https://youtu.be/Z0PH6Sxl4oo
పెద్దపెద్ద మాటలేవి చెప్పను
ధర్మపన్నాలు వల్లించను
తత్వబోధచేయగా కోరను
ముక్తి ప్రాప్తించమని వేడను
నీ మనుగడ సత్యమని సాయీ నమ్మెదనూ
నీ కనుసన్నల నను కనిపెట్టుకొమ్మనెదనూ
1.సృష్టిలోని బాధనంత మూటగట్టి ఇచ్చావే
ఓర్చుకోతగనంత వేదన కలిగించావే
తీవ్రమైన యాతనలో మము పడద్రోసావే
పరిష్కరించుకోలేనివి ప్రసాదించినావే
నీ మనుగడ సత్యమని సాయీ నమ్మెదనూ
నీ కనుసన్నల నను కనిపెట్టుకొమ్మనెదనూ
2.మొక్కని మొక్కులేదు ఇన్నాళ్ళుగా సాయీ
కట్టని ముడుపులేదు ఇన్నేళ్ళుగా నమ్మవోయీ
తిరుగని జాగలేదు తిరునాళ్ళుగా ప్రతిదీ నీదయీ
వాడని వైద్యమూ వేనోళ్ల వేడని వేలుపూ లేడోయీ
నీ మనుగడ సత్యమని సాయీ నమ్మెదనూ
నీ కనుసన్నల నను కనిపెట్టుకొమ్మనెదనూ