యం

నమోనమో చిరంజీవా నమోస్తుతే ప్రభోవాగధీశా


2.  ఊరూరికి  రక్షణగా నిలవడమే నీ ధ్యేయం

నీ భక్తుల కండదండ కావడమే కడు భవ్యం

పిలిచినంతనే పలుకుతు ఔతావు ప్రత్యక్షం

నిను నమ్మికొలిచినంత సులభతరమె మోక్షం

నమోనమో అంజనానందన నమోస్తుతే దనుజ భంజన

 https://youtu.be/TTja0nWVuQo?si=DhbdF3KJRqsxfdjh

రచన,స్వరకల్పన&గాఖనం:డా.రాఖీ


రాగం:హంసానంది


సౌందర్య లహరీ శ్రీ లలితా పరమేశ్వరీ 

హృదయ వశంకరీ శాంకరీ కృపాకరీ

సహస్రనామ సంశోభితే సర్వ దుఃఖప్రశమనే

ప్రణమామ్యహం త్వాం శరణమహం ప్రపద్యే


1.మృదుమంజుల భాషిణీ నిత్యసంతోషిణీ

మునిజనవందినీ ముక్తిదాయినీ

త్రిభువన జననీ త్రైలోక్యపావనీ

త్రిమూర్త్యాది సకలదేవ సంసేవిత చరణీ


2.చండముండ  దానవ భంజనీ

చాముండీ నిరుమాన నిత్య నిరంజనీ

అండపిండ బ్రహ్మాండ మండల సృజనీ

ప్రచండ తేజోమయి భక్తజన రంజనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవ్వించకే నీ వాలుచూపులతో

నను చంపకే నీ చిలిపి నవ్వులతో

అందించవే అధరామృతం బ్రతికించగా

బంధించవే బిగికౌగిట దివిని తలపించగా


1.ప్రేమలేఖలేవో కనుపాపల కదలాడే

మూగబాసలేవో మానసాన్ని వెంటాడే

అందరాని చందమామలా దోబూచులాడేవు

హృదయాన్ని బంతిచేసి ఆటలెన్నొ ఆడేవు


2.నీ తనువు కావ్యాన్ని తనివార చదువుకోనీ

నీ మానసవీణపై నవరాగం పలికించనీ

నా పెదాల కుంచెతో నీదేహమంత చిత్రించనీ

అనుభూతుల నవరసాలతో అనుభవాలు మించనీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉన్నా లేకున్నా రెండు చేతులు నేస్తం

ప్రతి మనిషి కలిగిఉంటాడు మరో  హస్తం

అంతరాన అద్భుతమౌ అదృశ్య హస్తం

అదే అదే  దయగలిగిన ఆపన్న హస్తం

ఉపయోగించనపుడు జీవితమే వ్యర్థం


1.సంపన్నులమైతేనే అన్న షరతులేదు

పుష్కల ఆదాయమే అర్హత కాదు

ప్రతిఫలమాశించే అవసరమే లేదు

పేరు ప్రఖ్యాతులు పెద్ద విషయమే కాదు

సహృదయత ఒక్కటుంటే పేదరికం అడ్డుకాదు


2.అభద్రతే పిసినారికి అతిపెద్ద ఆటంకం

తృణమో ఫణమో ఇవ్వగలగడం ముఖ్యం

సహానుభూతి చెందితే ఉదారతే సులభం

చందా దానము  విరాళము వితరణదొక రూపం

ధనమో వస్తువో శ్రమనో ఏదో ఒక చిరు సాయం

Sunday, October 18, 2020

 https://youtu.be/KQg1J-n4h7U

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


దుర్గాభవాని-నేను నీ పసివాణ్ణి

పాలించగా నీవే-లాలించగానూ నీవే

మోకరిల్లుతున్నాను మాతా శాంభవి

ప్రణతులందుకోగదే తల్లీ భార్గవీ

వందనాలు నీకిదే అమ్మా వాగ్దేవి


1.నవరాత్రులూ నిన్ను నమ్మి కొలిచేను

ఏదినమందైనా నిన్నే తలిచేను

నా మనసే నీకు నైవేద్యమర్పింతు

నా ప్రాణజ్యోతులే హారతిగ వెలిగింతు

మోకరిల్లుతున్నాను మాతా శాంభవి

ప్రణతులందుకోగదే తల్లీ భార్గవీ

వందనాలు నీకిదే అమ్మా వాగ్దేవి


2.కోరడానికేముంది జననీ నీవెరగవనా

అడిగేది ఏముంది అమ్మా నువు ఈయవనా

బిడ్డ మనసు తెలిసి తల్లి మసలుకోదా

దొడ్డమనసు నీకుందన్నది లోకానికి కొత్తదా

మోకరిల్లుతున్నాను మాతా శాంభవి

ప్రణతులందుకోగదే తల్లీ భార్గవీ

వందనాలు నీకిదే అమ్మా వాగ్దేవి

https://youtu.be/FSkw3pGC1kU


ముక్కంటి దేవర-నిక్కముగ కావర

మాకు వరమీయర-కలవరమెడబాపర

నమః పార్వతీపతయే హరహరా 

శివరాత్రి సంభవా మహాలింగేశ్వరా 


1.మది నమ్మినానుర-పదము నడిగినానుర

పదపడి ఇదె వేగరా-దయసేయి శంకరా

నమః పార్వతీపతయే హరహరా 

శివరాత్రి సంభవా మహాలింగేశ్వరా


2.నలతల మరి మాన్పర-కలతల పరిమార్చర

కలలిక నెరవేర్చర-కైవల్యమొసగరా

నమః పార్వతీపతయే హరహరా 

శివరాత్రి సంభవా మహాలింగేశ్వరా

 

https://youtu.be/ZMDzGMdeN3o?si=Mqh7GdP4SsvtydE_

రచన,స్వరకల్పన&గానం డా.రాఖీ


ఏమాదీర్ఘాలోచన సులోచన

ఔనోకాదో తెలుపగ లేదా వివేచన

ప్రేమంటే కానేకాదది ఒక యాచన

ఇరు ఎదలే జతగా చేసెడి రచన


1.తొలిచూపుది కాదు నా భావన

నీవేంటో అర్థమైన మనోనివేదన

పరస్పరం అంకితమవడమె ప్రేమ సాధన

చితి దాకా ప్రతి సాగగలిగితే ప్రేమ దీవెన


2.రక్తబంధమే లేని అనురక్తి మనది

మలినమే అంటక నిష్కల్మషమైనది

స్నేహితమునకన్నా అతీతమైనది

అలౌకిమైన అభౌతికమైన తత్వమిది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వరదలు వరదలు వరదలుఊరంతా వరదలు

వరదలు వరదలు వరదలువాడంతా వరదలు

వరదలు వరదలు వరదలుఇవి కన్నీటి వరదలు

వరదలు వరదలు వరదలు ఎనలేని కష్టాల  వరదలు


1.కోరికోరి కొనుక్కున్న ఖరీదైన వరదలు

ఏరికోరి చెఱువుపక్క ఎంచుకున్న వరదలు

ఎడాపెడా అనుమతులతొ లంచాల వరదలు

కుదేలైపోగా బజారుపాలైన బ్రతుకుల వరదలు


2.తామే అమ్ముడై ఎన్నుకున్న ఓట్ల వరదలు

 ఏమాత్రమైన నెరవేర్చని నేతల వాగ్దాన వరదలు

గృహనిర్మాణ రంగాన ఇబ్బడి ముబ్బడి డబ్బుల వరదలు

నాలాలూ  శిఖముల దురాక్రమణల వరదలు


3.ముందుచూపు కొఱవడిన నిర్లక్ష్యాల వరదలు

తెలిసీగోతిలొ పడే మధ్యతరగతి వరదలు

గతిలేక తలదాచే పేదల గూడుల వరదలు

అతలాకుతలమయే నగరాల పదేపదే వరదలు


4.చుట్టూ నీళ్ళున్నా తీర్చని దాహపు వరదలు

కాలకృత్యాలకై నోచవీలవలేని వరదలు

పసివాళ్ళు ముదుసళ్ళు రోగుల వెతల వరదలు

అన్నీ ఉండీ అనాథలుగ మార్చే వికృత వరదలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూపులకేం పని తూపులు వేయడమే

పెదవులకేం పని వ్యూహమమలు చేయడమే

పగబట్టింది నీ అంగాంగాం నను బంధించుటకై

నీకెంతటి ఉబలాటమో అస్త్రాలు సంధించుటకై


1.కనుగీటితె చాలుగా కదనకుతూహలమేల

నవ్వితె సరిపోవుగా సంగ్రామ తపనయేల

నేనూ ఇక సిద్ధమే  నిషిద్దాలు ఆయుధాలు

మల్లయుద్ధమైతే మేలు ఇరువురికి విజయాలు


2.ఊపిరాడనీయను బాహువుల బిగించి

తేరుకోనీయను ముద్దులతో ముంచెత్తి

పట్టేపడతాను  ఆయువు పట్లపై సరసంగా

ఉట్టేకొడతాను దండిగ వెన్నా మీగడ లొలుకంగ

Saturday, October 17, 2020


https://youtu.be/H4WhiKUp5Fg

వెన్ను చూస్తె కన్ను చెదిరె ఉన్నపాటుగా

ముందు చూస్తే సన్నుతించ నాకిక తరమా

ఎదనెవరో పిండేస్తున్నట్టు ఏదేదో ఐపోతున్నట్టు

నరాలన్ని జివ్వునలాగే తమాయించుకోనట్టు

ఆగలేనే వేగలేనే వేచిఉండలేనే-వేగరావే యోగమవగా ఆగమైపోతానే


1.తురుముకున్న మల్లెచెండు చెండాడుతోందే నిగ్రహాన్ని

 ఉండీలేక రవికేమో దండిస్తోందే మనో నిబ్బరాన్ని

బల్మీటికి చూపుకాస్త క్రిందికి తెస్తే నడుమొంపులోనే నలిగిందే

తెల్లచీర సోయగాలు తెప్పరిల్లనీయక గుండె మత్తగా మూల్గిందే

నరాలన్ని జివ్వునలాగే తమాయించుకోనట్టు

ఆగలేనే వేగలేనే వేచిఉండలేనే-వేగరావే యోగమవగా ఆగమైపోతానే



2.పట్టుకుంటె జారిపోయే పట్టులాంటి నీ కోమల దేహము

ముట్టుకుంటె మాసిపోయె దబ్బపండు ఛాయ అంగాంగము

తాకనీయి  తమకాన తడమగా తనువు తడిసి ముద్దై పోనీ

పెదాలతో పెదాలు రసనతొ రసనా మెలిపడి అద్భుత ముద్దైపోనీ

నరాలన్ని జివ్వునలాగే తమాయించుకోనట్టు

ఆగలేనే వేగలేనే వేచిఉండలేనే-వేగరావే యోగమవగా ఆగమైపోతానే


OK